Photo Gallery
-
Tirupati: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. నిన్న (బుధవారం) 65,570 మంది స్వామివారిని దర్శించుకోగా 24,446 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ. 3.53 కోట్లు సమర్పించారు. టైమ్ స్లాట్ (SSD) దర్శనానికి 4 గంటల సమయం పడుతుంది 7 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు . దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 12 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. -
Singapore Squash Open 2023: సౌరవ్ పరాజయం
న్యూఢిల్లీ: సింగపూర్ ఓపెన్ అంతర్జాతీయ స్క్వాష్ టోర్నమెంట్ నుంచి భారత స్టార్ సౌరవ్ ఘోషాల్ నిష్క్రమించాడు. సింగపూర్‌లో గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్ మ్యాచ్‌లో సౌరవ్ 3–11, 7–11, 10–12తో నాలుగో సీడ్ ముస్తఫా అసల్ (ఈజిప్ట్) చేతిలో ఓడిపోయాడు. భారత్‌కే చెందిన మరో ప్లేయర్ రమిత్ టాండన్ 3–11, 2–11, 4–11తో రెండో సీడ్ డీగో ఇలియాస్ (పెరూ) చేతిలో పరాజయం పాలయ్యాడు. తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో సౌరవ్ 11–6, 7–11, 11–6, 11–5తో టాడీ హారిటి (అమెరికా)పై, రమిత్ 11–7, 12–10, 12–10తో రోరీ స్టీవర్ట్ (స్కాట్లాండ్)పై గెలుపొందారు. -
ఆనంద్ దేవరకొండ సినిమాకు హీరోయిన్గా ప్రగతి.. బేబీకి నో ఛాన్స్
బేబీ సినిమా సక్సెస్‌తో ఆనంద్ దేవరకొండకు వరుస సినిమా అవకాశాలు క్యూ కట్టాయి. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ఇండస్ట్రీలో ఆనంద్ మార్కెట్ కొంతమేరకు పెరిగింది. ఇప్పటికే తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నిర్మాత జ్ఞానవేల్ రాజాతో ఒక చిత్రానికి ఆనంద్ సంతకం చేశాడు. ఈ సినిమాను ఏఆర్ మురుగదాస్ టీమ్ నుంచి ఒక కొత్త డైరెక్టర్ ఈ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించనున్నాడట. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ సినిమాకు హీరోయిన్గా సోషల్ మీడియాలో పాపులర్ అయిన ఢిల్లీ బ్యూటీ ప్రగతి శ్రీవాస్తవను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ బ్యూటీ శ్రీకాంత్ అడ్డాల ‘పెద్ద కాపు’తో తన జర్నీని స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. రెండు పార్టులుగా వస్తున్న ఈ సినిమా మొదటి భాగం విడుదల కోసం ఆమె ఎదురుచూస్తోంది. ఇది విడుదల కాకముందే ఈ బ్యూటీకి మరో క్రేజీ సినిమాను కైవసం చేసుకోవడం ఆహ్వానించదగ్గ పరిణామం. త్వరలో ప్రారంభం కానున్న ఈ ప్రాజెక్ట్‌లోకి ఆనంద్ దేవరకొండతో పాటు ప్రగతి శ్రీవాస్తవ కూడా అడుగుపెట్టబోతుంది. (ఇదీ చదవండి: అతను అలా ప్రవర్తించినా త్రిష భరించింది.. ఎందుకంటే: సినీ నటి) బేబీ సినిమా తర్వాత సినిమాల ఎంపిక విషయంలో ఆనంద్ దేవరకొండ మరింత జాగ్రత్త పడుతున్నాడని చెప్పవచ్చు. ఈ సినిమాతో పాటు మైత్రీ మూవీ మేకర్స్‌తో కూడా ఆయన డీల్ కుదుర్చుకున్నాడు. ఆనంద్ జ్ఞానవేల్ రాజా, మైత్రీ మూవీ మేకర్స్ లాంటి రెండు పెద్ద ప్రొడక్షన్స్లలో ఆనంద్‌కు ఒకేసారి ఛాన్స్ దక్కడంతో ఆయన ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. కానీ బేబీ సినిమా తర్వాత వైష్ణవి చైతన్యతో ఆనంద్ మరో సినిమా తీస్తున్నట్లు ప్రచారం జరిగింది. దీనిని బట్టి చూస్తే అందులో నిజం లేదని తెలుస్తోంది. ఒక సినిమాకు హీరోయిన్గా ప్రగతి శ్రీవాస్తవ ఎంపిక దాదాపు జరిగిపోయింది. ఇక మిగిలి ఉండేది మైత్రీ మూవీ మేకర్స్ మాత్రమే ... అందులోనైనా ఆమెకు అవకాశం దక్కుతుందేమో వేచి చూడాలి. బేబీ సినిమా హిట్ కావడం వెనుక వైష్ణవి చైతన్య నటన ఎంతో బలం చేకూర్చింది. కానీ ఆ సినిమా తర్వాత ఆమెకు ఇప్పటి వరకు ఒక్క అవకాశం కూడా రాలేదు. -
నేను దిగితే మిగిలేదుండదు!
రామ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాకు ‘స్కంద’ అనే టైటిల్ ఖరారు చేశారు. ‘ది ఎటాకర్’ అనేది ఉపశీర్షిక. ఈ చిత్రంలో రామ్ సరసన శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్నారు. సోమవారం ‘స్కంద’ టైటిల్ గ్లింప్స్‌ను విడుదల చేశారు చిత్రయూనిట్. ‘మీరు (సినిమాలో రౌడీలను ఉద్దేశిస్తూ..) దిగితే ఊడేదుండదు... నేను దిగితే మిగిలేదుండదు..’ అంటూ రామ్ చెప్పే డైలాగ్‌తో ఈ గ్లింప్స్ విడుదలైంది. జీ స్టూడియోస్, పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సెప్టెంబర్ 15న విడుదల కానుంది. ఈ సినిమాకు సంగీతం: తమన్ , కెమెరా: సంతోష్ డిటాకే.