ఎల్లుండి శ్రీకాకుళం జిల్లాలో ప్రధాని ఏరియల్ సర్వే | manmohan singh to move andhra pradesh to visit flood ares | Sakshi
Sakshi News home page

ఎల్లుండి శ్రీకాకుళం జిల్లాలో ప్రధాని ఏరియల్ సర్వే

Oct 29 2013 9:39 PM | Updated on Oct 22 2018 9:16 PM

ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ బుధవారం రాష్ట్రానికి రానున్నారు.

ఢిల్లీ:  ప్రధానిమంత్రి మన్మోహన్ సింగ్ గురువారం ఆంధ్రప్రదేశ్ కు రానున్నారు. తుపాను ధాటికి దెబ్బతిన్న శ్రీకాకుళం జిల్లాలో ఆయన ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. ఆయనతో పాటు ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ కూడా రానున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని అధికారంగా ధృవీకరించలేదు. కాగా, రాష్ట్రంలో ఆమె కూడా ఏరియల్ సర్వేలో ఆమెకు పాల్గొనన్నట్లు ప్రాధమిక సమాచారం.  సీమాంధ్రలో చోటు చేసుకుంటున్న పరిస్థితుల దృష్ట్యా ఆమె పర్యటన వివరాలను గోప్యంగా ఉంచినట్లు తెలుస్తోంది. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాన్నిసమైక్యవాదులు నిరసిస్తూ కదం తొక్కిన సంగతి తెలిసిందే.  ఈ అంశాలను దృష్టిలో పెట్టుకున్న కాంగ్రెస్ పెద్దలు సోనియా గాంధీ పర్యటనను వివరాలను బయటకు వెల్లడించకుండా గోప్యత పాటిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement