breaking news
Banks loan
-
ఏటీఎం‘లోనూ’ తీసుకోవచ్చు!
డబ్బులు కావాలని ఏటీఎంకు వెళ్లారు. విత్‌డ్రా చేసుకున్నారు. అంతే! పని అయిపోయింది కదా అని వచ్చేయకండి. ఒక్కసారి ఏటీఎం స్క్రీన్ వంక చూడండి. మీకు ఇన్స్టంట్ లోన్ ఆఫర్ ఏదైనా ‘ఫ్లాష్’ అవుతుందేమో పరిశీలించండి. ఒకవేళ ఫ్లాష్ అయితే... మీకు గనక లోన్ కావాలనుకుంటే... అక్కడే జస్ట్ క్లిక్ చేస్తే చాలు. మీ ఖాతాలోకి డబ్బు వచ్చేస్తుంది. దాన్ని అదే ఏటీఎంలో విత్‌డ్రా చేసుకోవచ్చు కూడా!! ఇదీ బ్యాంకుల కొత్త వ్యూహం. ఏటీఎంలే బ్యాంక్ బ్రాంచీలుగా మారి, అప్పటికప్పుడు మీకు చిన్న మొత్తాల్లో వ్యక్తిగత రుణ సౌలభ్యం కల్పించే వ్యవస్థ త్వరలో ఏర్పాటవుతోంది. రిటైల్ రుణాల్ని పెంచటానికిబ్యాంకుల వ్యూహం * మొబైల్ వెరిఫికేషన్‌తో తక్షణమే డబ్బు జమ * ఏటీఎంలతో మరిన్ని సేవల దిశగా బ్యాంకుల చర్యలు ఏటీఎంల ద్వారా సేవలు, ఉత్పత్తుల విస్తరణకు ఈ ఏడాది ప్రారంభంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి ఇచ్చింది. దేశంలో దాదాపు 1.9 లక్షల ఏటీఎంలు పనిచేస్తున్నాయి. వీటిలో దాదాపు సగం బ్యాంక్ బ్రాంచీల వద్దే ఉండగా, మిగిలినవి వేర్వేరు ప్రాంతాల్లో ఉన్నాయి. పలు బ్యాంకులు తమ ఏటీఎంలను ఈ-బ్యాంకింగ్ సెంటర్లుగా ఇప్పటికే అభివృద్ధి చేశాయి. రుణం మంజూరు చేసేది ఇలా... మీరు ఏం చేస్తున్నారు? ఆదాయం ఎంత? వ్యక్తిగత వివరాలేంటి? మీ చెల్లింపు సామర్థ్యమేంటి? వంటి వివరాలను మీ ప్రొఫైల్ ఆధారంగా బ్యాంకులు ముందే ‘ఆల్గో రిథమ్’ విధానంగా విశ్లేషిస్తాయి. దాన్నిబట్టే మీకు ఎంత రుణం ఇవ్వాలో నిర్ణయించి దాన్ని ఆఫర్ చేస్తాయి. మీ డెబిట్ కార్డ్‌తో స్వైప్ చేయగానే మీ కళ్లముందు ఈ ఆఫర్ ఉందనుకోండి. వెంటనే మీరు దీనికి ఓకే చేసి, ‘మొబైల్ నెంబర్’ టైప్ చేస్తే... ఆ మొబైల్‌కు వెంటనే వన్‌టైమ్ పాస్వర్డ్ ఒకటి వస్తుంది. దాన్ని ఎంటర్ చేశారనుకోండి. ఏటీఎం దాన్ని వెరిఫై చేసుకుంటుంది. అంతే!! క్షణాల్లో మీ అకౌంట్లో డబ్బు జమవుతుంది. ఆర్థిక మందగమన పరిస్థితుల నేపథ్యంలో కార్పొరేట్ రుణాల్లో వృద్ధి పెద్దగా ఉండటం లేదు. దీంతో బ్యాంకులు రిటైల్ రుణాలను పెంచుకునే పనిలో పడ్డాయి. ఈ దిశలోనే బ్యాంకులు చుట్టూ తిరగాల్సిన పనిలేకుండా... ముందుగానే కస్టమర్లకు రుణ ఆఫర్లను అందించబోతున్నాయి. సెలవు రోజుల్లోనూ ఇబ్బంది ఉండదు... తాజా పరిణామంపై హెచ్డీఎఫ్సీ బ్యాంక్ అన్సెక్యూర్డ్ లోన్స్ అండ్ మార్టిగేజ్ విభాగం హెడ్ అరవింద్ కపిల్ వ్యాఖ్యానిస్తూ... ‘‘ఏటీఎం ఇప్పుడు కస్టమర్లకు అతి చేరువగా ఉన్న బ్యాంకింగ్ సాధనం. ప్రతి బ్యాంక్ కస్టమర్ తరచూ దాని ముందుకు వెళ్లి తీరవలసిందే. బ్యాంకింగ్ రిటైల్ రుణ వృద్ధికి ఇప్పుడు ఇదే ఒక మార్గం కానుంది. సెలవైనా... ఏ అత్యవరసర పరస్థితుల్లోనైనా తక్షణం రుణం పొందే సౌలభ్యం ఏటీఎంల ద్వారా ఏర్పడుతోంది’’ అన్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ మృత్యుంజయ్ మహాపాత్ర కూడా దీంతో ఏకీభవించారు. ‘‘బ్యాంకులు తమ ఉత్పత్తుల విస్తృతికి మల్టీ వెండార్ సాఫ్ట్‌వేర్‌ను వినియోగిస్తున్నాయి. క్రెడిట్, ఇన్సూరెన్స్ ప్రొడక్టుల విక్రయం వంటివి ఏటీఎం ద్వారా సాధ్యమే. అన్ని హార్డ్వేర్లలో పనిచేసే మల్టీ వెండార్ సాఫ్ట్వేర్ వల్ల తన పూర్తి ఏటీఎం నెట్వర్క్ బ్యాంక్ నియంత్రణలో ఉంటుంది. ఈ సాఫ్ట్‌వేర్‌తో బ్యాంక్ ప్రొడక్టులను కస్టమర్లకు మరింత చేరువ చేయొచ్చు’’ అని చెప్పారాయన. తన 50,000 ఏటీఎం నెట్‌వర్క్‌కు ఈ సాఫ్ట్‌వేర్‌ను వినియోగించాలన్నది ఎస్బీఐ లక్ష్యమని తెలియజేశారు. సగటున తమ ఒక్కొక్క ఏటీఎంకు రోజూవారీగా 400 నుంచి 500 హిట్స్ వస్తున్నట్లు కూడా ఆయన ఈ సందర్భంగా చెప్పారు. బ్యాంక్ కస్టమర్ అయితే ఈజీ... తన సొంత కస్టమర్ అయితే ఒక బ్యాంక్ వెనువెంటనే అవసరమైన ప్రక్రియ అంతా పూర్తిచేసి, లోన్‌ను జారీ చేస్తుందేమో కానీ, వేరే బ్యాంక్ కస్టమర్ అయితే ఇలాంటి పక్రియ కాస్త కష్టమేనని బ్యాంకర్లు పేర్కొంటున్నారు. వేరే బ్యాంక్ కస్టమర్ అయితే... రుణ మంజూరుకు ముందు ‘అప్లికేషన్ దాఖలు’ పక్రియ అంతా మామూలేనని వారు పేర్కొన్నారు. ‘‘మా కస్టమర్ కాని వ్యక్తి విషయంలో ‘కాల్ బ్యాంక్’ అనే ఆప్షన్‌ను ఇస్తున్నాం. తద్వారా తనను సంప్రదించవలసిన వివరాలన్నీ సంబంధిత కస్టమర్ తెలియజేసే వీలుంటుంది. సంబంధిత వ్యక్తి ఇచ్చిన సమాచారం ప్రాతిపదికన, మేం తిరిగి అతనికి కాల్ చేస్తాం. అప్లికేషన్ దాఖలు ప్రక్రియ ద్వారా అతనికి రుణ సేవలు అందిస్తాం’’ అని యాక్సిస్ బ్యాంక్ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ అమిత్ సేథి చెప్పారు. -
మాకు అప్పు పుట్టలేదు.. మీ పేరుతో తెస్తారా!
- కార్మికుల క్రెడిట్ సొసైటీతోఆర్టీసీ అవగాహన - దసరా అడ్వాన్స్, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ బకాయిల చెల్లింపు తిప్పలివి సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వాలు సాయం చేయవు. నిండా అప్పులు, నష్టాల్లో మునిగిపోవడంతో బ్యాంకులు అప్పు ఇవ్వవు. వచ్చే ఆదాయం ఖర్చులకే సరిపోవడంతో అవసరాలకు డబ్బుల్లేవు. ప్రపంచంలోనే అతిపెద్ద రవాణా సంస్థగా గిన్నిస్ బుక్‌లో చోటు దక్కించుకున్న ఆర్టీసీ (ఉమ్మడి రూపం) ప్రస్తుత దుస్థితి ఇది. కార్మికుల ‘గుడ్‌విల్’ను ముందుంచి బ్యాంకుల నుంచి అప్పు తెచ్చుకుని రోజులు గడిపే స్థాయికి చేరుకుంది. మంగళవారం జరిగిన ఓ పరిణామం ఆర్టీసీ దుస్థితిని తేటతెల్లం చేస్తోంది. ఇదీ సంగతి: ఏ నెలకానెల జీతాలు చెల్లించడం టీఎస్ ఆర్టీసీ, ఏపీఎస్ ఆర్టీసీలకు చాలాకష్టమైంది. కార్మికులు ఘనంగా నిర్వహించుకునే దసరా పండుగకు అడ్వాన్స్ రూపంలో ఆర్థిక సాయం అందించే ఆనవాయితీ ఉంది. ఇందుకు రెండు సంస్థలకు కలిపి రూ.43 కోట్లు కావాలి. కానీ చిల్లిగవ్వ చేతిలో లేక దాన్ని వాయిదా వేశాయి. అలాగే, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ చెల్లింపు 2012 నుంచి పెండింగులో ఉంది. 2012 సంవత్సరానికి సంబంధించిన మొత్తాన్ని ఆగస్టులో చెల్లించనున్నట్టు సంస్థలు కార్మిక సంఘాలతో గతంలోనే ఒప్పందం చేసుకున్నాయి. కానీ మాట తప్పాయి. దీంతో కార్మికుల నుంచి తీవ్ర ఒత్తిడి వస్తోంది. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు సాయం చేయకపోవటంతో బ్యాంకుల నుంచి అప్పు తీసుకుందామన్నా బ్యాంకులు సిద్ధంగా లేవు. దీంతో కార్మికులకు సంబంధించిన క్రెడిట్ కో-ఆపరేటివ్ సొసైటీ (సీసీఎస్)పై దృష్టి సారించింది. ప్రతినెలా తమ జీతం నుంచి 5 శాతం చొప్పున ఈ సొసైటీకి కార్మికులు జమ చేస్తారు. క్రమం తప్పకుండా నిధి జమ అయ్యే సొసైటీ కావటంతో దీనికి అప్పు ఇచ్చేందుకు బ్యాంకులు సరేనంటున్నాయి. ఆ సొసైటీ నిధులను గతంలో సొంతానికి వాడుకున్న ఆర్టీసీ వాటిని తిరిగి చెల్లించేందుకు ఏపీ కేంద్ర సహకార బ్యాంకు నుంచి రూ.162 కోట్ల అప్పు కోసం యత్నించింది. అక్కడ చేదు అనుభవం ఎదురుకావడంతో సీసీఎస్ పేరుతో అప్పు పొందింది. ఇదే మాదిరే తాజాగా కెనరాబ్యాంకు నుంచి రూ.80 కోట్లు అప్పు తెచ్చేందుకు సీసీఎస్ సరేనంది. ఈమేరకు మంగళవారం జరిగిన పాలకమండలి సమావేశం తీర్మానించింది. ఆర్టీసీ కోసం అప్పు తెస్తే సీసీఎస్ గుడ్‌విల్ దెబ్బతింటుందని నలుగురు పాలకమండలి సభ్యులు ఈ ప్రతిపాదనను వ్యతిరేకించారు. మెజార్టీ సభ్యులు సానుకూలంగా ఉండటంతో తీర్మానానికి ఆటంకం కలగలేదు. తెచ్చిన అప్పులో రూ.40 కోట్ల చొప్పున రెండు ఆర్టీసీలకు ఇవ్వాలని నిర్ణయించారు.