తెలంగాణ అభివృద్ధికి కేంద్రం సహకరించటం లేదన్నది అవాస్తవమని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు.
హైదరాబాద్ : తెలంగాణ అభివృద్ధికి కేంద్రం సహకరించటం లేదన్నది అవాస్తవమని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణ అభివృద్ధికి బీజేపీ శక్తివంచన లేకుండా కృషి చేస్తుందని, ఈ విషయంలో కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య తమపార్టీ వారధిగా ఉంటుందని అన్నారు. ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న కిషన్ రెడ్డి శనివారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ కొంతమంది కేంద్ర మంత్రులను కలిశామని, తెలంగాణలో సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లామన్నారు.
హెల్త్ యూనివర్సిటీ, గ్యాస్ పైప్లైన్, స్పోర్ట్స్ కాంప్లెక్స్ మంజూరుకు కేంద్రం సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి సరైన నివేదికలు ఇస్తే ప్రాజెక్టులు సాధించగలమని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రధానమంత్రిని కలిసి అభివృద్ధిపై నివేదికలు ఇస్తామని బీజేపీ ఎంపీ బండారు దత్తాత్రేయ తెలిపారు.