ప్రేమజంట ఆత్మహత్యాయత్నం | Lovers attempt suicide | Sakshi
Sakshi News home page

ప్రేమజంట ఆత్మహత్యాయత్నం

Mar 29 2016 4:39 PM | Updated on Sep 3 2017 8:49 PM

మంథని మండలంలోని గోదావరి నది ఒడ్డున ఓ ప్రేమ జంట పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

మంథని (కరీంనగర్ జిల్లా) : మంథని మండలంలోని గోదావరి నది ఒడ్డున ఓ ప్రేమ జంట పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అటుగా వెళ్లిన స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ప్రస్తుతం వీరికి స్థానిక ప్రభుత్వాసుపత్రిలో ప్రాథమిక చికిత్స చేసి మెరుగైన చికిత్స కోసం కరీంనగర్ తరలించారు. ఆత్మహత్యకు పాల్పడిన ఇద్దరూ ఆదిలాబాద్ జిల్లా చెన్నూరుకు చెందిన తిరుపతి(22), నిర్మల(19)గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement