నల్లగొండ జిల్లా చిట్యాలలో హంసరేఖ(20)అనే యువతి రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడింది.
నల్లగొండ జిల్లా చిట్యాలలో ఓ యువతి రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడింది. చిట్యాల మండల కేంద్రానికి చెందిన మేకల హంసరేఖ(20) స్థానికంగా ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తోంది. ఆదివారం రాత్రి ఆమె ఇంటి నుంచి వెళ్లిపోయింది. సోమవారం ఉదయం సమీపంలోని రైలు పట్టాలపై విగతజీవిగా పడి ఉండగా స్థానికులు గుర్తించారు. ఆమె తండ్రి మరణించాడు. తల్లితో కలిసి జీవనం సాగిస్తోంది. ఆమె ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది.పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.