breaking news
B.Tech course
-
బీటెక్ కౌన్సిలింగ్‌కు ఆన్లైన్లో ఆప్లై చేసుకోండి
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ ఇంటర్నేషనల్ టెక్నాలజీ స్కూల్ మహీంద్ర ఎకోల్ సెంట్రల్ (ఎమ్ఈసీ), హైదరాబాద్ లో బీటెక్ 2020-2024 విద్యాసంవత్సరానికి సంబంధించి కౌన్సిలింగ్ జరగనుంది. కరోనా కారణంగా లాక్డౌన్ కొనసాగుతుండటంతో బీటెక్ అడ్మిషన్ల కోసం జరిగే కౌన్సిలింగ్ విధానాన్ని పూర్తిగా ఆన్లైన్లోనే చేపట్టనున్నారు. కౌన్సిలింగ్ అడ్మిషన్ల కోసం విద్యార్ధులు www.mahindraecolecentrale.edu.in లో మే10 వరకు అప్లై చేసుకోవచ్చు. జనవరి లో నిర్వహించిన జేఈఈ మెయిన్స్‌లో వచ్చిన పర్సన్టైల్ ఆధారంగా ఆడ్మిషన్లు ఇవ్వడం జరుగుతుందని ఎమ్ఈసీ తెలిపింది. దీనికి సంబంధించిన ప్రెస్ నోట్‌ను సోమవారం యమ్‌ఈసీ విడుదల చేసింది. యమ్ఈసీలో ఇంజనీరింగ్‌కి సంబంధించిన నాలుగు బ్రాంచ్‌లకు(సివిల్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్)240 సీట్లు( ఒక్కో బ్రాంచ్‌కు 60 సీట్లు )ఉన్నాయి.భవిష్యత్తులో ప్రపంచశ్రేణి ఇంజనీరింగ్ పట్టభద్రులను అందించాలనే ఉద్దేశంతో మహీంద్రా గ్రూప్ సంస్థ ప్రారంభించిన ఇంజనీరింగ్ కాలేజ్.. మహీంద్రా ఎకోల్ సెంట్రల్. అకడెమిక్ సిలబస్, కరిక్యులం రూపకల్పన, బోధన, ఇతర శిక్షణ అంశాలకు సంబంధించి.. ఫ్రాన్స్‌కు చెందిన 185 ఏళ్ల చరిత్ర కలిగిన ప్రముఖ ఇన్స్టిట్యూట్ ఎకోల్ సెంట్రల్-ప్యారిస్, మన రాష్ట్రంలోని జేఎన్టీయూ(హైదరాబాద్)లతో ఒప్పందం కుదుర్చుకుని హైదరాబాద్‌లో ఈ కాలేజ్‌ను ఏర్పాటు చేశారు. టెక్ మహీంద్రా సంస్థ ప్రాంగణంలోనే 30 ఎకరాల విస్తీర్ణంలో ఈ కాలేజ్‌కు మౌలిక సదుపాయాలు కల్పించారు. దీనికోసం సంస్థ ప్రారంభంలో రూ.300 కోట్లు కేటాయించింది. భవిష్యత్తు అవసరాలకు సరితూగే విధంగా ప్రతి విద్యార్థికి రీసెర్చ్ ఓరియెంటెడ్ స్కిల్స్, ప్రాక్టికల్ అప్రోచ్ మెళకువలను అందిస్తారు. తద్వారా కోర్సు పూర్తయ్యేనాటికి మంచి నైపుణ్యాలు ఉన్న ఇంజనీర్లుగా తీర్చిదిద్దుతారు. ప్రతి విద్యార్థి కోర్సు సమయంలో ఆరు నుంచి తొమ్మిది నెలల వ్యవధిలో ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్‌లో భాగంగా ఎకోల్ సెంట్రల్ ప్యారిస్‌కు వెళ్లే అవకాశం లభిస్తుంది. మీరు కూడా ఈ సంస్థలో చేరాలనుకుంటే మే 10లోపు కౌన్సిలింగ్‌కు ఆప్లై చేసుకోండి. 10+2 లొ 60 శాతం పైగా మార్క్‌లు సాధించి,జేఈఈ మెయిన్స్‌లో అర్హత సంపాదించిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. -
ఏం‘టెక్’ కాలేజీలో..!
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ కాలేజీల్లో బీటెక్ కోర్సుల్లోనే కాదు.. ఎంటెక్ కోర్సుల్లోనూ సదుపాయాల కొరత తీవ్రంగా ఉంది. బీటెక్ ఇంజనీరింగ్ కాలేజీల్లోనే ఎంటెక్ కోర్సులను కొనసాగిస్తుండటంతో ఈ పరిస్థితి నెలకొంది. అనేక కాలేజీల్లో కంప్యూటర్ ల్యాబ్‌లు లేవు. ఒకవేళ ఉన్నా సరిపడా కంప్యూటర్లు సమకూర్చడం లేదు. అధ్యాపకుల కొరత కూడా ఎక్కువే. కొన్ని కాలేజీల్లో బోధనే సరిగ్గా జరగడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఇక మరికొన్ని కాలేజీల్లో అనర్హులతో బోధన కొనసాగిస్తున్నారనే ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి. 50 శాతం వరకు కాలేజీల్లో అరకొరగా ఉన్న సిబ్బందితోనే నెట్టుకొస్తున్నట్లు అంచనా. ఈ పరిస్థితుల్లో ఈ నెల 6వ తేదీ నుంచి ఎంఈ/ఎంటెక్‌లో ప్రవేశాల కోసం ఉన్నత విద్యా మండలి తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే అనేక కాలేజీలకు ఇప్పటివరకు అఫిలియేషన్లే లభించలేదు. దీంతో ఏం చేయాలో అర్థం కాని గందరగోళం యాజమాన్యాల్లో నెలకొంది. అలాగే బీటెక్ ఇంజనీరింగ్ సీట్లలో కోతపడినట్లే పీజీ సీట్లు కూడా చాలా మేరకు కోత పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిజానికి ఎంటెక్కు బోధించాలంటే పీహెచ్డీ విద్యార్హత అవసరం. కానీ చాలా కాలేజీల్లో పీహెచ్డీ లేని వారితోనే బోధన కొనసాగిస్తున్నట్లు తెలిసింది. ఎంఫార్మసీలోనూ ఇదే పరిస్థితి నెలకొందని ఉన్నత విద్యా మండలి వర్గాలు పేర్కొంటున్నాయి. చాలా ఫార్మసీ కాలేజీల్లో ప్రయోగశాలలు సరిగా లేవని చెబుతున్నారు. ప్రయోగాలు చేసేందుకు అవసరమైన పరికరాలను సమకూర్చుకోవడం లేదని ఆరోపిస్తున్నాయి. బీటెక్ కోసం ఏర్పాటు చేసిన కొద్దిపాటి సదుపాయాలతోనే ఎంటెక్, ఎంఫార్మసీ కోర్సులను కొనసాగిస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే బీటెక్ కాలేజీల్లో సదుపాయాలపై సీరియస్‌గా ఉన్న ప్రభుత్వం.. ఈ పీజీ కోర్సుల నిర్వహణ తీరుపైనా దృష్టి సారిస్తే మరిన్ని లోపాలు బయటపడే అవకాశం ఉందని అధికారవర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 349 ఎంటెక్, 188 ఫార్మసీ కాలేజీలు ఉన్నాయి. వీటిలో దాదాపు సగం కాలేజీలు తెలంగాణ జిల్లాల్లోనే ఉన్నాయి. ఈ కాలేజీల్లో ఫస్ట్, సెకండ్ షిఫ్ట్ కలిపి ఎంటెక్‌లో 41,178 సీట్లు ఉండగా, ఎం.ఫార్మసీలో 15,452 సీట్లు ఉన్నాయి. ఎక్కువ కాలేజీల్లో విద్యార్థుల హాజరు అసలే ఉండదని, అవి ఫీజులు వసూలు చేసుకుని సర్టిఫికెట్లు ఇప్పించే కేంద్రాలుగా మారిపోయాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో సదరు కాలేజీల అఫిలియేషన్ల విషయం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఎంటెక్‌లో ప్రవేశాలకు షెడ్యూల్ జారీ సాక్షి, హైదరాబాద్: ఎంఈ/ఎంటెక్/ఎంఆర్క్/ఎం.ఫార్మసీ/ఫార్మ్-డి కోర్సుల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ జారీ అయింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం నేతృత్వంలో కౌన్సెలింగ్ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఉమ్మడిగా ఈ ప్రవేశాలను చేపడతారు. ఈ నెల 6వ తేదీ నుంచి 19 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జరుగుతుంది. 10 నుంచి 23వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పిస్తారు. 2013, 2104 సంవత్సరాల్లో గేట్, జీప్యాట్ లేదా ఓయూ నిర్వహించిన పీజీఈసెట్‌లో అర్హత సాధించిన వారు ఈ కోర్సుల్లో చేరేందుకు అర్హులు. పూర్తి వివరాలను వెబ్ సైట్ (http://pgecet.apsche.ac.in, http://appgecet.org)లో ఉన్నాయి.