breaking news
Balram
-
కరోనా మళ్లీ సోకడం అరుదే..
న్యూఢిల్లీ: కరోనా తగ్గిపోయాక, తిరిగి సోకడం చాలా అరుదని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరామ్ భార్గవ చెప్పారు. తెలంగాణ, కర్ణాటక, గుజరాత్, పంజాబ్, మహారాష్ట్రలో కరోనా తిరిగి సోకుతున్న కేసులు వస్తున్నాయన్న అనుమానాల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. హాంకాంగ్‌లో రెండోసారి వస్తున్న కరోనా గురించి∙సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. రష్యా వ్యాక్సిన్ గురించి మాట్లాడుతూ వారు తయారు చేసిన వ్యాక్సిన్ మూడో దశ ఇంకా పూర్తి కాలేదని చెప్పారు. అయితే శరీరంలో యాంటీబాడీలను పెంచడంలో అది 76 శాతం మందిలో సానుకూల ప్రభావాన్ని చూపినట్లు లాన్సెట్ జర్నల్ లో ప్రచురితమైందన్నారు. ప్రపంచంలో అందరికంటే ఎక్కువగా మన దేశంలోనే రికవరీలు జరుగుతున్నాయని ఆరోగ్య కార్యదర్శి రాజేశ్ భూషన్ చెప్పారు. ఆగని కరోనా ఉధృతి దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ ఆగడం లేదు. గత 24 గంటల్లో 83,809 కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 49,30,236కు చేరుకుంది. మంగళవారం 83 వేల కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 1,054 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 80,776 కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 38,59,399 కు చేరుకోగా, యాక్టివ్ కేసుల సంఖ్య 9,90,061 గా ఉంది. దేశంలో కరోనా రికవరీ రేటు క్రమంగా పెరుగుతోందని, ప్రస్తుతం ఇది 78.28 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. -
ప్రొఫెసర్ కిడ్నాప్‌నకు ఏడాది
గత ఏడాది జూలై 29వ తేదీన లిబియా దేశంలో ఐఎస్ తీవ్రవాదులు కిడ్నాప్ చేసిన శ్రీకాకుళం జిల్లా టెక్కలికి చెందిన తిరువీధుల గోపీకృష్ణ ఆచూకీ ఇప్పటికీ తెలియరాలేదు. అప్పట్లో మన దేశానికి చెందిన నలుగురు వ్యక్తులను తీవ్రవాదులు కిడ్నాప్ చేశారు. కిడ్నాప్‌నకు గురైన వారిలో ఇద్దరు కర్ణాటక వాసులు కాగా మరొకరు హైదరాబాదుకు చెందిన బలరాం, శ్రీకాకుళం జిల్లాకు చెందిన గోపీకృష్ణ ఉన్నారు. వీరిలో కర్ణాటక వాసులను విడుదల చేసిన తీవ్రవాదులు బలరాం, గోపీకృష్ణలను మాత్రం బందీలుగానే ఉంచుకున్నారు. గోపీకృష్ణ లిబియాలో స్రిట్ యూనివర్సిటీలో కంప్యూటర్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేసేవారు. గోపీకృష్ణ కిడ్నాప్‌నకు గురైన తరువాత రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, శ్రీకాకుళం ఎంపీ కె.రామ్మోహన్నాయుడు తదితరులు అతని తల్లిదండ్రులైన వల్లభనారాయణరావు, సరస్వతిలను పరామర్శించారు. గోపీకృష్ణ విడుదలకు పూర్తి ప్రయత్నాలు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ నెల 29వ తేదీకి ఏడాది పూర్తవుతున్నప్పటికీ గోపీకృష్ణ నుంచి ఏ సమాచారం లేకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. అప్పట్లో గోపీకృష్ణ భార్య కల్యాణి, సోదరుడు మురళీకృష్ణ రాష్ట్రపతిని సైతం కలిసి తమ గోడు వెళ్లబుచ్చారు. అయినప్పటికీ ఫలితం కనిపించలేదు. ఇదిలా ఉండగా గోపీకృష్ణ విడుదల విషయంలో పూర్తిగా వైఫల్యం చెందిన ప్రభుత్వాలు ఆయా కుటుంబ సభ్యులకు ఇటీవల కాలంలో పరిహారం అందజేసి చేతులు దులుపుకున్నాయి. -
ఓ మనిషి ప్రయాణం
క్లాసిక్ కథ మనిషి... పుట్టుక... బలహీనత... వీటి పరస్పర సంబంధాల్ని ఆలోచిస్తూ బలరాం మరింత బలహీనంగా తయారయ్యాడు. బలరాం గురించి ఆ వీధిలో ప్రత్యేకంగా ఎవరూ ఏమీ చెప్పుకోరు. చెప్పుకోవాల్సిందేమీ లేదు కూడా. ముప్ఫై ఏళ్లు దాటిన మనిషని ఎవరూ అనుకోరు. వయస్సుని అతని విషయంలో అంచనా కూడా వేయలేరు. బలహీనతకి ఎముకలతో ఓ ఆకారం కూర్చి, ఓ పల్చటి పొర కప్పినట్టుంటాడు. రోజూలాగే నిద్రలేచాడు బలరాం, కిటికీలోంచి వచ్చే వెలుగుకి. గదికి ఉన్న ఆ ఒక్క కిటికీ అంటే బలరాంకి చాలా ఇష్టం. అతని సుషుప్తికి, జాగ్రదావస్తకి సరిహద్దు ఆ కిటికీ... కళ్లు తెరవగానే అలమారులో పచ్చ డబ్బా... ఈ రోజు ఇంకొంచం మెరుస్తూ కనపడింది. ఈ మధ్య ప్రతి ఉదయం బలరాంకి అలా అనిపిస్తూనే ఉంది. సాయంత్రానికి మామూలుగానే ఉంటుంది. మామూలంటే ఆ డబ్బాని అలమారులో ఉంచిన రోజు తోచినట్టు. ఆ డబ్బాని చూస్తూ నవ్వాడు. రోజు రోజుకీ బలరాం మనసులో బరువు పెరుగుతోంది. అది సంతోషమో, విచారమో... తెలియని బరువు. చింకి చాపమీంచి లేవకుండా ‘ఇది ఆనందమే...’ అనుకుంటాడు. లేచింతర్వాత సందేహం మామూలే. కాలు తిన్నగా సాగలేదు. చలికి చర్మం బిగుసుకుని, పుండుమీద గట్టిన గూడు నొప్పి... చిరాగ్గా కాలు లాగటం వల్ల పుండు రేగింది. రసి... చీము... నెత్తురు... ‘ఇంక ఇది తగ్గదు...’ సూదులు గుచ్చినట్టు పుండు సలుపు. నెమ్మదిగా లేచాడు. దొడ్లో అక్కడో చితుకు... ఇక్కడో చితుకు... వో కొబ్బరి మట్ట... మరో తాటాకు... కుంటుతూనే ఏరి మంట వేశాడు. ఎండ బాగా వేడెక్కే వరకూ అదే కార్యక్రమం బలరాంకి. కాలు సలుపుకి సవనగా ఉంటుంది. ఆ ఎర్రని మంటల్లో... దూరంగా ఏనాటివో నీలి మంటలు... చిటపట చప్పుళ్లు... కళ్ల ముందు కదుల్తాయి బలరాంకి. అదో వోదార్పు... స్మృతుల అవలోకన... ‘నేను కాబట్టే తల్లి చితి కాల్చుతుంటే గొప్ప పని చేసినవాడిలా మురిసి పోయాను’ మంటలోని తాటాకు కదుపుతూ అనుకున్నాడు. మంట వేడి... కళ్లల్లో నీరు తిరిగింది. నెమ్మదిగా లేచి మళ్లీ గదిలోకి. మామూలే... చూరుమీద అక్కడక్కడ చెదరిన పెంకులు... ఒక్కటే కిటికీ... అలమారు... అలమారులో ఒక్కటే డబ్బా... ఆ డబ్బాని అలా లోపల పెడుతూ గట్టిగా పకాపకా, సినిమాలో వికృత విజయం సాధించినవాడిలా నవ్వాలనిపించింది బలరాంకి ఆ రోజు... కాని మామూలుగా కూడా నవ్వలేకపోయాడు. ముప్ఫై ఏళ్ల జీవితంలో బలరాం ఏ ఒకటి రెండుసార్లో చూశాడు సినిమా... చూసిన ఆ ఒకటి రెండుసార్లు ఆశ్చర్యం తప్ప ఆనందం కలుగలేదు. బలరాం జీవితం సినిమాతో పొసిగే జీవితం కాదు. నెమ్మదిగా చింకిచాప చుడుతుంటే, మూల చిరుగుల బొంత కనిపించింది. ‘అమ్మది...’ బలరాం మనసు అనుకుంటుందా బొంతనెప్పుడు చూసినా. ‘ఇలాగే ఆ చాప పక్కనే బొంత వేసుకుని పడుకునేది అమ్మ’ గుర్తు తెచ్చుకున్నాడు బలరాం. తల్లిని తలుచుకున్నప్పుడల్లా శ్మశానం... మంటలే గుర్తొస్తాయి బలరాంకి. రోజూ పెట్టే రెండు ముద్దల అన్నం... వేసే చింకిగుడ్డల పక్క... ఆ ఆప్యాయపు చూపులు... ఆ గది నాలుగు మూలలా ఉన్నట్టే ఉంటాయి బలరాంకి. కాని అవి బలరాంని చేరుకోవటం లేదు: ఎర్రటి మంటల్లో కాలిపోతున్నాయి. తల్లి తలపులకి, బలరాంకి మధ్య ఎర్రటి మంటలడ్డు. అప్పుడప్పుడు వాటిని దాటుతుంటాడు బలరాం. అప్పుడే తల్లి మాటల్ని మననం చేసుకోగలడు. ‘నలుగురి తర్వాత నాకు మిగిలిన వెర్రి బాబువి... అసలే అంతంతమాత్రం మనిషివి. పట్టుమని పదడుగులేయలేవు. కడుపు నిండా తిండైనా పెట్టలేక పోతున్నాను. నా మూలానే నువ్విలా అయ్యావు. ముందెలా బతుకుతావో వెట్టిబాబువి.’ ఆ ముందు బతుకంటే అర్థం తెలియడం లేదు బలరాంకి ఆనాడు. అంత దూరం ఆలోచించే చైతన్యం లేదు. తల్లి అస్తమానం అన్నం అన్నం అంటే ఆలోచించేవాడు. అన్నం కొంచమే ఎందుకు దొరుకుతోందా అని. తల్లినడిగితే... ‘అదైనా వాళ్ల దయే కదు బాబు... నా వయస్సెంత... నేను చేసే పనెంత?’ అంది. బలరాంకి కూడా నిజమే అనిపించింది. సుదర్శనంగారు నిజంగా ధర్మాత్ముడే. తల్లి ఏ పనీ చేయలేదని తెలుసు. ఎన్నో ఏళ్ల నుంచి ఉన్నందుకు గాను పొమ్మనలేక, పేరుకి రెండు గదులు ఊడ్పించుకుంటూ... మిగిలిందో... మిగిల్చిందో... రెండు కరుళ్లు అన్నం పెడుతున్నా రంటే... దొడ్లో ఇంట్లో తలదాచుకో నిస్తున్నారంటే, తల్లిమీద అభిమానమే. గడచిన రోజుకి గడవబోయే రోజుకి పెద్ద తేడా కనిపించేది కాదు బలరాంకి దైనందిన కార్యక్రమంలో... దొడ్లో తిరగటం... పెంకుల వేపు చూడటం... రాలిన చింతకాయలు తినటం... రోజులో ఎక్కువసేపు కిటికీ దగ్గర కూర్చుని వచ్చేపోయే వాళ్లని చూడటం... ఎన్నో ఆలోచనలొచ్చేవి. కిటికీలోంచి చూస్తూ ఎన్నో కలలు... కాని ఏదీ స్థిరంగా నిలిచి తన సంపూర్ణ స్వరూపాన్ని చూపలేదు.ఈనాడు జీవితం అంతా గుర్తు తెచ్చుకుంటే... అక్కడో రోజు... అక్కడో రోజు... వేళ్లమీద లెక్కపెట్టగలిగినన్ని మాత్రం గుర్తొస్తాయి బలరాంకి. తల్లి కొత్త చొక్కా తొడిగిన రోజు... కొత్తదనం అంటే ఏమిటో తెలిసిన మురిపెం. సుదర్శనంగారి దగ్గర నాలుగక్షరాలు నేర్చుకుంటున్న కొత్తలో సరదా... అలా... వాటిల్లో ఆనాడు... అదోరోజు... కిటికీలోంచి చూస్తుంటే... వెడుతూ వెడుతూ ఆగిపోయింది. మాసిన చిరుగుల చీర... ఎత్తయిన గుండెల్ని పూర్తిగా కప్పలేని జీవితం... అడుక్కునేది. బలరాంని రెండు క్షణాలు అలా చూస్తూ నవ్వింది. అది అందం నవ్విన నవ్వు కాదు. స్త్రీత్వంలోని జాలి, లాలన నవ్విన నవ్వది. ఆడతనం నవ్విన నవ్వది. ఆ రోజు కిటికీలోంచి ఎన్నో రంగులు, ఇదివరకు కనపడనివి ఎన్నెన్నో కనిపించాయి బలరాంకి. సూటిగా సాగి గబుక్కుని విరిగిపోయే బలరాం ఊహలు ఆ రోజు కొద్దిగా మలుపు తిరిగి కొత్త చైతన్యం వేపు చూశాయి... మరి బలరాం జీవితమే మలుపు తిరిగిందేమో... రోజుకి రోజుకి తేడా కనిపించని బలరాంకి ఆ రోజు పెద్ద తేడా కనిపించింది.ఆలోచనో... బాధో... ఏమిటో తెలియని స్థితి... ఆ క్షణాన తెలిసిందొక్కటే బలరాంకి తల్లి చచ్చిపోయిందని... అందరిలాగే తన తల్లి పోతుందనే ఆలోచనెప్పుడూ లేదు బలరాంకి. సుదర్శనంగారు భుజం తట్టేవరకు ఏమీ తెలియలేదు. ఆయన్ని చూడగానే గుండెల్లో... నిశ్శబ్దంలో... ఏడుపు ఒక్కసారిగా పగిలింది. ‘ఊరుకో బలరాం... ఏదోనాడు అందరం అంతే... ఇంకా నయం మూలపడలేదు. కాలు చెయ్యి వంగకుండా దాటిపోయింది. మూల పడితే మందు మాకూ చూడగలిగేవాడివా చెప్పు. ముందు జరగాల్సిందేమిటో చూడు.’ ‘ముందు జరగాల్సిందంటే...’ సుదర్శనంగారు చెప్పేవరకు తోచలేదు బలరాంకి. జీవి రూపు ఏర్పరచుకున్న క్షణం నుంచి ఆ రూపం నశించే వరకూ ముడిపడిన అవసరం... డబ్బు. ఆనాడు అభిమానం అడ్డు రాలేదు. వివరించలేని ఆ స్థితిలో... ఆనాడు అలా అంతమందిని ఎలా అర్థించగలిగానో అనుకుంటాడు బలరాం. ‘మా వాళ్ల తద్దినాలే పెట్టలేక చస్తుంటే... ఊళ్లో వాళ్ల గొడవొకటి’... ఓ ఇంటావిడ పావలా ఇస్తూ అన్నమాట. ‘అడుక్కోటంలో అనేక రకాలు...’ ఇంకో ఇంటావిడ చీదరింపు. ‘మనిషి బతగ్గానే సరా... జీవితం ఏమిటి ఎందుకు అనే ఇంగితం ఉండఖర్లా... అంత గతి లేకపోతే ఏ కార్పొరేషన్ వాళ్లనో బతిమాలితే లాక్కుపోతారుగా’... ఇంకో ఇంటావిడ. వాళ్లందరూ కలిసి ముద్దగా ముఖం మీద విసిరిన అసహ్యం... బాధ కలిగించలేదానాడు. తల్లికి అంత్యక్రియలు చేయాలి. తల్లి పోయిందన్న బాధ కన్నా తల్లికి అంత్యక్రియలు చేయలేకపోతానేమో అన్న బాధ ఎక్కువైంది బలరాంకి. ఆఖరికెలాగైతేనేం... ఆ చితి మంటల్ని చూడగలిగాడు. గర్వంగా ఏడ్చాడు. అందుకనే తల్లి గుర్తొచ్చినప్పుడల్లా అడ్డొస్తాయి, ఆ మంటలు ఆలోచనకి. ఆనాడనుకుంది... తర్వాత బలపడింది. ఈ పచ్చ డబ్బా రూపు...ముందెలా బతుకుతావో వెర్రిబాబువి అన్న తల్లి మాటలకి ‘మామూలుగానే’ అనాలనిపించేది బలరాంకి. ఆ మాటే నిజమైంది. తల్లి ఊడ్చే రెండు గదులు తనే ఊడుస్తున్నాడు... అదే గమనం... అదే జీవనం. బలరాం పోయాడన్న వార్త అందరూ చాలా సహజంగానే విన్నారు, ఒక్క సుదర్శనంగారు తప్ప. వీలున్నవాళ్లు చూటానికి వచ్చారు. ‘అయ్యో పాపం’ అన్నారు. నిశ్చలంగా పడున్న బలరాంని చూస్తూ తనకి ఈ తద్దినం తప్పదనుకున్నారు సుదర్శనంగారు. మరి ఎందుకో తెలియదు కాని నాలుగు వేపులా కలయ చూశాడు. అలమారులో పచ్చ డబ్బా ఆకర్షణీయంగా ఉంది. అందుకున్నారు. బరువుగా ఉంది. మూత తీస్తే... సుదర్శనంగారి కళ్లు చెదిరాయి... ఏదో కాయితం... కళ్లజోడు లేదు. పక్క కుర్రాడెవరో అందుకున్నాడు... ‘‘ఇది ఎవరూ చదవాలని రాయలేదు. నన్ను నేను దాచుకోలేక రాసుకుంటున్నాను. ఎవరో ఒకళ్లు చదవాలన్న ఆశ లేకనూ పోలేదు. నా జీవితం మీ అందరికీ తెలిసున్నదే. శారీరకంగా పూర్తి బలహీనుణ్ని... కష్టపడి ఏ పనిచేసే శక్తి లేనివాణ్ని. చేయాలన్న ఉద్దేశం కలిగినా అమ్మ సాగనివ్వలేదు. మనిషికి మనిషెంత బరువో... మనిషి జీవితం విలువెంతో, అమ్మ పోయిననాడు తెలిసింది. ఆనాడు అమ్మ చితికి నిప్పంటిస్తూ ఎంతో గర్వపడ్డాను, కొడుకును కాబట్టి... నన్నలా తగలేస్తూ ఎవరూ గర్వపడరని తెలుసు.’’ ‘మనిషి బతగ్గానే సరా... జీవితం ఎందుకు, ఏమిటనే ఇంగితం ఉండఖర్లా...’ అన్నారొకరు ఆనాడు. జీవితం ఎందుకు అనే ప్రశ్నకి సమాధానం దొరకలేదు. ఏమిటి అన్నదానికీ అంతే. చిన్నప్పుడు అమ్మ ఒకసారి ‘రేపు ఊరు వెడదాం’ అంది. ఏ ఊరో తెలియదు. ప్రయాణం ఎందుకో తెలియదు. కాని ఎంతో సరదా వేసింది ఏదేదో ఉంటుందని. ఆ ప్రయాణం చేయనేలేదు. కాని అది చాలా మురిపించింది. నా జీవితం గురించి ఆలోచిస్తే ఇదీ ప్రయాణమే అనిపిస్తోంది. స్థాన చలనం లేని ప్రయాణం. ఎంతో ఇరుకుగా గడిపిన జీవితంలో చైతన్యానికి తావే లేకపోయింది... ఆ ఒక్కరోజు తప్ప... ఆ ఒక్క చూపు తప్ప... ఎన్నో ఊహలు, కదలికలు నిండిన రంగులు కళ్లముందు నిలిచాయి. ఇంచు మించుగా అమ్మ అప్పుడే పోయింది. నా హీన స్థితికి లోకం విసిరిన అసహ్యపు ముద్ద ఆ రంగుల్ని మళ్లీ కనపడనివ్వలేదు. ఆనాటి నుంచి మిగిలిన ఆలోచన ఇదొక్కటే. సంఘంలో ఆ ఏర్పాటుందని తెలుసు... అనాథ ప్రేతాన్ని లాగేయకపోరు. కాని అదీ ఉద్యోగ ధర్మమే... మళ్లీ అసహ్యం... చీదరింపులు... ఆ స్థితి నాకు కలగకూడదనే ఈ శ్రమపడ్డాను. ఈ పచ్చ డబ్బాలోది అరవై రూపాయలు కాదు, నా రక్తం... ఏనాడూ శ్రమించి ఎరుగని నా బలహీన దేహపు శ్రమ. చావు తరువాత... ఆత్మ... నాకయోమయం. ఆలోచన అంత దూరం సాగినా అర్థం చేసుకుని నిర్ణయించుకోగల శక్తి నాలో లేదు. ఈ ప్రయాణంలో, మనిషి తనంతగా తాను దాటలేని ఆఖరి మజిలీని ‘దాటించే ఈ ఖర్చు’ని. ఎవరి నెత్తిమీదైనా వేసుకుని అసహ్యించుకుంటారేమోనని బాధ.ఈ డబ్బు దానికి వినియోగించండి... ఇలా నాకు నేనుగా... ఈ ఏర్పాటు. బాధో... ఆన -
తుపాకులతో బెదిరిస్తూ తెలుగు ప్రొఫెసర్లతో పాఠాలు?
న్యూఢిల్లీ: ఇంట్లో ఆర్థిక సమస్యలు. మాతృదేశంలో ఉద్యోగాలు కరువు.. కళ్లముందు బోలెడు సమస్యలు వెరసి ఎలాగైనా ఓ ఉద్యోగం చేయాలనే తపన వారిని ప్రమాదభరిత ప్రాంతాల్లో సైతం ఉద్యోగాలకు వెళ్లేలా చేసింది. విదేశాల్లో ఉద్యోగాల కోసం దరఖాస్తులు చేసుకోగా ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల ప్రభావం ఎక్కువగా ఉండే లిబియాలో ఉద్యోగం వచ్చింది. సిర్తీ విశ్వవిద్యాలయంలో విధుల్లో చేరారు. సెలవుల్లో భాగంగా తిరుగు ప్రయాణం అయినవారిని దురదృష్టం వెంటాడింది. దాదాపు రెండు నెలలుగా వారి గురించి ఇసుమంత జాడకూడా తెలియకుండా పోయింది. ఇది లిబియాలో కిడ్నాప్ కు గురైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఇద్దరు ప్రొఫెసర్లు బలరాం, గోపీకృష్ణల కథ. బలరాం, గోపికృష్ణలు గత ఏడాది జూలై చివరి వారంలో భారత్ కు తిరిగి వచ్చేందుకు ట్యునిషియా ఎయిర్ పోర్టుకు వస్తుండగా వారిని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. అప్పటి నుంచి వారి జాడ కరువైంది. కానీ, విద్యార్థులకు పాఠాలు చెప్పేందుకు వెళ్లిన వారిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లి ఉగ్రవాదులు తమకు పాఠాలు చెప్పించుకుంటున్నారని తాజాగా తెలిసింది. వారి ప్రాణానికి ఎలాంటి హాని తలపెట్టకుండా బెదిరింపులకు మాత్రమే దిగుతూ పాఠాలు చెప్పించుకుంటున్నారని, ఈ కృతజ్ఞతాభావంతోనైనా ఆ ఉగ్రవాదులు తమవారిని విడిచిపెడతారని ఆశిస్తున్నట్లు వారి కుటుంబ సభ్యుల ద్వారా తెలిసింది. వీరితోపాటు ఎంతోమందిని ఇలాగే ఉగ్రవాదులు కిడ్నాప్ చేసి తీసుకెళ్లి పాఠాలు చెప్పించుకుంటున్నారట. బలరాం భార్య శ్రీదేవీ ఈ విషయంపైనే ఓ మీడియాతో మాట్లాడుతూ 'ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు తమవారితో బలవంతంగా పాఠాలు చెప్పించుకుంటున్నారని నాకు మూడు నెలల కిందట భారత దౌత్య కార్యాలయం, స్థానికుల సమాచారం ద్వారా తెలిసింది. నేను ప్రతి రోజు విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ పీఏకు ఫోన్ చేస్తున్నాను. వారు సురక్షితంగా ఉన్నారని చెప్తున్నారు. దీంతో వారు క్షేమంగా తిరిగొస్తారన్న భరోసాతో ఉంటున్నాను. ఈ సమయంలో నా కుటుంబం నాకు ఎంతో ధైర్యాన్ని ఇస్తున్నా కొంత గుబులుగానే ఉంది' అని చెప్పింది. ఇక గోపి కృష్ణ సోదరుడు మురళీ కృష్ణ మాట్లాడుతూ.. తమ సోదరుడిని సెప్టెంబర్ 2014లో చూశామని, ఫిబ్రవరి 29 తన పుట్టినరోజని ఆ నాటికైనా తాను వస్తాడని తాము ఆశిస్తున్నట్లు తెలిపాడు. తమ కుటుంబ పరిస్థితి దయనీయంగా మారిందన్నాడు. వీరితోపాటు కర్ణాటకకు చెందిన ఎస్ విజయ్ కుమార్, లక్ష్మీ కాంత్ రామకృష్ణ అనే ఇద్దరిని కూడా ఉగ్రవాదులు కిడ్నాప్ చేసినా అనంతరం విడిచిపెట్టారు. -
ఇంకా చెరలోనే ప్రొఫెసర్లు
రెండు రోజులైనా తెలియని ఆచూకీ సాక్షి, హైదరాబాద్: లిబియాలో కిడ్నాప్‌నకు గురైన తెలంగాణ, ఏపీకి చెందిన బలరాం, గోపీకృష్ణ ఆచూకీ ఇంకా లభించలేదు. వీరితో పాటు కిడ్నాప్ అయిన కర్ణాటకకు చెందిన లక్ష్మీకాంత్, విజయ్‌కుమార్‌ను శుక్రవారమే విడుదల చేశారు. అయితే బలరాం, గోపీకృష్ణ ఇప్పటికీ విడుదల కాకపోవడంతో వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కేంద్ర విదేశాంగ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు వారి పరిస్థితిపై కుటుంబసభ్యులకు సమాచారం అందజేస్తున్నారు. వారు క్షేమంగానే ఉన్నారని, వీలైనంత త్వరగా విముక్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు కుటుంబసభ్యులకు విదేశాంగ శాఖ అధికారులు ధైర్యం చెప్పారు. కాగా, శనివారం నాచారంలోని గోపీకృష్ణ, అల్వాల్ సాయినగర్‌లోని కుటుంబసభ్యులు మీడియా సభ్యులను కలిసేందుకు ఇష్టపడలేదు. విడుదలకు కృషి చేస్తున్నాం: వెంకయ్య నాచారంలోని గోపీకృష్ణ కుటుంబసభ్యులను ఉప్పల్ ఎమ్మెల్యే ప్రభాకర్ శనివారం పరామర్శించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుతో వారిని ఫోన్లో మాట్లాడించారు. దౌత్యపరంగా తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకుంటున్నామని, వారు క్షేమంగానే తిరిగొస్తారన్న నమ్మకముందని భరోసా ఇచ్చారు. కిడ్నాపర్ల చెర నుంచి విడుదలైన కేరళకు చెందిన లక్ష్మీకాంత్, విజయ్‌కుమార్‌లు లిబియాలోని భారత దౌత్య కార్యాలయానికి క్షేమంగా చేరుకున్నారని విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ తెలిపారు.ప్రభుత్వం నుంచి సమాచారం లేదు. బలరాంకు సంబంధించిన వివరాలు ప్రభుత్వం కాని, లిబియాలోని సిర్త్‌యూనివర్సిటీ నుంచి కానీ ఎలాంటి సమాచారం రావడం లేదని బలరాం కుటుంబసభ్యులు తెలిపారు. మీడియాలో వస్తున్న వార్తల ద్వారానే తమకు సమాచారం తెలుస్తోందని వాపోయారు. కలెక్టర్ ఆదేశాల మేరకు మల్కాజిగిరి తహసీల్దార్ శ్రీనివాస్, స్థానిక పోలీసులు బలరాం నివాసానికి వచ్చి వివరాలు తెలుసుకున్నారు. వారినీ కాపాడండి: సుష్మాకు దత్తన్న ఫోన్ సాక్షి, హైదరాబాద్: ఉగ్రసంస్థ ఐఎస్ఐఎస్ చెరలో బందీలుగా ఉన్న తెలుగువారిని కాపాడాలని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ విదేశాంగశాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌ను కోరారు. ఇప్పటికే ఇద్దరిని కాపాడిన తీరు అభినందనీయమని, మిగిలిన ఇద్దరినీ కాపాడాలని దత్తాత్రేయ శనివారం ఫోన్లో విజ్ఞప్తి చేశారు. సుష్మ సానుకూలంగా స్పందించారని, బందీలుగా ఉన్నవారు క్షేమంగా విడుదల అవుతారనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. బలరాం, గోపీకృష్ణ విడుదలయ్యేలా చూడండి * కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ లిబియాలో కిడ్నాప్‌నకు గురైన రాష్ట్రానికి చెందిన బలరాం విడుదల విషయంలో చొరవ చూపాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర విదేశాంగ శాఖను కోరింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ శనివారం కేంద్ర విదేశాంగ శాఖ కార్యదర్శికి లేఖరాశారు. లిబియా కిడ్నాప్ ఉదంతంపై సీఎం కేసీఆర్, ఆయన కార్యాలయం ఎప్పటికప్పుడు వివరాలు సేకరిస్తోంది. ఢిల్లీలోని తెలంగాణ భవన్ అధికారులు సైతం విదేశాంగ శాఖ అధికారులతో మాట్లాడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా లిబియా ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతోంది. కిడ్నాప్‌నకు గురైన బలరాంతో పాటు ఏపీకి చెందిన గోపీకృష్ణ సైతం క్షేమంగా విడుదలయ్యేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. వారు క్షేమంగా తిరిగి రావాలని సీఎం ఆకాంక్షించారు.