breaking news
Banganapalli
-
బంగినపల్లి మామిడి కర్నూలు జిల్లాదే
కర్నూలు (అగ్రికల్చర్): జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విశేష ప్రాచుర్యం పొందిన బంగినపల్లి మామిడికి భౌగోళిక (జియోగ్రాఫికల్ ఇండికేషన్) గుర్తింపు లభించింది. ఈ మామిడి ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాకు చెందినదిగా ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) గుర్తించింది. రెండేళ్ల క్రితమే ప్రాథమికంగా గుర్తింపు లభించినప్పటికీ తాజాగా పూర్తి హక్కులు ఇచ్చినట్లు సంస్థ సోమవారం చెన్నైలో ప్రకటించింది. భౌగోళిక గుర్తింపుతో పాటు బంగినపల్లి మామిడి మాది అని చెప్పే అధికారం ఇతరులకు ఇకనుంచి ఉండదు. బంగినపల్లి మామిడి పేరును వాడుకోవాలంటే కర్నూలు జిల్లాకు రాయల్టీ చెలించాల్సి ఉంటుంది. -
రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలకు తీవ్రగాయాలు..
అమ్మవారి దర్శనానికి వెళ్తున్న భార్యా భర్తలు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ సంఘటన కర్నూలు జిల్లా బనగానపల్లె మండలం నందవరం సమీపంలో ఆదివారం చోటుచేసుకుంది. వైఎస్సార్ జిల్లా రాజుపాలెంకు చెందిన భార్యాభర్తలు ఓబుల్ రెడ్డి(35) హుస్సేనమ్మ(32) తమ ఎనిమిదేళ్ల కూతురితో కలిసి నందవరం చౌడేశ్వరి అమ్మవారి దర్శనానికి బైక్ వెళ్తున్నారు. ఈ క్రమంలో నందవరం పండ్లాపురం గ్రామల మధ్యకు చేరుకోగానే ఎదురుగా వస్తున్న స్కార్పియో వాహనం ఢీకొట్టింది. దీంతో భార్యా భర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
నందీశ్వరుడు రంకె వేసే స్థలమేది?
కలియుగాంతాన ఓ క్షేత్రంలోని నందీశ్వరుడు (బసవన్న) రంకె వేస్తాడని వీరబ్రహ్మేంద్ర స్వామి తన కాలజ్ఞానంలో వివరించారు. ఆ క్షేత్రం ఎక్కడ ఉంది? - విశ్వంతరాజు, ఈ-మెయిల్ కర్నూలు జిల్లా బనగానపల్లి మండలంలో బనగానపల్లి గ్రామానికి సుమారు పది కిలోమీటర్ల దూరంలో యాగంటి క్షేత్రం ఉంది. ప్రకృతి అందాల నడుమ అలరారుతున్న ఈ క్షేత్రంలో ఉమా మహేశ్వర స్వామి వార్లు ఒకే శిలలో వెలిశారు. అగస్త్య మహాముని ఈ స్వామి వార్లను ప్రతిష్ఠించినట్లు ఇక్కడి స్థల పురాణాలు చెబుతున్నాయి. నరసింహ స్వామి మానవ శరీర రూపంగా దర్శనమిస్తున్న క్షేత్రమేది? అదెక్కడుంది? - ఆర్.వి.వి, హైదరాబాద్ నరసింహ స్వామి మానవ శరీర రూపంగా దర్శనమిస్తున్న క్షేత్రం మల్లూరు. వరంగల్ జిల్లాలో ఉన్న ఈ దివ్య క్షేత్రం పట్టణానికి 135 కిలోమీటర్ల దూరంలో ఉంది. మల్లూరు గ్రామానికి 8 కిలోమీటర్ల దూరంలో హేమాచలం ఉంది. ఈ పర్వతం మీద నరసింహ స్వామి వెలిశాడు. కనుక ఈ స్వామిని హేమాచల నరసింహస్వామి అని పిలుస్తారు. ఇక్కడ స్వామి వారి విగ్రహానికి రోమాలు వుంటాయి, స్వామి వారి మూర్తి మెత్తగా ఉంటుంది. ఏటా ఇక్కడ పెద్ద గిరిజన జాతర జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఇది రెండో పెద్ద గిరిజన జాతరగా ప్రసిద్ధికెక్కింది. నాగదోషాల నివారణకు పేరెన్నికగన్న క్షేత్రమేది? ఎలా చేరుకోవాలి? - ఎన్.బి.వసంత, ఇ-మెయిల్ నాగదోషాల నివారణకు పేరెన్నికగన్న క్షేత్రం కుక్కి సుబ్రహ్మణ్య క్షేత్రం. ఇది కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరు జిల్లాలో, బెంగళూరు నగరానికి సుమారు 400 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ కుక్కి సుబ్రహ్మణ్య క్షేత్రం కర్ణాటక రాష్ట్రంలో ఉన్న మూడు ముఖ్యమైన సుబ్రహ్మణ్య క్షేత్రాలలో ప్రముఖమైనది. దట్టమైన వనాల మధ్య అలరారే ఈ క్షేతంలో అన్ని సదుపాయాలూ ఉన్నాయి. - దాసరి దుర్గాప్రసాద్, ట్రావెల్ ఎక్స్పర్ట్