breaking news
Breaks Out
-
ఢిల్లీలో ప్రైవెట్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం
-
నిద్రలోనే ప్రాణాలు పోయాయి..
పుణే: మహారాష్ట్ర లోఓ బేకరీ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. శుక్రవారం తెల్లవారుఝామున చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో ఆరుగురు నిద్రలోనే ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. పుణే లోని బేక్స్ అండ్ కేక్స్ లో బేకరీ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు అంటుకున్నట్టుగా ప్రాథమికంగా పోలీసులు భావిస్తున్నారు. బహుళ అంతస్తుల భవనంలో మొదటి అంతస్తులో ఉన్న బేకరీ ఈ ప్రమాదం సంభవించింది. అయితే మంటలు పెద్దగా వ్యాపించకపోయినప్పటికీ.. లోపల నిద్రిస్తున్న ఆరుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. . బయట తాళం వేసి ఉండటంతో బయటికి వచ్చేదారిలేకపోవడంతో ఊపిరి ఆడక చనిపో్యినట్టు పోలీసులు తెలిపారు. అయితే తాళం ఎందుకు వేశారనే కోణంలో విచారణ కొనసాగుతోందన్నారు. -
ఢిల్లీలోని సెంట్రల్ బ్యాంక్లో అగ్ని ప్రమాదం