banking employees
-
బ్యాంకు ఉద్యోగుల సమ్మె.. వరుసగా నాలుగు రోజులు సెలవు
బ్యాంకు ఉద్యోగులు తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ సమ్మెకు దిగబోతున్నట్లు తెలిపారు. దాంతో మార్చిలో వరుసగా నాలుగు రోజులు బ్యాంకులు మూతబడనున్నాయి. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్‌బీయూ) ఆధ్వర్యంలో మార్చి 24, 25 తేదీల్లో ఈ సమ్మె జరగనుండగా, మార్చి 22, 23 తేదీల్లో వారాంతపు సెలవులు ఉన్నాయి. దాంతో వరుసగా నాలుగు రోజులు సెలవులు వచ్చినట్లయింది. ఆయా తేదీల్లో బ్యాంకింగ్ సేవల కోసం వెళ్లే వినియోగదారులు ఈ విషయాన్ని గమనించాల్సి ఉంది.సమ్మె ఎందుకంటే..తొమ్మిది బ్యాంకు యూనియన్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న యూఎఫ్‌బీయూ అనేక డిమాండ్ల పరిష్కారం కోసం సమ్మెకు పిలుపునిచ్చింది.ఐదు రోజుల పని వారం: ప్రపంచ బ్యాంకింగ్ విధానాలకు అనుగుణంగా వారానికి ఐదు రోజుల పనిదినాలను ఉద్యోగులు సూచిస్తున్నారు. అయితే ప్రస్తుతం రెండు, నాలుగో శనివారం మాత్రమే సెలవు ఉంది.తగినన్ని నియామకాలు: తక్కువ సిబ్బందితో నిత్యం బ్యాంకింగ్ కార్యకలాపాలపై ఒత్తిడి పెరుగుతోంది. ఇది ఉద్యోగులపై పనిభారాన్ని పెంచుతుంది. వెంటనే తగినన్ని నియామకాలు చేపట్టాలి.భద్రతా చర్యలు: బ్యాంకు సిబ్బందిపై దాడులు పెరుగుతున్న నేపథ్యంలో మెరుగైన భద్రతా చర్యలు తీసుకోవాలి.విధాన సంస్కరణలు: పనితీరు ఆధారిత ప్రోత్సాహకాలను, మైక్రో మేనేజ్మెంట్పై ఇచ్చిన ఆదేశాలను ఉపసంహరించుకోవాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.ఇదీ చదవండి: నెలకు రూ.82,000 వేతనం.. ఇంటి ఖర్చులు భారం..బ్యాంకింగ్ సేవలపై ప్రభావంవరుసగా నాలుగు రోజులు బ్యాంకులు మూతపడటంతో ఖాతాదారులు తమ ఆర్థిక లావాదేవీలను ముందుగానే ప్లాన్ చేసుకోవాలని మార్కెట్ వర్గాలు సూచిస్తున్నాయి. ఏటీఎంలు, మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలు యథావిధిగా పని చేస్తాయని, చెక్ క్లియరెన్స్, లోన్ ప్రాసెసింగ్ వంటి కార్యకలాపాల్లో అంతరాయం ఏర్పడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. -
నేడు దేశ వ్యాప్తంగా బ్యాంకింగ్ సమ్మె
-
నేడు బ్యాంకింగ్ సమ్మె
వేతనాలుసహా పలు సమస్యల పరిష్కారానికి డిమాండ్ న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకుల కార్యకలాపాలు మంగళవారం దేశవ్యాప్తంగా నిలిచిపోనున్నాయి. వేతన సంబంధ అంశాలుసహా పలు సమస్యల పరిష్కారానికి యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్‌బీయూ) గొడుకు కింద పలు యూనియన్ల బ్యాంకింగ్ ఉద్యోగులు సమ్మెబాట పట్టడమే దీనికి కారణం. కాగా ప్రైవేటు రంగంలోని ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ, యాక్సిస్, కొటక్ మహీంద్రా వంటి బ్యాంకులు పనిచేసినా... చెక్ క్లియరెన్సుల విషయంలో కొంత ఇబ్బంది తలెత్తే అవకాశం ఉందని భావిస్తున్నారు. మంగళవారం సమ్మె ప్రభావం గురించి ఎస్బీఐ, పీఎన్బీ, బీఓబీసహా పలు బ్యాంకులు ఇప్పటికే తమ కస్టమర్లకు వివరించాయి. దేశంలోని మొత్తం బ్యాంకింగ్ వ్యాపారంలో 75 శాతం వాటా 27 ప్రభుత్వ రంగ బ్యాంకులది కావడం గమనార్హం. బీఎంఏ నో..: సమ్మెకు నేతృత్వం వహిస్తున్న యూఎఫ్‌బీయూ 9 యూనియన్లకు నేతృత్వం వహిస్తోంది. దాదాపు 10 లక్షల మందికి సభ్యత్వం ఉన్నట్లు పేర్కొంటోంది. కాగా భారతీయ మజ్దూర్ సంఘ్(బీఎంఏ) అనుబంధ సంఘాలు.. నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ బ్యాంక్ వర్కర్స్, నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ బ్యాంక్ ఆఫీసర్స్ సమ్మెలో పాల్గొనడంలేదు. సమ్మె తప్పడం లేదు: ఏఐబీఓసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి బ్యాంక్ మేనేజ్మెంట్ ప్రత్యేకించి ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) నుంచి తగిన స్పందన లేకపోవడంతో సమ్మె చేయాల్సి వస్తోందని ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ (ఏఐబీఓసీ) జనరల్ సెక్రటరీ హర్వీందర్ సింగ్ తెలిపారు. ఫిబ్రవరి 21వ తేదీన ఐబీఏ, బ్యాంక్ యూనియన్లు, చీఫ్ లేబర్ కమిషనర్ మధ్య చర్చలు విఫలమయ్యాయని ఏఐబీఓసీ జనరల్ సెక్రటరీ సీహెచ్ వెంకటాచలం పేర్కొన్నారు. డిమాండ్లు ఇవీ... ⇒ బ్యాంకింగ్ రంగంలో పర్మినెంట్ ఉద్యోగాలకు ఔట్సోర్సింగ్ విధానాన్ని ఎంచుకోవడం సరికాదు. ⇒ నవంబర్‌లో పెద్ద నోట్ల రద్దు అనంతరం పనిచేసిన అదనపు గంటలకు సంబంధించి ఉద్యోగులు, అధికారులకు తగిన పరిహారం ఇవ్వాలి. ⇒ బ్యాంక్ ఉద్యోగులకు తదుపరి వేతన సవరణ ప్రక్రియను త్వరగా ప్రారంభించాలి. ⇒ అన్ని విభాగాల్లో తగిన రిక్య్రూట్మెంట్లు జరగాలి. ⇒ మొండిబకాయిల పరిష్కారానికి కఠిన చర్యలు తీసుకోవాలి. టాప్ ఎగ్జిక్యూటివ్‌లను ఇందుకు బాధ్యులుగా చేయాలి. ఉద్దేశపూర్వక ఎగవేతదారులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి.