breaking news
Biological Research
-
మిత్రుడికి ముప్పు!
సాక్షి, అమరావతి: పర్యావరణ పరిరక్షణ, ఆహార ధాన్యాల ఉత్పత్తిలో కీటకాల పాత్ర కీలకం. మానవాళి కంటే దాదాపు 17 రెట్లు అధికంగా ఉండే కీటకాల జనాభా ప్రస్తుతం ముప్పు ఎదుర్కొంటోంది. ప్రపంచ వ్యాప్తంగా 40 శాతం కీటక జాతులు తగ్గిపోతున్నాయని, మూడో వంతు అంతరించిపోతున్నట్లు బయోలాజికల్ కన్జర్వేషన్ నివేదిక వెల్లడిస్తోంది. జనావాసాల పెరుగుదల, విచ్చలవిడిగా పురుగు మందులు, ఎరువుల వాడకం, కాలుష్యం, వాతావరణ మార్పుల కారణంగా మిత్ర కీటకాలు నశిస్తున్నాయి. పర్యావరణ నిపుణులు దీన్ని ‘కీటకాల అపోకలిప్స్’గా అభివర్ణిస్తున్నారు. ఆహార చక్రంలో ఎంతో కీలకం ప్రపంచవ్యాప్తంగా 5.5 మిలియన్ జాతుల కీటకాలు ఉన్నట్లు అంచనా వేయగా ఇప్పటివరకు కేవలం ఒక మిలియన్ జాతులను మాత్రమే గుర్తించారు. భూమిపై జంతు జాలంలో 80 శాతం కీటకాలే ఉండటం గమనార్హం. ఆహార పంటల పరాగ సంపర్కంతో పాటు తెగుళ్ల నియంత్రణ వ్యవస్థలుగా, భూమిని రీసైక్లింగ్ చేసే డీకంపోజర్లుగా పర్యావరణాన్ని కీటకాలు కాపాడుతున్నాయి. ఫిష్ అండ్ వైల్డ్‌లైఫ్ సర్వీస్ నివేదిక ప్రకారం భూమిపై ఉన్న 2.50 లక్షల రకాల పుష్పించే మొక్కలను పరాగ సంపర్కం చేయడంలో లక్ష కంటే ఎక్కువ కీటక జాతుల పాత్ర కీలకం. ఇందులో తేనెటీగలు, కందిరీగలు, సీతాకోక చిలుకలు, ఈగలు, బీటిల్స్ లాంటివి ఉన్నాయి. ఆహార చక్రంలో కీలక పాత్ర పోషించే కీటకాలు ఒక్క అమెరికాలోనే ఏటా 70 బిలియన్ డాలర్ల విలువైన సేవలను అందిస్తున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఏటా 1–2 శాతం క్షీణత.. ప్రపంచవ్యాప్తంగా ఏటా 1 నుంచి 2 శాతం కీటకాలు నశిస్తున్నట్లు శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. గత 30 ఏళ్లలో కీటకాల సంఖ్య దాదాపు 25 శాతం తగ్గింది. పక్షులు, క్షీరదాలు, సరీసృపాల కంటే కీటకాలు అంతరించిపోయే రేటు ఎనిమిది రెట్లు ఎక్కువగా ఉన్నట్లు వెల్లడైంది. కీటకాల సంఖ్య క్షీణిస్తే ఆహార సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 35 శాతం ఆహార పంటలకు పరాగ సంపర్కమే ఆధారం కావడం కీటకాల మనుగడ ఆవశ్యకతను సూచిస్తోంది. ♦ మానవులు దాదాపు 2 వేల కీటకాలను ఆహారంగా భుజిస్తారు. ♦ 75 శాతం కంటే ఎక్కువ కీటకాలు పరాగ సంపర్కంతో ఆహార చక్రాన్ని పరిరక్షిస్తాయి. ♦ దీని విలువ ఏటా 577 బిలియన్ల డాలర్లు ఉంటుంది. ♦ ప్రకృతిలో దాదాపు 80 శా>తం అడవి మొక్కలు పరాగ సంపర్కం కోసం కీటకాలపై ఆధారపడతాయి. ♦ గత 150 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా 2.50 లక్షల నుంచి 5 లక్షల కీటక జాతులు అంతరించాయి. -
వైల్డ్ ఇన్నొవేటర్ అడవి కూన
అడవిలో జాడలైన వాళ్లకు, అన్వేషణలో అడుగులు వీడని వాళ్లకు ‘వైల్డ్ ఇన్నొవేటర్ అవార్డు’ వస్తుంది! వన్య పరిశోధకుల వినూత్న దృష్టికి గొప్ప అభినందన వంటి ఈ అంతర్జాతీయ అవార్డుకు తొలిసారి ఒక భారతీయ మహిళ ఎంపికయ్యారు. యు.ఎస్. నుంచి ముగ్గురు, కెన్యా నుంచి ఇద్దరు, యు.కె., ఆస్ట్రేలియా కొలంబియా, మొజాంబిక్ నుంచి ఒక్కొక్కరు ఈ అవార్డును గెలుపొందగా.. ఇండియా నుంచి డాక్టర్ కృతి కారంత్ విజేత అయ్యారు. బహుమతి 75 లక్షల రూపాయలు. గౌరవం గగనమంత. విలువ భూగోళమంత. కృతి మాత్రం పుట్టినప్పటి నుంచీ అడవి కూనే! అరణ్యంలో వృక్షాలెన్నో, కృతి కెరీర్లో అవార్డులు అన్ని. అయితే ఇప్పుడొచ్చింది ప్రత్యేకమైన అవార్డు. ఒక విలక్షణమైన వృక్షంతో పోల్చదగిన పురస్కారం. యు.ఎస్. లోని ‘వైల్డ్ ఎలిమెంట్స్ ఫౌండేషన్’ ఈ అవార్డు ఇస్తుంది. బెంగళూరులోని ‘సెంటర్ ఫర్ వైల్డ్ లైఫ్ స్టడీస్’ (సి.డబ్లు్య.ఎస్.)లో కృతి చీఫ్ కన్సర్వేషన్ సైంటిస్ట్. వన్యప్రాణుల జీవనాన్ని అధ్యయనం చేసి, పరిశోధించి వాటి సంరక్షణకు వినూత్న విధానాలను కనిపెడుతుంటే శాస్త్రవేత్త. 42 ఏళ్ల కృతి ఎప్పటికప్పుడు అప్పుడే కొత్తగా అడవిని, అడవిలో పులులు, సింహాలను చూస్తున్నంత ఉల్లాసంగా ఉంటారు. నిజానికి ఆమె తనకు ఊహ తెలుస్తున్నప్పుడే అరణ్యమార్గంలోకి వచ్చేశారు! నాగర్హోల్ నేషనల్ పార్క్‌లో ఒక సాయంత్రం తాతగారి తెల్ల అంబాసిడర్ కారులో తండ్రి పక్కన కూర్చొని మెల్లిగా వెళుతున్నప్పుడు ఒక కందకంలో పులి ఆ చిన్నారి కంట పడింది. ఆ కొద్దిసేపటికే చిరుత దర్శనమిచ్చింది. ‘‘నాకది ఇప్పటికీ స్పష్టంగా గుర్తుంది’’ అంటారు కృతి. క్రమంగా కర్ణాటక లోని అటవీ ప్రాంతాలన్నీ ఆమె ఆట మైదానాలు అయ్యాయి. అందుకు తగిన కారణమే ఉంది. తండ్రి డాక్టర్ ఉల్లాస్.. టైగర్ బయాలజిస్ట్! తాతగారు డాక్టర్ శివరామ్ కారంత్ ప్రసిద్ధ రచయిత, పర్యావరణవేత్త. అడవులకు సమీపంలో ఉన్న గ్రామాల వారితో కలిసి కృతి వన్య జీవన అధ్యయనం తర్వాతి కాలంలో జ్ఞానపీuЇ అవార్డు గ్రహీత. ప్రకృతిని ప్రేమించే ఇద్దరు వ్యక్తుల దగ్గర పెరిగిన అమ్మాయి ప్రకృతినే కదా ప్రేమిస్తుంది. అయితే వన్యప్రాణుల సంరక్షణ శాస్త్రవేత్త అవుతానని అప్పుడు ఆమెక్కూడా తెలీదు. తల్లిలా, తండ్రిలా, తాతయ్యలా పీహెచ్డీ చేయాలని మాత్రమే అనుకుంది. నార్త్ కరోలీనా వెళ్లి అక్కడి డ్యూక్ యూనివర్శిటీలో పర్యావరణంపై పీహెచ్.డీ చేశారు కృతి. ఆ ముందు వరకు, ఆ తర్వాతా ఆమె చదివిన చదువులు, జరిపిన పరిశోధనలు, చేసిన ఉద్యోగాలు.. దేశంలో, విదేశాల్లో.. అన్నీ కూడా వన్యప్రాణి సంరక్షణకు సంబంధించినవే. చివరికి తను పుట్టిన రాష్ట్రంలోనే పెద్ద సైంటిస్టుగా పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడీ అవార్డు! 2011లో ‘నేషనల్ జియోగ్రాఫిక్ సొసైటీ వాళ్ల రిసెర్చ్ గ్రాంట్ రావడం, తర్వాతి ఏడాదే ‘ఎమర్జింగ్ ఎక్స్‌ప్లోరర్’గా గుర్తింపు పొందడం కృతి కెరీర్‌ని విస్తృతం చేశాయి. పది దేశాలు తిరిగి, పది సంస్కృతుల మనుషులతో కలిసిమెలిసి తిరగడం సాధ్యం అయింది. సాధారణంగా సైంటిస్టులు మనుషులతో కలవడానికి ఇష్టపడరు. కృతి మాత్రం ఎక్కడి మనుషులతో అక్కడి మనిషిలా కలిసిపోయారు. కర్ణాటక అరణ్య ప్రాంతాల చుట్టూ కనీసం రెండు వేల ఇళ్లకైనా వెళ్లి వాళ్లతో మాట్లాడి ఉంటారు కృతి! మాట వరకు పైన పది దేశాలను అన్నాం కానీ.. 40 దేశాలకు పైగానే ఆమె పర్యటించారు. అన్ని దేశాలు తిరిగిన ఆమె ఇండియా మొత్తం తిరగకుండా ఉంటారా! దేశంలోని అభయారణ్యాలన్నిటిలో ఒక అడుగు వేసి వచ్చారు. పరిశోధన అవసరమైన చోట అక్కడే కొన్నాళ్లు నివాసం ఉన్నారు. ఆమె పరిశోధనలు బి.బి.సి.లో, ఇంకా అనేక ప్రసిద్ధ చానళ్లలో సీరీస్‌గా వచ్చాయి. కృతి రియల్ లైఫ్ హీరోలు తండ్రి, తాత, తల్లి ప్రతిభ. ఇప్పుడు ఆమె తన కుటుంబంలోని ముగ్గురికి హీరో అయ్యారు. భర్త అవినాశ్ సొసలే, ఇద్దరు కూతుళ్లు.. ఆమె సెలవు రోజుల్లో ఆమెతో పాటు అడవిలో విహరించే వన్యప్రాణులు అయిపోతారు! వాళ్లతో పాటు ఇంట్లో నల, బఘీర అనే రెండు పిల్లులు వినిపించీ వినిపించనంతగా మ్యావ్ మ్యావ్ మంటూ పులుల్లా సోఫాలు ఎక్కి దిగుతుంటాయి. కృతి సాధించిన పరిశోధనల్లో ఒకటి.. ధ్వని, వాయు కాలుష్యాల నుంచి వన్య జీవులను సంరక్షించడం. -
పరిణామ సిద్ధాంత అన్వయానికి నోబెల్
స్టాక్‌హోం: జీవ పరిణామ సిద్ధాంతం ఆధారంగా పరిశోధనలు సాగించిన ముగ్గురికి ఈ ఏడాది రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి దక్కింది. ఫ్రాన్సిస్ ఆర్నాల్డ్(అమెరికా), జార్జ్ స్మిత్(అమెరికా), గ్రెగరీ వింటర్(బ్రిటన్)లు ఈ పురస్కారానికి ఎంపికయ్యారు. జీవ ఇంధనాల నుంచి ఔషధాల వరకు మానవాళికి ఉపయోగపడే పదార్థాల తయారీకి దోహదపడే ఎంజైమ్‌లను వీరు జీవ పరిణామ సిద్ధాంతం ప్రాతిపదికగా సృష్టించారు. రసాయన శాస్త్రంలో నోబెల్ పొందిన 5వ మహిళగా ఫ్రాన్సిస్ ఆర్నాల్డ్ గుర్తింపు పొందారు. సుమారు రూ.7.40 కోట్ల ప్రైజ్‌మనీని ఆర్నాల్డ్ సగం..స్మిత్, వింటర్‌లు మిగతా సగాన్ని పంచుకోనున్నారు. ‘నోబెల్ గ్రహీతలు డార్విన్ సిద్ధాంతాన్ని మానవాళికి గొప్ప మేలుచేసే కార్యసాధనకు ఉపయోగించారు’ అని స్వీడిష్ రాయల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ కొనియాడింది. ‘వారు డార్విన్ సూత్రాలను ప్రయోగశాలలో అమలుపరిచారు. వేయి రెట్ల వేగంతో జీవ పరిణామ క్రమాన్ని ప్రదర్శించి కొత్త ప్రొటీన్లను సృష్టించారు’ అని నోబెల్ కెమిస్ట్రీ కమిటీ చీఫ్ క్లాయిస్ గుస్తాఫసన్ వ్యాఖ్యానించారు. పరిణామవాదం.. శక్తిమంత ఇంజనీరింగ్ జీవ పరిణామ క్రమాన్ని అనుకరిస్తూ ఆర్నాల్డ్ డీఎన్ఏ విన్యాసంలో మార్పులు చేశారు. దీని వల్ల విషపూరిత శిలాజ ఇంధనాలకు మెరుగైన, పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయాలు కనుగొనేందుకు వీలు కలిగింది. ఫలితంగా, చెరకు నుంచి జీవ ఇంధనాలను ఉత్పత్తిచేస్తు న్నారు. శీతల వాతావరణంలోనూ మెరుగ్గా పనిచేసే డిటర్జెంట్ల తయారీకి కూడా ఆమె పరిశోధన దోహదపడింది. ‘ఈ భూమ్మీద అత్యంత క్లిష్టమైన, అద్భుతమైన వస్తువులను పరిణామ సిద్ధాంతం సృష్టించింది. ఎలా తయారుచేయాలో ఎవరికీ తెలియని విషయా లను కూడా దీని ద్వారా నిజం చేయొచ్చు. ఈ ప్రపంచంలో పరిణామ క్రమం అనేది అత్యంత శక్తిమంతమైన ఇంజినీరింగ్ పద్ధతి. గ్యాసోలిన్ ఉత్పత్తికి భూమి నుంచి ఇంధనాన్ని తోడాల్సిన పనిలేదు. మొక్కల్లో నిల్వ ఉండే సూర్యరశ్మి చాలు’ అని ఆర్నాల్డ్ ఓ సందర్భంలో చెప్పారు. కాలిఫోర్నియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో కెమికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఆర్నాల్డ్ (67) కేన్సర్ వ్యాధితో పోరాడి బయటపడ్డారు. బ్యాక్టీరియాపై దాడిచేసే వైరస్‌తో కొత్త ప్రొటీన్లు తయారుచేయొచ్చని స్మిత్, వింటర్ రుజువుచేశారు. వీరి ప్రయోగాల ఫలితంగా కీళ్ల నొప్పులు, సోరియాసిస్, పేగు వాతం తదితర వ్యాధులకు ఔషధాలు కనుగొన్నారు. స్మిత్ ఎంఆర్సీ మాలిక్యులర్ బయోలజీ లేబొరేటరీలో పరిశోధకులుగా పనిచేస్తున్నారు. -
హైదరాబాద్ లో జీవ పరిశోధన
అవార్డులు యూఎన్ హెచ్‌సీఆర్‌కు ఇందిర శాంతి బహుమతి ఐక్యరాజ్యసమితి శరణార్థుల పరిరక్షక కమిషనర్ (యూఎన్‌హెచ్‌సీఆర్)కు 2015 సంవత్సరానికి ఇందిరాగాంధీ శాంతి, నిరాయుధీకరణ, అభివృద్ధి బహుమతి లభించింది. ప్రపంచవ్యాప్తంగా శరణార్థులకు సహాయ సహకారాలు అందించడంతోపాటు వారి సంక్షేమానికి ఇది కృషి చేస్తోంది. ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ నేతృత్వంలోని కమిటీ యూఎన్‌హెచ్‌సీఆర్‌ను ఈ అవార్డుకు ఎంపిక చేసింది. కులదీప్ నయ్యర్‌కు గోయంకా అవార్డు 2013-14 సంవత్సరానికి రామ్‌నాథ్ గోయంకా జీవిత సాఫల్య పురస్కారాన్ని సీనియర్ పాత్రికేయుడు, కాలమిస్టు, రచయిత కులదీప్ నయ్యర్‌కు నవంబర్ 23న న్యూఢిల్లీలో అందజేశారు. పాత్రికేయుడిగా ఆయన చేసిన సేవలకు ఈ పురస్కారం దక్కింది. ఆయన గతంలో ఇండియన్ ఎక్స్‌ప్రెస్ దినపత్రికకు ఎడిటర్‌గా పనిచేశారు. యార్లగడ్డకు గురజాడ పురస్కారం 2015 గురజాడ అప్పారావు విశిష్ట పురస్కారం డా॥యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్‌కు లభించింది. విజయనగరంలోని సాహితీ, సాంస్కృతిక సేవా సంస్థలు.. ఏటా నవంబర్ 30న ఈ రంగానికి చెందిన ప్రముఖ వ్యక్తిని గురజాడ పురస్కారంతో సత్కరిస్తాయి. వార్తల్లో వ్యక్తులు ఏడీబీ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్‌గా స్వాతి దండేకర్ ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ఏడీబీ) ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్‌గా భారతీయ అమెరికన్, రాజకీయవేత్త స్వాతి దండేకర్‌ను అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా నవంబర్ 19న నియమించారు. ప్రపంచ జలమండలి గవర్నర్‌గా పృథ్వీరాజ్ సింగ్ రాజస్థాన్‌లోని ‘జల్ భగీరథి’ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు పృథ్వీరాజ్ సింగ్ ప్రపంచ జల మండలి గవర్నరుగా నవంబర్ 16న ఎంపికయ్యారు. ఫ్రాన్స్‌లో జరిగిన మండలి సమావేశంలో 160 దేశాలకు చెందిన ప్రతినిధులు ఆయనను ఎన్నుకున్నారు. వీహెచ్‌పీ నేత అశోక్ సింఘాల్ కన్నుమూత విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) సీనియర్ నేత అశోక్ సింఘాల్(89) గుర్గావ్లో నవంబర్ 17న మరణించారు. ఆయన 1980లో వీహెచ్‌పీ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. సైన్స అండ్ టెక్నాలజీ ఏఏడీ క్షిపణిని పరీక్షించిన భారత్ స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్(ఏఏడీ) క్షిపణిని భారత్ నవంబర్ 22న ఒడిశా తీరంలోని అబ్దుల్ కలాం దీవిలో విజయవంతంగా పరీక్షించింది. ఈ సూపర్ సోనిక్ ఇంటర్సెప్టార్ మిస్సైల్‌ను బహుళ అంచెల క్షిపణిగా అభివృద్ధి చేశారు. 7.5 మీటర్ల పొడవైన ఏఏడీ ఘన ఇంధనంతో పనిచేస్తుంది. ఇందులో ఆధునిక దిక్సూచి వ్యవస్థ, కంప్యూటర్, ఎలక్ట్రో మెకానికల్ యాక్టివేటర్లు ఉంటాయి. జాతీయం బిహార్ ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ బిహార్ ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ నవంబర్ 20న ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన ముఖ్యమంత్రిగా ఎన్నిక కావడం ఇది అయిదోసారి, వరుసగా మూడోసారి. ఆయనతో పాటు 28 మంది మంత్రులుగా బాధ్యతలు చేపట్టారు. మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఇద్దరు కుమారులు మంత్రివర్గంలో చేరారు. వీరిలో తేజ్ ప్రతాప్ ఉపముఖ్యమంత్రిగా నియమితులయ్యారు. హైదరాబాద్‌లో జీవ పరిశోధన కేంద్రం హైదరాబాద్‌లో జీవ పరిశోధన కేంద్రం ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ నవంబర్ 18న ఆమోదం తెలిపింది. జీవ వైద్య పరిశోధనలకు జాతీయ వనరుల సంస్థ (ఎన్ఏఆర్ఎఫ్)ను ఏర్పాటు చేస్తారు. వైద్య అవసరాల కోసం, వివిధ రకాల పరిశోధనలకు జంతు వనరులను ఈ సంస్థ సమకూరుస్తుంది. హైదరాబాద్‌లోని జీనోమ్ వ్యాలీలో భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) దీన్ని ఏర్పాటు చేస్తోంది. రూ.338.58 కోట్లతో ఏర్పాటు చేసే ఈ సంస్థ 2018-19 నాటికి విధులు నిర్వహిస్తుంది. క్రీడలు ప్రపంచ టూర్ టైటిల్ ఏటీపీ ప్రపంచ టూర్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను నొవాక్ జకోవిచ్ గెలుచుకున్నాడు. నవంబర్ 23న జరిగిన ఫైనల్లో రోజర్ ఫెదరర్‌ను ఓడించాడు. ఈ టైటిల్‌ను జకోవిచ్ వరుసగా నాలుగోసారి, మొత్తం మీద 5వసారి సాధించాడు. పురుషుల డబుల్స్ టైటిల్‌ను హొరియా టెకావ్ (రుమేనియా)-జీన్ జూలియన్ రోజర్ (నెదర్లాండ్స్) జంట.. రోహన్ బోపన్న(భారత్), ఫ్లోరిన్ మెర్జియా (రుమేనియా) జోడీని ఓడించి గెలుచుకుంది. స్నూకర్ ప్రపంచ చాంపియన్‌షిప్ విజేత పంకజ్ అద్వానీ ప్రపంచ స్నూకర్ చాంపియన్‌షిప్‌ను బెంగుళూరుకు చెందిన పంకజ్ అద్వానీ గెలుచుకున్నాడు. నవంబర్ 21న హర్గాడా (ఈజిప్ట్)లో జరిగిన ఫైనల్లో జావో జిన్‌టాంగ్ (చైనా)పై అద్వానీ విజయం సాధించాడు. హాంకాంగ్ ఓపెన్ టైటిల్ హాంకాంగ్ ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను లీ చోంగ్‌వీ (మలేసియా) గెలుచుకున్నాడు. నవంబరు 22న కౌలూన్ (హాంకాంగ్)లో జరిగిన ఫైనల్లో తియాన్ హువీ (చైనా)ను ఓడించాడు. ఇది చోంగ్‌వీకి కెరీర్లో 60వ సింగిల్స్ టైటిల్. మహిళల సింగిల్స్ టైటిల్‌ను కరోలినా మారిన్(స్పెయిన్) దక్కించుకుంది. ఫైనల్లో నొజోమీ ఒకుహారా(జపాన్)ను ఓడించింది. ఆసియా జూనియర్ హాకీ చాంపియన్‌షిప్ ఆసియా జూనియర్ హాకీ చాంపియన్‌షిప్ టైటిల్‌ను భారత్ గెలుచుకుంది. నవంబర్ 22న క్వాంటన్(మలేసియా)లో జరిగిన ఫైనల్లో పాకిస్థాన్‌ను ఓడించింది. ఇందులో భారత్ ఈ టైటిల్‌ను గెలుచుకోవడం మూడోసారి. 2004, 2008లో కూడా ఈ టైటిల్‌ను సాధించింది. రాష్ట్రీయం ప్రపంచ విపత్తు నిర్వహణ సదస్సు విశాఖపట్నంలో నాలుగు రోజుల పాటు జరిగిన ప్రపంచ విపత్తు నిర్వహణ సదస్సు (డబ్ల్యూసీడీఎం) రెండో సమావేశం నవంబర్ 22న ముగిసింది. 46 దేశాలకు చెందిన 100 మంది నిపుణులు, 1000 మంది ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరయ్యారు. సదస్సు అనంతరం డిక్లరేషన్‌ను విడుదల చేశారు. విపత్తు నిర్వహణకు పూర్తి స్థాయి స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థలను ఏర్పాటు చేయడం, ప్రజలకు వాతావరణ మార్పులపై అవగాహన కల్పించడం వంటి అంశాలు డిక్లరేషన్‌లో ఉన్నాయి. వరంగల్ ఉప ఎన్నికలో తెరాస విజయం వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికలో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అభ్యర్థి పసునూరి దయాకర్ ఘన విజయం సాధించారు. సమీప కాంగ్రెస్ అభ్యర్థి సర్వే సత్యనారాయణపై 4,59,092 ఓట్ల భారీ ఆధిక్యంతో గెలుపొందారు. ఇది దేశంలోనే ఏడో అత్యధిక మెజారిటీ. ఆర్థికం అక్టోబర్‌లో -3.81 శాతంగా డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం ఈ ఏడాది అక్టోబర్‌లో టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం -3.81 శాతంగా నమోదైంది. ఇది సెప్టెంబర్‌లో -4.54 శాతంగా ఉంది. 2014 అక్టోబర్‌లో 1.66 శాతంగా నమోదైంది. అంతర్జాతీయ కమోడిటీ ధరలు కనిష్ట స్థాయిలో ఉండటం వల్ల టోకు ద్రవ్యోల్బణం వరుసగా 12వ నెల మైనస్‌లోనే కొనసాగిందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ నవంబర్ 16న విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. ఆస్తుల రికవరీపై ప్రపంచ సదస్సు ఆస్తుల రికవరీపై గ్లోబల్ ఫోకల్ పాయింట్ సదస్సు నవంబర్ 18న న్యూఢిల్లీలో జరిగింది. సీబీఐ, అవినీతి నిరోధక, విజిలెన్స్ విభాగాల 21వ సదస్సును కూడా నిర్వహించారు. వ్యవస్థీకృత నేరాలకు మాదక ద్రవ్యాలు, ఆయుధాలు, మనుషుల అక్రమ రవాణా, ఉగ్రవాదం వంటివి అక్రమ నిధులు పెంపొందిస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. 102 కోట్లకు చేరిన టెలిఫోన్ వినియోగదారులు దేశంలో ఈ ఏడాది (2015) సెప్టెంబర్ నాటికి టెలిఫోన్ వినియోగదారుల సంఖ్య 102 కోట్లకు చేరిందని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) నవంబర్ 18న తెలిపింది. టెలీ- డెన్సిటీ కూడా 80.98 శాతానికి పెరిగింది. అంతర్జాతీయం కౌలాలంపూర్‌లో ఆసియాన్ సదస్సు ఆగ్నేయాసియా దేశాల (ఆసియాన్) సదస్సు మలేసియాలోని కౌలాలంపూర్‌లో నవంబర్ 21న జరిగింది. పదమూడో భారత్-ఆసియాన్ సదస్సు కూడా ఇక్కడే జరిగింది. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో సహకారాన్ని పెంపొందించుకోవాలని సదస్సులో పాల్గొన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. భారత్- ఆసియాన్ల మధ్య భౌగోళిక, డిజిటల్ అనుసంధానత కోసం రూ. 100 కోట్ల రుణాన్ని ఆయన ప్రకటించారు. అన్ని ఆసియాన్ దేశాలకు ఈ-వీసా సౌకర్యం కల్పిస్తామన్నారు. ఈ సదస్సులో ఆగ్నేయాసియా దేశాలు ప్రత్యేక ఆర్థిక సమాజం (ఏఈసీ)ను నవంబర్ 22న ఏర్పాటు చేసుకున్నాయి. సభ్య దేశాల మధ్య స్వేచ్ఛాయుత సరుకు రవాణా, పెట్టుబడుల ప్రవాహానికి ఇది తోడ్పడుతుంది. మలేసియాతో మూడు ఒప్పందాలు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మలేసియా పర్యటనలో నవంబర్ 23న ఆ దేశ ప్రధాని నజీబ్ రజాక్‌తో సమావేశమయ్యారు. భద్రత, రక్షణ రంగాల్లో వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేసుకోవాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. సైబర్ భద్రత, 2015-20 మధ్యకాలంలో సాంస్కృతిక పర్యటనలు, ప్రాజెక్టుల పర్యవేక్షణ సహకారానికి సంబంధించి రెండు దేశాల మధ్య మూడు ఒప్పందాలు కుదిరాయి. జీటీఐలో భారత్‌కు ఆరో స్థానం ప్రపంచ ఉగ్రవాద సూచీ (జీటీఐ)- 2015లో భారత్ ఆరో స్థానంలో నిలిచింది. వాషింగ్టన్‌లోని ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనమిక్స్ అండ్ పీస్ సంస్థ నవంబర్ 18న విడుదల చేసిన ఈ సూచీలో 2014 లో ఉగ్రవాదం వల్ల అత్యధికంగా ప్రభావితమైన తొలి 10 దేశాల్లో భారత్ ఒకటిగా ఉంది. 2014లో 162 ఉగ్రవాద ప్రభావిత దేశాల జాబితాను ఆ సంస్థ విడుదల చేసింది. అఫ్గానిస్తాన్, ఇరాక్, నైజీరియా, పాకిస్థాన్, సిరియాలో ఉగ్రవాద ప్రభావం ఎక్కువ ఉందని ఆ సంస్థ తెలిపింది. సంక్షిప్తంగా ‘గాంధీ’ చిత్రంతో అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన బాలీవుడ్ నటుడు సయీద్ జాఫ్రీ (86) లండన్‌లో నవంబర్ 14న మరణించారు.విజయనగరంలోని గురజాడ అప్పారావు నివాసానికి రక్షిత కట్టడంగా ప్రభుత్వం గుర్తింపునిస్తూ నవంబర్ 19న ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ చారిత్రక కట్టడాలు, పురావస్తు చట్టం 1960 కింద గురజాడ నివాసాన్ని రక్షిత కట్టడంగా గుర్తించారు. ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధిగా సయ్యద్ అక్బరుద్దీన్‌ను నవంబర్ 16న ప్రభుత్వం నియమించింది. అశోక్ ముఖర్జీ స్థానంలో అక్బరుద్దీన్ బాధ్యతలు చేపడతారు.ఆఫ్రికా దేశం.. మాలి రాజధాని బమాకాలోని హోటల్‌పై నవంబర్ 20న ఉగ్రవాదులు చేసిన దాడిలో 27 మంది మరణించారు.