మళ్లీ తెరపైకి కిరణ్‌కుమార్‌రెడ్డి! | kirankumar reddy to join congress party? | Sakshi
Sakshi News home page

మళ్లీ తెరపైకి కిరణ్‌కుమార్‌రెడ్డి!

Jul 24 2017 8:31 PM | Updated on Jul 29 2019 5:28 PM

మళ్లీ తెరపైకి కిరణ్‌కుమార్‌రెడ్డి! - Sakshi

మళ్లీ తెరపైకి కిరణ్‌కుమార్‌రెడ్డి!

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రిగా పనిచేసిన కిరణ్‌కుమార్‌రెడ్డి..

కాంగ్రెస్‌ పార్టీలో చేరేందుకు తెరవెనుక ప్రయత్నాలు

హైదరాబాద్‌: మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి తిరిగి కాంగ్రెస్‌పార్టీలో చేరేందుకు తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. తిరిగి హస్తం గూటికి చేరేందుకు ఢిల్లీలోని ఏఐసీసీ నేతలతో ఆయన మంతనాలు జరుపుతున్నట్టు చెప్తున్నారు. త్వరలోనే ఈ విషయంలో స్పష్టత వచ్చే అవకాశముందని తెలుస్తోంది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రిగా పనిచేసిన కిరణ్‌కుమార్‌రెడ్డి.. విభజన బిల్లును వ్యతిరేకించి.. చివరకు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. జై సమైక్యాంధ్ర పార్టీని స్థాపించి గత ఎన్నికల్లో పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో ఓడిపోవడంతో క్రియాశీల రాజకీయాలకు గత కొన్నాళ్లుగా దూరంగా ఉంటున్నారు. ప్రస్తుతం తిరిగి రాజకీయాల్లోకి రావాలని భావిస్తున్నారని, ఇందులోభాగంగా తిరిగి కాంగ్రెస్‌ పార్టీలో చేరేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. ఢిల్లీలో తనకు తెలిసిన కాంగ్రెస్‌ పెద్దలతో కిరణ్‌ మంతనాలు జరుపుతున్నట్టు సమాచారం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement