breaking news
anthapuram TDP
-
పార్టీ నేతలకు చంద్రబాబు వార్నింగ్!
-
పార్టీ నేతలకు చంద్రబాబు వార్నింగ్!
విజయవాడ: అనంతపురం జిల్లా టీడీపీ నేతలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు క్లాస్ తీసుకున్నారు. పార్టీలో క్రమశిక్షణ ముఖ్యమని, బహిరంగ విమర్శలు చేస్తే క్షమించేది లేదంటూ వార్నింగ్ ఇచ్చారు. అనంతపురం జిల్లా టీడీపీ నేతలతో శనివారం చంద్రబాబు సమావేశమయ్యారు. కదిరి, రాప్తాడులో పార్టీలో వర్గపోరుపై ఆయన దృష్టి సారించారు. ఎమ్మెల్యే చాంద్ బాషా, కందికుంట వెంకటప్రసాద్ లు పార్టీ అధినేత చంద్రబాబు ఎదుటే ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకున్నారు. మంత్రి పరిటాల సునీత, వరదాపురం సూరి విభేదాలపై ఈ సమావేశంలో సెటిల్ మెంట్ చేసినట్లు సమాచారం. ఒకరి నియోజకవర్గంలో మరొక నేత జోక్యాన్ని సహించేది లేదని పార్టీ నేతలను హెచ్చరించారు. తనపై పార్టీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి బహిరంగంగా చేస్తున్న వ్యాఖ్యలపైనా చంద్రబాబు నాయుడు ఈ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది.