breaking news
Agricultural insurance company
-
పంటల బీమా..రైతుకు ధీమా
మన దేశ జనాభాలో 47% మంది వ్యవసాయ కార్యకలాపాలలో నిమగ్నమై ఉన్నారు, ఇది భారతదేశ జిడిపిలో దాదాపు 20%కు దోహదం చేస్తుంది. అయితే బీమా వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలియక పోవటం వల్ల బీమా పొందిన వారి సంఖ్య వ్యవసాయం మీద ఆధారపడిన వారి సంఖ్యకు తగ్గట్టుగా లేదు.. మరోవైపు వ్యవసాయం అనేది ఏ కాలంలో అయినా అనిశ్చిత ఆర్థిక చర్యగానే ఉంటుంది. ఇది చాలా వరకూ రైతు నియంత్రణకు అందనిదే, వ్యవసాయం అంటే...ఊహాతీత వాతావరణం, తెగుళ్లు, వ్యాధులపై ఆధారపడి ఉంటుంది. చాలా తక్కువ లేదా ఎక్కువ, తగినంత కానీ సమయానుకూలం కాకుండా.సంభవించే వర్షం, ఎండ లేదా చలి కూడా పంటలను నాశనం చేస్తాయి. వీటన్నింటినీ తట్టుకుంటూనే తుఫానులు, భూకంపాలు, కొండచరియలు విరిగిపడటం, వడగండ్ల వానలు తదితర ప్రకృతి వైపరీత్యాల సమయంలో కూడా రైతులు మనకు ఆహారం అందించటానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. రానుంది ఖరీఫ్...కావాలి రిలీఫ్...ఈ నేపధ్యంలో... మనం ఖరీఫ్ సీజన్లోకి వెళుతున్న వేళ, రైతులు తమ జీవనోపాధిపై ప్రభావం చూపే అనిశ్చితి పరిస్థితులు నుంచి తమను తాము రక్షించుకోవడం అత్యంత ముఖ్యం. తద్వారా వారు అప్పుల బారిన పడకుండా ఉండడం, పేదరికం లోకి జారిపోకుండా నిలవటం కూడా అత్యవసరమే. దీనికోసం పంట బీమాను ఎంచుకోవడం అత్యంత ఉత్తమమైన ఆర్థికపరమైన ఎంపికలలో ఒకటిగా నిలుస్తుంది. అనుకోని ప్రమాదాల కారణంగా అనిశ్చితి వాతావరణం కారణంగా పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించడం ద్వారా ఇది రైతులకు ఆర్థికంగా ఒక రక్షణ వలయాన్ని అందిస్తుంది. ఆధునిక వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహిస్తూ వారి ఆదాయాన్ని కూడా పంటల బీమా స్థిరీకరిస్తుంది. ప్రప్రధమ పంట బీమా ఉత్పత్తి అయిన క్షేమ సుకృతి వంటి బీమా పధకాలు ఎకరానికి రూ. 499 నుండి ప్రారంభం అవుతున్నాయి. రైతులకు తగినంత శక్తిని తిరిగి అందించేలా 100కు పైగా ఎక్కువ పంటలను రక్షించే పంట బీమా పథకాలు ఉన్నాయి. రైతులు తమ పంటలకు ముందుగా నిర్ణయించిన తొమ్మిది ప్రమాదాల జాబితా నుంచి ఒక పెద్ద, ఒక చిన్న ప్రమాదాల కలయికతో బీమాను ఎంచుకోవచ్చు. వాతావరణం, ప్రాంతం, వారి పొలం స్థానం, చారిత్రక నమూనా మొదలైన వాటి ఆధారంగా తమ పంటను ఎక్కువగా ప్రభావితం చేసే పలు విపత్తుల నుంచి రైతులకు ఇవి భరోసా అందిస్తాయి.రెండు రోజుల్లోనే...చెల్లింపులు...తుఫాను, ఉప్పెన (హైడ్రోఫిలిక్ పంటలకు వర్తించదు), వరదలు, వడగళ్ల వాన వంటి విపత్తులు భూకంపం, కొండచరియలు విరిగిపడడం, మెరుపుల కారణంగా మంటలు, జంతువుల దాడి (కోతి, కుందేలు, అడవి పంది, ఏనుగు) విమానాల వల్ల కలిగే స్వల్ప నష్టాలు సైతం కవర్ చేసే విధంగా బీమా అందుబాటులో ఉంటుంది.రైతులు తమ ఆర్థిక ప్రయోజనాలను కాపాడుకోవడానికి అదనపు ప్రీమియం చెల్లించడం ద్వారా బీమా మొత్తాన్ని పెంచుకునే అవకాశం కూడా ఉంది. ఒక రైతు క్షేమ యాప్‌లో నమోదు చేసుకోవడం ద్వారా బీమాను కొనుగోలు చేయవచ్చు. పాలసీ వివరాలు దెబ్బతిన్న పంట ఫోటోలు లేదా వీడియోలను అప్లోడ్ చేయడం ద్వారా క్లెయిమ్స్ కూడా యాప్ ద్వారా చేయవచ్చు . గత డిసెంబర్లో మైచాంగ్ తుఫాను వల్ల తన పంట నాశనమైందని, ఆంద్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాకు చెందిన ఒక రైతు క్లెయిమ్ చేసిన రెండు రోజులలోపు తన బీమా మొత్తం స్వీకరించగలగడం పంటల బీమా ఇచ్చే భధ్రతకు నిదర్శనం. -
3 ప్రైవేటు కంపెనీలకు పంటల బీమా
బజాజ్ అలియాంజ్, రిలయన్స్ జీఐసీ, ఎస్బీఐ జీఐసీలకు అప్పగింత {పభుత్వ ఆధ్వర్యంలోని వ్యవసాయ బీమా కంపెనీకి కూడా అనుమతి పీఎంఎఫ్‌బీవై అమలు ఖరారు... వ్యవసాయశాఖ ఉత్తర్వులు జారీ 3 జిల్లాల్లో వరికి 1.5% ప్రీమియం, ఒక జిల్లాలో వరికి 1.3% ప్రీమియం వాతావరణ ఆధారిత పంటల బీమా ప్రైవేటు కంపెనీలకే అప్పగింత హైదరాబాద్: ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై), వాతావరణ ఆధారిత పంటల బీమా (డబ్ల్యుబీసీఐఎస్) పథకాలను రాష్ట్రంలో అమలు చేసేందుకు 3 ప్రైవేటు కంపెనీలకు అనుమతించారు. పీఎంఎఫ్‌బీవైను కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని వ్యవసాయ బీమా కంపెనీ (ఏఐసీ) సహా బజాజ్ అలియాంజ్ జీఏసీ లిమిటెడ్ ద్వారా అమలు చేస్తారు. డబ్ల్యుబీసీఐఎస్ పథకాన్ని రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, ఎస్బీఐ జీఐసీ లిమిటెడ్‌ల ద్వారా అమలు చేయనున్నారు. ఈ మేరకు వ్యవసాయశాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. తొలిసారిగా వ్యవసాయ బీమా రంగంలోకి ప్రైవేటు కంపెనీలు ప్రవేశించాయి. రాష్ట్ర వ్యవసాయ శాఖ, కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన పీఎంఎఫ్‌బీవై సహా ఇప్పటికే ఉన్న డబ్ల్యుబీసీఐఎస్ పథకాల అమలుకు ఇటీవల ప్రైవేటు బీమా కంపెనీల నుంచి టెండర్లకు ఆహ్వానించింది. 10 ప్రైవేటు బీమా కంపెనీలు బిడ్లు దాఖలు చేశాయి. బిడ్లను ఖరారు చేసి సర్కారుకు పంపించారు. రాష్ట్రంలో వ్యవసాయ బీమాను అమలుచేసేందుకు అనుమతి పొందిన ఈ కంపెనీలు వచ్చే ఖరీఫ్‌లో రుణం తీసుకునే రైతులతోపాటు రుణం తీసుకోని రైతులకూ సేవలందించాలి. ఆ ప్రకారం నిర్ణీత మొత్తంలో ప్రీమియం వసూలు చేయాలి. పీఎంఎఫ్‌బీవై అమలుకు 3 క్లసర్ల ఏర్పాటు పీఎంఎఫ్‌బీవై అమలుకోసం రాష్ట్రంలో 3 క్లస్టర్లను ఏర్పాటు చేసినట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మొదటి క్లస్టర్‌లోని మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ సహా మూడో క్లస్టర్లో ఉన్న ఖమ్మం, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో ఈ పథకాన్ని వ్యవసాయ బీమా కంపెనీ అమలు చేయనుంది. రెండో క్లస్టర్లో ఉన్న వరంగల్, కరీంనగర్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో బజాజ్ అలియాంజ్ అమలు చేయనుంది. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లోని రైతులు వరి పంటకు బీమా మొత్తంలో 1.5 % ప్రీమియంగా చెల్లించాలి. రంగారెడ్డి జిల్లా రైతులు వరికి 1.3% ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది. వరంగల్ జిల్లాలోని రైతులు జొన్నకు ప్రీమియం 1% చెల్లించాలి. కరీంనగర్ జిల్లా రైతులు పసుపుకు 1.8%, మహబూబ్‌నగర్ జిల్లా రైతులు మిరప (సాగు ఏరియా)కు 4 % ప్రీమియంగా చెల్లించాలని ఉత్తర్వుల్లో వివరించారు. నిర్ణీత జిల్లాల్లో నోటిఫైడ్ పంటలకు రుణాలు తీసుకునే రైతులు తప్పక పీఎంఎఫ్‌బీవై పథకానికి ప్రీమియం చెల్లించాలి. పత్తి, మిరప, పామాయిల్, బత్తాయిలకు 5 శాతం ప్రీమియం... డబ్ల్యుబీసీఐఎస్ పథకాన్ని కూడా 3 క్లస్టర్ల వారీగా అమలుచేస్తారు. మొదటి క్లస్టర్‌లోని మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ దీన్ని అమలుచేస్తుంది. క్లస్టర్ రెండులోని వరంగల్, కరీంనగర్, మహబూబ్‌నగర్ జిల్లాలు, మూడో క్లస్టర్‌లోని ఖమ్మం, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో ఎస్బీఐ జీఐసీ లిమిటెడ్ కంపెనీ బీమా పథకాన్ని అమలు చేస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పత్తికి అన్ని జిల్లాల్లోనూ బీమా వర్తింపజేస్తారు. మిరపకు ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో బీమా వసతి కల్పించారు. పామాయిల్‌కు ఖమ్మం జిల్లాలో, బత్తాయికి నల్లగొండ జిల్లాలో బీమా వసతి కల్పించారు. వీటన్నింటికీ బీమా మొత్తంలో 5% ప్రీమియంగా ఖరారు చేశారు. ఆ మేరకు రైతులు చెల్లించాలి. ఈ పథకాన్నీ రుణం తీసుకునే రైతులకు తప్పనిసరి చేయగా... రుణం తీసుకోని రైతులకు వారిష్టానికే వదిలేశారు. మిరపకు జూలై 9వ తేదీ, పత్తికి జూన్ 14, పామాయిల్‌కు జూలై 14, బత్తాయికి ఆగస్టు 9 ప్రీమి యం చెల్లింపుకు ఆఖరి తేదీగా నిర్ణయించారు.