Bengal chief minister
-
బెంగాల్ పీఠంపై కూర్చునేది ఎవరు?
కమ్యూనిస్టుల కంచుకోటలను బద్దలుకొట్టి 15ఏళ్లు ఏకఛత్రాధిపత్యంగా పశ్చిమబెంగాల్‌ను ఏలిన మమతాబెనర్జీని ఘోరంగా ఓడించి ఇంటికి సాగనంపిన కమలనాథుల్లో ఎవరు రాష్ట్ర ముఖ్యమంత్రి కుర్చిలో ఆసీనులవుతారనే ప్రశ్న తలెత్తింది. ఆ కుర్చీకి తామే అర్హులమంటూ రాష్ట్ర ముఖ్యనేతలు బీజేపీ అధిష్టానం వద్ద వాదనలు గట్టిగా విన్పిస్తున్నారు. వీరి వాదనల్లో ఎవరి వాదనకు అగ్రనేతలు మోదీ, అమిత్‌షా ద్వయం సమ్మతి తెలుపుతుందో త్వరలో తేలిపోనుంది.అయితే మమతను ఒంటిచేత్తో మట్టికరిపించిన రాష్ట్ర రాజకీయ దురం«ధరుడిగా ఘనత సాధించిన సువేందు అధికారికే సీఎం పీఠం దక్కే అవకాశముందని ఊహాగానాలు ఎక్కువయ్యాయి. అయితే గుజరాత్ మొదలు మధ్యప్రదేశ్, హరియాణా, ఉత్తర ప్రదేశ్దాకా ప్రతిసారీ కొత్త ముఖాలకు అవకాశమిచి్చన బీజేపీ అధిష్టానం ఈసారి పశ్చిమబెంగాల్లోనూ కొత్త వారికి ఛాన్స్ ఇచ్చే ఆస్కారముందనే వాదనా తెరమీదకొచి్చంది. ఈ నేపథ్యంలో ఐదారుమంది నేతల పేర్లు ప్రముఖంగా విన్పిస్తున్నాయి. వారి గురించి క్లుప్తంగా.. సువేందు అధికారి.. బెంగాల్లో అత్యధిక మందికి చిరపరిచితమైన నేత. గతంలో మమతాబెనర్జీకి కుడిభుజంగా ఉంటూ నందిగ్రామ్‌లో రైతు ఉద్యమాన్ని ముందుకు నడిపించిన నేత తర్వాత టీఎంసీకి తిలోదకాలిచ్చి కమలదళంలో చేరి కీలక నేతగా ఎదిగారు. గతంలో నందిగ్రామ్‌లో మమతను ఓడించి ఈసారి భవానీపూర్‌లోనూ మమతకు ఓటమి రుచిచూపించారు. క్షేత్రస్థాయిలోనూ పార్టీపై పట్టుసాధించిన సువేందుకు సీఎం అయ్యే అవకాశాలు మిగతావారికంటే మెరుగ్గా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే నారదా స్టింగ్ ఆపరేషన్ ఉదంతంలో లంచం తీసుకుంటూ కెమెరా కంటికి చిక్కి పరువుపోగొట్టుకున్నారు. సమిక్ భట్టాచార్య ఆర్ఎస్ఎస్ మూలాలున్న భట్టాచార్య ఇటీవలే పశ్చిమబెంగాల్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సేవలు ఆరంభించారు. ఎన్నికల్లో అత్యంత క్రియాశీలకంగా వ్యవహరించారు. అగ్రనేతల సుడిగాలి పర్యటనలను సమన్వయంచేసుకుంటూనే సొంతంగా పలు ప్రచారకార్యక్రమాల్లో పాల్గొని టీఎంసీపై పదునైన విమర్శనాస్త్రాలు సంధించి ప్రజల్లో గుర్తింపుపొందారు. పార్టీలో నేతలను ఏకతాటి మీదకు తీసుకురావడంలో దిట్టగా పేరొందారు. కులమతాలకతీతంగా అన్ని వర్గాల్లోనూ పార్టీని విస్తరింపజేసే సత్తా ఈయనకు ఉందని అగ్రనాయకత్వంలోనూ ఈయన మంచిపేరు సంపాదించారు. ఈయన నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతం అవుతుందనే మాటా విన్పిస్తోంది. అగ్నిమిత్ర పాల్ గతంలో వృత్తిరీత్యా ఈమె ఒక ఫ్యాషన్ డిజైనర్. బెంగాల్లో ముందంజలో ఉండి పార్టీని నడిపించే క్రియాశీలక మహిళా నేతల్లో ఈమె కూడా ఒకరు. బీజేపీ మహిళా మోర్చాకు గతంలో అధ్యక్షురాలిగా సేవలందించారు. తర్వాత రాష్ట్ర ఉపాధ్యక్షురాలి స్థాయికి ఎదిగారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో అసన్సోల్ నుంచి మరోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ నుంచి గతంలో పట్టభద్రురాలైన ఈమె తరచూ మమతా బెనర్జీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రూపా గంగూలీ దిగ్గజ నిర్మాత, స్క్రీన్రచయిత బీఆర్ చోప్రా తెరకెక్కించిన అద్భుత సీరియల్ ‘మహాభారత్’లో ద్రౌపది పాత్రతో యావత్ భారతానికి చిరపరిచితమైన నటి రూపా గంగూలీ. బీజేపీ రాజ్యసభ సభ్యురాలిగా పశ్చిమ బెంగాల్ ప్రజలకు ఎంతో దగ్గరయ్యారు. తర్వాత సోనానూర్ దక్షిణ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది నియోజకవర్గంలో ఓటర్లకు అందుబాటులో ఉంటూ మంచి పేరుతెచ్చుకున్నారు. బెంగాల్ బీజేపీ మహిళా మోర్చాకు అధ్యక్షురాలిగా రెండేళ్లు సేవలందించారు. ఆకాలంలో రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి మహిళల సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. దిలీప్ ఘోష్ బీజేపీ ఫైర్‌బ్రాండ్‌గా పేరొందారు. గతంలోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సేవలందించారు. 2021లో పార్టీ టీఎంసీకి గట్టిపోటీ ఇవ్వడంలో సఫలీకృతమయ్యారు. ఆనాడు రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమంటే వామపక్షలు, కాంగ్రెస్ కాదు అని బీజేపీయే ప్రజల పక్షాన పోరాడుతోందని నిరూపించే ప్రయత్నంచేశారు. తక్కువకాలంపాటే బీజేపీ రాష్ట్ర శాఖ చీఫ్‌గా కొనసాగినా వ్యవహారాలను చక్కబెట్టడంలో తనదైన ముద్రవేశారు. సీఎం రేసులో తానూ ముందంజలో ఉన్నానని నిరూపించుకున్నారు. గతంలో ఆర్ఎస్ఎస్లో పనిచేశారు. 12 సంవత్సరాల క్రితం బీజేపీలో చేరారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కష్టపడిపనిచేసి త్వరగానే రాష్ట్ర చీఫ్ స్థాయికి ఎదిగారు. అయితే వాచాలత్వంతో తరచూ వివాదాస్పద వ్యాఖ్యానాలుచేస్తూ అప్రతిష్ట తెచ్చుకోవడం ఈయనకు రివాజుగా మారింది. అయినాసరే రాజకీయ చతురతతో నెగ్గుకురాగల సమర్థుడని ఆయనకుపేరుంది. సువేందుకు ఈయన ఒక్కరే గట్టిపోటీ ఇచ్చే అవకాశముంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అమిత్ షా భోజనం ఫొటోపై మమత ట్వీట్
కోల్‌కతా: బెంగాల్లో కొన్ని సంవత్సరాలుగా అధికార పార్టీ టీఎంసీ, ప్రతిపక్షం బీజేపీ మధ్య రాజకీయాలు రగులుతున్నాయి. రెండు పార్టీలు దూకుడుతో అక్కడి రాజకీయం రణరంగాన్ని తలపిస్తోంది. ఇన్ని రోజులుగా బీజేపీ ప్రధాన నాయకులు బెంగాల్లో అడుగుపెట్టలేదు అందుకే ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ ఇప్పుడు అమిత్ షా ఈ రాష్ట్రంలో పర్యటన చేస్తున్నారు. బిహార్ విజయంతో బీజేపీ మంచి జోరు మీద ఉంది. ఇదే అదునుగా చూసుకొని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అమిత్ షాపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. బెంగాల్ రాష్ట్రంలోని బంకురా జిల్లాలో ఒక గిరిజన