వీడియోకాన్... 3జీ కాలింగ్ ట్యాబ్లెట్ | Videocon launches 3G-calling tablet at Rs 8,999 | Sakshi
Sakshi News home page

వీడియోకాన్... 3జీ కాలింగ్ ట్యాబ్లెట్

Nov 15 2013 2:58 AM | Updated on Sep 2 2017 12:36 AM

వీడియోకాన్... 3జీ కాలింగ్  ట్యాబ్లెట్

వీడియోకాన్... 3జీ కాలింగ్ ట్యాబ్లెట్

వీడియోకాన్ గ్రూప్‌కు చెందిన వీడియోకాన్ మొబైల్ ఫోన్స్ కంపెనీ 3జీ కాలింగ్ ట్యాబ్లెట్, వీడియోకాన్ వీటీ85సీ ని మార్కెట్లోకి తెచ్చింది.

చెన్నై: వీడియోకాన్ గ్రూప్‌కు చెందిన వీడియోకాన్ మొబైల్ ఫోన్స్ కంపెనీ 3జీ కాలింగ్  ట్యాబ్లెట్, వీడియోకాన్ వీటీ85సీ ని  మార్కెట్లోకి తెచ్చింది. ఈ ట్యాబ్లెట్ ధర రూ.8,999. ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ఓఎస్‌పై పనిచేపే ఈ ట్యాబ్లెట్‌లో 7 అంగుళాల డిస్‌ప్లే, డ్యుయల్-కోర్ కోర్టెక్స్ ఏ9 ప్రాసెసర్, 5 మెగా పిక్సెల్ రియర్ కెమెరా, వీజీఏ ప్రైమరీ కెమెరా, 1 జీబీ ర్యామ్, 4 జీబీ ఇన్‌బిల్ట్ మెమెరీ, 32 జీబీ ఎక్స్‌పాండబుల్ మెమెరీ,  హెవీ డ్యూటీ 3000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలున్నాయి. ట్యాబ్లెట్‌లు అమ్మకాలు బాగా ఉండటంతో వీడియోకాన్, శామ్‌సంగ్ తదితర పలు కంపెనీలు వివిధ ఫీచర్లతో ట్యాబ్లెట్‌లను అందుబాటులోకి తెస్తున్నాయి. ఈ ఏడాది చివరి నాటికి బడ్జెట్ ట్యాబ్లెట్‌లు 18.2 కోట్లు అమ్ముడవుతాయని అంతర్జాతీయ రీసెర్చ్ సంస్థ, గార్ట్‌నర్ ఇటీవల ఒక నివేదికలో తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement