బెంగళూరు - బ్యాంకాక్.. రూ. 3,999కే టికెట్! | Thai AirAsia launches Bengaluru-Bangkok direct flight | Sakshi
Sakshi News home page

బెంగళూరు - బ్యాంకాక్.. రూ. 3,999కే టికెట్!

Jun 29 2015 6:11 PM | Updated on Sep 3 2017 4:35 AM

బెంగళూరు - బ్యాంకాక్.. రూ. 3,999కే టికెట్!

బెంగళూరు - బ్యాంకాక్.. రూ. 3,999కే టికెట్!

బెంగళూరు నుంచి బ్యాంకాక్ వెళ్లడానికి రూ. 3,999కే టికెట్ ఇస్తామంటూ థాయ్ ఎయిర్ ఏషియా ఒక ఆఫర్ ఇచ్చింది.

బ్యాంకాక్ వెళ్లడం అందరికీ ఇష్టమే. అక్కడి ప్రకృతి అందాలను ఆస్వాదించి, అన్నీ చూసుకుని రావాలనుకుంటారు. కానీ టికెట్ ధర చూసి కాస్త ముందూ, వెనకా ఆగుతుంటారు. దాన్ని దృష్టిలో పెట్టుకునే ఇప్పుడు థాయ్ ఎయిర్ ఏషియా ఒక కొత్త ప్యాకేజి ప్రకటించింది. బెంగళూరు నుంచి బ్యాంకాక్ వెళ్లడానికి రూ. 3,999కే టికెట్ ఇస్తామంటూ ఆఫర్ ఇచ్చింది. ఇది సెప్టెంబర్ 1 నుంచి అమలులోకి వస్తుంది. అది కూడా డైరెక్ట్ విమానమే.

బెంగళూరు నుంచి వారానికి ఐదు విమానాలు బ్యాంకాక్ వెళ్తాయి. భారతదేశం నుంచి బ్యాంకాక్ వెళ్లడానికి చాలామంది ఉత్సాహంగా ఉంటారని, అందువల్ల తాము మంచి బిజినెస్ చేయగలమన్న ఆశాభావం ఉందని థాయ్ ఎయిర్ ఏషియా సీఈవో తస్సపన్ బిజ్లేవెల్డ్ తెలిపారు. 2014 సంవత్సరంలో భారతదేశం నుంచి థాయ్లాండ్కు మొత్తం 9.50 లక్షల మంది వెళ్తే, వాళ్లలో 1.50 లక్షల మంది బెంగళూరు నుంచే వెళ్లారు. అందుకే ఇప్పుడు ఈ ప్యాకేజికి బెంగళూరును ఎంచుకున్నారు.

Advertisement

పోల్

Advertisement