breaking news
Arcades care
-
రాతి శిథిలం..అద్భుత తోరణం
సాక్షి, హైదరాబాద్ : రెండేళ్ల క్రితం.. ముళ్ల పొదలు.. మట్టి దిబ్బలు.. వాటిలోంచి కొద్దిగా బయటకు కనిపిస్తున్న రాళ్లు.. తరచి చూస్తే రాతి శిల్పాలు.. మరికాస్త శోధిస్తే పురాతన తోరణం ఆనవాళ్లు. ఇప్పుడు.. ఠీవిగా, గంభీరంగా నిలుచున్న భారీ తోరణం. ఇంజనీరింగ్ నైపుణ్యంతో తిరిగి ప్రాణ ప్రతిష్ట పొందిన పురాతన సంపద. కాకతీయుల కంటే ముందునాటి ఈ తోరణం.. వరంగల్ సమీపంలోని చారిత్రక ఐనవోలు మల్లికార్జునస్వామి దేవాలయం ముందు ఉంది. పురావస్తుశాఖ అధికారులు, వరంగల్ నిట్ ఇంజనీరింగ్ నిపుణులు ఈ తోరణాన్ని తిరిగి నిర్మించారు. ఇనుప కడ్డీలతో.. తోరణం రెండు స్తంభాలు విరిగి ఉండటంతో ఇనుప కడ్డీలతో జోడించారు. రాతి ముక్కల్లో రంధ్రాలు చేసి.. వాటిలోకి ఇనుపకడ్డీలను దూర్చారు. రంధ్రాలను ఎరల్‌డైట్ మిశ్రమంతో నింపి.. రాతి ముక్కలను జోడించారు. కొన్ని రాతి ముక్కలు లభించకపోవడంతో.. అలాంటివి తెప్పించి కలిపారు. మొత్తంగా ఎక్కడా సిమెంటు వాడకుండా తోరణాన్ని పునరుద్ధరించడం గమనార్హం. ఓరుగల్లు తోరణాల కంటే కొంత చిన్నగా.. ఓరుగల్లు తోరణాలు 40 అడుగుల కంటే ఎత్తు ఉండగా.. ఐనవోలు తోరణాలు 30 అడుగుల ఎత్తు ఉన్నాయి. ఓరుగల్లు తోరణాల పైభాగంలో రెండు చివరల్లో హంస ఆకృతి ఉండగా.. వీటిలో లేదు. వేలాడుతున్న కలశాల ఆకృతులు మాత్రం ఉన్నాయి. ఇక శిల్ప నైపుణ్యం, నగిషీలు కొంత తక్కువగా ఉన్నాయి. పురాతన ఆలయమిది ఐనవోలు మల్లికార్జునస్వామి దేవాలయ ప్రస్తావన క్రీస్తుశకం 1007 నాటి నుంచే ఉంది. పున్నాల శాసనంలో దీని ప్రస్తావన కనిపించింది. క్రీస్తుశకం 1118 నాటి విక్రమాదిత్య శాసనం, 1163 నాటి రుద్రదేవుడి శాసనం, 1369 నాటి రేచర్ల వెలమరాజు అనపోతనాయకుడి శాసనాల్లోనూ ఈ ఆలయ ప్రస్తావన ఉంది. అంటే ఆలయ నిర్మాణ సమయానికి కాస్త అటూఇటుగా ఈ తోరణాలు ఏర్పాటు చేసి ఉంటారని చరిత్రకారులు పేర్కొంటున్నారు. ఓరుగల్లు తోరణాల కంటే ముందే.. వరంగల్ కోటలో ఆనాటి వైభవానికి సాక్ష్యంగా భాసిల్లుతున్న కాకతీయ తోరణాలు అందరికీ తెలిసినవే. అప్పట్లో అక్కడ పెద్ద శివాలయం ఉండేదని, దానికి నాలుగువైపులా ద్వారాలుగా తోరణాలు ఏర్పాటు చేశారని చారిత్రక ఆనవాళ్లు చెబుతున్నాయి. అదే తరహాలో అంతకన్నా వందేళ్ల ముందు అంటే క్రీస్తుశకం 1000వ సంవత్సరం సమయంలో.. ఐనవోలులో మల్లికార్జునస్వామి దేవాలయాన్ని నిర్మించినట్లు అంచనా. ఈ దేవాలయానికి తూర్పు, దక్షిణ, ఉత్తర దిశల్లో మూడు ద్వారాలున్నాయి. వాటికి ఎదురుగా తూర్పు, దక్షిణ దిశల్లో రెండు తోరణాలు ఉన్నాయి. ఉత్తర ద్వారంవైపు మాత్రం తోరణం లేదు. కానీ 2016లో స్థానికులు మట్టిదిబ్బలు, ముళ్ల పొదల్లో ఆ తోరణానికి సంబంధించిన శిథిలాలను గుర్తించారు. దానికి పునర్వైభవం తేవాలని నిర్ణయించిన పురావస్తుశాఖ సంచాలకురాలు విశాలాచ్చి.. వరంగల్ నిట్ మాజీ ప్రొఫెసర్ పాండురంగారావు, ప్రస్తుత ప్రొఫెసర్ల సహాయంతో తోరణాన్ని తిరిగి నిర్మించారు. -
మోడల్ గోశాలగా మారుస్తాం
గోవు మాతృమూర్తితో సమానం గో ఆధారిత వ్యవసాయమే ఉత్తమమార్గం మంత్రి మాణిక్యాలరావు తిరుపతి తుడా : టీటీడీ ఆధ్వర్యంలో న డుస్తున్న ఎస్వీ గో సంరక్షణ శాలను మో డల్ గోశాలగా మార్చేందుకు చర్యలు చేపడుతున్నామని దేవాదాయ ధర్మాదాయశాఖ మంత్రి మాణిక్యాలరావు తెలిపారు. గో వ్యవసాయ ఆరోగ్య విజ్ఞాన కేంద్రం ఆదివారం తిరుపతి ఎస్వీ గో సంరక్షణశాలలో ఏపీ గో శాలల నిర్వహణ ప్రతినిధుల సదస్సు నిర్వహిం చింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మం త్రి మాణిక్యాలరావు మాట్లాడుతూ దేశీ య గోవుల నిర్వహణ, సంరక్షణ లక్ష్యం గా మోడల్ గోశాలగా తీర్చిదిద్దనున్నట్టు చెప్పారు. ఇక్కడ నుంచి ఇతర గో సంరక్షణ శాలలకు విస్తరింపవచ్చన్నారు. దేశీయ గోవుల సంరక్షణతోపాటు పునరుత్పత్తి, వ్యర్థాలతో ఔషధాల తయారీ సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు చర్యలు చేపట్టాలని టీటీడీ అధికారులకు సూచించారు. తిరుమలకు వచ్చే భక్తులు మోడల్ గోశాలను సందర్శించే విధంగా రూపురేఖలు మారుతాయన్నారు. హిం దూ సనాతన ధర్మంలో గోవును మాతృమూర్తితో సమానంగా భావిస్తారన్నారు. ఈ విషయాన్ని ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లాలని సూచించారు. గో ఆధారిత వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడం ద్వారా ఉత్తమమైన దిగుబడులు సాధించవచ్చన్నారు. అంతకు ముందు జేఈవో భాస్కర్‌తో కలిసి మంత్రి గో పూజ చేశారు. అనంతరం గోవులకు దాణా తినిపించారు. ఎగ్జిబిషన్‌ను సందర్శించారు. ఈ కార్యక్రమంలో చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, తిరుపతి జేఈవో పోలా భాస్కర్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్‌రెడ్డి, ఎస్వీ గో సంరక్షణశాల డెరైక్టర్ హరినాథరెడ్డి, బీజేపీ నేత సామంచి శ్రీనివాస్, ఏపీ గో సంరక్షణ శాలల ని ర్వాహకులు కుమారస్వామి, సుబ్బరాజు, దామోదర్ పాల్గొన్నారు. వకుళామాత ఆలయానికి జీర్ణోద్ధరణ తిరుపతి రూరల్: వేంకటేశ్వరస్వామి తల్లి వకుళామాత ఆలయానికి త్వరలో జీర్ణో ద్ధరణ చేస్తామని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు తెలిపారు. తిరుపతికి సమీపంలోని పేరూరు బండపై ఉన్న వకుళామాత ఆలయాన్ని ఆదివారం ఆయన సందర్శించారు. మైనింగ్ వల్ల దుస్థితికి చేరిన ఆలయాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆలయాలు దేశ సంస్కృతి, సంప్రదాయాలకు ఆనవాళ్లన్నారు. కొందరు స్వార్థపరులు స్వాలాభం కోసం ఆలయాలను ధ్వంసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వేలకోట్ల సంపద ఉన్న శ్రీవారి తల్లి కొలువైన ఆలయం శిథిలావస్థకు చేరటం సమాజానికి మంచిదికాదన్నారు. అందుకే వకుళామాత ఆలయాన్ని త్వరలోనే జీర్ణోద్ధరణ చేసి భక్తులందరూ దర్శించుకునేలా చేస్తామని చెప్పారు. నిలదీసిన స్థానికులు వకుళమాత ఆలయం వద్ద పాత కాల్వ సర్పంచ్ మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో స్థానికులు మంత్రి మణిక్యాలరావుని నిలదీశారు. ఎన్నో ఏళ్లుగా బండనే నమ్ముకుని జీవిస్తున్న స్థానికులకు ఉపాధి చూపిన తర్వాత జీర్ణోద్ధరణ కోసం రాయిని కదపాలని డిమాండ్ చేశారు. 4 ఏళ్లుగా ఉపాధి లేక కుటుంబాలు వలస వెళ్లే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇదంతా ప్రజా ప్రతినిధులు, అధికారులు, స్వామీజీల మాయమాటలు వల్లేనని కన్నీరు పెట్టుకున్నారు. దీంతో జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి ఉపాధి కల్పిస్తానని మంత్రి జారుకున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు భానుప్రకాష్‌రెడ్డి, సామంచి శ్రీనివాస్, కోలా భాస్కర్, వరప్రసాద్, గోపి, జాషువా, సర్పంచ్ మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.