రాజస్థాన్ రివర్ బోర్డు చైర్మన్ గా శ్రీరాం వెదిరె | sriram vedire appointed as rajasthan river board chairman | Sakshi
Sakshi News home page

రాజస్థాన్ రివర్ బోర్డు చైర్మన్ గా శ్రీరాం వెదిరె

Jul 31 2015 7:56 PM | Updated on Sep 3 2017 6:31 AM

రాజస్థాన్ రివర్ బోర్డు చైర్మన్ గా శ్రీరాం వెదిరె

రాజస్థాన్ రివర్ బోర్డు చైర్మన్ గా శ్రీరాం వెదిరె

తెలంగాణకు చెందిన బీజేపీ నేత శ్రీరాం వెదిరె రాజస్థాన్ రివర్ బోర్డు చైర్మన్ గా నియమితులయ్యారు.

న్యూఢిల్లీ: తెలంగాణకు చెందిన బీజేపీ నేత శ్రీరాం వెదిరె రాజస్థాన్ రివర్ బోర్డు చైర్మన్ గా నియమితులయ్యారు. ఆయనకు రాజస్థాన్ ప్రభుత్వం రాష్ట్ర మంత్రి హోదా కల్పించింది. రాజస్థాన్ లోని 19 నదుల ప్రాజెక్టుల్లోని నీటి వినియోగంపై ఆయన పనిచేయనున్నారు. ప్రస్తుతం కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ సలహాదారుగా ఆయన ఉన్నారు. 

'నదుల అనుసంధానం' ప్రాజెక్టు త్వరగా సాకారమయ్యేందుకు వీలుగా కేంద్ర జలవనరుల శాఖ ఏర్పాటు చేసిన 'టాస్క్ ఫోర్స్'  కమిటీలోనూ ఆయన సభ్యుడిగా ఉన్నారు.  నల్లగొండ జిల్లాకు చెందిన శ్రీరాం  అమెరికాలో ఓ కంపెనీలో 15ఏళ్లపాటు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేశారు.  2009లో భారత్‌కు తిరిగొచ్చారు. నీరు పారుదలపై  అనేక రచనలు చేశారు. బీజేపీలో చేరిన ఆయన పార్టీ వాటర్ మేనేజ్‌మెంట్ సెల్ జాతీయ కన్వీనర్‌గా విధులు నిర్వర్తించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement