
ప్రచారం చేస్తున్న ఆప్ అభ్యర్థి బాబుల్‌రెడ్డి
సాక్షి,మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: ఆమ్‌ఆద్మీ పార్టీ అభ్యర్థి సి.బాబుల్‌రెడ్డి ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. శుక్రవారం పట్టణంలోని వెంకటేశ్వరకాలనీ, లక్ష్మినగర్‌కాలనీతోపాటు మోటార్‌లైన్‌లో ప్రచారం చేశారు. సామాన్యుడికి అధికారం కావాలన్న ఉద్ధేశంతో ఆప్ ఎన్నికల్లో పోటీ పడుతుందని ఓటర్లకు వివరించారు. గెలిచినా, ఓడినా ప్రజల మధ్యన ఉంటూ సమస్యల పరిష్కార సాధనకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పట్టణాల్లో కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో కూడా తమ పార్టీని ఆదరిస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో ఆప్ నాయకులు జుల్ఫీకర్, అంబరీష్ తదితరులు పాల్గొన్నారు.