అక్రమంగా నిల్వ ఉంచిన 16 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని గురువారం పౌరసరఫరాల అధికారులు, పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
త్రిపురారం: అక్రమంగా నిల్వ ఉంచిన 16 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని గురువారం పౌరసరఫరాల అధికారులు, పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నల్లగొండ జిల్లా త్రిపురారం మండల కేంద్రంలో రేషన్ బియ్యాన్ని అక్రమంగా నిల్వ చేశారనే సమాచారంతో అధికారులు దాడులు నిర్వహించారు. అధికారులు ఒక ప్రైవేటు రైస్‌మిల్‌లో నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకొని ఆ మిల్లు యజమాని పై కేసు నమోదు చేశారు.