10 లక్షల మందికి రూ.153 కోట్లు | Niti Aayog has disbursed over Rs 153 Crore as reward money to encourage digital payments | Sakshi
Sakshi News home page

10 లక్షల మందికి రూ.153 కోట్లు

Feb 22 2017 8:54 AM | Updated on Sep 5 2017 4:21 AM

10 లక్షల మందికి రూ.153 కోట్లు

10 లక్షల మందికి రూ.153 కోట్లు

కేంద్ర పథకాల ద్వారా సుమారు 10 లక్షల మంది రూ.153.5 కోట్ల మొత్తాన్ని గెలుచుకున్నారు.

న్యూఢిల్లీ: డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన లక్కీ గ్రాహక్‌ యోజన, డిజీ ధన్‌ వ్యాపార్‌ యోజన పథకాల ద్వారా సుమారు 10 లక్షల మంది రూ.153.5 కోట్ల మొత్తాన్ని గెలుచుకున్నారని నీతి ఆయోగ్‌ సీఈవో అమితాబ్‌ కాంత్‌ ప్రకటించారు. వీరిలో మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీలకు చెందిన వారు అధికంగా ఉన్నారని తెలిపారు.

9.8 లక్షల మంది విజేతల్లో 9.2 లక్షల మంది వినియోగదారులు ఉండగా, 56 వేల మంది వ్యాపారులు ఉన్నారని వెల్లడించారు. వీరిలో ఎక్కువ మంది 21 నుంచి 30 ఏళ్ల మధ్య వయసున్న వారు ఉన్నారని పేర్కొన్నారు. ఈ పథకాల ద్వారా ప్రజల్లో డిజిటల్‌ చెల్లింపులు చేసే వారి సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు. డిసెంబర్‌ 25న ప్రారంభించిన ఈ పథకాలు ఏప్రిల్‌ 14 వరకు కొనసాగనున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement