3 వేల మంది అరెస్ట్
ఢాకా: బంగ్లాదేశ్ ప్రభుత్వం ఉగ్రవాదులు, నేరస్తులపై ఉక్కుపాదం మోపుతోంది. శుక్ర, శనివారాల్లో దేశవ్యాప్తంగా 37 మంది మిలిటెంట్లు సమారు 3 వేల మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
మైనారిటీలు, లౌకికవాద రచయితలపై దాడుల నేపథ్యంలో ఇస్లాం తీవ్రవాదులపై చర్యల్లో భాగంగా వీరిని నిర్బంధంలోకి తీసుకున్నారు. ప్రతి హంతకుడినీ పట్టుకుని తీరతామని ప్రధానమంత్రి షేక్ హసీనా ప్రతినబూనారు.