
'మీరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు'
ఉద్యోగులు ఇబ్బంది పడకుండా చేయాల్సిన బాధ్యత తమపై ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.
హైదరాబాద్: ఉద్యోగులు ఇబ్బంది పడకుండా చేయాల్సిన బాధ్యత తమపై ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఏ ప్రాంతం వారు ఆ ప్రాంతంలోనే పనిచేస్తారని ఆయన చెప్పారు. తమను ఆంధ్రప్రదేశ్ కు బదిలీ చేశారంటూ సచివాలయంలో ఆందోళన చేస్తున్న తెలంగాణ ఉద్యోగులను కేసీఆర్ కలిశారు. మీరు ఆందోళన పడాల్సిన అవసరం లేదంటూ వారికి భరోసా ఇచ్చారు.
కేసీఆర్ హామీతో ఉద్యోగులు ఆందోళన విరమించారు. ఉద్యోగుల పంపకాల్లో భాగంగా పలువురు తెలంగాణ ఉద్యోగులను ఆంధ్రప్రదేశ్ కు కేటాయించిన సంగతి తెలిసిందే.