పార్టీ కార్యకర్త ఇంట్లో అమిత్‌షా భోజనం చేస్తుండగా తీసిన ఫోటోను ఆయన తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. దీనిపై స్పందించిన మమత తీవ్రంగా విమర్శించారు. బయట నుంచి తెచ్చిన భోజనం తింటూ గిరిజన కార్యకర్త ఇంట్లో తింటున్నట్లు ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రజలకు ఉచిత రేషన్ పంపిణీ జూన్ వరకు ఇచ్చామని దానిని ఇంకా పెంచుతామని మమత ప్రకటించారు. అమిత్ షా రాకతో బెంగాల్ రాజకీయాలు కొత్త మలుపులు తిరగనున్నాయి. మొత్తం 294 అసెంబ్లీ స్థానాలున్న బెంగాల్లో వచ్చే ఏడాది ఏప్రిల్ మే మధ్య ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపిస్తాయి. ఎలా అయిన బెంగాల్లో మకాం వెయ్యాలని బీజేపీ చూస్తోంది. అందుకే ఇప్పటి నుంచే పర్యటనల పేరుతో ప్రజలలో మంచి పేరు తెచ్చుకోవాలని ప్రయత్నిస్తుంది. వారికి శుభ సూచికంగా మమత శిబిరంలో చీలికలు మొదలైనట్లు కనిపిస్తుంది. బీజేపీ బలం పెంచుకోవడానికి ఇదే మంచి సమయం అని భావించి అమిత్ షాను రంగంలోకి దించింది. కానీ ఈ పర్యటనలో స్వలాభం ఉందని మమతఎద్దేవా చేయడంతో ప్రజలలో కొంతమేర వ్యతిరేకత వచ్చినట్లు కనిపిస్తుంది. (గ్రేటర్ హైదరాబాద్ పోరు.. రంగంలోకి అమిత్ షా) Had amazing Bengali food at Shri Vivishan Hansda ji’s home in Chaturdhi village. No words can express their warmth and hospitality. চতুরডিহি গ্রামে শ্রী বিভীষণ হাঁসদা জীর বাড়িতে চমৎকার বাঙালী খাবার খাওয়ার সুযোগ পেলাম। কোনো শব্দই তাদের আতিথেয়তা বর্ণনা করতে পারবেনা। pic.twitter.com/pdeMCEa6Xp — Amit Shah (@AmitShah) November 5, 2020 -
సీపీఎం ‘మాస్టర్’ ప్లాన్!
* దీదీని ఢీకొనేందుకు సరికొత్త ఎత్తుగడ * ఉపాధ్యాయ అభ్యర్థుల్ని దించిన సీపీఎం * ఆరుగురు తృణమూల్ ఎంపీలకు సవాలు రాజశేఖర్, సాక్షి-న్యూఢిల్లీ: దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఉవ్విళ్లూరుతున్న తృణమూల్ కాంగ్రెస్ అధినాయకురాలు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ఢీకొనేందుకు సీపీఎం ఈసారి ‘మాస్టర్’ ప్లాన్ వేసింది. తృణమూల్‌కు గట్టి ప్రాబల్యమున్న స్థానాల్లో ఉపాధ్యాయ నేపథ్యం గల అభ్యర్థులను బరిలోకి దించింది. ఆరుగురు తృణమూల్ సిట్టింగ్ ఎంపీలను ఎదుర్కొనేందుకు ఉపాధ్యాయులను రంగంలోకి దించిన సీపీఎం, మరో నాలుగు స్థానాల్లోనూ ‘మాస్టర్స్’నే పోటీకి నిలిపింది. వారి వివరాలు ఓసారి చూద్దాం.. నియోజకవర్గం: బంగావ్ దేబాశీష్ దాస్ (సీపీఎం) జాదవ్‌పూర్ వర్సిటీ నుంచి టెలీ కమ్యునికేషన్, ఇంజనీరింగ్ విభాగంలో పీహెచ్డీ చేసిన ఈయన బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో అధ్యాపకునిగా పనిచేశారు. తర్వాత సీపీఎంలో చేరి, 1991, 2001, 2006 అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కపిల్కృష్ణ ఠాకూర్ (తృణమూల్) మతువా సామాజికవర్గానికి చెందిన కపిల్ తండ్రి గురుచంద్ ఠాకూర్‌కు దళిత నేతగా మంచి పేరు ఉంది. కపిల్ తల్లి మంజులాకృష్ణ ఠాకూర్ ఇదివరకు ఎమ్మెల్యేగా, మమత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. నియోజకవర్గం: కంతి తపస్ సిన్హా (సీపీఎం) విద్యాసాగర్ వర్సిటీలో పట్టభద్రుడైన తపస్ సిన్హా రంగస్థల నటుడిగా ప్రసిద్ధుడు. థియేటర్ ఆర్ట్సలో అధ్యాపకుడిగా వ్యవహరించారు. శిశిర్ అధికారి (తృణమూల్) మన్మోహన్ ప్రభుత్వంలో సహాయ మంత్రిగా పనిచేశారు. గతంలో కంతి మునిసిపాలిటీ చైర్మన్‌గా పాతికేళ్లు కొనసాగారు. ప్రస్తుతం కంతి ిసిటింగ్ ఎంపీ. నియోజకవర్గం: దక్షిణ కోల్‌కతా నందినీ ముఖర్జీ (సీపీఎం) ఈమె జాదవ్‌పూర్ వర్సిటీ నుంచి ఎంఈ, మాంచెస్టర్ యూనివర్సిటీ నుంచి పీహెచ్డీ చేశారు. ప్రస్తుతం నందినీ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. సుబ్రతా బక్షీ (తృణమూల్) సుబ్రతా బక్షీ ఇది వరకు రెండుసార్లు ఎమ్మెల్యేగా, ఒక పర్యాయం రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం దక్షిణ కోల్‌కతా సిటింగ్ ఎంపీగా ఉన్నారు. నియోజకవర్గం: డమ్‌డమ్ దాస్‌గుప్తా (సీపీఎం) కోల్‌కతా వర్సిటీ నుంచి ఎకనామిక్స్‌లో మాస్టర్ డిగ్రీ పూర్తి చేసిన అసీమ్కుమార్ దాస్‌గుప్తా.. అమెరికాలోని ఎంఐటీ వర్సిటీ నుంచి పీహెచ్డీ పూర్తి చేశారు. సౌగతారాయ్ (తృణమూల్) ఇదివరకు ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. మన్మోహన్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. నియోజకవర్గం: కృష్ణానగర్ శంతన్ ఝా (సీపీఎం) బిధాన్‌చంద్ర వర్సిటీ నుంచి వ్యవసాయశాస్త్రంలో పీహెచ్డీ చేశారు. అదే వర్సిటీలో ఫ్రొఫెసర్‌గా పనిచేశారు. కళ్యాణి మున్సిపాలిటీకి చైర్మన్‌గా పనిచేశారు. తపస్ పాల్ (తృణమూల్) ప్రఖ్యాత నటుడు. దాదాపు యాభైకి పైగా సినిమాల్లో నటించారు. ఇదివరకు రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఇప్పుడు సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. నియోజకవర్గం: రాణాఘాట్ అర్చనా బిశ్వాస్ (సీపీఎం) హోమియోపతిలో డిప్లొమా చేసిన అర్చనా బిశ్వాస్, చాలాకాలం బాలికల పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేశారు. గతంలో ఐద్వాలో పనిచేసిన ఆమె 2011లో సీపీఎంలో చేరారు. సౌగత బర్మన్(తృణమూల్) ఇక్కడి నుంచి సిటింగ్ ఎంపీగా ఉన్న సుచల్రంజన్ స్థానంలో మమత సౌగతను ఎంపిక చేశారు. స్థానిక పార్టీ బలం, ఆర్థిక బలం సౌగతకు సానుకూలాంశాలు. మరికొందరు... వీరితో పాటే అధ్యాపక వృత్తిలో కొనసాగిన మరికొందరిని కూడా సీపీఎం ఈ ఎన్నికల్లో బరిలోకి దించింది. జాల్పాయిగుడి స్థానం నుంచి మహేంద్రకుమార్ రాయ్, పురులియా నుంచి నరహరి మెహతా, జర్ద్వాన్పుర్జా నుంచి ఈశ్వరచంద్ర బోస్, బర్ద్వాన్-దుర్గాపూర్ నుంచి సైదల్ హఖీ పోటీ చేస్తున్నారు. వీరంతా ఇదివరకు ఉపాధ్యాయులు.


