లాలునాయక్‌ మృతి టీఆర్‌ఎస్‌కు తీరనిలోటు | TRS leaders Visitation Lalu Nayak House Nalgonda | Sakshi
Sakshi News home page

లాలునాయక్‌ మృతి టీఆర్‌ఎస్‌కు తీరనిలోటు

Jul 6 2020 12:53 PM | Updated on Jul 6 2020 12:53 PM

TRS leaders Visitation Lalu Nayak House Nalgonda - Sakshi

లాలునాయక్‌ మృతదేహం వద్ద నివాళులర్పిస్తున్న మండలి చైర్మన్‌ గుత్తా, మంత్రి జగదీశ్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్, ఎమ్మెల్యే

చందంపేట(దేవరకొండ) : టీఆర్‌ఎస్‌ నాయకుడు, చందంపేట మండల  రైతు సమన్వయ సమితి  అధ్యక్షుడు రమావత్‌ లాలు నాయక్‌ మృతి టీఆర్‌ఎస్‌ పార్టీకి తీరని లోటు అని మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం చందంపేట మండలం పోలేపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని బిల్డింగ్‌తండాలో లాలునాయక్‌ మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ పార్టీలో క్రియాశీలకంగా పని చేసే లాలు నాయక్‌ను హత్య చేయడం దారుణమన్నారు. పార్టీ బలోపేతానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేశారు. అనంతరం లాలు నాయక్‌ కుమార్తె, ప్రస్తుత జెడ్పీటీసీ సభ్యురాలు రమావత్‌ పవిత్రను పరామర్శించి ఘటనకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. లాలునాయక్‌ కుటుంబాన్ని పార్టీ, ప్రభు త్వ పరంగా అన్ని విధాలా ఆదుకుంటామని భరోసాని చ్చారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్‌ బండా నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే రవీంద్రకుమార్, దేవరకొండ మున్సిపల్‌ చైర్మన్‌ ఆలంపల్లి నర్సింహ, ఎంపీపీలు నూన్సావత్‌ పార్వతి చందునాయక్, పద్మహన్మానాయక్, భవాని,  జాన్‌యాదవ్, జెడ్పీటీసీలు, పలు గ్రామాల నాయకులు  పాల్గొన్నారు.

పోలీసుల పటిష్ట బందోబస్తు
మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రి జగదీశ్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్, ఎమ్మెల్యే చందంపేట మండలంలోని పోలేపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని బిల్డింగ్‌తండాకు రావడంతో పోలీసు శాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టినట్లు దేవరకొండ డీఎస్పీ ఆనంద్‌రెడ్డి తెలిపారు. బందోబస్తులో సీఐలు వెంకటేశ్వర్‌రెడ్డి, పరుశురాములు, శ్రీనివాస్‌రెడ్డి, గౌరినాయుడు, ఎస్‌ఐలు నరేశ్, సందీప్‌  ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement