breaking news
bitterguard
-
పూతరేకులు.. వెరీ స్పైసీ గురూ..
సాక్షి, విశాఖపట్నం: పూతరేకు ఏంటీ.. స్పైసీగా ఉండట మేంటి...? విడ్డూరం కాకపోతేనూ...! అని అనుకుంటు న్నారా... లేదండీ... నిజమే.. ఇక నుంచి స్పైసీ పూత రేకులు మార్కెట్లో హాట్ హాట్‌గా కనిపించనున్నాయి. ప్రత్యేకంగా మధుమేహ వ్యాధిగ్రస్తుల కోసం కాకరకాయ, వెల్లుల్లి కారంతో పూతరేకులను రూపొందించారు ఆత్రేయ పురానికి చెందిన తయారీదారులు. పూతరేకుల తయారీ అనేది డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయ పురం ప్రజలకు తరతరాలుగా వారసత్వంగా వస్తోంది. తొలినాళ్లలో పంచదారతోనే పూతరేకులు తయారు చేసేవారు. కాలానుగుణంగా మారుతున్న అభిరుచుల మేరకు పూతరేకుల్లోనూ అనేక రకాలు వచ్చేశాయి. బెల్లం, నెయ్యి, డ్రై ఫ్రూట్స్ వంటి వాటితో రకరకాల పూతరేకులు తయారు చేస్తున్నారు. ఇప్పుడు పూతరేకుల తయారీదారులు ట్రెండ్ మార్చారు. స్పైసీ పూతరేకులు సిద్ధం చేశారు. కాకరకాయ, వెల్లుల్లి కారంపొడితో పూతరేకు చుడతారు. డయాబెటిక్‌తో ఉన్నవారికి ఇది ఒక ఔషధంలా పనిచేస్తుంది. ఈ పూతరేకులు తింటే రక్తశుద్ధి, ఇన్సులిన్ సామర్థ్యం పెరిగే అవకాశాలు ఉన్నాయని తయారీదారులు చెబుతున్నారు. మార్కెట్లోకి స్సైసీ బిట్టర్గార్డ్, గార్లిక్ పూతరేకులు ఇన్నాళ్లూ పూతరేకులు తీయని రుచితో నోరూరిస్తూ.. మధుమేహ బాధితులకు మాత్రం శత్రువుగా ఉండేవి. షుగర్ ఫ్రీ పూతరేకులు అందుబాటులోకి వచ్చినా వాటిపై డయాబెటిక్ రోగులు అంతగా ఆసక్తి చూపించలేదు. అందుకే ఇప్పుడు స్వీట్‌ని హాట్‌గా తింటూ... మధుమేహాన్ని కంట్రోల్ చేసుకునేందుకు ఆత్రేయపురం వాసులు తయారు చేసిన కొత్త తరహా పూతరేకులను శుక్ర వారం మార్కెట్లోకి విడుదల చేశారు. అత్రేయపురానికి చెందిన సర్ ఆర్థర్ కాటన్ పూతరేకుల సహకార సంఘం ప్రతినిధులు తీసుకువచ్చిన స్పైసీ బిట్టర్గార్డ్, గార్లిక్ పూతరేకులను దామోదరం సంజీవయ్య న్యాయ విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ శ్రీసుధ మార్కెట్లోకి విడుదల చేశారు. ప్రతి ఒక్కరూ ఆస్వాదించేలా... ఆత్రేయపురం పూతరేకులు అంటే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంది. మా పూతరేకు ప్రతి ఒక్కరూ ఆస్వాదిస్తూ తినాలన్నదే తయారీదారులందరి కోరిక. పంచదారతో తయారు చేయడం వల్ల తినలేకపోతున్నామంటూ చాలామంది మధుమేహం ఉన్నవారు మా ఊరు వచ్చినప్పుడు చెప్పి బాధపడేవారు. అందుకే భౌగోళిక గుర్తింపు వచ్చిన తర్వాత మంచి రోజు చూసుకుని స్పైసీ పూతరేకులను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాం. – గాదిరాజు ప్రసాదరాజు, ఆత్రేయపురం -
పందిరి సాగుతో పరుగులు
పెరుగుతున్న కాకర సాగు విస్తీర్ణం సత్ఫలితాలు సాధిస్తున్న రైతులు మెలకువలు పాటిస్తే మరింత మేలు గజ్వేల్ ఉద్యాన అధికారి చక్రపాణి సలహాలు, సూచనలు గజ్వేల్: పందిరి విధానంలో కాకర సాగుతో రైతులు సత్ఫలితాలు సాధిస్తున్నారు. ఈ పంట సాగు జిల్లాలో రోజురోజుకూ విస్తరిస్తోంది. పంట సాగులో పాటించాల్సిన మెలకువలపై గజ్వేల్ ఉద్యాన అధికారి చక్రపాణి (సెల్: 83744 49345) సలహాలు, సూచనలు మీ కోసం... విత్తన రకాలు(సాధారణం): పూసాదోమౌసమి, కోయంబత్తూర్ గ్రీన్‌లాంగ్, కో-వైట్ లాంగ్, అర్కహరిత, పూసా, విశేష్, డీకే-1, ప్రియ, మహికో గ్రీన్‌లాంగ్ హైబ్రీడ్ రకాలు: ఎంబీటీహెచ్-101, 102, ఎస్.ఎస్-431, 432, బీఐటీ-711, శ్వేత, పూనం, శ్రేయ, ప్రాచీ, పాలి. విత్తన మోతాదు: ఎకరాకు 1.8 నుంచి 2.4 కిలోలు రెండు వరుసల మధ్య దూరం: వేసవిలో 1.5 మీటర్లు ఖరీఫ్‌లో 2.5 మీటర్లు వరుసలో రెండు పాదుల మధ్య దూరం: వేసవిలో 0.5 మీటర్లు ఖరీఫ్‌లో 0.75 మీటర్లు విత్తే పద్ధతి: భూమి మీద పాకించే పాదులకు, వర్షాకాలంలో నీటి కాల్వలకు తోడుగా మురుగు నీరు పోవడానికి 2 మీటర్ల దూరంలో కాల్వలు చేయాలి. వేసవిలో వేసే పాదులకు పొలం అంతటా నీటిపారుదలకు బోదెలు చేయాలి. 15X10 సెం.మీల పాలిథిన్ సంచుల్లో విత్తుకొని 15-20 రోజులు పెరిగిన తర్వాత అదును చూసి పొలంలో విత్తుకోవాలి. విత్తనశుద్ధి: కిలో విత్తనానికి 3 గ్రాముల థైరమ్, 5 గ్రాముల చొప్పున ఇమిడాక్లోప్రిడ్ ఒకదాని తర్వాత మరోటి కలిపి విత్తన శుద్ధి చేయాలి. ఆ తర్వాత 100 గ్రాముల విత్తనానికి 2 గ్రాముల చొప్పున ట్రైకోడెర్మావిరిడితో విత్తనశుద్ధి చేయాలి. ఎరువులు: విత్తే ముందు ఎకరాకు 8-10 టన్నుల పశువుల ఎరువు, 32-40 కిలోల భాస్వరం, 16-20 కిలోల పొటాష్‌నిచ్చే ఎరువులను గంటలో వేయాలి. నత్రజని (32-40) రెండు సమపాళ్లుగా చేసి విత్తిన 25-30 రోజులకు, పూత పిందె దశలో వేసుకోవాలి. మొక్కకు దగ్గరలో ఎరువు వేయకూడదు. ఎరువు వేసిన వెంటనే మట్టిని కప్పి నీరు పెట్టాలి. కలుపు నివారణ, అంతర కృషి: కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు తీసేయాలి. 2-3 తడుల తర్వాత మట్టిని గుల్ల చేయాలి. ఎకరాకు పెండిమిథాలిన్ 1.2 లీటర్ల నీటిని కలిపి విత్తిన 24-48 గంటల్లోపు నేలకు పిచికారీ చేయాలి. మొక్కలు 2-4 ఆకుల దశలో ఉన్నప్పుడు లీటర్ నీటికి 3 గ్రాముల బొరాక్స్ కలిపి ఆకులపై పిచికారీ చేస్తే ఆడపూలు ఎక్కువగా పూసి పంట దిగుబడి అధికంగా ఉంటుంది. సీసీసీ 250మి.గ్రాముల లేదా మాలిక్ హైడ్రోజన్ 50 మీ.గ్రాములు లీటర్ల నీటికి కలిపి కూడా ఈ దశలో పిచికారీ చేయవచ్చు.