కరీంనగర్ జిల్లాలో ఓ రైతు అప్పుల బాధతో బలవన్మరణానికి యత్నించాడు.
అప్పుల భాధతో రైతు ఆత్మహత్య
Aug 20 2015 12:16 PM | Updated on Nov 6 2018 7:56 PM
మహదేవ్‌పూర్: కరీంనగర్ జిల్లాలో ఓ రైతు అప్పుల బాధతో బలవన్మరణానికి యత్నించాడు. ఈ ఘటన జిల్లాలోని మహదేవ్ పూర్ మండలంలో గురువారం చోటు చేసుకుంది. మండలంలోని సూరారం గ్రామనికి చెందిన బాపు అనే వ్యక్తి పత్తి పంట సాగు చేస్తున్నాడు. అయితే బోర్లలో నీరు లేకపోవడం, గత ఏడాది అప్పులు తీరే మార్గం లేకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురై పురుగుల తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement