బడిలో దోపిడి షురూ!

Private Schools Starts School Fees Collecting Nizamabad - Sakshi

ఆన్‌లైన్‌లో ప్రైవేట్‌ విద్యాసంస్థల ఫీ‘జులూం’..

యాప్‌ లింక్‌ పాస్‌వర్డ్‌ కావాలంటే ఫీజులు కట్టాల్సిందే..

పుస్తకాలు, సామగ్రి కొనాలంటూ తల్లిదండ్రులపై ఒత్తిడి

రామారెడ్డి/దోమకొండ : కరోనా వైరస్‌ మనిషి జీవన విధానంలో ఏన్నో మార్పులు తెచ్చింది. కరోనా ముందు.. కరోనా తర్వాత.. అన్నట్లుగా మనిషి జీవన విధానం మారిపోయింది. ఇక స్కూళ్ల విషయానికి వస్తే పిల్లలకు స్మార్ట్‌ఫోన్లకు దూరంగా ఉంచండి.. రేడియేషన్‌ కారణంగా పిల్లలకు హాని కలుగుతుందని కూడా ఉద్భోద చేశాయి పాఠశాలలు. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. ‘‘మీ ఇంట్లో ఇద్దరు పిల్లలు మా స్కూళ్లో చదువుతున్నారు. ఇద్దరికి ఒకేసారి ఆన్‌లైన్‌ తరగతుల టైం టేబులు ఉన్నాయి. వారు ఇద్దరు ఆన్‌లైన్‌క్లాస్‌కు అటెండ్‌ కావాలంటే మీరు ఇద్దరి పిల్లలకు స్మార్ట్‌ ఫోనులు ఆరెంజ్‌ చేయండి. లేదంటే వారు క్లాస్‌లు మిస్‌ అవుతారు.’’ అంటూ ఇప్పుడు స్కూళ్లే విద్యార్థుల ను స్మార్ట్‌ఫోన్‌ బాట పట్టిస్తున్నాయి. జిల్లాలో పట్టణ కేంద్రం కామారెడ్డితో పాటు హైదరాబాద్, నిజామాబాద్‌ ప్రాంతాలలో జిల్లా విద్యార్థులు చదువుతుంటారు. కామారెడ్డి పట్ణణంలో ఓ విద్యార్థికి వార్షిక ఫీజు సుమారుగా 40వేలు ఉండేది. ఈ విద్యార్థి ప్రస్తుతం ఆరు నుంచి ఏడో తరగతికి వెళ్లాడు. బడులు ఇంకా మొదలు కాలేదు. కరోనా నేపథ్యంలో ఇప్ప ట్లో బడులు తెరిచేది అనుమానమే. ఆన్‌లైన్‌లో మాత్రం క్లాస్‌ లు ప్రారంభించారు. ఏడో తరగతికి ఫీజు నిర్ణయించామని, తొలివిడత ఫీజు చెల్లించాలని, సదరు విద్యార్థి తల్లిదండ్రులకు ఫోన్లు చేస్తున్నారు. 

స్మార్ట్‌ఫోన్లు కావాలని..
అసలే రైతులకు పెట్టుబడుల కాలం ఇది. మరో వైపు మధ్యతరగతి, నిరుపేదలకు బతుకు బండి లాగడానికే ఇబ్బందిగా మారిన వేళ.. ఆన్‌లైన్‌ తరగతుల కోసం ఇంట్లో పిల్లలు స్మార్ట్‌ ఫోన్‌లు కావాలంటూ లొల్లి చేస్తున్నారు. రైతులకు పెట్టుబడికి ఖర్చులు లేక, తిండికే ఇబ్బందులు పడుతున్న రోజుల్లో స్మార్ట్‌ఫోన్లు కోసం డబ్బులు 10నుంచి 20వేల ఎక్కడి నుంచి తేవాలని అవేదన చెందుతున్నారు.

విద్యాశాఖ దృష్టి సారించేనా..?
కరోనా నేపథ్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలు కార్పొరేట్‌ ప్రైవేటు యాజమాన్యాలు ఆన్‌లైన్‌ క్లాస్‌లు నిర్వహిస్తున్నా యి. ఈ క్లాసులకు  ఎలాంటి నిబంధనలు లేకపోవడంతో యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. జిల్లా విద్యాశాఖ అధికారులు పట్టించుకోవాలని, కనీసం తరగతు లు నిర్వహించిన ఫీజుల విషయంలో జోక్యం చేసుకుని ని యంత్రించాలని తల్లిదండ్రులు పేర్కొంటున్నారు.

చిన్న స్కూళ్లకు ఇబ్బందులు
ఓ వైపు కార్పొరేట్‌ స్థాయి పాఠశాలలు ఆన్‌లైన్‌ ద్వారా తరగతులు నిర్వహించి, ఫీజులు వసూలు చేస్తోంటే ఎన్నో ఏళ్లుగా స్కూళ్ల నిర్వహిస్తున్న చిన్న స్కూళ్ల యాజమాన్యాలు బెంబేలెత్తిపోతున్నారు. అరకొర వసతులతో నానా తంటాలు పడి పాఠశాలల నిర్వహణను నెట్టుకొస్తుండగా ఇప్పుడు ఆన్‌లైన్‌లో పెద్ద స్కూళ్లతో పోటీ పడి నిర్వహించడం ఎలా అంటూ నిర్వాహకులు తలలు పట్టుకుంటున్నారు. తమ దగ్గర చదివే పిల్లలకు ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్‌ లేవని, బడిలోనూ ఆన్‌లైన్‌ తరగతుల నిర్వహణకు తగు ఏర్పాట్ల ఇబ్బందేనని, ఆన్‌లైన్‌ క్లాస్‌లు ఆర్థికంగా భారంగా మారుతుందని వాపోతున్నారు.

తల్లిదండ్రులకు భారం..
ప్రసుత్తం కరోనా వ్యాప్తి అన్ని వర్గాల ప్రజల ఉపాధిపై తీవ్రమైన ప్రభావం చూపింది. కాన్వెంట్‌ స్కూళ్ల నుంచి కార్పొరేట్‌ స్కూళ్ల వరకు వివిధ పేర్లతో పాఠశాలలు నిర్వహిస్తున్నారు.
ఫీజుల పేరుతో పరిస్థితులు బాగున్న రోజుల్లోనే తల్లిదండ్రుల నుంచి ఏటా లక్షల్లో ఫీజులు వసూలు చేశారు. కరోనా నేపథ్యంలో పలు కార్పొరేట్‌ పాఠశాలలు ఆన్‌లైన్‌ క్లాస్‌ల పేరుతో కొత్త దందాకు తెరతీశా యి. ప్రస్తుత ఆన్‌లైన్‌ తరగతులకు నిర్వహణకు ఫీజులు కట్టలేక తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారు.

పిల్లలపై రేడియేషన్‌ ప్రభావం
స్మార్ట్‌ఫోన్ల వినియో గంతో రేడియోషన్‌ ప్రభావంతో పిల్లలు అనారోగ్యం పాలవుతారని.. కానీస భద్రత పా టించకుండా పలు ప్రైవేటు యాజమాన్యాలు ఉ దయం 9 నుంచి మధ్యాహ్నం 1వరకు నడుపుతున్నారు. ఇలా సుమారు 4గంటల పాటు ఆన్‌లైన్‌ త రగతులు నిర్వహిస్తే విద్యార్థులకు రేడియేషన్‌ తో పాటు కళ్లపైన ప్రభావం చూపుతుందని వైద్యులు చెప్తున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top