Bonsai nursery
-
'మొక్క'వోని హాబీ.. సిరులు కురిపిస్తోంది..!
పచ్చని సీమలో ఎడారి మొక్కల అందాలు కనువిందు చేస్తున్నాయి. హాబీగా చేపట్టిన బోన్సాయ్ మొక్కల పెంపకం సిరులు కురిపిస్తోంది. ఎడారికి అందాలు అద్దే అడీనియం మొక్కలకు మండలంలోని వెలివోలు గ్రామం చిరునామాగా మారింది. ఈ కుగ్రామం నుంచి దేశంలోని పలు ప్రాంతాలకు అడీనియం మొక్కలు సరఫరా అవుతు న్నాయి. ఆంధ్రప్రదేశ్ కృష్ణజిల్లా వెలివోలు గ్రామానికి చెందిన కుంభా సాంబ శివరావు ప్రైవేటు స్కూల్లో వ్యాయామోపాధ్యాయుడగా పనిచేసేవారు. 2020లో తన హాబీ మేరకు తెలిసిన వారి దగ్గర నుంచి 12 రకాల అడీనియం మొక్కలను తెచ్చి తన ఇంటి పెరటిలో నాటారు. కరోనా సంక్షోభం కారణంగా ఓ పక్క స్కూల్స్ మూతపడటం, మరోపక్క చేసేందుకు ఎక్కడా పని దొరక్కపోవటంతో తన దృష్టిని ఎడారి మొక్కల పెంపకంపై కేంద్రీకరించారు. తన పెరటిలో ఉన్న 12 అడీనియం మొక్కల నుంచి విత్తనాలను సేకరించి, వాటి నుంచి మొక్కలను పునరుత్పత్తి చేయడం ప్రారంభించారు. రెండు పద్ధతుల్లో మొక్కల పునరుత్పత్తి తన పెరటిలో ఉన్న అడీనియం మొక్కలతోపాటు థాయ్‌ల్యాండ్, కేరళ, తమిళనాడు నుంచి మరికొన్ని రకాల మొక్కలను సాంబశివరావు దిగుమతి చేసుకున్నారు. వాటి ద్వారా అరుదైన అడీనియం రకాలను సృష్టించడం ప్రారంభించారు. తన ఇంటి పెరట్లో 12 మొక్కలతో ప్రారంభమైన నర్సరీ నేడు 75 సెంట్ల స్థలంలో సుమారు 10 వేల అడీనియం మొక్కలతో విరాజిల్లుతోంది. ఇక్కడ మొక్కలను రెండు రకాలుగా పునరుత్పత్తి చేస్తున్నారు. అంటుకట్టు పద్ధతిలో ఇప్పటి వరకూ 100 రంగులకు పైగా పూలు పూసే మొక్కలను ఉత్పత్తి చేశారు. రెండో పద్ధతిలో విత్తనాలు నాటడం ద్వారా మరో 200 రకాల మొక్కలను సృష్టించినట్లు సాంబశివరావు తెలిపారు. 5 వేల మొక్కల విక్రయం సాంబశివరావు నర్సరీలో అరబికం, ఉబేసం, నోవా టాంజానియా, క్రిస్పం, స్వాజికం, సోమాలియన్స్, మల్టీఫ్లోరం, సోకోట్రానమ్, బహుమీనియం, తాయ్ సోకోట్రానమ్ వంటి రకాలు, ఉప రకాల మొక్కలు ఉన్నాయి. మూడు నెలల నుంచి పదేళ్ల వయసు మొక్కలు కొలువుదీరాయి. ప్రత్యేకంగా సృష్టించిన రకాల్లో టవర్ఫామ్, రూట్ ట్రెయిన్ప్లాంట్, అనకొండ వంటివి ఉన్నాయి. నాలుగేళ్లలో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, ఢిల్లీ, మేఘాలయ ప్రాంతాలు మినహా దాదాపు మిగిలిన అన్ని రాష్ట్రాలకు ఐదు వేలకు పైగా మొక్కలను ఎగుమతి చేశారు. తన SambaAdeniums అనే ఇస్టా్రగామ్, ఫేస్బుక్ అకౌంట్ల ద్వారా ఆర్డర్లు సేకరించి ఈ మొక్కలు సరఫరా చేస్తున్నట్లు సాంబశివరావు తెలిపారు. రూ.150 నుంచి రూ.25 వేల విలువైన, అరుదైన మొక్కలు తన వద్ద ఉన్నట్లు చెప్పారు. ప్రతి నెలా రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకూ మొక్కల విక్రయం ద్వారా తనకు ఆదాయం వస్తోందని వివరించారు. మక్కువే పెట్టుబడి కరోనా తరువాత ఉద్యోగం లేక పనిదొరక్క ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా. మొక్కల పెంపకంపై ఉన్న నా మక్కువను అడీనియం వెలల మొక్కల వ్యాపారానికి పెట్టుబడిగా పెట్టా. 12 మొక్కలతో ప్రారంభించిన నర్సరీ 10 వేల మొక్కలకు విస్తరిం చింది. మారుమూల గ్రామమైన వెలివోలు నుంచి దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాలకు మొక్కలు సరఫరా చేస్తున్నా. ఇష్టమైన అలవాట్లను వ్యాపార అవకాశాలుగా మార్చుకుంటే తప్పక విజయం సాధిస్తామని నా నమ్మకం. –కుంభా సాంబశివరావు, నర్సరీ యజమాని, వెలివోలు (చదవండి: సునీతా విలియమ్స్ జీరో-గ్రావిటీ డైట్: ఆ తొమ్మిది నెలలు ఎలాంటి ఆహారం తీసుకున్నారంటే..) -
పొట్టి మొక్కతో పుట్టెడు లాభాలు.. నెలకు రూ. 4 లక్షలు పక్కా!
జీవితంలో నువ్వు గొప్ప వాడివి కావాలంటే డబ్బు సంపాదించాలి.. అయితే ఇది అనుకున్న సులభమైతే కాదు, కానీ మనిషి అనుకుంటే అసాధ్యం మాత్రం కాదు. ఇప్పుడు కంపెనీలు ప్రారంభించాలా అని సందేహం రావొచ్చు.. అవేమీ అవసరం లేకుండానే మొక్కలు పెంచి కూడా నీదైన మెలకువలతో తప్పకుండా సక్సెస్ సాధించవచ్చు. ఈ కథనంలో బోన్సాయ్ మొక్కలు పెంచి లక్షలు ఎలా సంపాదించాలో వివరంగా తెలుసుకుందాం. మనం ఎప్పుడైనా నర్సరీకి లేదా గార్డెన్ వంటి వాటికి వెళ్ళినప్పుడు చిన్నగా.. ఎంతో ముద్దుగా కనిపించే 'బోన్సాయ్' (Bonsai) మొక్కలు పెంచి తప్పకుండా లాభాలను పొందవచ్చు. జపనీస్ కళాకృతి మాదిరిగా ఉండే మొక్కలు చూడటానికి చాలా అందంగా కనిపిస్తూ ఎంతోమందిని ఆకర్షిస్తాయి. వీటిని ఇంట్లో ఓ మూల కుండీలో ఉంచి కూడా సులభంగా పెంచుకోవచ్చు. మార్కెట్లో ధర.. ప్రపంచ వ్యాప్తంగా గ్రీనరీని ఇష్టపడే చాలామంది ఈ మొక్కలను ఎంతో ఇష్టపడి మరీ కొనుగోలు చేస్తుంటారు. మార్కెట్లో వీటి ధర రూ. 200 నుంచి రూ. 2500 వరకు ఉన్నాయి. వీటి పెంపకం సాధారణ మొక్కల పెంపకం కంటే కూడా కొంత భిన్నంగా ఉంటుంది. అయితే దీని పెంపకం గురించి కొంత అవగాహనా కలిగి మొదలు పెడితే చాలా సులభంగా పెంచుకోవచ్చు. బోన్సాయ్ మొక్కలు పెంపకానికి ప్రధానంగా కావలసింది మట్టిని ఎంచుకోవమే. మొక్క నాటడం, చిగురించే ప్రక్రియ, పొడవు వంటివన్నీ చాలా భిన్నంగా ఉంటాయి. వీటిని పువ్వులు వచ్చే వారకు సాగు చేయాలంటే కొంత సమయం పట్టే అవకాశం ఉంటుంది. కావున కొంత ఓపిక అవసరం. పెంపకం విధానం.. ఈ మొక్కల పెంపకం ప్రారంభించాలనుకునే వారు కొంత భూమి కలిగి నీటి వసతి కూడా సరైన విధంగా ఉండేలా చూసుకోవాలి. భూమిలేని వారు కూడా 100 నుంచి 150 చదరపు అడుగుల టెర్రస్ ఉన్నా చేసుకోవచ్చు. దీనికి మట్టి కుండలు లేదా గాజు కుండలు, శుభ్రమైన గులకరాళ్లు, నీటిని చల్లడానికి ఒక స్ప్రే బాటిల్ వంటివి సమకూర్చుకోవాలి. ఒక చిన్న షెడ్ మాదిరిగా నిర్మించాలనుకుంటే నెట్ కూడా అవసరం ఉంటుంది. ఇదీ చదవండి: నెలకు రూ. 1 లక్ష.. 25 ఏళ్ళు రావాలంటే? ఇలా చేయండి! తక్కువ పెట్టుబడితో కూడా బోన్సాయ్ మొక్కల పెంపకం ప్రారభించవచ్చు. కానీ లాభం పొందటానికి కనీసం రెండు నుంచి ఐదు సంవత్సరాల సమయం పడుతుంది. మొక్క కొంత పెరిగిన తరువాత సుమారు 30 నుంచి 50 శాతం అధిక ధరకు విక్రయించవచ్చు. గతంలో ఓ బోన్సాయ్ మొక్క ఏకంగా రూ. 9 కోట్లకు అమ్ముడైంది అంటే దీనికున్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇదీ చదవండి: ముఖేష్ అంబానీ వేతనం ఎంతో తెలుసా? మరో ఐదేళ్లూ అదే జీతం! సగటు ఖర్చు.. ఒక మొక్కను మూడు సంవత్సరాలు సాగు చేయడానికి సగటున రూ. 240 ఖర్చు అవుతుంది. అయితే ఈ మొక్కల పెంపకాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం కూడా ఒక్కో మొక్కకు రూ. 120 అందిస్తుంది. ఇందులో కూడా మీకు 50 శాతం సబ్సిడీ లభిస్తుంది. కేంద్ర & రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక సబ్సిడీలు అందిస్తాయి. ఉదాహరణకు మీరు వంద మొక్కలు పెంచడానికి రూ. 24000 ఖర్చవుతుంది. ప్రభుత్వం మొక్కకు 120 అందిస్తుంది కావున వంద మొక్కలకు 12000 అందిస్తుంది. ఇందులో మీకు సబ్సిడీ రూ. 6000 లభిస్తుంది. ఈ లెక్కన మీకు అయ్యే ఖర్చు చాలా తక్కువగా ఉంటుందని స్పష్టమవుతుంది. ఈ సబ్సిడీలను పూర్తిగా ముందుగానే తెలుసుకుంటే మంచిది. కొంత మంది రైతులు వెల్లడించిన సమాచారం ప్రకారం.. ఒక హెక్టారులో 3 x 2.5 మీటర్ల విస్తీరణంలో 1500 నుంచి 2500 చెట్లను పెంచవచ్చు. మొక్కల మధ్య ఖాళీ స్థలంలో కూడా మరో పంట పండించుకోవచ్చు. మొత్తం మీద నెలకు సుమారు రూ. 3.5 లక్షల నుంచి రూ. 4 లక్షల వరకు సంపాదించవచ్చు. రీప్లాంటేషన్ కూడా పెద్దగా అవసరం ఉండదని చెబుతున్నారు. -
ట్రీ ఇన్ ట్రే
పార్టీల్లో బొకేలు, ఆర్ట్ఫిషియల్ గిఫ్ట్‌లూ మామూలే. మరి ఈ ‘ట్రీ ఇన్ ట్రే’ ఏమిటి! ఇప్పుడిప్పుడే సిటీలో పెరుగుతున్న రిటర్న్ గిఫ్ట్ ట్రెండ్... బోన్సాయ్ చెట్టు. ప్రత్యేకించి చిన్నారులకు పుట్టిన రోజు బహుమతిగా అందిస్తూ... బాల్యం నుంచే ప్రకృతితో అనుబంధం పెంచుతున్నారు. పబ్లిక్ గార్డెన్స్‌లో బుధవారం బోన్సాయ్పై వర్క్‌షాపు జరిగిన సందర్భంగా ‘శ్రీ బోన్సాయ్’ వ్యవస్థాపకురాలు లలితాశ్రీ ఈ విషయాలను వెల్లడించారు... - వాంకె శ్రీనివాస్ సిటీ కుర్రాడు ఊరికెళితే చెట్ల ఒడిలో సేద తీరుతాడు. ప్రకృతిని ఆస్వాదిస్తాడు. ఈ వాతావరణం నగరంలో ఉంటే ఎంత బాగుంటుందని ఆ క్షణం అనుకుంటాడు. ఇలాంటి వారి కోసమే బోన్సాయ్. ఎక్కువ స్థలం ఆక్రమించకుండా... పళ్లెంలో పెరిగే చెట్టు ఇది. గ్రామాల్లో చెట్లలానే పూలు పూస్తాయి. పండ్లు కాస్తాయి. రెండున్నర వేల ఏళ్ల నాటి ఈ చెట్టు ఇప్పుడు నగరవాసులకు ఫ్యామిలీ ఫ్రెండ్‌గా మారింది. మిగిలిన మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లోనే దీనికి డిమాండ్ ఎక్కువ. కావల్సిన పండ్లు కోసుకు తినడమే కాదు... కాలుష్యం నుంచి కొంతవరకైనా బోన్సాయ్ ద్వారా ఉపశమనం పొందుతున్నారు. పిల్లలైతే వారికి తెలియకుండానే పర్యావరణానికి దగ్గరవుతున్నారనేది నిపుణుల మాట. ఒక్కోటి ఒక్కో వెరైటీ... ఫార్మల్, ఇన్ఫార్మల్ అప్రైట్, బ్రూమ్, స్లాటింగ్, మల్టీ ట్రంక్... ఇవన్నీ బోన్సాయ్ చెట్లు పెరిగే స్టైల్స్. అభిరుచిని బట్టి ఎంచుకోవచ్చు. మేడి, జమ్మి, మర్రి, రావి చెట్లు పెంచుకొనేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ఈ చెట్లకు ఆధ్యాత్మిక నేపథ్యం ఉండటంతో క్రేజ్ మరింత పెరిగింది. రూ. 250 నుంచి రూ. లక్షల వరకు ధరలున్నాయి. ఓసారి రాష్ట్రపతి భవన్‌కు వెళ్లినపుడు బోన్సాయ్ నర్సరీ గురించి తెలుసుకున్నా. చదువుకొంటూనే ఖాజాగూడలో బోన్సాయ్ నర్సరీ ఏర్పాటు చేశా. ఇప్పటి వరకు మూడు వేల మొక్కలు పెంచా. మాదిప్పుడు భారత్‌లోనే నంబర్ వన్. పదమూడేళ్ల చింత చెట్టుకు ‘ఎక్సలెన్స్ ఇన్ డిజైన్స్’ గౌరవం దక్కింది.