డివైడర్ను ఢీకొన్న బైక్: బీటెక్ విద్యార్థులు మృతి | B tech students died in bike accident at warangal | Sakshi
Sakshi News home page

డివైడర్ను ఢీకొన్న బైక్: బీటెక్ విద్యార్థులు మృతి

Dec 28 2014 8:45 AM | Updated on Sep 28 2018 3:39 PM

వరంగల్ నగరంలోని పోచమ్మ మైదాన్ జంక్షన్ వద్ద డివైడర్ను ఆదివారం బైక్ ఢీ కొట్టింది.

వరంగల్: వరంగల్ నగరంలోని పోచమ్మ మైదాన్ జంక్షన్ వద్ద డివైడర్ను ఆదివారం బైక్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే మరణించారు. స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని యువకులు మృతదేహలను స్వాధీనం చేసుకున్నారు.

అనంతరం పోస్ట్మార్టం నిమిత్తం నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన ఇద్దరు విద్యార్థులు బీటెక్ చదువుతున్నారని పోలీసులు తెలిపారు. విద్యార్థుల మృతి వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించినట్లు వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement