42 విలీన గ్రామాలపై పన్ను పోటు | 42 merged villages, the tax pressure | Sakshi
Sakshi News home page

42 విలీన గ్రామాలపై పన్ను పోటు

Oct 17 2014 3:43 AM | Updated on Sep 2 2017 2:57 PM

వరంగల్ నగరంలో విలీనమైన 42 గ్రామాల ప్రజలపై పన్ను భారం మోపేందుకు రంగం సిద్ధమైంది. నగరంలో విలీన గ్రామాలకు పట్టణ శోభ దేవుడెరుగు కానీ..

వరంగల్ అర్బన్ : వరంగల్ నగరంలో విలీనమైన 42 గ్రామాల ప్రజలపై పన్ను భారం మోపేందుకు రంగం సిద్ధమైంది. నగరంలో విలీన గ్రామాలకు పట్టణ శోభ దేవుడెరుగు కానీ.. ప్రస్తుతం ఉన్న ఆస్తి పన్ను రెట్టింపు కానుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి అదనపు పన్నుల భారం పడనుంది. ఈ మేరకు రాష్ట్ర పురపాలక శాఖ ఉన్నతాధికారులు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.

ఇటీవల కొత్త మునిసిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఆస్తి పన్ను పెంచాలని ఆదేశాలు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పడు వరంగల్ నగరంలో విలీనమైన 42 గ్రామ పంచాయతీల ప్రజలపై భారం మోపేందుకు సన్నద్ధమైంది. ట్రైసిటీ పరిధిలోని 53 డివిజన్లలో 1,10,689 అసెస్‌మెంట్లు ఉండగా, 42 విలీన గ్రామాల్లో  53,694 అసెస్‌మెంట్లు ఉన్నాయి. ప్రస్తుతం విలీన గ్రామాల నుంచి బల్దియాకు రూ.2.49 కోట్ల ఆదాయం వస్తోంది.

విలీన గ్రామాల ప్రజల నుంచి గతంలో ఉన్న ఆస్తి పన్నులనే వసూలు చేయాలని గత ఏడాది మే 25న ఆదేశాలు జారీ అయ్యాయి. అప్పటి నుంచి పం చాయతీ సిబ్బంది నిర్ణయించిన విధంగానే పన్నులు వసూలు చేస్తున్నారు. నగర పాలక సంస్థలో 42 గ్రామాలను విలీనం చేసి రెండేళ్లు కావస్తున్నా మౌలిక వసతులు కల్పించడంలో అధికార యంత్రాంగం విఫలమైంది.

దీంతో ఆయా గ్రామాల్లో సమస్యలు రాజ్యమేలుతున్నాయి.తమ గ్రామాలను నగర పాలకసంస్థలో విలీనమవుతుండటంతో అభివృద్ది పను లు ముమ్మరంగా జరుగుతున్నాయని ఆశించి న స్థానికులకు తీవ్ర నిరాశే ఎదురైంది. సమస్యలకు పరిష్కారం చూపకుండా తాజాగా పన్ను పెంచుతూ రాష్ట్ర పురపాలక శాఖ ఆదేశాలు జారీ చేయడంపై ఆయా గ్రామాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
 
పెరగనున్న బల్దియా ఆదాయం

విలీన గ్రామాల్లోని నివాస, నివాసేతర గ్రామాలపై పన్నుల భారం భారీగా పెరిగే అవకాశం ఉంది. గ్రామాల్లో చాలా వరకు ఇళ్లు ముందే చిన్నచిన్న షాపులు దుకాణాలు నడుపుకుంటున్నారు. అయితే వీటిని ఇక నుంచి నివాసేతర భవనాలుగా పరిగణించే అవకాశాలు ఉన్నాయి. నగరంలో నివాసేతర భవనాలకు 2007 గెజిట్ ప్రకారం పన్ను వసూలు చేస్తున్నాయి. విలీన గ్రామాల్లో ఉన్న నివాసేతర భవనాలపై ఇదే విధానాన్ని కొనసాగించే అవకాశం ఉంది. గ్రామాల్లోని ప్రాంతాలను ప్రాదేశిక జోన్లుగా విభజించడం, ప్రతి జోన్‌లో ఉన్న కట్టడాలు, వాటి నిర్మాణం, స్వభావం ఆధారంగా ఆరు తరగతులుగా వర్గీకరించి పన్ను విధిస్తారు. ఈ క్రమంలో ప్రజల నుంచి అందిన అభ్యంతరాలు, సలహాలు పరిశీలించన తర్వాత అన్ని కేటగిరీల ప్లింత్ ఏరియా తదితర అంశాఅపై నోటిఫికేషన్ జారీ చేయనున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement