ఖేడ్ టీఆర్‌ఎస్ అభ్యర్థిగా భూపాల్రెడ్డి | TRS Party announced party candidate for narayanakhed bi election | Sakshi
Sakshi News home page

ఖేడ్ టీఆర్‌ఎస్ అభ్యర్థిగా భూపాల్రెడ్డి

Jan 20 2016 7:04 PM | Updated on Sep 3 2017 3:59 PM

ఖేడ్ టీఆర్‌ఎస్ అభ్యర్థిగా భూపాల్రెడ్డి

ఖేడ్ టీఆర్‌ఎస్ అభ్యర్థిగా భూపాల్రెడ్డి

తెలంగాణలో ఎన్నికల సందడి కొనసాగుతోంది.ఇప్పటికే గ్రేటర్ ఎన్నికల్లో అన్ని పార్టీలు అమితుమీకి సిద్ధమవుతుండగా.... బుధవారం నుంచి నారాయణఖేడ్ అసెంబ్లీ ఉప ఎన్నికకు నామినేషన్ల స్వీకరణ మొదలైంది.

మెదక్: తెలంగాణలో ఎన్నికల సందడి కొనసాగుతోంది. ఇప్పటికే గ్రేటర్ ఎన్నికల్లో అన్ని పార్టీలు అమితుమీకి సిద్ధమవుతుండగా.... బుధవారం నుంచి నారాయణఖేడ్ అసెంబ్లీ ఉప ఎన్నికకు నామినేషన్ల స్వీకరణ మొదలైంది.

అధికార టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థిగా ఎం.భూపాల్‌రెడ్డి పోటీ చేయనున్నట్లు పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ ఓ ప్రకటనలో తెలిపారు. 2014 సాధారణ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన భూపాల్‌రెడ్డి .. కాంగ్రెస్ అభ్యర్థి కిష్టారెడ్డి చేతిలో ఓటమి పాలై రెండో స్థానంలో నిలిచారు. గత ఏడాది ఆగస్టులో కాంగ్రెస్ ఎమ్మెల్యే కిష్టారెడ్డి హఠాన్మరణంతో ప్రస్తుతం ఉప ఎన్నిక జరుగుతున్న విషయం తెలిసిందే. కిష్టారెడ్డి కుమారుడు సంజీవరెడ్డిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఇప్పటికే ప్రకటించింది. ఫిబ్రవరి 13న పోలింగ్, 16న ఎన్నికల ఫలితం వెలువడనుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement