 
															మోదీకి సైనా ముందస్తు కానుక..
మరి కొద్ది గంటల్లో 65వ పడిలోకి అడుగిడనున్న ప్రధాని నరేంద్ర మోదీకి ఒక రోజు ముందే పుట్టినరోజు శుభాకాంక్షలతోపాటు అరుదైన బహుమానం కూడా అందింది.
	న్యూఢిల్లీ: మరి కొద్ది గంటల్లో 65వ పడిలోకి అడుగిడనున్న ప్రధాని నరేంద్ర మోదీకి ఒక రోజు ముందే పుట్టినరోజు శుభాకాంక్షలతో పాటు అరుదైన బహుమానం కూడా అందింది. సెప్టెంబర్ 17 ఆయన జన్మదినం. అయితే బుధవారం (సెప్టెంబర్ 16) సాయంత్రం ప్రధానిని కలిసి.. సంబరాన్ని పంచుకుంది వరల్డ్ నంబర్వన్ షట్లర్ సైనా నెహ్వాల్.
	
	బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్ షిప్ లో పతకం సాధించిన తొలి భారతీయురాలిగా అరుదైన రికార్డును సొంతం చేసుకున్న తర్వాత తొలిసారిగా సైనా నెహ్వాల్ ప్రధానిని కలిశారు. ఈ సందర్భంగా మోదీకి ఒక బ్యాడ్మింటన్ రాకెట్ ను బహుకరించారు. భేటీ అనంతరం సైనా మీడియాతో మాట్లాడారు.
	
	'మోదీజీ బర్త్ డేకి ఒకరోజు ఆయనను కలవడం సంతోషంగా ఉంది. రేపు వీలవుతుందో లేదోనని ముందుగానే హ్యాపీ బర్త్ డే చెప్పేశా. ఓ గిఫ్ట్ చూడా ఇచ్చేశా. అభిమానులు నా మ్యాచ్ లను ఫాలో కావడం తెలిసిందే గానీ, మోదీ సార్ కూడా నేనాడే మ్యాచ్ ల గురించి నాతో ప్రత్యేకంగా మాట్లాడటం నిజంగా గొప్ప విషయం' అని చెప్పుకొచ్చారు సైనా నెహ్వాల్.
	
		@narendramodi Very nice meeting u PM sir thank u so much and wish u a very happy birthday 😊😊.
	— Saina Nehwal (@NSaina) September 16, 2015

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
