breaking news
best farmer
-
రైతు మల్లికార్జున్ యువతకు ఆదర్శం
సాక్షి, న్యూఢిల్లీ/ చొప్పదండి: ఉన్నత విద్య అభ్యసించి సాఫ్ట్వేర్ ఉద్యోగంలో చేరినా.. దానిని వదులుకొని స్వగ్రామంలో పర్యా వరణహిత పద్ధతిలో వ్యవసాయం చేస్తున్న కరీంనగర్ జిల్లాకు చెందిన రైతు మల్లికార్జున్ రెడ్డి యువతకు ఆదర్శప్రాయుడని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. వ్యవ సాయంలో ఉన్న విస్తృత అవకాశాలకు వీరు బలమైన ఉదాహరణ అని ప్రశంసించారు. ఇటువంటి ఉన్నత విద్యావంతులు మరెందరికో మార్గదర్శకంగా నిలవాలన్నారు. విద్యావంతులైన యువత వ్యవసాయ రంగంలోకి వచ్చేలా ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి.. వికసిత్ భారత్ సంకల్ప్ యాత్రలో భాగంగా ప్రధా ని మోదీ గురువారం దేశవ్యాప్తంగా ఉన్న లబ్ధిదా రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంభాషించారు. ఇందులో భాగంగా కరీంనగర్ జిల్లా చొప్ప దండి మండలం పెద్దకూర్మపల్లికి చెందిన రైతు మావురం మల్లికార్జున్‌రెడ్డి, ఆయన ఇద్దరి కుమార్తె లతోనూ ప్రధాని మాట్లాడారు. ఈ సందర్భంగా మల్లికార్జున్‌రెడ్డి మాట్లాడుతూ.. తాను మంచి రైతు గా ఎదగడానికి విద్య ఎంతో సహాయపడిందన్నారు. పశుపోషణ, ఉద్యానవనాల సాగుతోపాటు ప్రకృతి సేద్యం, ఔషధ మొక్కల పెంపకం చేపట్టా నని వివరించారు. సాంప్రదాయ వ్యవసాయానికి భిన్నంగా సమీకృత, పర్యావరణహిత వ్యవసాయ విధానాలను అవలంబిస్తున్నట్టు చెప్పారు. ఏడాదికి రూ.6 లక్షలుగా ఉన్న తన ఆదాయం రూ.12 లక్షలకు పెరిగిందని తెలిపారు. రైతులకు స్ఫూర్తిగా నిలిచారు ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. విద్యావంతులైన యువత వ్యవసాయం చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. మల్లికార్జున్ చేస్తు న్న సమీకృత వ్యవసాయంపై విశ్వవిద్యాలయాల్లో నిర్వహించే సెమినార్లలో అవగాహన కల్పించాల న్నారు. వ్యవసాయంలో భర్తకు చేదోడుగా నిలిచిన సంధ్య వంటివారు భారత నారీ శక్తులని అభివర్ణించారు. వ్యవసాయంలో ఉన్న అవకాశాలకు మీరే బలమైన ఉదాహరణ అన్నారు. ఇటువంటి ఉన్నత విద్యావంతులు మరెందరికో ఆదర్శంగా నిలవాల ని.. విద్యార్థులను, యువతను కలసి వ్యవసాయ రంగంలోకి వచ్చేలా ప్రోత్సహించాలని కోరారు. ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా రైతు లకు కల్పిస్తున్న పలు పథకాలను ప్రధాని వివరించారు. వ్యవసాయ రుణాలపై బ్యాంకులు వేస్తున్న వడ్డీ వివరాలను ప్రధాని అడగడంతో.. సాలీనా ఏడు శాతం వేస్తున్నారని మల్లికార్జున్ చెప్పారు. దీనిపై స్పందించిన ప్రధాని ఆ వడ్డీ మూడు శాత మేనని, మళ్లీ బ్యాంకులో సంప్రదించి తెలుసుకో వాలని సూచించారు. కాగా.. చొప్పదండి మార్కెట్ యార్డు నుంచి మల్లికార్జున్‌రెడ్డి ప్రధాని వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బండి సంజయ్, కలెక్టర్ పమేలా సత్పతి, ఇతర అధికారులు పాల్గొన్నారు. సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలేసి.. బీటెక్ కంప్యూటర్ సైన్స్ చది విన మల్లి కార్జున్రెడ్డి గతంలో హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేశారు. ఆయన తోపాటు సతీమణి సంధ్య ఇద్దరూ తమ ఉద్యోగాలను వదిలేసి స్వగ్రామానికి వచ్చారు. ఇక్కడ ప్రకృతి వ్యవసాయం, ఉద్యానవనాల సాగు, పశు పోషణ చేపట్టారు. సమీకృత వ్యవసాయం, ప్రకృతి సేద్యంపై ప్రచారం చేయడంతోపాటు సమీప ప్రాంతాల్లో రైతులకు శిక్షణ కూడా ఇస్తున్నారు. రెండేళ్ల క్రితం ఐకార్ సంస్థ అందించిన జాతీయ ఉత్తమ రైతు అవార్డు పొందారు. ఎంతో ఆనందంగా ఉంది.. ప్రధానితో మాట్లాడే అవకాశం రావడం మరిచిపోలేనిది. నేను సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదిలేసి చేపట్టిన ప్రకృతి వ్యవసాయానికి తగిన గుర్తింపు రావడం సంతోషంగా ఉంది. వికసిత్ భారత్ యాత్ర ద్వారా కేంద్ర ప్రభుత్వ పథకాల వివరాలు ప్రజలకు తెలిసివస్తున్నాయి. గతంలో నాకు కూడా ఈ పథకాలు తెలియవు. నేను సాయిల్ హెల్త్‌కార్డు తీసుకోవడం ద్వారా.. నా పొలానికి భూసార పరీక్ష చేయించా. అనువైన పంటలు వేసుకొని తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి, ఎక్కువ ఆదాయం పొందుతున్నాను. పీఎం కృషి సంచాయి యోజన కార్డు, పీఎం కిసాన్ క్రెడిట్‌కార్డు ఎంతో ఉపయోగపడ్డాయి. నేచర్ ఫార్మింగ్ పథకం లబ్ధి కూడా పొందాను. – రైతు మల్లికార్జున్‌రెడ్డి ప్రధాని ప్రశంసలను మర్చిపోలేను నేను ఎంబీఏ చేసి.. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కంపెనీలో హెచ్ఆర్గా పనిచేశాను. మా ఆయన ప్రకృతి వ్యవసాయం చేయాలని సంకల్పించడంతో.. స్వగ్రామానికి తిరిగి వచ్చాం. సేంద్రియ వ్యవసాయంతోపాటు హార్టికల్చర్, పశువుల పెంపకం, వంటివి చేపట్టి ఆదాయం పొందుతున్నాం. ప్రధాని నన్ను ఉద్దేశించి నారీశక్తి అని ప్రశంసించడం మర్చిపోలేని గుర్తింపు. మా ఇద్దరు పిల్లలు కూడా స్వగ్రామంలోనే చదువుకుంటూ మాకు సహకరిస్తున్నారు. – సంధ్య, మల్లికార్జున్‌రెడ్డి సతీమణి -
జిల్లా నుంచి ఇద్దరు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవరం సందర్భంగా వివిధ రంగాల ప్రముఖులకు రాష్ట్ర స్థాయిలో ఇవ్వనున్న అవార్డులకు గాను జిల్లా నుంచి ఇద్దరు ఎంపికయ్యారు. సుంకిరెడ్డి నారాయణరెడ్డి (సాహితీవేత్త), కర్ర శశికళ (ఉత్తమ రైతు)ను ఉత్తమ పురస్కారాలకు ఎంపిక చే స్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు అందజేసింది. సుంకిరెడ్డి నారాయణరెడ్డిది జిల్లాలోని కనగల్ మండలం పగిడిమర్రి గ్రామం. నారాయణరెడ్డి డి గ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌గా ఉద్యోగ విరమణ పొందారు. ‘దాలి’ అనే కవిత్వంతో ఆయన ప్రస్థానం ప్రారంభమైంది. ‘తోవ ఎక్కడ’ అనే మరో కవిత్వ పుస్తకాన్ని కూడా రాశారు. ‘మత్తడి’ అనే తెలంగాణ కవిత్వ సంకలనాన్ని కూడా ఆయన ప్రచురించారు. ‘ముంగిలి’ పేరుతో ఆయన రాసిన తెలంగాణ ప్రాచీన కవిత్వం మంచి గుర్తింపు పొందింది. ‘తెలంగాణ చరిత్ర’ పేరుతో ఆయన రాసిన తెలంగాణ చరిత్రకు సంబంధించిన మొద టి పుస్తకంగా ప్రచారంలో ఉంది. ఉద్యమ సమయంలో అనేక వ్యాసాలు రాసిన ఆయన తెలంగాణలో మరుగునపడ్డ కవులు, రచయితలు, చారిత్రక విశేషాలను వెలుగులోనికి తెచ్చారు. ప్రస్తుతం ఆయన నల్లగొండ పట్టణంలో నివాసం ఉంటున్నారు. ఇక,త్రిపురారం మండలం దుగ్గేపల్లికి చెందిన కర్ర శశికళ ఉత్తమరైతుగా ఎంపికయ్యారు. ఈమె వ్యవసాయంలో రసాయన ఎరువులను వినియోగించకుండా వర్మికంపోస్ట్ ద్వారా పంటలు పండించడంతో పాటు గోబర్‌గ్యాస్ విద్యుదుత్పాదన చేస్తున్నందుకు గాను పురస్కారానికి ఎంపికయ్యారు. ఈ ఇద్దరికీ జూన్2న హైదరాబాద్‌లో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా అవార్డుతో పాటు 1,00,116 రూపాయల నగదును అందజేయనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
సాక్షి ఎక్సలెన్స్ అవార్డ్స్-2014: ఉత్తమ రైతు - గుడివాడ నాగరత్నం నాయుడు