
కాంగ్రెస్‌కు శాశ్వతంగా ఉప్పుపాతర: కేటీఆర్
బంగారు తెలంగాణ సాధ్యం కావాలంటే కాంగ్రెస్ పార్టీకి శాశ్వతంగా ఉప్పుపాతర వేయాలని మంత్రి కేటీఆర్ అన్నారు.
- అప్పుడే బంగారు తెలంగాణ సాధ్యమని వ్యాఖ్య
జగిత్యాల: బంగారు తెలంగాణ సాధ్యం కావాలంటే కాంగ్రెస్ పార్టీకి శాశ్వతంగా ఉప్పుపాతర వేయాలని మంత్రి కేటీఆర్ అన్నారు. ఆయన సోమవారం రాత్రి జగిత్యాలలో జరిగిన సభలో ప్రసంగించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రానేరాదని, పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కోరుతున్నట్టు, కాంగ్రెస్ నేతలకే నిరుద్యోగ భృతి ఇవ్వాల్సి వస్తుందని ఎద్దేవా చేశారు. జూన్ 2 నుంచి ఒంటరి మహిళలకు రూ. వెయ్యి పెన్షన్ అందజేస్తామని, గర్భిణీలకు కేసీఆర్ కిట్టు ఇస్తామని చెప్పారు.
2019లో లేదా అంతకంటే ముందే ఎన్నికలు జరిగినా.. జగిత్యాలలో గులాబీ జెండా ఎగరడం ఖాయమని మంత్రి కేటీఆర్ అన్నారు. ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ మతాన్ని అడ్డుపెట్టుకొని బీజేపీ రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. తెలంగాణలో బీజేపీని ఆదరించేవారే లేరన్నారు. అధికారంలో లేకుంటే బతకలేని పార్టీ కాంగ్రెస్ అని ఆయన ఎద్దేవా చేశారు.