breaking news
bussiness contracts
-
రష్యాతో భారత్ స్నేహం.. అమెరికా కక్షసాధింపు హెచ్చరిక
వాషింగ్టన్: భారత్, చైనా విషయంలో అమెరికా మరో సంచలన ప్రకటన జారీ చేసింది. రష్యాతో వ్యాపార సంబంధాలు కొనసాగిస్తే భారత్, చైనాలపై 500 శాతం సుంకాలు విధిస్తామని హెచ్చరించింది. దీంతో, అగ్రరాజ్యం అమెరికా తీరు తీవ్ర చర్చకు దారి తీసింది. ఇక, ఇటీవలే భారత్‌తో బిగ్ డీల్ ఉంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక, తాజాగా ఇలా మాట మార్చడం గమనార్హం.రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రాహం తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. రష్యా, ఉక్రెయిన్ మధ్య పరిస్థితులను గమనిస్తున్నాం. రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే దేశాలపై తప్పకుండా చర్చలు ఉంటాయి. ఉక్రెయిన్‌కు సాయం చేయని దేశాల ఉత్పత్తులపై 500 శాతం సుంకం విధిస్తాం. రష్యా నుంచి చమురును భారత్, చైనాలు 70శాతం కొనుగోలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా ఈ రెండు దేశాలపై సుంకం విధించే అంశం పరిశీలిస్తున్నామని అన్నారు. ఇదే సమయంలో ఆగస్టులో బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. ఈ బిల్లుపై ట్రంప్ కూడా ఓకే చెప్పారని వెల్లడించారు. అయితే, ఉక్రెయిన్‌తో యుద్ధం విషయంలో రష్యా కాల్పులు విరమణకు అంగీకరించలేదు. ట్రంప్ సూచనలు, హెచ్చరికలను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ లెక్క చేయలేదు. దీంతో, రష్యాను అమెరికా టార్గెట్ చేసింది. రష్యాను ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేసే యూఎస్ ప్రయత్నాల్లో ఇది ఒకటిగా తెలుస్తోంది. ఈ బిల్లు అమల్లోకి వస్తే.. రష్యా నుంచి పెద్దమొత్తంలో ముడి చమురు కొనుగోలు చేస్తున్న భారత్, చైనాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇది మన ఔషధాలు, వస్త్రాలు వంటి ఎగుమతులపై ప్రభావం పడుతుంది. ఇక, ఉక్రెయిన్‌కు మద్దతు ఇచ్చే దేశాల కోసం లిండ్సే మరో ఒప్పందాన్ని ప్రతిపాదించనున్నట్లు తెలుస్తోంది.ట్రంప్ బిగ్ డీల్ ప్రకటన..ఇదిలా ఉండగా.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవలే భారత్‌తో బిగ్ డీల్ ఉండనున్నట్టు తెలిపారు. త్వరలోనే భారత్‌తో ఒప్పందం కుదుర్చుకోనున్నాం. అది ఒక కొత్త డీల్ అవుతుంది. ప్రస్తుతం భారత్ ఇంకా దాన్ని అంగీకరించలేదు. వాళ్లు డీల్‌కు ఒప్పుకుంటే తక్కువ సుంకాలు విధించేలా ఒప్పందం కుదురుతుందని అన్నారు. జూలై తొమ్మిదో తేదీ నాటికి వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవాలని ఇరు దేశాలు ప్రయత్నిస్తున్నాయి. దీనిపై చర్చలు సైతం జరుగుతున్నట్టు తెలుస్తోంది. -
‘రేప్ ఒక ప్రమాదం’
రిపబ్లికన్ రాష్ట్రాల్లో బీమా కంపెనీలకు లాభాలను పండించే ‘రేప్ ఇన్సూరెన్స్’ చట్టాలు పుట్టుకొస్తున్నాయి. అత్యాచార గర్భవతుల అబార్షన్లనే కాదు, వైద్యసలహాలపై జరిగే అబార్షన్లను, ఆధునిక జీవనశైలి ఫలితంగా పెరుగుతున్న యాదృచ్చిక గర్భస్రావాలను కూడా సాధారణ బీమా నుంచి మినహాయించారు. కారు ప్రమాదానికి ప్రత్యేక బీమాలాగే అబార్షన్లకు ప్రత్యేక బీమా తీసుకోవాలని చెబుతున్నారు. ‘రేప్ ఒక ప్రమాదం లాంటిది... కారు ప్రమాదం మనం ముందుగా ప్లాన్ చేసుకునేదేం కాదు. అదీ అంతే.’ గత ఏడాది జరిగిన ‘ఢిల్లీ బస్సు ప్రమాదం’ గురించి మిరపకాయలు తిన్న కాకుల్లా గోల చేసిన వారంతా బార్బరా లిస్టింగ్ ప్రవచించిన ఈ సత్యాన్ని గ్రహించాలి. నిర్భయ చట్టం భయం లేకుండా ‘ప్రమాదాలు’ యథావిథిగా ఎలాగూ సాగిపోతూనే ఉన్నాయి. అపలేని వాటిని ఆపాలని ప్రయాస పడేకంటే... ‘అత్యాచార బీమా చట్టం’ కావాలని గోల చేయడం ఉత్తమం. మిచిగాన్ ‘రైట్ టు లైఫ్’ (జీవించే హక్కు) అధ్యక్షురాలు బార్బరా మాటలను తీసిపారేయకండి. ఆమె పూనుకోబట్టే అమెరికన్ ఆటోమొబైల్ పరిశ్రమకు కేంద్రమైన ఆ రాష్ట్రానికి ‘అత్యాచార బీమా చట్టం’ దక్కింది. రిపబ్లికన్ మెజారిటీ సెనేట్ ముందు డెమోక్రటిక్ నేత్రి గ్రెషెన్ విట్మెర్... రేప్ ఇన్సూరెన్స్ గురించి సభ చర్చించడమే రోతను పుట్టిస్తోంది... మహిళలు ఇకపై తమ కోసం, తమ కూతుళ్ల కోసం రేప్ ఇన్సూరెన్స్ పాలసీ కొనుక్కోవాలో వద్దో నిర్ణయించుకోవడమనే ఆలోచనే కంపరమెత్తిస్తోంది. బీమా తీసుకుంటే ముందుగానే రేప్‌కు ప్లాన్ చేసినట్లవుతుంది. బీమా తీసుకోకుండా రేప్ వల్ల గర్భవతులైన మహిళలను ముందే జాగ్రత్తపడి ఇన్సూరెన్స్‌ను ‘ప్లాన్’ చేసుకోవద్దా? అని వెక్కిరించినట్లవుతుంది’ అంటూ వాపోయింది. 18 ఏళ్ల ప్రాయంలో అత్యాచారానికి గురై స్వయంగా తాననుభవించిన నరక వేదనను ఏకరువు పెట్టింది. తల్లిదండ్రులకు కూడా తెలియని తన గతం గాయం కథను విప్పి చెబితేనైనా సెనేట్ మన సు మారుతుందేమోనని పేరాశకు పోయింది. ఇంతకు ముందున్న ప్రైవేటు ఆరోగ్య బీమా పథకాలన్నీ అబార్షన్లను మహిళలకు అవసరమైన సహజ వైద్యంగానే భావించేవి. కొత్త చట్టం ప్రభుత్వ, ప్రైవేటు ఆరోగ్య బీమా పథకాల నుంచి అన్ని రకాల గర్భస్రావాలను, గర్భ విచ్ఛిత్తులను నిషేధించింది. రేప్ గర్భవతుల అబార్షన్లనే కాదు, ఒత్తిడితో కూడిన ఆధునిక జీవనశైలి వల్ల పెచ్చుపెరుగుతున్న అవాం ఛిత, యాదృచ్ఛిక గర్భస్రావాలను (మిస్క్యారేజెస్), వైద్య సలహాపై జరిగే అబార్షన్లను సైతం సాధారణ బీమా పరిధి నుంచి తప్పిం చారు. ఎలాంటి అబార్షన్ల కోసమైన ప్రత్యేక బీమా కొనుక్కోవాల్సిందే. స్త్రీల వైద్యం అబార్షన్లపై వేటు వేయడాన్ని నిరసిస్తూ... విట్మెర్ గాక మరో 20 మంది మహిళా ప్రతినిధులు స్వీయానుభవాలను కలబోతతో రక్తస్రావాల మయమైన ఆడబతుకును వివరించారు. మహిళలు ఏ పరిస్థితుల్లో యాదృచ్ఛిక గర్భస్రావాలు, వైద్యపరమైన, స్వచ్ఛంద అబార్షన్ల బాధలను అనుభవించాల్సి వస్తున్నదో పూసగుచ్చారు. విట్మెర్ అన్నట్టు ‘80 శాతం మగ ప్రజా ప్రతినిధులే అడవాళ్ల శరీరాల గురించి నిర్ణయాలను చేసే’ చోట ఈ ఆడ గోల వినేవాడెవడు? ఉభయ సభల ఆమోదంతో డిసెం బర్ రెండో వారంలో ‘అబార్షన్ ఇన్సూరెన్స్ ఆప్ట్-అవుట్’ (వద్దనుకునే అవకాశం కల్పించే అబార్షన్ బీమా) బిల్లు చట్టమైంది. విశేషమేమంటే మిచిగాన్ రాష్ట్ర గవర్నర్ రిక్ స్నైడర్ రిపబ్లికన్ పార్టీకి చెందినవారే. అయినా 2012 లోనే రేప్ ఇన్సూరెన్స్ బిల్లును ‘వ్యక్తిగత ఆరోగ్య బీమాలోకి అవాంఛనీయమైన చొరబాట’ని వీటో చేశారు. మిచిగాన్ రాజ్యాంగంలోని ఒక లొసుగును వాడుకొని బార్బరా లాంటి వాళ్లు రాష్ట్ర ఓటర్లలో 3 శాతం సంత కాలను సేకరించి బిల్లును ఉభయ సభల ముందుకు తెచ్చి, పంతం నెగ్గించుకున్నారు. మిచిగాన్కు ముందే 8 రాష్ట్రాలు రేప్ ఇన్సూరెన్స్ చట్టాలు చేశాయి. మరో 20 రాష్ట్రాలు అదే బాట పట్టనున్నాయి. ‘ఎఫర్డబుల్ హెల్త్ కేర్’ పేరిట అట్టహా సంగా ప్రారంభమైన ఒబామా కేర్ అమలుకు నిబంధనలను రూపొందించేది రాష్ట్రాలే. దీం తో వారు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ప్రైవే టు ఇన్సూరెన్స్ కంపెనీలకు లబ్ధిని చేకూర్చ డం కోసం అబార్షన్లపై కత్తి దూస్తున్నారు. అబార్షన్ బీమా అవసరం లేదనుకునే వారికి ఈ చట్టం వల్ల ఖర్చు తగ్గుతుందని చెబుతున్నారు. అదో కుంటిసాకు మాత్రమేనని ఒక్కసారి గణాంకాలను చూస్తే సరిపోతుంది. రిపబ్లికన్ వీరులు గగ్గోలు పెడుతున్నట్టు బీమా ఉందని మహిళలు విరగబడి అబార్షన్లు చే యించేసుకోవడం లేదు. మిచిగాన్ రాష్టంలో 1987లో 40 వేలకు పైగా అబార్షన్లు జరగగా 2012 నాటికి ఆ సంఖ్య 23 వేలకు పడిపోయింది. పైగా ఈ 23 వేల మందిలో 739 మం ది మాత్రమే బీమా సదుపాయాన్ని ఉపయోగించుకున్నారు. అమెరికా అంతటా 70 శాతం అబార్షన్లు ఇలా సొంత డబ్బులతో చేయించుకుంటున్నవే. ఒక్కొక్క అబార్షన్‌కు 300 నుం చి 1,000 డాలర్ల చొప్పున మిగిల్చేదెంత? అందులో బీమాదారులకు ఆదా అయ్యేదెం త? ఆ లెక్కలు కట్టడం కంటే... ప్రతి ఐదుగురు స్త్రీలలో ఒకరు జీవితంలో ఏదో ఒక సమయంలో అత్యాచారానికి గురవుతున్న దేశంలో అబార్షన్ కోసం ప్రత్యేక బీమాలను కొనక చస్తారా? అనే లాభాల తర్కం వేపు చూస్తే రేప్ ఇన్సూరెన్స్ చట్టం ఎవరి కోసమో అర్థమవుతుంది. ఈ చట్టానికి, అబార్షన్ల వ్యతిరేక ఉద్యమానికి ఎలాంటి సంబంధమూ లేదనీ, ఇది ‘వ్యాపార కాంట్రాక్టేనని’ రిపబ్లికన్లే చెబుతున్నారు. మహిళల రక్షణ అమెరికాకం టే అధ్వాన్నంగా ఉన్న మన దేశంలో అసలు ప్రభుత్వ సబ్సిడీ బీమాయే లేదు. విస్తరిస్తున్న ప్రైవేటు బీమా సంస్థలు చట్టాల గోల లేకుం డా వైద్యంతో పాటూ నగదు పరిహారం సైతం ఆశ చూపి, ఏ ముసుగులూ లేకుండా రేప్ ఇన్సూరెన్స్ ‘వ్యాపార కాంట్రాక్టులు’ అంటగట్టడం ఎప్పుడు ప్రారంభిస్తాయో ఏమో? అదేమోగానీ రేప్ ఇన్సూరెన్స్ చట్టాన్ని నిరోధించడంలో ఓటమి పాలైనా చట్టాలతో స్త్రీల పునరుత్పత్తి హక్కులను నియంత్రించే ఈ ప్రయత్నాలను ఓడిస్తామని ఘంటాపథంగా చెబుతున్నారు. కాదనలేం. 2012 అధ్య క్ష ఎన్నికల్లో ఈ ఆడోళ్లే బరాక్ ఒబామాను గెలిపించేసి రిపబ్లికన్లకు జెల్లకాయ కొట్టేయలేదా? 2016 చాలా దూరముందని రిపబ్లికన్లు అనుకుంటున్నట్టుంది. నేడు బరాక్ ఒబామా ప్రతిష్ట పాతాళంలో ఉన్న మాట నిజమే. కానీ రెండేళ్లనాటికి కొత్త డెమోక్రటిక్ అభ్యర్థిగా ఏ హిల్లరీ క్లింటన్నో ప్రత్యక్షం అవుతారు. ఈ ఆడోళ్లు వారిని అధ్యక్ష పీఠం ఎక్కించేసి కుక్క కాటుకు చెప్పు దెబ్బ అనేయగలరు. - పిళ్లా వెంకటేశ్వరరావు