ప్రపంచంలో అత్యధిక జనాభా గల నగరాల్లో భారత్ రాజధాని ఢిల్లీ రెండో స్థానంలో నిలిచింది.
ఐక్యరాజ్యసమితి: :ప్రపంచంలో అత్యధిక జనాభా గల నగరాల్లో భారత్ రాజధాని ఢిల్లీ రెండో స్థానంలో నిలిచింది. 2014 సంవత్సరానికి గాను ప్రపంచ నగరాల జనాభాకు సంబందించి ఐక్యరాజ్యసమితి విడుదల చేసిన నివేదికలో ఈ విషయం వెల్లడయ్యింది. తొలి స్థానంలో జపాన్ రాజధాని టోక్యో నిలవగా.. రెండో స్థానాన్ని మన మహా నగరం ఢిల్లీ ఆక్రమించింది. 1990 నుంచి ఇప్పటి వరకూ రెండున్నర కోట్లకు పైగా జనాభా పెరగడంతో ఢిల్లీ రెండో స్థానానికి చేరింది.
ఇప్పటికే నగర, పట్టణ జనాభాలో ముందున్న చైనాను భారత్ 2050 కల్లా అధిగమించే అవకాశం ఉందని ఆ నివేదిక పేర్కొంది. 2030 కల్లా ఢిల్లీ నగర జనాభా మూడు కోట్ల అరవై లక్షలకు పైగా పెరిగే అవకాశం ఉన్నట్లు నివేదిక వెల్లడించింది.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
