ఒక్క ఫోన్‌ కాల్‌తో డబ్బు స్వాహా 

cyber criminals  Fraud In Medak - Sakshi

బ్యాంకుఖాతా నుంచి రూ.25 వేలు మాయం 

 సైబర్‌ నేరగాళ్ల వలలో ఖాతాదారుడు  

సాక్షి, కొల్చారం(నర్సాపూర్‌): ఒక్క ఫోన్‌కాల్‌తో ఖాతాదారుని ఖాతాలో ఉన్న రూ.25వేలు ఖాళీ అయిన సంఘటన కొల్చారం మండలం పైతర గ్రామంలో శనివారం వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే పొలంలో దుక్కిదున్నతున్న పైతర గ్రామానికి చెందిన కమ్మరి సాయిలుకు మొబైల్‌ నెం.87891 29706 నుంచి గురువారం సాయంత్రం ఒక ఫోన్‌కాల్‌ వచ్చింది. తాను ఎస్‌బీఐ బ్యాంకు నుంచి మాట్లాడుతున్నానని, మీ ఏటీఎంకార్డు ఫేయిల్‌ అయింది. రేపు కొత్తకార్డు వస్తుంది. అని అపరిచిత వ్యక్తి తెలిపాడు. దీంతో సాయిలు తాను పొలం పనుల్లో ఉన్నానని, 40 నిమిషాల తరువాత ఫోన్‌ చేయమని చెప్పాడు. 

ఏటీఎం నెంబర్‌ చెప్పడంతో..
అప్పటికి ఇంటికి చేరుకున్న సాయిలుకు అదే వ్యక్తి నుంచి ఫోన్‌కాల్‌ రావడం, మీ ఏటీఎం కలర్‌ బ్లాక్‌ రంగులోఉందని చెప్పడం, మీకొత్త ఏటీఎం నెంబర్‌ నమోదు చేసుకొండని చెప్పడంతో సాయిలు ఆ నెంబర్‌ను నోట్‌చేసుకున్నాడు. అనంతరం మీ ఏటీఎం నెంబర్‌ చెప్పాలని అవతలి వ్యక్తి అడగటంతో ఏటీఎం వెనక గల మూడు నెంబర్లు సైతం తెలపాలని సూచించడంతో సాయిలు పూర్తి వివరాలు అందజేశాడు. 

వెంటనే ఖాతాలోంచి డబ్బు మాయం
ఇంతలోనే తన ఖాతాలో నుంచి మూడుసార్లు డబ్బులు డ్రా చేసినట్లు మేసెజ్‌లు రావడం, మొత్తం రూ.25వేలు ఖాతాలో నుంచి ఖాళీ కావడంతో అప్రమత్తమైన సాయిలు అదే వ్యక్తికి మరోసారి మీ ఇంట్లోని వారి ఏటీఎం నెంబర్లు చెప్పండని అడగటంతో తన అల్లుడికి ఫోన్‌చేసి వివరాలు తెలిపాడు. అది మోసం అంటూ సమాధానం రావడంతో సాయిలు అయోమయంగా మారింది. తాను పంటపెట్టుబడి కోసం బ్యాంకులో డబ్బులు దాచుకోవడం జరిగిందని, ఇలా మోసపోతానని అనుకోలేదని సాయిలు వాపోయాడు. ఈ విషయమై కొల్చారం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు సాయిలు తెలిపాడు.   

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top