breaking news
Brands List
-
అదానీ గ్రూప్ విలువ జూమ్..
న్యూఢిల్లీ: అత్యంత వేగంగా ఎదుగుతున్న భారతీయ బ్రాండుగా అదానీ గ్రూప్ నిల్చింది. 2025కి గాను బ్రాండ్ ఫైనాన్స్ సంస్థ రూపొందించిన అత్యంత విలువైన భారతీయ బ్రాండ్స్ జాబితాలో చోటు దక్కించుకుంది. ఈ రిపోర్టు ప్రకారం అదానీ బ్రాండ్ విలువ 2024లో 3.55 బిలియన్ డాలర్లుగా ఉండగా తాజాగా 2.91 బిలియన్ డాలర్లు పెరిగి 6.46 బిలియన్ డాలర్లకు ఎగిసింది. ఓవరాల్‌గా గతేడాది 16వ స్థానంలో ఉండగా ఈసారి 13వ ర్యాంకుకు చేరింది. 82 శాతం బ్రాండ్ విలువ వృద్ధితో అదానీ గ్రూప్ అత్యంత వేగంగా ఎదుగుతున్న భారతీయ బ్రాండుగా నిల్చిందని రిపోర్ట్ పేర్కొంది. తాజా నివేదిక ప్రకారం.. → ఇండియా 100 జాబితాలోని మొత్తం సంస్థల బ్రాండ్ విలువ 236.5 బిలియన్ డాలర్లు.→ అత్యంత విలువైన భారతీయ బ్రాండుగా టాటా గ్రూప్ మరోసారి అగ్రస్థానంలో నిల్చింది. బ్రాండ్ విలువ 10 శాతం వృద్ధి చెంది 31.6 బిలియన్ డాలర్లకు చేరింది. → 15 శాతం బ్రాండ్ విలువ (16.3 బిలియన్ డాలర్లు) వృద్ధితో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ఈ జాబితాలో అత్యంత విలువైన రెండో భారతీయ బ్రాండుగా నిల్చింది.→ హెచ్డీఎఫ్సీ గ్రూప్ బ్రాండ్ విలువ 14.2 బిలియన్ డాలర్లకు చేరడంతో ర్యాంకింగ్స్‌లో మూడో స్థానంలో నిల్చింది. ఎల్ఐసీ (13.6 బిలియన్ డాలర్లు) నాలుగో ర్యాంకు, హెచ్‌సీఎల్‌టెక్ (బ్రాండ్ విలువ 17 శాతం అప్, 8.9 బిలియన్ డాలర్లు) ఒక ర్యాంకు ఎగబాకి ఎనిమిదో స్థానానికి చేరింది. ఎల్అండ్టీ గ్రూప్ (7.4 బిలియన్ డాలర్లు) తొమ్మిదో స్థానంలో, మహీంద్రా గ్రూప్ (7.2 బిలియన్ డాలర్లు) 10వ స్థానంలో నిల్చాయి. → అత్యంత పటిష్టమైన భారతీయ బ్రాండుగా తాజ్ హోటల్స్ వరుసగా నాలుగో ఏడాదీ అగ్రస్థానాన్ని కాపాడుకుంది. -
టాప్ 3 ఐటీ బ్రాండ్స్‌లో టీసీఎస్...
లండన్: దేశీ సాఫ్ట్వేర్ సేవల దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) తాజాగా టాప్ 3 అంతర్జాతీయ ఐటీ దిగ్గజ బ్రాండ్స్ జాబితాలో చోటు దక్కించుకుంది. అంతర్జాతీయ బ్రాండ్ వేల్యుయేషన్ సంస్థ బ్రాండ్ ఫైనాన్స్ తమకు ఈ ర్యాంకింగ్ ఇచ్చినట్లు టీసీఎస్ ఒక ప్రకటనలో తెలిపింది. అత్యుత్తమ పనితీరుకు గాను తమకు ఎఎప్లస్ రేటింగ్ దక్కినట్లు పేర్కొంది. అయిదేళ్ల క్రితం టీసీఎస్ .. బిగ్ 4 బ్రాండ్స్‌లో ఒకటిగా నిలవగా తాజాగా మరో మెట్టు ఎదిగి టాప్ 3లో చోటు దక్కించుకుందని బ్రాండ్ ఫైనాన్స్ సీఈవో డేవిడ్ హేగ్ తెలిపారు. తొలి రెండు స్థానాల్లో ఐబీఎం, యాక్సెంచర్ ఉన్నాయి.