ఉన్నతాధికారి కారులో మంటలు | fire in car in rangareddy district | Sakshi
Sakshi News home page

ఉన్నతాధికారి కారులో మంటలు

May 22 2016 11:27 AM | Updated on Sep 5 2018 9:47 PM

వరంగల్ జిల్లా ఎక్సైజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగి వాహనం పూర్తిగా దగ్ధం అయింది.

తాండూరు: వరంగల్ జిల్లా ఎక్సైజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగి వాహనం పూర్తిగా దగ్ధం అయింది. ఈ ప్రమాదం నుంచి అధికారితోపాటు ఆయన కుమార్తె తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. వరంగల్ జిల్లా ఎక్సైజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్గా పనిచేస్తున్న మహిపాల్‌రెడ్డి రంగారెడ్డి జిల్లా బషీరాబాద్ మండలంలోని తన స్వగ్రామం మంతటికి ఆదివారం కుమార్తె సోనితో కలసి కారులో బయల్దేరారు.

గ్రామంలో జాతర ఉండడంతో తన తల్లిదండ్రుల వద్ద కుమార్తె సోనిని దిగబెట్టి వెళదామని ఆయన వస్తున్నారు. ఆ క్రమంలో గ్రామానికి సమీపంలోకి రాగానే వారి కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మహిపాల్‌రెడ్డి వెంటనే కారును నిలిపివేశారు. అనంతరం కారులో నుంచి కుమార్తెతో పాటు ఆయన దిగిపోయారు. అనంతరం మంటలకు కారు పూర్తిగా దగ్ధం అయ్యింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement