breaking news
bad roads
-
రంబుల్స్ట్రిప్స్తో ప్రమాదాలు.. ఏం చేయాలి?
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఇంజినీర్లకు కాంట్రాక్టర్లతో కలిసి రోడ్లు వేయకుండానే బిల్లులు కాజేయడం తెలుసు. ఎక్కడా లేని నిబంధనలతో కావాల్సిన వారికే టెండర్లు కట్టపెట్టడమూ తెలుసు. నాణ్యత లేమితో తూతూమంత్రంగా పనులు చేయడమూ తెలుసు. ఎటొచ్చీ జేబులు నింపుకొనేందుకు చూపిస్తున్న శ్రద్ధ ప్రజలకు ప్రమాదాలు జరగకుండా ఉండటంపై చూపడం లేదు. నాసిరకం రోడ్లే కాదు.. రోడ్డు ప్రయాణాలు చేసేవారికి చూపాల్సిన మార్గదర్శకాలు పట్టించుకుంటే ఒట్టు. చివరకు సైనేజీలపైనా శీతకన్నే. సైనేజీలు, లేన్‌మార్కింగ్‌లు, అడ్డగోలు రంబుల్‌స్ట్రిప్స్ వల్ల ప్రజలకు ఎలా ప్రమాదాలకు ఆస్కారం ఉందో నగరంలో వాహనాల మొబిలిటీ ఎందుకు తగ్గుతుందో జీహెచ్ఎంసీలోని మరో విభాగమే క్షేత్రస్థాయిలో సర్వే చేసి లోపాలు తెలియజేయడం విశేషం. అంతేకాదు, రోడ్‌సేఫ్టీ చర్యల్లో భాగంగా.. రహదారుల ప్రమాణాలకు సంబంధించి దేశంలోనే అత్యున్నత సంస్థలైన ఇండియన్ రోడ్ కాంగ్రెస్ (ఐఆర్సీ), మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ (మోర్త్) ప్రమాణాలకనుగుణంగా ఎలా ఉండాలో సూచిస్తూ జీహెచ్ఎంసీ (GHMC) ట్రాఫిక్ విభాగం రూపొందించిన స్టాండర్డ్ ఆపరేషనల్ ప్రొసీజర్ (ఎస్ఓపీ)ను జీహెచ్ఎంసీ ఇంజినీర్లు తప్పనిసరిగా పాటించాల్సిందిగా కమిషనర్ ఆదేశించారు. క్షేత్రస్థాయి సర్వే నివేదిక మేరకు.. రోడ్ మార్కింగ్‌లు వేస్తున్నామా అంటే వేస్తున్నాం. స్పష్టంగా కనిపించడం లేదు. చార్మినార్ నుంచి బంజారాహిల్స్, హైటెక్ సిటీ దాకా అదే దుస్థితి. రద్దీప్రాంతాల్లో పాదచారులకుకానీ, పాఠశాలల వద్ద విద్యార్థులకు కానీ సురక్షితంగా రోడ్డు దాటేందుకు జీబ్రా లేన్స్ లేవు. అబిడ్స్ వంటి ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి. ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చెందిన గచ్చిబౌలి వంటి ప్రాంతాల్లో సైతం పాదచారులు రోడ్డు దాటేందుకు ముప్పుతిప్పలు పడాల్సి వస్తోంది. లేన్ మార్కింగ్లెందుకు? బస్సులు వెళ్లేందుకు, సైకిళ్లు, పాదచారుల కోసం వేర్వేరు విభాగాలుగా ఉండేందుకు లేన్ మార్కింగ్‌లు అవసరం.. కానీ నగరంలో చాలా ప్రాంతాల్లో ఇవి కనిపించడం లేదు. దీంతో డ్రైవర్లు లేన్లను మారుస్తుండటంతో బాటిల్‌నెక్స్ ఏర్పడుతున్నాయి. అందుకు తాజా ఉదాహరణ చాదర్‌ఘాట్. ఈ గుర్తులేవీ? అవసరమైన ప్రాంతాల్లో ‘స్టాప్’, ‘నో యూ టర్న్’ ‘ముందుకు స్పీడ్‌బ్రేకర్’ ఉంది వంటి హెచ్చరికలు లేవు. ఎన్నో ప్రధాన రహదారులు, జంక్షన్లలోనూ అదే దుస్థితి. జంక్షన్ల వద్ద ఏ దారి ఎటువైపు వెళ్తుందో సూచించే సైనేజీలూ (నేవిగేషన్) లేవు. ఉన్నా ప్రైవేటు ప్రకటనల్లో మూసుకుపోయాయి. దీంతో నగరానికి కొత్తగా వచ్చిన వారికి కానీ, ఇతర ప్రాంతాలకు వెళ్లే నగర ప్రజలకు కానీ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రంబుల్స్ట్రిప్స్తో ప్రమాదాలు అడ్డదిడ్డంగా ఇష్టానుసారంగా వేసిన రంబుల్‌స్ట్రిప్స్ వేగాన్ని తగ్గించేందుకు బదులు ప్రమాద హేతువులవుతున్నాయి. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు వాటిని దాటేటప్పుడు అదుపుతప్పి కింద పడిపోతున్నారు. ఓఆర్ఆర్ వంటి ప్రాంతాల్లో పెద్ద వాహనాలు సైతం అదుపు తప్పుతున్నాయి. ఎల్బీనగర్ – ఉప్పల్ మార్గంలో తరచూ ప్రమాదాలకు ఇది కూడా కారణమే. రంబుల్‌స్ట్రిప్స్ ఐఆర్సీ మార్గదర్శకాల మేరకు 10–17 మిమి ఎత్తు, 250–300 వెడల్పుతో ఉండాలి. 600 ఎంఎం గ్యాప్‌తో 6 స్ట్రిప్స్ ఉండాలి కానీ నగరంలో ఎత్తు మాత్రం పెంచారు.అవి సైతం ఎక్కడ పడితే అక్కడ కాకుండా పాదచారులు రోడ్డు దాటే మార్గాలకు ముందు, జంక్షన్ల వద్ద ఏర్పాటు చేయాలి. ‘రంబుల్‌స్ట్రిప్స్ ముందు ఉన్నాయి’ అనే సూచికలు ఉండాలి. సాఫీగా ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండాలి కానీ లోపభూయిష్ట డిజైన్లతో నడుములు విరుగుతున్నాయి.ఏం చేయాలి ? లోపాలను చక్కదిద్దడంతో పాటు నగరం విశ్వనగరంగా ఉండాలంటే ఆధునిక సాంకేతికతతో కూడిన కొత్త విధానాలు అందుబాటులోకి తేవాలి. సైనేజీలు, సూచికల వంటి వాటి ఏర్పాటుతోపాటు ప్రజలకు వాటి గురించి అవగాహన కలిగేలా నిరంతరం కార్యక్రమాలుండాలి. స్కూల్స్, హాస్పిటల్స్ ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక గుర్తులుండాలి. ‘పాదచారి దారిలో ఉన్నారు’, ఓవర్ టేక్ చేయవద్దు, స్పీడ్‌లిమిట్ వంటి సూచనలు రిఫ్లెక్లివ్ బోర్డులతో ఏర్పాటు చేయాలి. జంక్షన్ల వద్ద కౌంట్‌డౌన్ టైమర్లతో కూడిన లైన్లు, పెలికాన్ క్రాసింగ్బటన్లు ఉండాలి. రంబుల్ స్ట్రిప్స్ ఇష్టానుసారం కాకుండా అవసరమైన ప్రాంతాల్లోనే వేయాలి.చదవండి: అంతర్జాతీయ ప్రమాణాలతో హైదరాబాద్‌లో ఎకోపార్కుబస్బేస్, ఆన్‌స్ట్రీట్, ఆఫ్‌స్ట్రీట్ పార్కింగ్ ప్రాంతాలకు ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలి. ఇరుకు రోడ్లకు, డివైడెడ్ రోడ్లకు వేర్వేకు మార్కింగ్ నిబంధనలుండాలి. ఫ్లై ఓవర్లు, జంక్షన్లు, వలయాకారపు జంక్షన్లు వంటి ప్రాంతాల్లో స్పష్టంగా కనిపించే లేన్లు, మార్గదర్శక సూచనలు ఉండాలి. మలుపులున్న ప్రాంతాల్లో 15 ఎంఎం వెడల్పుతో రోడ్డుకు ఇరువైపులా తెలుపురంగు ఉండాలి. రాత్రిళ్లు కనపడేలా స్టడ్స్ ఉండాలి. సెన్సర్ ఆధారిత రంబుల్ స్ట్రిప్స్ బదులు కాలం చెల్లిన స్టాటిక్ సిస్టమ్‌నే వాడుతున్నారు. వాటిని మార్చడంతోపాటు రంబుల్ స్ట్రిప్స్ (rumble strips) లొకేషన్స్, స్థితిగతులకు సంబంధించి సెంట్రలైజ్డ్ డేటాబేస్ అవసరం. జీహెచ్ఎంసీ, ట్రాఫిక్ పోలీస్, ఆర్అండ్బీ, హెచ్‌ఎంఆర్‌ల మధ్య సమన్వయ లోపం వల్ల రోడ్డు నిబంధనలు సవ్యంగా అమలు కావడం లేదు. -
ఈ రోడ్డుపై వెళితే నడుము విరగాల్సిందే?
-
క్షమించండి అంటూ నితిన్ గడ్కరీ సంచలన వ్యాఖ్యలు... షాక్‌లో బీజేపీ
భోపాల్: కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ మధ్యప్రదేశ్‌లో నాసిరకంగా నిర్మించిన రహదారి విషయమై ప్రజలకు బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. పొరపాటు జరిగితే క్షమాపణలు కోరడానికి వెనుకడుగు వేయనని అన్నారు. ఈ మేరకు ఆయన మధ్యప్రదేశ్‌లో జబల్పూర్లోని ఒక అవార్డుల పంక్షన్లో ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన జబల్పూర్ హైవేకి 63 కి.మీ బరేలా నుంచి మండలానికి సుమారు రూ. 400 కోట్లతో నిర్మించిన రహదారి నాసిరకంగా ఉందంటూ బాధపడ్డారు. దీని గురించి అధికారులతో మాట్లాడాను. ప్రాజెక్టు నిలిపివేయడమో లేక మరమ్తతులు చేయడమో చేస్తాను లేదా కొత్త టెండర్ వేయించి మంచి రహదారి అందించేలా చూస్తానని అన్నారు. ఇప్పటి వరకు మీరంతా ఈ రహదారి కారణంగా ఎన్నో సమస్యలు, ఇబ్బందులు ఎదర్కొన్నందుకు క్షమాపణలు కోరుతున్నాను అని అన్నారు. గడ్కరీ గతంలో తన హాయాంలో మధ్యప్రదేశ్‌కి రూ. 6 లక్షల విలువైన రోడ్డు ఇస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. ఆ విషయమై భూసేకరణ, అడవుల తొలగింపు వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు కూడా. ఆ తర్వాత ఫంక్షన్ చివరిలో కాంగ్రెస్ గూర్చి అన్యూహ్యమైన వ్యాఖ్యలు చేసి బీజేపీని షాక్‌కి గురి చేశారు. ఈ మేరకు ఆ ఫంక్షన్లో మాట్లాడుతూ...2004 నుంచి 2014 మధ్య రెండు కాంగ్రెస్ ప్రభుత్వాలకు నాయకత్వం వహించిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తన ఆర్థిక సంస్కరణలతో సరికొత్త సరళీకరణకు దిశా నిర్ధేశం చేశారంటూ ప్రశంసించారు. ఈ విషయమై దేశం ఆయనకు ఎంతగానో రుణపడి ఉంటుందని కొనియాడారు గడ్కరీ. ఐతే గడ్కరీ ఒక్కోసారి చేసే వ్యాఖ్యలు బీజీపీని ఇబ్బందుల్లోకి నెడుతుంటాయి. (చదవండి: కేరళ గవర్నర్‌కు షాక్.. వర్సిటీల ఛాన్సలర్‌గా తప్పించేందుకు సిద్ధమైన సర్కార్) -
కర్ణాటక సర్కారుకు సొంతపార్టీ ఎమ్మెల్యే షాక్.. అసెంబ్లీలోనే ఫైర్
బెంగళూరు: పాడైపోయిన రోడ్లు, గుంతలు పడిన రోడ్లపై ప్రయాణం చేయడమంటే సవాలుతో కూడుకొని ఉన్నదే. ఆ దారుల్లో ప్రయాణించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. రోడ్లు సరిగా లేకపోడం కూడా రోడ్డు ప్రమాదాలకు దారితీస్తుంది. అయినా నేతలకు చీమ కుట్టిన్నట్లు కూడా ఉండదు. తాజాగా బెంగుళూరులోని రోడ్ల పరిస్థితి కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీలో చర్చకు దారితీసింది. చెడిపోయిన, గుంతలమయమైన రోడ్ల వల్ల బెంగళూరు వాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ప్రతిపక్షాలతోపాటు అధికార ఎమ్మెల్యే సైతం విమర్శలు గుప్పించారు. బెంగుళూరులో రోడ్లు అధ్వానంగా తయారయ్యాయని బీజేపీ పార్టీ ఎమ్మెల్యే మండిపడ్డారు. అయితే రాష్ట్రంలో బీజీపీ అధికారంలో ఉండగా.. సొంత పార్టీ ఎమ్మెల్యే నుంచి ప్రభుత్వంపై విమర్శలు రావడం హాట్ టాపిక్‌గా మారింది. కర్ణాటక అసెంబ్లీలో శీతాకాల సమావేశాల సందర్భంగా.. బెంగళూరుతో పాటు చుట్టు పక్కల రోడ్ల పరిస్థితి గురించి బీజేపీ ఎమ్మెల్యే అరవింద్ లింబావలి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నగరంలో రోడ్లను మెరుగు పరేచేందుకు తక్కువ నిధులు కేటాయిస్తున్నారంటూ మండిపడ్డారు. చదవండి: పెళ్లి ఊరేగింపులో అపశృతి.. తృటిలో తప్పింది లేదంటే వరుడికి.. బెంగళూరులోని మహదేవపుర నియోజకవర్గం ఎమ్మెల్యే అరవింద్ లింబావలి మాట్లాడుతూ.. తన నియోజవవర్గంలో బెంగళూరు చుట్టుపక్కల గ్రామాలను అభివృద్ధి చేసేందుకు మంజూరు చేస్తున్న ఆర్థికసాయం నిధులు సరిపోవడం లేదన్నారు. తన నియోజకవర్గంలో అత్యధిక గ్రామలు ఉన్నాయని కానీ తక్కువ నిధులు ఇచ్చారన్నారు. ఈ విషయాన్ని నేను సీఎంకు కూడా వివరించానని, రోడ్లను పునరుద్ధరిండడానికి కేవలం రూ. 1,000 కోట్లు కేటాయిస్తే సరిపోదన్నారు. వర్షాలు తగ్గడంతో బెంగళూరులో రోడ్లను పునరుద్ధరించాలని అరవింద్ లింబావలి కోరారు.. చదవండి: Sania Mistry: స్లమ్ సెన్సేషన్... ర్యాపర్ సానియా.. ఒక్కసారి వింటే! రోడ్లు వేయడం, రోడ్ల నిర్వహణలో ప్రభుత్వ సంస్థల మధ్య సమన్వయం లోపించిందని మండిపడ్డారు. బెంగళూరు నీటి సరఫరా, మురుగునీటి బోర్డు పైప్లైన్లను వేస్తోంది. బెంగళూరు ఎలక్ట్రిసిటీ సప్లై కంపెనీ లిమిటెడ్ (బెస్కామ్) కూడా రోడ్లను తవ్వుతోంది. వారి మధ్య పూర్తిగా సమన్వయం లోపించింది. వీరి మధ్య కాస్త సమన్వయం ఉంటేనే బెంగళూరు నగరం, రోడ్లు బాగుంటాయన్నారు. బెంగళూరు రోడ్ల పరిస్థితి గురించి ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో విమర్శిస్తున్నారని, దీనిపై ప్రభుత్వం తన వైఖరిని తెలియజేయాలని డిమాండ్ చేశారు. కాగా రోడ్ల పరిస్థితిపై బీజేపీ ఎమ్మెల్యేతోపాటు రోడ్డు పనులకు నిధుల మంజూరులో జాప్యంపై జేడీఎస్‌కు చెందిన దాసరహళ్లి ఎమ్మెల్యే ఆర్ మంజునాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బైటరాయణపురకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే కృష్ణ బైరేగౌడ కూడా మండిపడ్డారు. అసెంబ్లీ నియోజకవర్గాలకు నిధుల కేటాయింపులో వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. -
జీహెచ్ఎంసీ నిర్లక్ష్యంతోనే కాలు విరిగింది
-
అయ్యో.. పాపం!
పండంటి బిడ్డకు జన్మనివ్వాలని ఆ తల్లి కన్న కలలు ఆవిరయ్యాయి. భూమి మీద పడకుండానే.. లోకాన్ని చూడకుండానే బిడ్డ ప్రాణాలు కోల్పోయాడు. దీంతో తొమ్మిది నెలలు మోసిన మాతృమూర్తి ఆవేదనకు అంతులేకుండా పోయింది. ఈ ఘోరం పాడేరు మండలంలో శనివారం చోటుచేసుకుంది. రహదారి లేని కారణంగా కాలినడకన ఆస్పత్రికి వెళ్లే ప్రయత్నంలో బిడ్డ చనిపోయి జన్మించాడు. ఇలాంటి సంఘటనలు మన్యంలో తరచూ జరుగుతున్న పాపానికి గత పాలకుల నిర్వాకమే కారణమని ప్రజలు మండిపడుతున్నారు. సాక్షి, పాడేరు రూరల్ : మన్యంలో గర్భిణులకు ప్రసవ వేదన తప్పడం లేదు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా గిరిజనులు నేటికీ కష్టాలను అనుభవిస్తున్నారు. కనీస రోడ్డు రవాణా సౌకర్యాలు లేకపోవడం వీరికి శాపంగా మారింది. దీంతో కొన్నాళ్లుగా మన్యంలో మాతాశిశు మరణాలు ఆగటం లేదు. తాజాగా పాడేరు మండలం వై.సంపలలో గర్భిణి వంతాల జ్యోతి ప్రసవ వేదనకి గురై ప్రసవ సమయంలో తన బిడ్డను కోల్పోవలసి వచ్చింది. వంతాల జ్యోతి నాలుగోసారి గర్భం దాల్చింది. నెలలు నిండడం శనివారం పురిటినొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు మినుములూరు పీహెచ్సీ, ఏఎన్ఎం పద్మకు సమాచారం ఇచ్చారు. అయితే వై.సంపల గ్రామానికి కనీస రహదారి సౌకర్యం లేదు. దీంతో జ్యోతిని ఆస్పత్రికి తరలించేందుకు కుటుంబ సభ్యులు అష్టకష్టాలు పడ్డారు. డోలిలో తరలించేందుకు కూడా రహదారి సరిగ్గా లేదు. అలాగే చేతిలో డబ్బులు కూడా లేని పరిస్థితి. దీంతో చేసేది లేక కుటుంబ సభ్యులు నిండు గర్భిణి జ్యోతిని అడవి మార్గం మీదుగా కాలినడకన పాడేరు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలో ఆమె మగబిడ్డను ప్రసవించింది. కానీ కాలినడకన సుమారు 5 కిలోమీటర్ల మేర నడవడంతో బిడ్డ చనిపోయి పుట్టాడు. రోడ్డు లేకపోవడంతో అంబులెన్స్ కూడా సగం వరకూ వెళ్లి ఆగిపోయింది. ఏఎన్ఎం పద్మ అక్కడకు వెళ్లి వైద్య సేవలందించారు. గత పాలకులు తమ గ్రామానికి రోడ్డు నిర్మంచలేదని వై.సంపల వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మన్యంలో మాతాశిశు మరణాల్లో కొన్ని... - అనంతగిరి మండలంలో గత ఐదు రోజుల వ్యవధిలో ఐదుగురు శిశులు, ఒక గర్భిణి ప్రాణాలు కోల్పోయారు. -రెండు రోజుల క్రితం పాడేరు మండలం లగిసపల్లి గ్రామానికి చెందిన మూడు నెలల శిశువు మృతి చెందింది. -గత 10 రోజుల వ్యవధిలో పాడేరు, జి.మాడుగుల, పెదబయలు, డుంబ్రిగూడ, అనంతగిరి, మండలాల్లో తొమ్మిది మంది శిశువులు, ఐదుగురు గర్భిణులు మృత్యువాత పడ్డారు. -
చెత్త రోడ్లతో 10 వేల మందికి పైగా మృతి!
న్యూఢిల్లీ: దేశంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో చాలా వరకు అస్తవ్యస్తంగా ఉన్న రోడ్లే కారణమౌతున్నాయి. రోడ్డు ప్రమాదాలపై ఉపరితల రవాణాశాఖ ఇటీవల వెల్లడించిన నివేదికలో.. 2015లో సంభవించిన రోడ్డు ప్రమాద మరణాల్లో 10,727 మంది కేవలం రోడ్లు సరిగా లేకపోవటం వల్ల మృతిచెందారని వెల్లడించింది. అంతకు ముందు సంవత్సరంలో పోల్చితే ఈ మరణాల సంఖ్య కొంత తగ్గినట్లు నివేదిక చెబుతున్నా.. రోడ్లపై గుంతలు, స్పీడ్ బ్రేకర్లు, నిర్మాణంలో ఉన్న రోడ్లతో పదివేల మందికి పైగా ప్రజలు మృత్యువాతపడటం కలవరపెడుతోంది. రోడ్లపై గుంతల కారణంగానే 3,415 మంది మృతిచెందారని నివేదిక పేర్కొంది. ఈ తరహా మరణాలు మహారాష్ట్రలో ఎక్కువగా సంభవిస్తున్నాయని నివేదిక తెలిపింది. కాగా.. దేశ రాజధాని ఢిల్లీలో రోడ్లపై గుంతల కారణంగా మరణించిన వారి సంఖ్య తక్కువగా రెండుగా నమోదైంది. అయితే.. దేశంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో చాలా వరకు రిపోర్ట్ కాకుండా ఉంటున్నాయని, ప్రమాదాలకు గల స్పష్టమైన కారణంపై సరైన విచారణ కూడ జరగటం లేదని ట్రాన్స్పోర్ట్ రీసెర్చ్ విభాగం మాజీ అధికారి ఆశిష్ కుమార్ వెల్లడించారు. -
పల్లెల్లో అధ్వానంగా రోడ్లు
సంగం : మండలంలోని కోలగట్ల, తిరుమనతిప్ప, పెరమన, దువ్వూరు, పలు గ్రామాల్లోని అంతర్గత రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఎక్కువగా దళితవాడల్లో రోడ్లు దెబ్బతిని బురదమయమై ఉన్నాయి. దళితులు బురద రోడ్ల మీదనే నడుస్తూ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. రెండేళ్ల పాలనలో ప్రభుత్వం గ్రామీణ రోడ్లపై దష్టి పెట్టకపోవడంతో చిన్నపాటి వర్షానికే రోడ్లు జలమయం అవుతున్నాయి. ఈ రోడ్లపై గ్రామీణ ప్రాంత ప్రజలు తిరగలేక ఇబ్బందులు పడుతున్నారు. రైతులు సైతం అంతర్గత రోడ్లు దెబ్బతినడంతో పొలాలకు రసాయనిక ఎరువులు తీసుకెళ్లలేక ఇబ్బందులు పడుతున్నారు. జెండాదిబ్బ, అనసూయనగర్, దువ్వూరు, అరవపాళెం, పడమటిపాళెం గ్రామాల్లో ప్రజలు ఎక్కువగా కూరగాయలు, ఆకుకూరలు సాగుచేస్తున్నారు. పొలంలో నుంచి ప్రతినిత్యం పంటను నెల్లూరు మార్కెట్‌కు తరలించాల్సి ఉంటుంది. రోడ్లు దెబ్బతిని బండ్లు నడవలేకపోవడంతో ట్రాక్టర్లపై ఆధారపడాల్సి వస్తుందని సన్నకారు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎద్దల బండ్లపై పంటను తీసుకెళ్తే ఖర్చు తక్కువ. ట్రాక్టర్లపై తీసుకెళ్తే తడిసిమోపెడవుతోంది. రోడ్లు సరిగా లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఎక్కువ డబ్బులు ఇచ్చి ట్రాక్టర్ల ద్వారా పంటను తరలిస్తున్నామని రైతులు వాపోతున్నారు. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు దెబ్బతిన్న విషయాన్ని పలువురు సర్పంచులు అధికారుల దష్టికి తీసుకెళ్లారు. పలుమార్లు అర్జీలు సైతం సమర్పించారు. అయినా పరిస్థితిలో ఏమాత్రం మార్పురాలేదు. ఉన్నతాధికారులు స్పందించి గ్రామీణ ప్రాంతాల్లో ఛిద్రమైన రోడ్లకు మరమ్మతులు చేయాలని ప్రజలు, సన్నకారు రైతులు కోరుతున్నారు. నివేదికలు పంపాం : మల్లికార్జున, పంచాయతీరాజ్ ఏఈ మండలంలో పలు గ్రామాల్లో రోడ్లు మరమ్మతులకు గురయ్యాయి. వాటిని మరమ్మతులు చేసేందుకు నివేదికలు పంపాం. అనుమతి రాగానే పనులు ప్రారంభిస్తాం.