ట్రంప్‌గారు మా దేశంపై నిషేధం విధించండి! | Sakshi
Sakshi News home page

ట్రంప్‌గారు మా దేశంపై నిషేధం విధించండి!

Published Mon, Jan 30 2017 11:44 AM

ట్రంప్‌గారు మా దేశంపై నిషేధం విధించండి! - Sakshi

లాహోర్‌: అమెరికాలోకి ముస్లింల రాకపై అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తాజా ఆదేశాల నేపథ్యంలో క్రికెటర్‌, పాకిస్థాన్‌ ప్రతిపక్ష నేత ఇమ్రాన్‌ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమెరికాకు రాకుండా  పాకిస్థానీయులపై కూడా ట్రంప్‌ నిషేధం విధిస్తారని ఆశిస్తున్నానని, దీనివల్ల పాకిస్థానీలు తమ దేశాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశముందని ఆయన పేర్కొన్నారు. 'చాలామంది పాకిస్థానీలు కూడా అమెరికా వీసా ఆంక్షలు ఎదుర్కొంటున్నట్టు తెలుస్తోంది. పాకిస్థానీలకు వీసాలు ఇవ్వొద్దని ట్రంప్‌కు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది మాకు మేలు చేస్తుంది. మేం మా దేశాన్ని అభివృద్ధి చేసుకుంటాం' అని ఆయన అన్నారు.

ఏడు ముస్లిం మెజారిటీ దేశాల పౌరులు అమెరికాకు రాకుండా ట్రంప్‌ సర్కారు నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అదేవిధంగా పాకిస్థాన్‌పై కూడా భవిష్యత్తులో నిషేధం విధించే అవకాశముందని వైట్‌హౌస్‌ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఇమ్రాన్‌ ఖాన్‌ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. పాక్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ తలనొప్పి వచ్చినా విదేశాలకు వెళుతున్నారని, అమెరికా పాకిస్థానీయులపై నిషేధం విధిస్తే ఈ పరిస్థితి మారి.. ఆయన  దేశాభివృద్ధిపై దృష్టి సారించే అవకాశముందని పేర్కొన్నారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement