కరోనా  కట్టడికి  అన్ని  జాగ్రత్తలు తీసుకుంటున్నాం | We Are All Taking Care For Coronavirus Says Errabelli Dayakar Rao | Sakshi
Sakshi News home page

కరోనా కట్టడికి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం

Apr 25 2020 5:18 AM | Updated on Apr 25 2020 5:18 AM

We Are All Taking Care For Coronavirus Says Errabelli Dayakar Rao - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కరోనా వైరస్‌ కట్టడికి లాక్‌డౌన్‌ను పకడ్బందీగా నిర్వహిస్తున్నామని, అన్ని ముందు జాగ్రత్తలు పాటిస్తున్నామని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు. జాతీయ పంచాయతీరాజ్‌ దినోత్సవం సందర్భంగా శుక్రవారం ప్రధాని మోదీ ప్రసంగం తర్వాత, కేంద్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌తో మంత్రి ఎర్రబెల్లి మాట్లాడారు. ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ను వ్యవసాయంలో విలీనం చేయాలని సీఎం కేసీఆర్‌ ప్రధాని మోదీకి లేఖ రాశారని, ఆ విధంగా చేస్తే, ఎక్కువ మందికి ఉపాధి కల్పించే అవకాశం ఉంటుందని, వీలైనంత త్వరగా ఆ నిర్ణయం తీసుకోవాలని ఎర్రబెల్లి కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. 98శాతం గ్రామాల్లో ఉపాధి హామీ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement