ఏడేళ్ల బాలికపై అత్యాచారం, హత్య | Minor raped and killed by unidentified person in MP | Sakshi
Sakshi News home page

ఏడేళ్ల బాలికపై అత్యాచారం, హత్య

Oct 3 2014 5:39 PM | Updated on Oct 8 2018 3:17 PM

ఏడేళ్ల బాలికపై అత్యాచారం, హత్య - Sakshi

ఏడేళ్ల బాలికపై అత్యాచారం, హత్య

గుర్తు తెలియని వ్యక్తి ఒకరు ఏడేళ్ల బాలికను ఎత్తుకెళ్లి ఆమెపై అత్యాచారం చేసి, ఆమెను చంపేశాడు.

గుర్తు తెలియని వ్యక్తి ఒకరు ఏడేళ్ల బాలికను ఎత్తుకెళ్లి ఆమెపై అత్యాచారం చేసి, ఆమెను చంపేశాడు. ఈ దారుణ సంఘటన మధ్యప్రదేశ్లోని కాకడ్గావ్ గ్రామంలో జరిగింది. బాధితురాలు అర్ధరాత్రి పూట గర్భా ఉత్సవంలో పాల్గొని, తన ఇద్దరు అక్కలతో పాటు తిరిగి వచ్చి నిద్రపోతుండగా ఆ వ్యక్తి గుట్టు చప్పుడు కాకుండా వచ్చి ఆమెను ఎత్తుకెళ్లిపోయాడు.

తర్వాత ఆమెపై అత్యాచారం చేసి, పీక పిసికి చంపేశాడు. తెల్లవారుజామున ఇంట్లో పాప కనిపించకపోయేసరికి కుటుంబసభ్యులు అంతా గాలించడం మొదలుపెట్టారు. ఇంతలో గ్రామస్థులు తాము స్కూలు సమీపంలో ఓ బాలిక శవం చూసినట్లు చెప్పారు. తీరా వీళ్లు వెళ్లి చూసేసరికి అది వారి చిన్నారేనని గుర్తించారు. నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని జిల్లా ఎస్పీ అమిత్ సింగ్ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement