breaking news
-
మేడిపల్లి పీఎస్‌లో బండి సంజయ్‌పై కేసు
సాక్షి, మేడ్చల్ జిల్లా: మేడిపల్లి పోలీస్ స్టేషన్లో బండి సంజయ్‌పై కేసు నమోదైంది. చెంగిచర్లలో పిట్టల బస్తి బాధితులను పరామర్శించడానికి బండి సంజయ్, అతని అనుచరులు రాగా, పోలీసులకు, బీజేపీ నాయకులకు మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. తోపులాటలో కింద పడిన నాచారం సీఐ నందిశ్వర్ రెడ్డికి గాయాలయ్యాయి. సీఐ ఫిర్యాదుతో బండి సంజయ్‌తో పాటు మరో పది మందిపై 332, 353, 143, 149 ఐపీసీ 3, 4పీడీపీపీఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇదీ చదవండి: హైదరాబాద్ ఎంపీగా సానియా మీర్జా పోటీ?! -
హైదరాబాద్ ఎంపీగా సానియా మీర్జా పోటీ?!
భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా గురించి ఆసక్తికర వార్త తెరమీదకు వచ్చింది. ఈ స్పోర్ట్స్ స్టార్ త్వరలోనే రాజకీయ రంగ ప్రవేశం చేయనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్ లోక్‌సభ ఎంపీగా సానియా పోటీ చేసే అవకాశం ఉందనే ఊహాగానాలు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఆమెను బరిలోకి దించాలనే యోచనలో ఉన్నట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. కాగా లోక్‌సభ ఎన్నికలకు నగారా మోగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే పార్టీలన్నీ తమ అభ్యర్థులను ఖరారు చేసే పనిలో పడ్డాయి. ఈ క్రమంలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీకి కంచుకోటగా ఉన్న హైదరాబాద్‌లో.. బీజేపీ మాధవీ లతను పోటీకి దింపింది. అయితే, కాంగ్రెస్ పార్టీ మాత్రం అభ్యర్థి ఎంపిక విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకుంటున్నట్లు సమాచారం. ఎంఐఎంకు పట్టున్న హైదరాబాద్ నియోజకవర్గంలో సానియా మీర్జాను పోటీకి నిలపడం ద్వారా ఒవైసీకి చెక్ పెట్టవచ్చనే యోచనలో ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా అంతర్జాతీయ స్థాయిలో దేశ ఖ్యాతిని ఇనుమడింపజేసిన సానియా మీర్జా.. గతంలో తెలంగాణ రాష్ట్ర అంబాసిడర్‌గా ఉన్నారు. ఇక ఆమె చెల్లెలు ఆనం మీర్జా.. టీమిండియా మాజీ కెప్టెన్, కాంగ్రెస్ నాయకుడు మహ్మద్ అజారుద్దీన్ కోడలు అన్న విషయం తెలిసిందే. అజారుద్దీన్ కుమారుడు మహ్మద్ అసదుద్దీన్‌తో 2019లో ఆనం వివాహం జరిగింది. ఫలితంగా అప్పటికే మీర్జా- అజారుద్దీన్ మధ్య ఉన్న స్నేహం.. బంధుత్వంగా మారింది. ఇక కాంగ్రెస్ పార్టీలో నాయకుడిగా కొనసాగుతున్న అజారుద్దీన్ ఇటీవలి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేసి ఓడిపోయాడు. అయితే, లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో సానియా మీర్జా అభ్యర్థిత్వం గురించి అజారుద్దీన్ కాంగ్రెస్ పెద్దల వద్ద ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సైతం ఈ అంశాన్ని లోతుగా పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుండగా.. మీర్జా కుటుంబం నుంచి మాత్రం ఇంతవరకు ఎలాంటి స్పందనా రాలేదు. ఇదిలా ఉంటే.. సానియా మీర్జా.. తన భర్త షోయబ్ మాలిక్‌కు విడాకులు ఇచ్చినట్లు మీర్జా ఫ్యామిలీ ఇటీవల స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేవలం తన కుమారుడు ఇజహాన్ బాగోగులు, టెన్నిస్ అకాడమీ అభివృద్ధి పైనే దృష్టి సారించిన సానియా మీర్జా రాజకీయంగా స్టెప్ తీసుకోనున్నారంటూ వార్తలు రావడం ఆసక్తిని కలిగిస్తోంది. అయితే, దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటనా వెలువడలేదు. -
ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు: KTR ఆవేదన
రాజన్న సిరిసిల్ల, సాక్షి: తెలంగాణలో ఇప్పుడు రైతులు ఎదుర్కొంటున్న దుస్థితి చూస్తే గుండె తరుక్కుపోతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. గురువారం తంగళ్ళపల్లి మండలం సారంపల్లి గ్రామంలో ఎండిన వరి పొలాలను పరిశీలించిన ఆయన.. కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ‘‘రైతుల పరిస్థితి చూస్తే గుండె తరుక్కుపోతోంది. ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కరువు. గతేడాది ఇదే సమయానికి కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణలో అంతటా నీళ్లిచ్చింది. కేసీఆర్‌పై కోపంతోనే మేడిగడ్డకు రిపేర్ చేయించకుండా రైతులను ఇబ్బంది పెడుతున్నారు. ఢిల్లీకి హైదరాబాద్‌కు తిరగడం తప్ప.. రైతుల్ని పరామర్శించే తీరిక సీఎం రేవంత్‌రెడ్డికి లేకుండా పోయింది. ఇప్పటికే 200 మంది రైతులు చనిపోయారు. ఇప్పటికైనా రైతుల్ని ఆదుకోండి’’ అని కాంగ్రెస్ సర్కార్‌ను కోరారాయన. ‘ఎండిపోయి పంట నష్టం జరిగిన రైతులకు పరిహారం ఇవ్వాలి. ఎకరానికి పదివేలా, 25 వేలా.. ఎంతిస్తారో పరిహారం అంత ఇవ్వండి. అధికారం నుంచి దిగేపోయేనాటికి రైతుల కోసం కేసీఆర్ రైతుబంధు పేరిట రూ.7,000 కోట్ల రూపాయలు పెట్టారు. కానీ, అవికూడా రైతులకు ఇవ్వకుండా ఈ ప్రభుత్వం కాంట్రాక్టర్లకు ఆ డబ్బు చేరవేస్తోంది. ఎన్నికల టైంలో.. కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇస్తామన్న బోనస్, కౌలు రైతులకు ఇస్తామన్న రైతుబంధు ఇవ్వాలి. రైతులకు అండగా మేమున్నాం. కేసీఆర్ ఉన్నారు. దయచేసి ఆత్మహత్యల్లాంటి చర్యలకు రైతులు పాల్పడొద్దు’ అని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. -
ఫోన్ ట్యాపింగ్: రేవంత్‌కు కొత్త సవాల్ విసిరిన ఎంపీ లక్ష్మణ్
సాక్షి, హైదరాబాద్: గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాజకీయంగా లబ్ధి పొందేందుకు ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడిందని సీరియస్ కామెంట్స్ చేశారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. అలాగే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు తాటాకు చప్పుడు కాదని నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. కాగా, ఎంపీ లక్ష్మణ్ గురువారం మీడియాతో మాట్లాడుతూ..‘గత ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడితే.. సందట్లో సడేమియా అన్నట్టుగా అధికారులు సర్దుకున్నారు. గత ప్రభుత్వం రాజకీయంగా లబ్ధి పొందేందుకు ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడింది. రాజ్యాంగం కల్పించిన హక్కును గత ప్రబుతం అణచివేసింది. తెలంగాణను అబాసుపాలు చేసింది. పోలీసుల అనుమతితో ఒకటి రెండు ఫోన్ ట్యాపింగ్‌లు జరగవచ్చని కేటీఆర్ చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. ఉప ఎన్నికల సమయంలో ప్రతిపక్ష నేతల ఫోన్లను ట్యాపింగ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్‌పై సీబీఐతో విచారణ జరిపించాలి. వ్యాపారులను బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ వ్యాఖ్యలు తాటాకు చప్పుడు కాదని నిరూపించుకోవాలి. లీక్ వీరుడు కాదు.. గ్రీక్‌వీరుడైతే సీబీఐ విచారణకు వెంటనే ఆదేశించాలి. కేసీఆర్ కుటుంబం తెలంగాణ సంపదను దోచుకుంది. కేసీఆర్ కుటుంబాన్ని శిక్షించాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు’ అని వ్యాఖ్యలు చేశారు. -
ముగిసిన మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
Live Updates.. ఉప ఎన్నికకు పోలింగ్ ముగిసింది. జోగులాంబ గద్వాల.. ►జిల్లా కేంద్రంలోని జడ్పీ కార్యాలయంలో ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఓటు హక్కును వినియోగించుకున్న బీఆర్ఎస్ ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు. ►నాగర్ కర్నూల్ జడ్పీ గ్రౌండ్ పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకున్న ఎమ్మెల్సీ కూచకుల దామోదర్ రెడ్డి. జోగులాంబ గద్వాల.. ►స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక సందర్భంగా జిల్లా కేంద్రంలోని జడ్పీ కార్యాలయంలో ఓటు హక్కును వినియోగించుకోనున్న 225 మంది ప్రజా ప్రతినిధులు. వనపర్తి జిల్లా.. ►వనపర్తి జిల్లా కేంద్రంలోని RDO కార్యాలయంలో ప్రారంభమైన పోలింగ్. ►వనపర్తి జిల్లాలో మొత్తం ఓటర్స్ :218 ►నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట బాలికల ఉన్నత పాఠశాలలో ప్రారంభమైన ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు ►ఓటు హక్కును వినియోగించుకోనున్న 101 ఓటర్లు. వికారాబాద్ జిల్లా ►కొడంగల్ మండల పరిషత్ కార్యాలయంలో ప్రారంభమైన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్. ►కొడంగల్ నియోజకవర్గం మొత్తం 56 ఓటర్ల తమ ఓటును హక్కును వినియోగించనున్నారు. ►మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికకు పోలింగ్ ప్రారంభమైంది. ►ఎమ్మెల్సీ ఉపఎన్నికకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. గురువారం పోలింగ్ జరగనుండగా.. స్థానిక సంస్థల పరిధిలోని ఎంపీటీసీలు, జెడ్పీటీసీ సభ్యులు, పురపాలక కౌన్సిలర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరితోపాటు ఎక్స్ అఫీషియో హోదాలో ఉమ్మడి జిల్లా పరిధిలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలతోపాటు ముగ్గురు ఎమ్మెల్సీలు మొత్తం 1,439 మంది ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని కొడంగల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి ఎక్స్ అఫీషియోగా కొడంగల్‌లో ఓటు వేయనున్నారు. ►ఉపఎన్నికకు మహబూబ్‌నగర్, కొడంగల్, నారాయణపేట, వనపర్తి, గద్వాల, కొల్లాపూర్, నాగర్‌కర్నూల్, అచ్చంపేట, కల్వకుర్తి, షాద్‌నగర్ నియోజకవర్గ కేంద్రాల్లోని మండల పరిషత్ కార్యాలయాల్లో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ►ఉదయం ఎనిమిది నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. బ్యాలెట్ ద్వారా ప్రజాప్రతినిధులు ఓట్లు వేయనున్నారు. ►బుధవారం ఉమ్మడి జిల్లా కేంద్రం నుంచి అన్ని పోలింగ్ సెంటర్లకు ఎన్నికల సామగ్రిని పంపిణీ చేశారు. వచ్చే నెల రెండో తేదీన మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని బాలుర జూనియర్ కళాశాలలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. నేరుగా పోలింగ్ కేంద్రాలకే.. ►పార్లమెంట్ ఎన్నికలకు ముందు వచ్చిన ఉప ఎన్నిక కాగా.. బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రతిష్టా త్మకంగా తీసుకున్నాయి. అధికార కాంగ్రెస్ నుంచి యువ పారిశ్రామిక వేత్త, టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు జీవన్‌రెడ్డి, బీఆర్ఎస్ నుంచి జెడ్పీ మాజీ చైర్మన్ నవీన్‌కుమార్‌రెడ్డి పోటీ పడుతున్నారు. సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకుని పట్టు సాధించాలని బీఆర్ఎస్.. ఈ ఎన్నికల్లో గెలిచి సత్తా చాటాలని కాంగ్రెస్ ఎత్తుకు పైఎత్తులతో ముందుకు సాగుతున్నాయి. ఓటర్లు చేజారొద్దనే ఉద్దేశంతో ఓటర్లను ఆయా పార్టీలు గోవా, ఊటీ, కొడైకెనాల్ తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన క్యాంప్‌లకు తరలించారు. ►గురువారం పోలింగ్ జరగనుండగా.. బుధవారం తెల్లవారుజామునే క్యాంపుల నుంచి తరలించే ప్రక్రియకు శ్రీకారం చుట్టినట్టు తెలిసింది. రాత్రికి వారిని హైదరాబాద్‌లోని రిసార్ట్స్‌కు తరలించి.. గురువారం ఉదయం నేరుగా ప్రత్యేక బస్సుల్లో పోలింగ్ సెంటర్లకు తీసుకురానున్నారు. సంఖ్య ప్రకారం బీఆర్ఎస్ కు మెజారిటీ ఉన్నా, కాంగ్రెస్ అధికారంలోకి రావడం, ఆ తర్వాత మారిన రాజకీయ పరిణా మాల క్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు కాంగ్రెస్‌లో చేరారు. గెలుపుపై ఆయా పార్టీల అభ్యర్థులు ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. -
రెండంకెల సీట్లతో సత్తా చాటుతాం
సనత్‌నగర్ (హైదరాబాద్): తెలంగాణలో మెజార్టీ ఎంపీ సీట్లను బీజేపీ గెలుచుకుంటుందని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో సహా కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఇప్పటికే రాష్ట్ర బీజేపీ కార్యక్రమాల్లో పాల్గొన్నారని, వారి పర్యటనలతో ప్రజల నుంచి సానుకూల స్పందన వచ్చిందన్నారు. బుధవారం ఆయన సికింద్రాబాద్ పార్ల మెంట్ పరిధిలోని సనత్‌నగర్ నియోజకవర్గం రాంగోపాల్‌పేట, పాన్‌బజార్, రాణిగంజ్, ప్యాట్నీ, కళాసీగూడ, ఓల్డ్ బోయిగూడ, నాలాబజార్, మోండా మార్కెట్ బస్తీల్లో పర్యటించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో డబుల్ డిజిట్ సీట్లను గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. దేశ వ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల ప్రచార కా ర్యక్రమం ప్రారంభమైందని, తెలంగాణ లో నిర్వహించిన ఐదు బీజేపీ కార్యక్రమా ల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పోలింగ్ బూత్ కార్యకర్తల సమావేశంలో పాల్గొని కేడర్‌కు దిశా నిర్దేశం చేశారని చెప్పారు. భారీ బహిరంగ సభలే కాకుండా ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలిసి మాట్లాడాలని నిర్ణయించామని వెల్లడించారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మోదీ ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. -
మల్కాజిగిరిలో భారీ మెజారిటీతో గెలవాలి
సాక్షి, మేడ్చల్ జిల్లా: మల్కాజిగిరి పార్లమెంటు స్థానంలో పార్టీ అభ్యర్థి పట్నం సునీతా మహేందర్ రెడ్డిని భారీ మెజారిటీలో గెలి పించాలని సీఎం రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ కార్యకర్తలకు పిలుపుని చ్చారు. గతంలో తనకు వచ్చిన మెజారిటీ కంటే మరింత భారీ ఆధిక్యం సాధించి మల్కాజిగిరి నియోజకవర్గంలో పార్టీ జెండాను మరోమారు ఎగురవేయాలని ఆయన కోరారు. బుధవారం హైద రాబాద్లోని ముఖ్యమంత్రి నివాసంలో మంత్రి తుమ్మల నాగేశ్వ రరావు, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డిల ఆధ్వర్యంలో ఎల్బీనగ ర్, మేడ్చల్, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి నియోజకవర్గాలకు చెందిన బీఆర్ఎస్, టీడీపీతో పాటు పలువురు కమ్మ సంఘం నాయ కులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున వచ్చిన నాయకులు, కార్యకర్తలకు సీఎం రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లా డుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తిరుగులేని శక్తిగా దూసుకుపో తోందని చెప్పారు. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జన తాపార్టీ, రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయిన బీఆర్ఎస్లకు మల్కాజిగిరిలో ఉనికి లేకుండా చేయాలని కార్యకర్తలకు పిలుపు నిచ్చారు. ఎన్ని కుట్రలు, కుతంత్రాలకు పాల్పడ్డా.. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికల్లో గెలవ లేవని ఆయన అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారంటీలను ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు చేస్తామని స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో తమకు అడ్రస్ లేకుండా పోతుందనే భయంతో బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్‌పై అసత్య ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. పార్టీలో చేరిన వారిలో గతంలో మేడ్చల్ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున పోటీ చేసిన కృష్ణ ప్రసాద్, తెలంగాణ కమ్మ సంఘం నాయకులు బి.రవిశంకర్, అరికెపూడి ప్రసాద్ (మేడ్చల్), కుత్బుల్లాపూర్‌కు చెందిన బోడు వెంకటేశ్ యాదవ్, మాజీ కార్పొరేటర్లు శాలిని, పావనిరెడ్డి, రమణారెడ్డి, మాజీ ఎంపీపీ సి.దేవేందర్‌రెడ్డి తదితరులు ఉన్నారు. -
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆ ముగ్గురిపై కేసులు పెట్టాలి
సాక్షి, హైదరాబాద్: గత ప్రభుత్వ హయాంలో జరిగి న ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్, దుబ్బాక ఎన్నికల ఇన్చార్జ్గా ఉన్న మాజీ మంత్రి హరీశ్‌రావుతో పాటు అప్పటి కలెక్టర్ వెంకటరామి రెడ్డిని ముద్దాయిలుగా చేర్చి కేసులు పెట్టాలని డీజీపీ రవిగుప్తాకు బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఎం.రఘునందన్‌రావు విజ్ఞప్తి చేశారు. ఈ ముగ్గురిపై విడివిడిగా ఒక్కో ఎఫ్ఐఆర్ పెట్టి, ఈ కేసులపై వెంటనే విచారణ జరిపి త్వరితంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ వ్యవహారంపై స్పందించి చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి, చీఫ్ జస్టిస్‌లకు కూడా విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. దుబ్బా క ఉపఎన్నికతో పాటు, అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తనతోపాటు, తన కుటుంబసభ్యుల ఫోన్లను అక్రమంగా ట్యాపింగ్ చేయడంపై చర్యలు తీసు కోవాలని కోరుతూ బుధవారం డీజీపీ ఆఫీసులో రవిగుప్తాకు వినతిపత్రం సమర్పించాక రఘునందన్‌రావు మీడియాతో మాట్లాడారు. ట్యాపింగ్‌పై సమగ్ర విచారణ జరిపించాలని డీజీపీని కోరానని, ఆవిధంగా జరగని పక్షంలో న్యాయస్థానాలను ఆశ్రయిస్తానని చెప్పారు. దుబ్బాక, హుజూరాబాద్, మునుగోడు ఉప ఎన్నికలప్పుడు కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని అరెస్ట్ అయిన ప్రణీత్‌రావు చెప్పినట్టు మీడియాలో వచ్చిందని, ఆయన ఇచ్చిన స్టేట్మెంట్పై చర్యలు తీసుకోవాలని డీజీపీకి విజ్ఞప్తి చేశామన్నారు. అప్పటి సీఎం కేసీఆర్ ఆదేశాలు లేకుండా ఫోన్ ట్యాపింగ్ జరిగే ప్రసక్తే లేదని రఘునందన్ స్పష్టం చేశారు. సినిమా పరిశ్రమలో ఉన్న వారితో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఫోన్లను కొందరు ట్యాపింగ్ చేసి బెదిరింపులతో డబ్బులు వసూలు చేశారని ఆరోపించారు. హైకోర్టు జడ్జీల ఫోన్ సంభాషణలు విన్నారని కూడా తెలుస్తోందని, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తెలంగాణకు వస్తున్నందున ఆయనకు ఫోన్ ట్యాపింగ్ విషయం ఇక్కడి న్యాయమూర్తులు తెలియజేయాలని కోరారు. -
ఎన్నికలకు రాష్ట్ర పార్టీని సన్నద్ధం చేసేలా..
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికలకు రాష్ట్ర పార్టీని పూర్తిస్థాయిలో సన్నద్ధం చేయడంలో భాగంగా బీజేపీ జాతీయ నాయకులు తెలంగాణకు రాను న్నారు. ముఖ్యంగా పార్టీలో నాయకులు, కార్యక ర్తల మధ్య మెరుగైన సమన్వయ సాధన కోసం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర పార్టీ ఇన్చార్జిలు సునీల్ బన్సల్, తరుణ్ చుగ్, సంస్థాగత సహ ప్రధాన కార్యదర్శి శివప్రకాశ్, ఇతర నేతలు సమీక్షించనున్నారు. గురువారం నుంచి వరుసగా రాష్ట్రంలోని 17 ఎంపీ సీట్ల పరిధిలో ఎక్కడికక్కడ సమన్వయ సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా పార్లమెంట్ నియోజకవర్గాల ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీలతో భేటీ అయ్యి ఇప్పటి వరకు చేపట్టిన, చేపడుతున్న కార్యకలాపాలను సమీక్షిస్తారు. గ్రామీణ ప్రాంతాల్లోని లోక్‌సభ నియోజకవర్గాల్లో మండల పార్టీ అధ్యక్షులు, ఆపై స్థాయి నాయకులతో, పట్టణ ప్రాంతాల్లోని స్థానా ల్లో డివిజన్, ఆపై స్థాయి నాయకులతో సమావేశమై ఆయా అంశాలపై సమీక్ష నిర్వహి స్తారు. గురువారం శివప్రకాశ్ నాగర్‌కర్నూల్, హైదరాబాద్ ఎంపీ స్థానాలో పర్యటించనుండగా, మిగతా నేతలకు కూడా రెండేసి లోక్‌సభ స్థానాలను కేటాయించినట్టు తెలిసింది. సునీల్ బన్సల్, ఇతర నేతలు కూడా ఒకట్రెండు రోజుల్లో రాష్ట్రాన్ని సందర్శించనున్నట్టు తెలుస్తోంది. కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డా.కె.లక్ష్మణ్‌లకు కూడా కొన్ని ఎంపీ సీట్లలో నాయకుల మధ్య సమన్వయం సాధించే బాధ్యతలు అప్పగించినట్టు సమాచారం. పార్టీ జాతీయ నాయకులతో పాటు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) చంద్రశేఖర్ తివారీ కూడా ఈ సమీక్ష సమావేశాల్లో పాలుపంచుకోనున్నారు. ఈ సందర్భంగా పోలింగ్ బూత్ స్థాయిలో కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా ప్రయోజనం పొందిన వారిని, ముఖ్యంగా మహిళలు, ఇతర వర్గాల వారిని కలుసుకుని మద్దతును కూడగట్టాలని నిర్ణయించారు. పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలలో ఎన్నికల కార్యాలయాలు ప్రారంభించడం, ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీల భేటీల నిర్వహణ, ప్రచార కార్యక్రమాలు ముమ్మరం చేయడంపై దృష్టి పెట్టనున్నారు. -
నాకు పోటీ చేయడం ఇష్టం లేదని చెప్పా
సాక్షి, హైదరాబాద్: భువనగిరి లోక్‌సభ స్థానం నుంచి తనను పోటీ చేయాల్సిందిగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కోరారని, గెలిపించుకునే బాధ్యత కూడా తీసుకుంటానని ఆయన చెప్పినా తనకు పోటీ చేయడం ఇష్టలేదని స్పష్టం చేశానని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్ స్పష్టం చేశారు. బుధవారం ఆయన గాంధీభవన్‌లో విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయిన తర్వాత కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీలు రాజకీయంగా వెనుకబడి పోతున్నారని అభిప్రాయపడ్డారు. తెలంగాణకు చెందిన బీసీ నేత ఆర్.కృష్ణయ్యకు ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యత్వం ఇవ్వడం ద్వారా ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి బీసీలకు తగిన ప్రాధాన్యం ఇచ్చారని అన్నారు. బీఆర్ఎస్నుద్దేశించి సీఎం రేవంత్ ఒక్క మాట మాట్లాడితే ఎగిరెగిరి పడిన ఆ పార్టీ నేతలు, ఇప్పుడు కేటీఆర్ మాట్లాడుతున్న మాటలకు, ఆయన భాషకు ఏం చెప్తారని ప్రశ్నించారు. కేటీఆర్‌కు ముసళ్ల పండుగ ముందుందని, బీఆర్ఎస్ ఆరిపోయే దీపమని వ్యాఖ్యానించారు. ఫోన్ ట్యాపింగ్ వెనక కేటీఆర్ ఉండి ఉంటారని అభిప్రాయపడ్డ మధుయాష్కీ.. ఈ కేసులో కేసీఆర్, కేటీఆర్‌లు ఎ1, ఎ2 అవుతారని జోస్యం చెప్పారు. ఎన్నికలకు ముందు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను అరెస్టు చేయడాన్ని మాత్రమే తప్పు పట్టామని, కేజ్రీవాల్‌పై విచారణను ఏఐసీసీ తప్పు పట్టలేదని మధుయాష్కీ స్పష్టం చేశారు. -
నేడు మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. గురువారం పోలింగ్ జరగనుండగా.. స్థానిక సంస్థల పరిధిలోని ఎంపీటీసీలు, జెడ్పీటీసీ సభ్యులు, పురపాలక కౌన్సిలర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరితోపాటు ఎక్స్ అఫీషియో హోదాలో ఉమ్మడి జిల్లా పరిధిలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలతోపాటు ముగ్గురు ఎమ్మెల్సీలు మొత్తం 1,439 మంది ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని కొడంగల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి ఎక్స్ అఫీషియోగా కొడంగల్‌లో ఓటు వేయనున్నారు. ఉపఎన్నికకు మహబూబ్‌నగర్, కొడంగల్, నారాయణపేట, వనపర్తి, గద్వాల, కొల్లాపూర్, నాగర్‌కర్నూల్, అచ్చంపేట, కల్వకుర్తి, షాద్‌నగర్ నియోజకవర్గ కేంద్రాల్లోని మండల పరిషత్ కార్యాలయాల్లో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం ఎనిమిది నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. బ్యాలెట్ ద్వారా ప్రజాప్రతినిధులు ఓట్లు వేయనున్నారు. బుధవారం ఉమ్మడి జిల్లా కేంద్రం నుంచి అన్ని పోలింగ్ సెంటర్లకు ఎన్నికల సామగ్రిని పంపిణీ చేశారు. వచ్చే నెల రెండో తేదీన మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని బాలుర జూనియర్ కళాశాలలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. నేరుగా పోలింగ్ కేంద్రాలకే.. పార్లమెంట్ ఎన్నికలకు ముందు వచ్చిన ఉప ఎన్నిక కాగా.. బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రతిష్టా త్మకంగా తీసుకున్నాయి. అధికార కాంగ్రెస్ నుంచి యువ పారిశ్రామిక వేత్త, టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు జీవన్‌రెడ్డి, బీఆర్ఎస్ నుంచి జెడ్పీ మాజీ చైర్మన్ నవీన్‌కుమార్‌రెడ్డి పోటీ పడుతున్నారు. సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకుని పట్టు సాధించాలని బీఆర్ఎస్.. ఈ ఎన్నికల్లో గెలిచి సత్తా చాటాలని కాంగ్రెస్ ఎత్తుకు పైఎత్తులతో ముందుకు సాగుతున్నాయి. ఓటర్లు చేజారొద్దనే ఉద్దేశంతో ఓటర్లను ఆయా పార్టీలు గోవా, ఊటీ, కొడైకెనాల్ తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన క్యాంప్‌లకు తరలించారు. గురువారం పోలింగ్ జరగనుండగా.. బుధవా రం తెల్లవారుజామునే క్యాంపుల నుంచి తరలించే ప్రక్రియకు శ్రీకారం చుట్టినట్టు తెలిసింది. రాత్రికి వారిని హైదరాబాద్‌లోని రిసార్ట్స్‌కు తరలించి.. గురువారం ఉదయం నేరుగా ప్రత్యేక బస్సుల్లో పోలింగ్ సెంటర్లకు తీసుకురానున్నారు. సంఖ్య ప్రకారం బీఆర్ఎస్ కు మెజారిటీ ఉన్నా, కాంగ్రెస్ అధికారంలోకి రావడం, ఆ తర్వాత మారిన రాజకీయ పరిణా మాల క్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు కాంగ్రెస్‌లో చేరారు. గెలుపుపై ఆయా పార్టీల అభ్యర్థులు ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. -
అధికారం, ఆస్తుల కోసమే ద్రోహం చేశాడు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: అధికారం, ఆస్తులను కాపాడు కోవడం కోసమే చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి పార్టీని విడిచిపెట్టి ద్రోహం చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. చేవెళ్ల నుంచి బీఆర్ఎస్ సీటు ఇచ్చి గెలిపించుకున్న తర్వాతే రంజిత్‌రెడ్డి ఎవరో ప్రపంచానికి తెలిసిందన్నారు. చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలతో బుధవారం కేటీ ఆర్ తెలంగాణ భవన్లో భేటీ అయ్యారు. చేవెళ్ల పరిధిలో ఎన్నికల సన్నద్ధతపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రంజిత్‌రెడ్డిపై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘2019లో రాజకీయాల్లోకి రంజిత్ రెడ్డి కొత్తగా వచ్చినా పార్టీ కార్యకర్తలంతా కష్టపడి ఆయనను గెలిపించారు. ఆయనకు పార్టీలో అత్యధి క ప్రాధాన్యత ఇవ్వడంతోపాటు నియోజకవర్గంలో పూర్తి స్వేచ్ఛ ఇచ్చాం. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయను అని పార్టీ ఎదుట అశక్తతను వ్యక్తం చేయడంతోపాటు రాజకీయాల నుంచి తప్పుకుంటా అని రంజిత్‌రెడ్డి చెప్పారు. కానీ రంజిత్‌రెడ్డి తన సోదరి అని చెప్పుకున్న కవిత నివాసంలో కేంద్ర ప్రభుత్వ సంస్థలు సోదాలు జరిపి అరెస్టు చేసిన రోజే నవ్వుకుంటూ కాంగ్రెస్‌లో చేరిన స్వార్థపరుడి గా మిగిలిపోయారు. 2019 లోక్‌సభ ఎన్నికల ముందు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి కూడా పార్టీ కంటే తానే ఎక్కువ అనుకుని వేరే పార్టీలోకి వెళ్లి పోటీ చేస్తే ఫలితం ఏమైందో అందరికీ తెలుసు. పార్టీ కంటే తాను పెద్ద అనే అహంకారం ఉన్న వ్యక్తులు రాజకీయాల్లో గెలవరు. అదే నిజమైతే దేశంలో పార్టీలతో సంబంధం లేకుండా స్వతంత్ర అభ్యర్థులే గెలుస్తారు. సీఎం రేవంత్‌రెడ్డి, రంజిత్‌రెడ్డి మనసులు కలిసినంత మాత్రాన క్షేత్రస్థాయిలో కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణులు కలిసి పనిచేస్తాయని అ నుకోవడం వారి రాజకీయ అజ్ఞానానికి నిదర్శనం. చేవెళ్లలో కాంగ్రెస్‌కు కనీసం అభ్యర్థి కూడా దొరకలేదు. పార్టీలో సొంతంగా అభ్యర్థులు లేని కాంగ్రెస్.. చేవెళ్ల, మల్కాజిగిరి, సికింద్రాబాద్ నియోజకవర్గాల్లో గెలుపొందడం అసాధ్యం’అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. 13న చేవెళ్లలో భారీ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏప్రిల్ 13న చేవెళ్లలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. ఈ సభకు పార్టీ అధినేత కేసీఆర్ హాజరుకానున్నారు. బుధవా రం తెలంగాణ భవన్లో జరిగిన భేటీలో సభ ఏర్పాట్లు, జన సమీకరణ తదితరాలపై కేటీఆర్ చర్చించారు. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తర్వాత బీఆర్ఎస్ నిర్వహిస్తున్న తొలి సభ కావడంతో ఏర్పాట్లను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని నిర్ణయించారు. కాగా చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని నేతలతో ఈ నెల 29న తెలంగాణ భవన్లో సమావేశం జరగనుంది. బుధవారం కేటీఆర్ అధ్యక్షతన జరిగిన భేటీలో పార్టీ చేవెళ్ల అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్‌తోపాటు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, కాలే యాదయ్య, ప్రకాశ్‌గౌడ్, ఎమ్మెల్సీలు వాణీదేవి, ఎగ్గె మల్లేశం, మాజీ ఎమ్మెల్యేలు మహేశ్‌రెడ్డి, డాక్టర్ ఆనంద్, రోహిత్‌రెడ్డితోపాటు పార్టీ నేతలు కార్తీక్ రెడ్డి, శ్రీశైల్‌రెడ్డి పాల్గొన్నారు. ట్యాపింగ్ పేరుతో డైవర్ట్ చేస్తున్నారు రేవంత్‌పై కేటీఆర్ ధ్వజం ‘పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ ఎస్ ఒక్క సీటు కూడా గెలవదని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఇద్దరం ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి మల్కాజిగిరిలోనే పోటీకి దిగుదాం రమ్మంటే నోరు మెదపలేదు. దమ్ముంటే పోటీ చెయ్.. ఇప్పటికీ నేను నా సవాల్‌కు కట్టుబడే ఉన్నా’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్లో మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘భారీ డైలాగులే తప్ప విషయానికి వస్తే పారిపోయే పిరికివాడు రేవంత్‌రెడ్డి. ఈ ఎన్నికల పోరు వ్యక్తుల మధ్య కాదు. పదేళ్ల నిజానికి (బీఆర్ఎస్), వంద రోజుల అబద్ధానికి (కాంగ్రెస్), మరో పదేళ్ల విషానికి (బీజేపీ) మధ్యన జరుగుతున్నాయి. కేసీఆర్‌ను నోటికొచ్చినట్లు తిడుతున్న వారిని చూసి ఎందరో వేదన చెందుతున్నారు. నాకూ తన్నాలనే ఉంది కానీ అంతకంటే బలమైన ఓటు దెబ్బతోనే గట్టిగా జాడించి తన్నాలి. ఆరు గ్యారంటీల అమలు చేతకాక ట్యాపింగ్‌లు, స్కాములు, స్కీముల పేరిట గారడీలు చేస్తూ ప్రజలను డైవర్ట్ చేస్తున్నారు. పది లక్షల ఫోన్లు ట్యాప్ చేశారంటున్నారు. లంగలవి, దొంగలవి, ఒకరిద్దరు లుచ్చాగాళ్లవి ట్యాప్ చేసి ఉండొచ్చు. అది పోలీసుల పని. హీరో నాగార్జున గ్రీకువీరుడైతే, ఈయన లీకు వీరుడు. ధైర్యముంటే లీకులు బంద్ చేసి మీరు చేసిన తప్పు ఇదీ అని చెప్పు. నువ్వే ముఖ్యమంత్రివి, ఎవరిని లోపల వేస్తావో వేయ్.. అంతేకానీ లేనిపోని మాటలెందుకు’ అని కేటీఆర్ అన్నారు. ఈటల ఇంకా బీఆర్ఎస్లో ఉన్నా అనుకుంటున్నడు ‘హుజూరాబాద్, గజ్వేల్‌లో ఓడిపోయిన ఈటల రాజేందరన్న తానింకా బీఆర్ఎస్లో ఉన్నా అను కుంటున్నడు. రైతులకు రుణమాఫీ ప్రకటిస్తే ఇప్పుడు పోటీ నుంచి తప్పుకుంటా అంటున్న డు. మల్కాజిగిరిలో వేరే పార్టీల నుంచి పోటీ చేస్తున్న వారు కేసీఆర్‌కు వెన్నుపోటు పొడిచి వెళ్లినవారే. బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డిని గెలిపించేందుకు ప్రతి ఒక్కరూ కష్టపడాలి’ అని కేటీఆర్ చెప్పారు. కార్యక్రమంలో పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి, మాజీ మంత్రులు తలసాని, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణ కాంగ్రెస్.. మరో నలుగురు లోక్‌సభ అభ్యర్థుల జాబితా విడుదల
సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ నుంచి బరిలో దిగే మరో నలుగురు లోక్‌సభ అభ్యర్థులను కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. మెదక్ నుంచి నీలం మధు, భువనగిరి నుంచి చామల కిరణ్‌కుమార్ రెడ్డి, నిజామాబాద్ నుంచి తాటిపర్తి జీవన్‌రెడ్డి, ఆదిలాబాద్ నుంచి ఆత్రం సుగుణ పోటీ చేస్తారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ బుధవారం రాత్రి విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం 17 స్థానాలకుగాను 9 స్థానాలకు ఇంతకుముందే అభ్యర్థులను ప్రకటించగా, మిగతా స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసేందుకు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ బుధవారం ఢిల్లీలో సమావేశమైంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో జరిగిన ఈ భేటీలో రాష్ట్రం తరఫున టీపీసీసీ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, సీఈసీ సభ్యుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి పాల్గొన్నారు. ఇంకా పెండింగ్‌లో నాలుగు స్థానాలు సీఈసీలో 8 స్థానాలపై చర్చ జరుగుతుందని భావించినప్పటికీ కేవలం ఆరు స్థానాలపై మాత్రమే చర్చ జరిగింది. పారీ్టలో అంతర్గతంగా ఒత్తిడి ఎక్కువగా ఉన్న ఖమ్మం స్థానంతో పాటు హైదరాబాద్ అభ్యర్థి ఎవరనేది ప్రస్తావనకు రాలేదు. ఇక ఆరు స్థానాల్లోనూ నాలుగు సీట్లను మాత్రమే ఖరారు చేశారు. వరంగల్ నుంచి దొమ్మాట సాంబయ్య, నమిళ్ల శ్రీనివాస్, కరీంనగర్ నుంచి ప్రవీణ్ రెడ్డి, రాజేందర్ రావు, తీన్మార్ మల్లన్నల పేర్లను పరిశీలించినా నిర్ణయం తీసుకోలేదు. దీంతో ఈ రెండు స్థానాలతో పాటు ఖమ్మం, హైదరాబాద్ స్థానాల్లో ఎవరి అభ్యర్థిత్వానికి కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు చూపుతుందనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ నెల 31న మరోసారి జరగనున్న సీఈసీ భేటీలో స్పష్టత వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. తలనొప్పిగా మారిన ఖమ్మం తెలంగాణలో ఖమ్మం పార్లమెంట్ స్థానం హాట్ సీట్‌గా మారింది. ఎక్కువమంది పోటీ పడుతుండటంతో ఇక్కడ ఎవరిని బరిలో దించాలన్న అంశం కాంగ్రెస్ అధిష్టానానికి తలనొప్పిగా మారింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావులు తమకు సంబంధించిన అభ్యర్థులకు సీటు కేటాయించాలని ఒత్తిడి చేస్తున్నట్టు సమాచారం. భట్టి తన సతీమణి నందిని కోసం, పొంగులేటి తన సోదరుడు ప్రసాద్‌రెడ్డి కోసం, తుమ్మల తన కుమారుడు యుగంధర్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారని చెబుతున్నారు. వీరితో పాటు కమ్మ సామాజికవర్గానికి చెందిన పారిశ్రామికవేత్త వంకాయలపాటి రాజేంద్రప్రసాద్, టీపీసీసీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ జెట్టి కుసుమకుమార్‌లు సైతం తమకు ఖమ్మం సీటు కేటాయించాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఖమ్మం అభ్యర్థి ప్రకటన వాయిదా పడుతోందని చెబుతున్నారు. -
అక్కడ ఇద్దరం పోటీ చేద్దామా?.. రేవంత్‌కు కేటీఆర్ సవాల్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మోదీని సపోర్టు చేస్తున్నాడా? లేక రాహుల్ మనిషా? అని మాజీ మంత్రి కేటీఆర్ సెటైర్లు వేశారు. ఎన్నికల తర్వాత రేవంత్ బీజేపీలో చేరడం ఖాయం అని వ్యాఖ్యలు. అలాగే, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని చెప్పుకొచ్చారు. కాగా, కేటీఆర్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. చేవెళ్లలో ఈ మధ్య రేవంత్ దమ్ముంటే 17 ఎంపీ స్థానాల్లో బీఆర్ఎస్ ఒక్కటైనా గెలవాలి అన్నాడు. అక్కడ ఇక్కడా ఎందుకు రేవంత్ సిట్టింగ్ సీటు మాల్కాజ్గిరిలోనే ఇద్దరం పోటీ చేద్దామని అన్నాను. కానీ, ఉలుకుపలుకు లేదు. నామినేషన్లకు ఇంకా సమయం ఉంది. నీకు దమ్ముంటే చెప్పు ఇద్దరం పోటీ చేద్దాం. నరుకుడు.. ఉరుకుడు తప్ప రేవంత్‌కు ఏదీ చేతకాదు. గ్రామాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రైతులు ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఒక్క వర్గం కూడా ఆనందంగా లేదు. రేవంత్ రెడ్డి మోదీ మనిషా? రాహుల్ గాందీ మనిషా? అర్దం కావడం లేదు. ఒక్క ఓటు రేవంత్ రెడ్డికి వేసినా అది మోదీకి వేసినట్టే. ఎన్నికల తర్వాత రేవంత్ బీజేపీలో చేరటం ఖాయం. ఈటల రాజేందర్ ఇంకా తాను బీఆర్ఎస్లోనే ఉన్నానని అనుకుంటున్నాడు. గడిచిన పదేళ్లలో మోదీ ప్రభుత్వం కంటోన్మెంట్‌కు ఏం చేసిందో దమ్ముంటే ఈటల రాజేందర్ సమాధానం చెప్పాలి. రాజేందర్ మంచి డైలాగ్స్ కొడతాడు. అవి చూసి ఓట్లు వేయకండి. కేసీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన నాయకులే మల్కాజ్‌గిరిలో పోటీ చేస్తున్నారు. విషం చిమ్ముతున్న బీజేపీ, అబద్దాలతో బతుకుతున్న కాంగ్రెస్‌కు, మనకు మధ్య ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ ఇస్తామన్న ఆరు గ్యారంటీలు పక్కకుపోయాయి. ఆరు గారడీలు తెర మీదకు వచ్చాయి. ఇదే సమయంలో ఫోన్ ట్యాపింగ్స్పై కూడా కేటీఆర్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారు. 10 లక్షల మంది ఫోన్లు ట్యాపింగ్ చేశారని రేవంత్ చెబుతున్నారు. ఒక్కరిద్దరి ఫోన్లు ట్యాపింగ్ చేసి ఉండొచ్చు. అవి దొంగ పనులు చేసేవారివి అనుకుంటాను. మీకు దమ్ముంటే విచారణ చేసుకోండి. రేవంత్ రెడ్డి ఓ లీకుల వీరుడు’ అంటూ ఎద్దేవా చేశారు. -
కాంగ్రెస్ అభ్యర్థిగా దానం నాగేందర్.. హైకోర్టులో మరో పిటిషన్
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల వేళ ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు ఎదురుదెబ్బ తగిలే అవకాశముంది. దానం కాంగ్రెస్ చేరడం, సికింద్రబాద్ ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగడంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌పై రేపు హైకోర్టులో విచారణ జరుగనుంది. కాగా, బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. నగరానికి చెందిన రాజు యాదవ్ అనే వ్యక్తి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే, అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బీఫామ్‌పై పోటీ చేసి దానం ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ క్రమంలో ఆయన ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఇక, కొద్దిరోజుల క్రితమే దానం నాగేందర్ కాంగ్రెస్‌లో చేరారు. దీంతో, దానంకు కాంగ్రెస్ ఎంపీ సీటు ఆఫర్ చేసింది. సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి దానం బరిలో నిలిచారు. ఈ నేపథ్యంలో ఒక పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి రాజీనామా చేయకుండా మరో పార్టీ నుంచి పోటీ చేయడం రాజ్యాంగ విరుద్దం, చట్ట విరుద్దమంటూ పిటిషనర్ పిటిషన్లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా దానం నాగేందర్‌పై స్పీకర్ చర్యలు తీసుకోవాలని కోరారు. ఇదే సమయంలో దానంపై అనర్హత వేయాల్సిందిగా కోరారు. కాగా, ఈ పిటిషన్‌పై రేపు హైకోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా.. దానం నాగేందర్ ఎన్నిక చెల్లదంటూ ఆయన ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. జస్టిస్ విజయసేన్ రెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం విచారణకు స్వీకరించింది. దీనిపై దానం నాగేందర్‌కు నోటీసులు జారీ చేసింది. అయితే, దానం నాగేందర్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రలోభాలకు గురి చేశారని విజయారెడ్డి తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఓటర్లకు డబ్బులు పంచారని, ఈ విషయంలో కేసులు నమోదయ్యాయని కోర్టుకు వివరించారు. వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం దానంకు నోటీసులు జారీ చేసింది. -
Lok Sabha: టీకాంగ్రెస్ అభ్యర్థుల లిస్ట్.. మూడు స్థానాలపై సస్పెన్స్!
సాక్షి, ఢిల్లీ: తెలంగాణలో మిగిలి ఉన్న ఎనిమది లోక్‌సభ స్థానాలకు కాంగ్రెస్ అధిష్టానం బుధవారం అభ్యర్థుల్ని ఖరారు చేయనుంది. ఇందుకోసం ఆ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) మరోమారు భేటీ కానుంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగే ఈ సమావేశంలో పార్టీ మాజీ చీఫ్‌లు సోనియాగాంధీ, రాహుల్‌తో పాటు కమిటీ సభ్యులు కేసీ వేణుగోపాల్, అంబికాసోనీ, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, అలాగే సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సీఈసీ సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డిలు పాల్గొననున్నారు. ఇక, ఎనిమిది స్థానాల్లో అభ్యర్థుల ఎంపికకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర, జిల్లా నేతలు, పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేల అభి ప్రాయాలను ఏఐసీసీ స్వీకరించింది. వారిచ్చిన సూచనలు, సలహాల మేరకు ఆశావహుల అభ్యర్థి త్వాలను పరిశీలించి తుది జాబితాను సీఈసీకి పంపింది. ప్రజల్లో బలం, కుల సమీకరణలు, పార్టీకి చేసిన సేవల ఆధారంగా అభ్యర్థుల పేర్లను నేతలు సిఫారసు చేశారు. కాగా సీఈసీ వివిధ సర్వేల నివేదికలు, పార్టీ విధేయత ఆధారంగా అభ్యర్థులపై ఇప్పటికే ఓ అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. కాగా, ఇప్పటికే రెండు దఫాల్లో ఏఐసీసీ తొమ్మిది అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. మరోవైపు.. ఈ ఎనిమిదింటిలో మూడు పార్లమెంట్ స్థానాలపై ఉత్కంఠ నెలకొంది. ఖమ్మం, భువనగిరి, నిజామాబాద్ స్థానాలపై కాంగ్రెస్ నేతలు కుస్తీ పడుతున్నట్టు తెలుస్తోంది. ఖమ్మం నుండి పొంగులేటి ప్రసాద్ రెడ్డి, మల్లు నందిని, యుగెంధర్, రాజేంద్ర ప్రసాద్ టికెట్ ఆశిస్తున్నారు. ఇక, భువనగిరి నుండి టికెట్ కోసం చామల కిరణ్, కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి, గుత్తా అమిత్, కోమటి రెడ్డి ఫ్యామిలీ ప్రయత్నాలు చేస్తోంది. లేనిపక్షంలో బీసీ అభ్యర్థికి ఈ స్థానం కేటాయించే అవకాశం ఉన్నట్టు పార్టీలో చర్చ జరుగుతోంది. భువనగిరి లోక్‌సభ స్థానానికి ఓయూ విద్యార్థి నేత కైలాష్ అప్లికేషన్ పెట్టుకున్నారు. కరీంనగర్ తెరపైకి తీన్మార్ మల్లన్న ముఖ్యంగా కరీంనగర్ పార్లమెంట్ స్థానానికి తొలి నుంచి మాజీ ఎమ్మెల్యే ఎ.ప్రవీణ్‌రెడ్డి పేరు పరిశీలనలో ఉన్నప్ప టికీ, అక్కడే బీజేపీ నుంచి బండి సంజయ్, బీఆర్ఎస్ నుంచి వినోద్‌కుమార్ పోటీలో ఉన్న నేపథ్యంలో అక్కడ మరో అభ్యర్థిని పరిశీలించాలని ఏఐసీసీ సూచించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తీన్మార్ మల్లన్న పేరును తెరపైకి తెచ్చి నట్లు సమాచారం. ముగ్గురిలో ఎవరు? నిజామబాద్ టికెట్ బరిలో జీవన్ రెడ్డి, సునీల్ రెడ్డి, అనిత రెడ్డి మధ్య తీవ్ర పోటీ నెలకొంది. మరోవైపు.. హైదరాబాద్ పార్లమెంట్ స్థానాన్ని మస్కత్ ఆశిస్తున్నారు. వరంగల్ స్థానంపై దమ్మాటి సాంబయ్య ఆశలు పెట్టుకున్నారు. మెదక్ రేసులో నీలం మధు ఉన్నారు. ఆదిలాబాద్ సీటు కోసం ఆదివాసీ, లంబాడ నాయకుల మధ్య గట్టి పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో ఎవరికి టికెట్ వస్తుందోనన్న సస్పెన్స్ కొనసాగుతోంది. -
మీ పార్టీనే బీజేపీలో విలీనం చేస్తారు
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డినుద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ప్రభుత్వ విప్, పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి ఫైర్ అయ్యారు. కేటీ ఆర్కు మతిభ్రమించి సీఎం రేవంత్‌రెడ్డిపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. రామ్మోహన్‌రెడ్డి మంగళవారం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీపీసీసీ అధికార ప్రతినిధులు లింగం యాదవ్, కమల్‌తో కలిసి మాట్లాడారు. చెల్లెలు కవిత జైలుకు పోయి కేసులు చుట్టుముడుతుంటే కేటీఆర్‌కు బుర్ర పనిచేయడం లేదన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్‌ను, కేటీఆర్‌ను ప్రజలు ఇంటికి పంపించారని, పార్లమెంటు ఎన్నికల్లో చేయడానికి కేటీఆర్ దగ్గర ఏమీ లేదని వ్యాఖ్యానించారు. జేబుదొంగ ఎవరో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునని, ప్రజల జేబులు కొట్టి దోచుకున్న రూ.వేల కోట్లను కల్వకుంట్ల కుటుంబం నుంచి కక్కిస్తామని చెప్పారు. ‘దొంగలు కాబట్టే చెల్లి తీహార్ జైల్లో ఉంది. నువ్వు కూడా చంచల్‌గూడ జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండు. ఫోన్‌ట్యాపింగ్ విచారణ జరుగుతుంటే నువ్వు, నీ కుటుంబం ఎందుకు వణుకుతోంది. ఫోన్ ట్యాపింగ్‌తో బెదిరించి మీరు చేసిన వసూళ్ల జాబితా వస్తుంది సిద్ధంగా ఉండు’ అని వ్యాఖ్యానించారు. బీజేపీలోకి వెళ్లాల్సిన ఖర్మ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి పట్టలేదని, లోక్‌సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేయడం ఖాయమన్నారు. -
రేవంత్‌ను చూసి ఎవరూ భయపడరు
సాక్షి, హైదరాబాద్: ‘అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేక ప్రజల దృష్టిని మళ్లించేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఫోన్ ట్యాపింగ్ అంటున్నడు. ఎక్కడ జరిగిందో చెప్పకుండా యూట్యూబ్ చానళ్లు, మీడియాకు లీకులు ఇస్తూ ఏదో జరిగిందనే ప్రచారం చేస్తున్నడు. నీ చేతిలో అధికారం ఉంది కదా.. విచారణ చేసి తప్పులు ఎక్కడ జరిగాయో బయటపెట్టి బాధ్యులపై చర్యలు తీసుకో. ఎవడికీ భయపడేది లేదు. నువ్వు వెంట్రుక కూడా పీకలేవు. ఇలాంటి వాటిని చూసి కేడర్ ఆగం కావద్దు’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. తెలంగాణ భవన్లో మంగళవారం సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గ బీఆర్ఎస్ సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘సెక్రటేరియట్లో లంకె బిందెలు లేవని చెబుతున్న రేవంత్ గతంలో ఏం చేసెటోడో తెలియదు. జేబులో కత్తెరలు పెట్టుకుని తిరుగుతున్న జేబుదొంగ రేవంత్.. పేగులు మెడలో వేసుకునేందుకు నువ్వేమైనా బోటీ కొట్టెటోడివా. మున్సిపల్ శాఖ బాధ్యతలు చూస్తున్న రేవంత్‌రెడ్డి మూడు నెలలుగా భవన నిర్మాణ అనుమతులు ఎందుకు ఇవ్వడం లేదు. పార్లమెంటు ఎన్నికల డబ్బుల కోసం రైస్ మిల్లర్లు, రియల్టర్లు, బిల్డర్లపై దాడులు చేసి బెదిరించి రూ.2500 కోట్లు జమ చేసి ఢిల్లీకి కప్పం కట్టిండు. ఇది దోపిడీ సొమ్ము కాదా. ఇలాంటివి బయటకు రాకుండా బర్లు, గొర్ల స్కీమ్‌లంటూ ప్రజల మెదళ్లలో తప్పుడు సమాచారం నింపేందుకు చానళ్లలో కేసీఆర్‌ను తిడుతూ దొంగ మాటలు చెప్తున్నడు’ అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుబంధు, కరెంటు, మహిళలకు రూ.2500, వృద్ధులకు రూ.4వేలు, కళ్యాణలక్ష్మితోపాటు తులం బంగారం ఇవ్వలేని ఇతనా మన సీఎం అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. బీజేపీలో మొట్టమొదట చేరేది రేవంత్ ‘కేంద్రంలో బీజేపీని ఆపే శక్తి, ధైర్యం కాంగ్రెస్‌కు లేవు. ఎన్నికల రేసులో ఎవరూ ఉండొద్దని మోదీ ప్రయత్నిస్తున్నారు. దేశంలో బలంగా ఉన్న ప్రాంతీయ నాయకులు కేసీఆర్, మమతా బెనర్జీ, కేజ్రీవాల్ వంటి నేతలకు మాత్రమే బీజేపీని అడ్డుకునే శక్తి ఉంది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మోదీని చౌకీదార్ అంటే రేవంత్ మాత్రం బడేభాయ్ అంటున్నడు. అదానీ మంచివాడు కాదని రాహుల్ అంటే, రేవంత్ మాత్రం కౌగిలించుకుని ఫొటోలు తీసుకుంటుండు. లిక్కర్ స్కామ్ ఏమీ లేదు, కేజ్రీవాల్ అరెస్టు అక్రమం అని రాహుల్ అంటే, కవిత అరెస్టును ఇక్కడి సీఎం సమర్థిస్తాడు. కాంగ్రెస్‌లో రాహుల్ గాం«దీ, రేవంత్‌కు నడుమ పొంతన కుదరడం లేదు. దేశంలో పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ 40 సీట్లకు మించి గెలవదు. 40 సీట్లు దాటకుంటే వెంటనే తనతోపాటు మరికొందరిని మూటగట్టుకుని బీజేపీలో చేరే మొదటి వ్యక్తి రేవంత్‌రెడ్డి. ఈ విషయంలో ఎన్నిమార్లు ఆయనపై విమర్శలు చేసినా స్పందించక పోవడం వెనుక మతలబు ఇదే. జీవితకాలమంతా కాంగ్రెస్‌లో కొనసాగుతానని రేవంత్ చెప్పకపోవడమే దీనికి నిదర్శనం’ అని కేటీఆర్ పేర్కొన్నారు. కిషన్‌రెడ్డి సికింద్రాబాద్‌కు చేసిందేమీ లేదు.. ‘కాంగ్రెస్ కొన్ని యూట్యూబ్ చానళ్లను అడ్డుపెట్టుకుని అబద్ధాలు ప్రచారం చేస్తుంటే.. బీజేపీ రాముడి పేరును చెప్పి నాటకం ఆడుతోంది. ప్రతిపక్షాల నేతలపై కేసులతో గొంతు నొక్కి జైలుకు పంపి మానసికంగా వేధిస్తోంది. లిక్కర్ స్కామ్ బయట పెడతానని అంటున్న కిషన్‌రెడ్డి ఆధారాలను కోర్టుకు సమర్పించాలి. ఐదేళ్లుగా కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డి సికింద్రాబాద్‌కు చేసిందేమీ లేదు. పార్టీ మారిన ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు కోసం అవసరమైతే సుప్రీంకోర్టును కూడా ఆశ్రయిస్తాం’ అని కేటీఆర్ పేర్కొన్నారు. సమావేశంలో సికింద్రాబాద్ బీఆర్ఎస్ అభ్యరి్థ, ఎమ్మెల్యే పద్మారావు గౌడ్, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తోపాటు పలువురు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. -
నేడు కాంగ్రెస్ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్!
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో మిగిలిన 8 లోక్‌సభ స్థానాలకు కాంగ్రెస్ అధిష్టానం బుధవారం అభ్యర్థుల్ని ఖరారు చేయనుంది. ఇందుకోసం ఆ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) మరోమారు భేటీ కానుంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగే ఈ సమావేశంలో పార్టీ మాజీ చీఫ్‌లు సోనియాగాంధీ, రాహుల్‌తో పాటు కమిటీ సభ్యులు కేసీ వేణుగోపాల్, అంబికాసోనీ, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, అలాగే సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కలు పాల్గొననున్నారు. 8 స్థానాలకు అభ్యర్థుల ఎంపికకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర, జిల్లా నేతలు, పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేల అభి ప్రాయాలను ఏఐసీసీ స్వీకరించింది. వారిచ్చిన సూచనలు, సలహాల మేరకు ఆశావహుల అభ్యర్థి త్వాలను పరిశీలించి తుది జాబితాను సీఈసీకి పంపింది. ప్రజల్లో బలం, కుల సమీకరణలు, పార్టీకి చేసిన సేవల ఆధారంగా అభ్యర్థుల పేర్లను నేతలు సిఫారసు చేశారు. కాగా సీఈసీ వివిధ సర్వేల నివేదికలు, పార్టీ విధేయత ఆధారంగా అభ్యర్థులపై ఇప్పటికే ఓ అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. కరీంనగర్ తెరపైకి తీన్మార్ మల్లన్న ముఖ్యంగా కరీంనగర్ పార్లమెంట్ స్థానానికి తొలి నుంచి మాజీ ఎమ్మెల్యే ఎ.ప్రవీణ్‌రెడ్డి పేరు పరిశీలనలో ఉన్నప్ప టికీ, అక్కడే బీజేపీ నుంచి బండి సంజయ్, బీఆర్ఎస్ నుంచి వినోద్‌కుమార్ పోటీలో ఉన్న నేపథ్యంలో అక్కడ మరో అభ్యర్థిని పరిశీలించాలని ఏఐసీసీ సూచించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తీన్మార్ మల్లన్న పేరును తెరపైకి తెచ్చి నట్లు సమాచారం. ఇప్పటికే పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్మున్షీ, ఇతర రాష్ట్ర నేతలను కలిసిన మల్లన్న కరీంనగర్ నుంచి పోటీకి సానుకూలత వ్యక్తం చేసినట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఆయన పేరును సీఈసీ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్టు సమాచారం. నిజామాబాద్ నుంచి సునీల్‌రెడ్డి, దిల్‌రాజు తదితరుల పేర్లు పరిశీలించినా, చివరి కి టి.జీవన్‌రెడ్డి వైపే నేతల మొగ్గు ఉన్నట్లు తెలుస్తోంది. మెదక్ నుంచి బీసీ వర్గానికి చెందిన నీలం మధుకే ఎక్కువ అవకాశాలున్నాయని, ఆయనకు సీఎం వర్గం బలమైన మద్దతు ఇస్తోందనే ప్రచారం జరుగుతోంది. ఇక భువనగిరి స్థానానికి అభ్యర్థుల ఎంపిక విషయంలో మాత్రం కొంత సందిగ్ధత కనిపిస్తోంది. ఇక్కడి నుంచి సీనియర్ మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్ రెడ్డిలు కొన్ని పేర్లను ప్రతిపాదిస్తుంటే, ముఖ్యమంత్రి మాత్రం చామల కిరణ్ కుమార్‌రెడ్డి వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఆయనకే టిక్కెట్ దక్కేలా రేవంత్ ఇప్పటికే ఏఐసీసీ కీలక నేతలను ఒప్పించినట్లు తెలుస్తోంది. ఇక ఆదిలాబాద్, హైదరాబాద్, ఖమ్మం, వరంగల్ స్థానాల్లో ఒకరిద్దరు పేర్లను పరిగణనలోకి తీసుకుని విజయావకాశాల ఆధారంగా అభ్యర్థులను ఫైనల్ చేయనున్నారు. గురువారం జాబితాను విడుదల చేసే అవకాశం ఉందని అంటున్నారు. రేవంత్‌తో మహేశ్‌గౌడ్ భేటీ గాంధీభవన్ వేదికగా ఈనెల 29న సాయంత్రం 5 గంటలకు జరిగే టీపీసీసీ ఎగ్జిక్యూటివ్ సమావేశానికి సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ దీపాదాస్ మున్షీ, ఏఐసీసీ కార్యదర్శులు, పార్టీ సీనియర్ నేతలు హాజరుకానున్నారు. ఈ సమావేశ ఎజెండాపై చర్చించేందుకు గాను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్ సీఎం రేవంత్‌రెడ్డితో మంగళవారం సమావేశమయ్యారు. పార్లమెంటు ఎన్నికలు, తాజా రాజకీయ అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు. ఏప్రిల్ 6న తుక్కుగూడలో సభ తుక్కుగూడలో వచ్చే నెల ఆరో తేదీన భారీ బహిరంగసభ నిర్వహించేందుకు టీపీసీసీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ జనజాత ర సభకు రాహుల్, ఖర్గే లాంటి కీలక నేతలు రానుండడం, జాతీయస్థాయి మేనిఫెస్టోను విడుదల చేయనుండడంతో టీపీసీసీ ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. -
పెళ్లి పెద్దను చూసి పిల్లనివ్వాలా?
సాక్షి, హైదరాబాద్: పెళ్లి పెద్దను చూసి పిల్లనివ్వా లా? అని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. గత పదేళ్లలో తెలంగాణకు బీజేపీ ఏం చేసిందని ఆ పార్టీ అభ్యర్థులకు లోక్‌సభ ఎన్నికల్లో ఓట్లేయాలని నిలదీశారు. ప్రస్తుతం తెలంగాణను అభివృద్ధి చేసుకునేందుకు చక్కటి అవకాశం వచ్చిందని, ఇక్కడి నుంచి ఎక్కువ మంది కాంగ్రెస్ అభ్య ర్థులను లోక్‌సభకు పంపిస్తే రాష్ట్రాభివృద్ధి జరుగు తుందని చెప్పారు. మంగళవారం జూబ్లీహిల్స్‌లోని సీఎం క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గ స్థాయి సమావేశం జరిగింది. పార్టీ అభ్యర్థి గడ్డం రంజిత్‌రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి, మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మా రెడ్డి, రాజ్యసభ సభ్యుడు అనిల్‌కుమార్ యాదవ్‌తో పాటు మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడారు. ఏం చూసి మోదీకి ఓటేయమంటారు? ‘గత పదేళ్లలో మోదీ తెలంగాణకు చేసిందేమీ లేదు. ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు పూర్తి చేయలేదు. బుల్లెట్ ట్రైన్‌ను గుజరాత్‌కు తీసుకెళ్లిన మోదీ, వికారాబాద్‌కు ఎంఎంటీఎస్ ఎందుకు తేలేదు. గుజరాత్లో సబర్మతి రివర్ ఫ్రంట్‌ను అభివృద్ధి చేసుకున్న మోదీ, మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధికి నిధులెందుకు ఇవ్వలేదు? రీజినల్ రింగు రోడ్డు రాకుండా బీజేపీ ఎందుకు మోకాలడ్డుతోంది. ఏం చూసి మూడోసారి మోదీకి ఓటేయాలని బీజేపీ నేతలు అడుగుతున్నారు..’ అంటూ రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. అన్నీ బేరీజు వేసిన తర్వాతే అభ్యర్థుల ఎంపిక ‘రాష్ట్రంలో ఈసారి 14 లోక్‌సభ స్థానాల్లో గెలవా లన్న పట్టుదలతో పనిచేస్తున్నాం. క్షేత్రస్థాయిలో అందరి అభిప్రాయాలు, సర్వేలు అన్నీ బేరీజు వేసిన తర్వాతనే పార్టీ అధిష్టానం అభ్యర్థులను ఎంపిక చేస్తోంది. చేవెళ్ల, సికింద్రాబాద్, మల్కాజిగిరి నియోజకవర్గాలకు ఒకదానితో మరొకదానికి సంబంధాలున్నాయి. ఇలాంటివన్నీ ఆలోచించిన తర్వాతే ఈ మూడు స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేశాం. పార్లమెంటు ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ వందరోజుల పాలనకు రెఫరెండం లాంటివి. తెలంగాణలో 14 స్థానాలు గెలిచి సోనియాకు కృతజ్ఞతలు చెబుదాం..’ అని సీఎం అన్నారు. 6 లేదా 7న రాష్ట్రానికి ఖర్గే, రాహుల్ ‘కార్యకర్తలకు అండగా నిలబడడంతోపాటు దేశాన్ని కాపాడుకునేందుకు రాహుల్‌గాంధీ వేల కిలోమీటర్లు నడిచారు. రాహుల్, సోనియాగాంధీల నాయకత్వాన్ని బలపరిచే బాధ్యత అందరిపై ఉంది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తుక్కుగూడలో ఆరు గ్యారంటీలు ప్రకటించుకున్నాం. మళ్లీ అదే తుక్కుగూడలో ఏప్రిల్ 6 లేదా 7వ తేదీల్లో జాతీయ స్థాయి గ్యారంటీలను ప్రకటించుకోబోతున్నాం. రంగారెడ్డి జిల్లా నుంచే దేశ రాజకీయాలకు శంఖారావం పూరించబోతున్నాం. ఈ జనజాతర సభకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీలతోపాటు పలువురు జాతీయ స్థాయి నేతలు హాజరవుతారు..’ అని ముఖ్యమంత్రి తెలిపారు. డోర్లు తెరిచి దొంగల్ని కూడా తీసుకొస్తే కష్టం కేఎల్లార్ వ్యాఖ్యలు వైరల్ ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి చేసిన వ్యాఖ్యలు సామాజిక మా ధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ‘డోర్ తెరుస్తాం... డోర్ తెరుస్తాం అని అంటున్నారు. మీరు డోర్లు తెరిచి కాంగ్రెస్ పార్టీని మోసం చేసిన దొంగలను కూడా లోపలికి తీసుకొస్తే మా లాంటోళ్లు, కార్యకర్తలు చచ్చిపోయే పరిస్థితి వస్తుంది. కేఎల్లార్‌కు, రేవంత్‌రెడ్డికి పడదేమో అని అక్కడక్కడా కార్యకర్తలు అనుకుంటున్నారు. మనమిద్దరం దగ్గరి మిత్రులం అనే విషయం వాళ్లకు తెలియదు. నేను చెప్పినా నమ్మేటట్టు లేరు. కాబట్టి మీరు చెప్పాలి..’ అని కేఎల్లార్ వ్యాఖ్యానించారు. నియోజక వర్గంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించే బాధ్యత తాను తీసుకుంటానని చెప్పారు. -
నచ్చినోళ్లు జేబులో... నచ్చనోళ్లు జైలులో
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి/మెదక్: నచ్చినోళ్లు జేబులో ఉండాలి నచ్చనోళ్లు జైలులో ఉండాలి అన్నట్లుగా కేంద్రంలోని బీజేపీ సర్కారు తీరు ఉందని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు విమర్శించారు. మంగళవారం సంగారెడ్డి పట్టణంలో బీఆర్ఎస్ ముఖ్య కార్య కర్తల సమావేశంలో హరీశ్‌రావు ప్రసంగించారు. దేశంలో ప్రతిపక్షపార్టీల మీద అక్రమ కేసులు పెడుతున్నారని ఆయన మండిపడ్డారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను అక్రమంగా అరెస్టు చేశారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు బీజేపీతో బీఆర్ఎస్ ఒప్పందం చేసుకుని ఉంటే ఈరోజు ఎమ్మెల్సీ కవిత అరెస్టయి ఉండేవారా అని ప్రశ్నించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టును రాహుల్‌గాంధీ ఖండిస్తే సీఎం రేవంత్‌రెడ్డి మాత్రం సమర్థిస్తున్నా రని, రేవంత్‌రెడ్డి బీజేపీ ముఖ్యమంత్రా..? లేక కాంగ్రెస్ ముఖ్యమంత్రా అని నిలదీశారు. రాష్ట్రంలో పంటలు ఎండుతుంటే సీఎం రేవంత్ ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 180 మంది రైతులు, 38 మంది ఆటోడ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకుంటే ఏ ఒక్కరినీ పరామర్శించిన పాపాన పోలేదని విమర్శించారు. చోటే భాయ్‌కి బడే భాయ్ ఆశీర్వాదం చోటే భాయ్ సీఎం రేవంత్‌రెడ్డి.. బడే భాయ్ మోదీ ఆశీర్వాదం తీసుకున్నా రని, బీజేపీ, కాంగ్రెస్‌లు ఒక్కటేనని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ఒక్క ముస్లింను కూడా కేబినేట్లోకి తీసుకోలేదని విమర్శించారు. మైనార్టీల సంక్షేమ బడ్జెట్లోనూ కోత విధిస్తున్నారని, కనీసం రంజాన్ తోఫా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మెదక్ ఎంపీ అభ్యర్థి పి.వెంకట్రామ్రెడ్డి, ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, సునీతారెడ్డి, కొత్త ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఫోన్ ట్యాపింగ్‌పై పొలిటికల్ ఫైట్.. రేవంత్, కిషన్ రెడ్డికి కేటీఆర్ సవాల్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్‌పై పొలిటికల్ ఫైట్ నెలకొంది. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం నెలకొంది. తాజాగా ఫోన్ ట్యాంపింగ్ వ్యవహారంలో సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై విచారణ జరపాలని తెలిపారు. ఎవరెవరు తప్పులు చేశారో బయటపెట్టాలని అన్నారు. తప్పు చేసిన వాళ్లపై చర్చలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఇక్కడ భయపడేవాళ్లు ఎవరూ లేరని.. రేవంత్ రెడ్డి తననేం చేయలేడని అన్నారు. సికింద్రాబాద్ ఎంపీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఇష్టమొచ్చినట్లు నోరు పారేసుకోవద్దని.. ఆధారాలు ఉంటే బయటపెట్టాలని హెచ్చరించారు. ‘లిక్కర్ స్కాంలో ఏం ఉందో అదంతా బయటపెడుతా అని కిషన్ రెడ్డి అంటున్నాడు. ఆ కేసు కోర్టులోనే ఉంది. నిజంగా తప్పు జరిగితే కోర్టులో పెట్టు.. కోర్టులో జడ్జి శిక్ష వేస్తారు. ఇష్టమొచ్చినట్లు నోరు పారేసుకునుడు కాదు.. సికింద్రాబాద్‌కు ఏం చేశావో చెప్పి ఓట్లు అడుగు’ అని కేటీఆర్ సూచించారు. చదవండి: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై బీజేపీ సీరియస్ -
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై బీజేపీ సీరియస్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంచలనం రేకెత్తిస్తోంది. రోజురోజుకీ కీలక మలుపులు తిరుగుతోంది. తాజాగా ఫోన్ ట్యాపింగ్ అంశంపై కేంద్రమంత్రి, రాష్ట్ర బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బాధ్యులు అప్పటి ముఖ్యమంత్రేనని పరోక్షంగా కేసీఆర్‌ను ఉద్ధేశిస్తూ వ్యాఖ్యానించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై న్యాయవిచారణ జరగాలని డిమాండ్ చేశారు. బీజేపీ నేతల ఫోన్లూ ట్యాపింగ్ తమ ఆఫీసులో పనిచేసిన నేతలు, ఆఫీసు సిబ్బంది ఫోన్లు కూడా ట్యాపింగ్ జరిగినట్లు ఆధారాలు బయటపడుతున్నాయన్నారు కిషన్ రెడ్డి. 2019లో బీజేపీ అధికారిక అకౌంట్ నుంచి డబ్బులు డ్రా చేసుకొని వెళ్తుంటే తమ కార్యాలయ సిబ్బందిని బంధించారని తెలిపారు. అప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేసి తమ వాళ్లను బంధించారని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఓ వెలుగు వెలిగిన అధికారులు ఈ కేసులో ఉన్నారని తెలిసిందన్నారు కిషన్ రెడ్డి. దేశ భద్రత, ఉగ్రవాద నిర్మూలన అంశాల్లో మాత్రమే అనుమతితో ఫోన్ ట్యాపింగ్ చేసే అధికారం ఉందన్నారు. అవినీతి, అధికారం కోసం ఫోన్ ట్యాపింగ్ చేయడం అతిపెద్ద నేరమని తెలిపారు. రాజకీయ నేతలవే కాకుండా వ్యాపారస్తుల ఫోన్ల ద్వారా వ్యక్తిగత విషయాలు ట్యాపింగ్ చేశారని విమర్శించారు. పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగించారని మండిపడ్డారు కవిత పాత్ర లేకపోతే బహిరంగ చర్చకు రావాలి ‘కవిత అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేశారని కేటీఆర్ అంటున్నారు. కవిత ఢిల్లీ లిక్కర్ వ్యాపారంలో జోక్యం చేసుకున్నారా లేదా?. కేటీఆర్ ఆయన కుటుంబ సభ్యులు సమాధానం చెప్పాలి. షెల్ కంపెనీలు పెట్టీ బినామీ వ్యక్తుల్ని పెట్టరా లేదా..? ఆప్ ప్రభుత్వంతో కవిత చర్చలు జరిపారా లేదా? రూ. వందల కోట్లు చేతులు మారాయా లేదా? అని ప్రశ్నించారు. కవిత లిక్కర్ స్కాంపై కేసీఆర్ స్పందించాలి.క విత లిక్కర్ వ్యాపారానికి, అరెస్టుకు తెలంగాణకు ఎలాంటి సంబంధం లేదు. కేసీఆర్‌కు సవాల్ కవితది అక్రమ కేసు అనుకుంటే కేసీఆర్ బహిరంగ చర్చకు వస్తారా..?. కేసీఆర్, బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు అబద్ధాలు ఆడటంలో అగ్రగాములు. కడిగిన ముత్యంలా తిరిగి వస్తా అని కవిత అన్నారు. ఎందులో కడిగించుకొని వస్తారో చెప్పాలి. సికింద్రాబాద్‌కు కేంద్రమంత్రిగా ఎం చేశానో ప్రజలకు తెలుసు. కేటీఆర్‌కు దమ్ము ధైర్యం ఉంటే చర్చకు రావాలి. వాళ్ళు చెప్పేవన్నీ అబద్ధాలే’ అని కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. ఫోన్ ట్యాపింగ్‌లో నేనూ బాధితుడినే: రఘునందన్ రావు 2 జూన్ 2014 తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఫోన్ ట్యాపింగ్ మొట్టమొదటి బాధితుడు ఇప్పటి సీఎం రేవంత్ , 2015 ఓటుకు నోటు కేసులో ఫోన్ ట్యాప్ చేసి ఆయన్ని అరెస్ట్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ రెండో బాధితుడు రఘునందన్ రావు. బీజేపీ నేత BL సంతోష్ ఫోన్ కూడా ట్యాప్ చేశారు. రేవంత్ రెడ్డికి సూటి ప్రశ్న వేస్తున్నా. ఈ కేసుపై సమగ్రమైన విచారణ జరుపుతారా? మీకు చిత్త శుద్ధి ఉందా సీఎం రేవంత్?. మీ బిడ్డ పెళ్లికి పేరోల్ మీద బయటికి వచ్చారు. మీరు అధికారులను ఎందుకు క్షమిస్తున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత డీజీఏపీకి అటాచ్ అయిన శ్రీనాథ్ రెడ్డి ఎవరు? డీజీపీ మహేందర్ రెడ్డి రిటైర్ అయిన తర్వాత ఎక్కడున్నారు? కేసీఆర్@ A1 అమెరికాకి ఇద్దరు వ్యక్తుల్ని ఎవరు పంపారు తెలియాలి. టెలిఫోన్ ట్యాపింగ్ పరికరాలు ఎప్పుడు, ఏంతకు కొన్నారు తెలియాలి. సీఎం రేవంత్ దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలి. మీకు నచ్చినట్టు విచారణ జరిపిస్తే ఎలా? రఘునందన్ రావు దుబ్బాక ఉప ఎన్నికలో పోటీ చేసినప్పుడు అప్పటి మంత్రి హరీష్ రావు, కేసీఆర్‌కు తెలియదా? ఈ కేసులో మొదటి ముద్దాయిగా మాజీ సీఎం కేసీఆర్‌ను పెట్టాలి. రెండో ముద్దాయి హరీష్ రావుని పెట్టాలి. మూడో ముద్దాయి అప్పటి జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి. ఆ తర్వాతే మిగతా పోలీస్ ఆఫీసర్లు. మీ ఫోన్ ట్యాప్ చేయమని చెప్పిన కేసీఆర్‌ను ముద్దాయిగా చేర్చాలి. కుటుంబ సభ్యుల ఫోన్లు వినే అధికారం ఎవరికి లేదు. రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఉప ఎన్నికలో ఓడిపోవడానికి కారణం కేసీఆర్ చేసిన ఫోన్ ట్యాపింగ్. రెండో ముద్దాయి కేటీఆర్, మూడో ముద్దాయి హరీష్ రావు, నాలుగో ముద్దాయి జగదీష్ రెడ్డి. ఓ టీవీ ఛానెల్లో ఫోన్ ట్యాపింగ్ చేస్తారా ఇంతకీ దిగజారుతారా?. నేను బాధితుడిగా మాట్లాడుతున్నకేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ పాస్ పోర్టు సీజ్ చేయాలి. రేవంత్‌తో హరీష్‌రావు విమాన ప్రయాణం? నిన్న మాజీ మంత్రులు ముగ్గురు రహస్య సమావేశం అయ్యారు. కేసీఆర్ మాస్టర్ స్కెచ్ వేసి హరీష్ రావు కాంగ్రెస్‌లోకి వెళ్తున్నాడని వార్తలు వస్తున్నాయి. 19 మార్చి రాత్రి 10.15కి సీఎం రేవంత్, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఒకే విమానంలో ప్రయాణం చేశారు. విమానంలో రెండు గంటలు ఇద్దరు ఏం మాట్లాడారో తెలియాలి. సీఎం రేవంత్, హరీష్ రావు మధ్య ఏం సంభాషణ జరిగింది. మెదక్ ఎంపీ కాంగ్రెస్ టికెట్ గురించి చర్చ జరిగిందా?. 26 మంది ఎమ్మెల్యేలతో కాంగ్రెస్‌లోకి వస్తాను అన్నావా?. మెదక్ ఎంపీ ఎన్నికల వరకు మా ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ లోకి తోసుకోకుమని చెప్పావా?. అసలేం మాట్లాడారో తెలియాలి. సినిమా హీరోయిన్ల ఫోన్లు కూడా ట్యాపింగ్ హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్లను అరెస్ట్ చేయాలి. ఎమ్మెల్సీ నవీన్ రావుని కూడా అరెస్ట్ చేయాలి. ఇప్పటికే ముగ్గురు విదేశాలకి పారిపోయారు అంటున్నారు. వీళ్ళని కూడా విదేశాలకు పొమ్మంటున్నారా?. 2015లో డీజీపీ ఎవరో అతన్ని విచారించాలి. హైకోర్టు జడ్జీలు, సినిమా హీరోయిన్ల ఫోన్లను కూడా ట్యాప్ చేశారు. 13 కోట్ల ఎలక్టోరల్ బాండ్స్ ఒక సంస్థ నుంచి ఎత్తుకు వచ్చారు. ఈ కేసులో అందరిని ముద్దాయిలుగా చేర్చాలి. కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఫోన్లు సైతం.. ఈ కేసులో కొందరిని ఇరికించి కొందరిని కాపాడే కుట్ర జరుగుతుంది. సీఎం రేవంత్, డీజీపీ ఈ కేసును పూర్తిస్థాయిలో విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నా. నాకు నోటీస్‌లు పంపిస్తే నా దగ్గర ఉన్న ఆధారాలు సమర్పిస్తా. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. కర్ణాటక ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఫోన్లు ట్యాప్ చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఈ కేసును వాడుకుంటారా నిజాలు తెలుస్తారా సీఎం చెప్పాలి. ట్యాపింగ్ జరగపోతే కేసీఆర్‌కు ఎలా తెలుస్తాయి? బీఎల్ సంతోష్‌ను అనవసరంగా కేసులో ఇరికించారు. ఎమ్మెల్యేలు పార్టీ మారుతాం అంటే కేసీఆర్ బెదిరించి ఇలా ప్లాన్ చేశారు. బీఎల్ సంతోష్ కేసులో ఆడియో, వీడియోలు కేసీఆర్ చూపెట్టారు. టెలిఫోన్ ట్యాపింగ్ జరగకపోతే ఇవన్నీ కేసీఆర్‌కు ఎలా తెలుస్తాయి? హైకోర్టు చీఫ్ జస్టిస్‌తో ఈకేసుని విచారణ చేయాలి. సీబీఐపై నమ్మకం ఉంటే ఈ కేసుని సీబీఐకి అప్పగించాలి. అందరూ అధికారులు మళ్ళీ మీ చుట్టే చేరుతున్నారు సీఎం రేవంత్ జాగ్రత్తగా ఉండాలి’ అని రఘునందన్ రావు పేర్కొన్నారు. -
కవిత అరెస్ట్, ఫోన్ ట్యాపింగ్‌పై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందన్నారు. దర్యాప్తు సంస్థలను అడ్డం పెట్టుకొని బీజేపీ శిఖండి రాజకీయాలకు పాల్పడుతోందని విమర్శించారు. అధికార కాంగ్రెస్ చిల్లర రాజకీయాలు చేస్తోందని కేటీఆర్ ధ్వజమెత్తారు. కవితను అరెస్ట్ చేయలేదు. కాబట్టి బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే అంటూ దుష్ప్రచారం చేసిందని మండిపడ్డారు. నేడు పగబట్టి కవితను అరెస్ట్ చేశారన్నారు. ఇద్దరు ముఖ్యమంత్రులను కూడా అరెస్ట్ చేశారని, ఇపుడు కాంగ్రెస్ ఏమంటది ప్రశ్నించారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే అంటూ కాంగ్రెస్ చేసిన దుష్ప్రచారాన్ని హైదరాబాద్‌లో ఎవరూ నమ్మలేదని అన్నారు. దానం అవకాశవాది పార్టీ మారిన ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. దానం నాగేందర్ పార్టీ మారి తప్పు చేశాడని మండిపడ్డారు. అవకాశవాద రాజకీయాల కోసం పార్టీ మారాడని, ఆయనకు ఓటు వేసిన కార్యకర్తలను మోసం చేసి వెన్నుపోటు పొడిచారని అన్నారు. రెండు పడవల మీద నడవడం మంచిది కాదని హితవు పలికారు. ఆయన్ను అనర్హుడిగా ప్రకటించాలని కోరుతూ దానంపై స్పీకర్‌కు ఫిర్యాదు చేశామని తెలిపారు. అనర్హత వేటు వేయకపోతే సుప్రీం కోర్టు వరకు వెళ్లి అయన్ను అనర్హుడిగా ప్రకటింపజేస్తామని చెప్పారు. మనకు పోటీ బీజేపీతోటే.. ‘సికింద్రాబాద్ లో మనకి పోటీ బీజేపీతోనే. కాంగ్రెస్ మనకు పోటీ కాదు. కిషన్ రెడ్డి సికింద్రబాద్‌లో ఎంపీగా ఉండి చేసిందేమీ లేదు. అంబర్ పేటలో పోటీ చేయకుండా భయపడి వెళ్ళాడు. ఈ సారి కిషన్ రెడ్డికి సానుభూతి లేదు. కరోనా సమయంలో కుర్ కురేలు పంచాడు. అతన్ని చాలామంది కిషన్ రెడ్డి అనటం లేదు. కుర్ కురె రెడ్డి అంటున్నారు మేము కాళేశ్వరం ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తే కిషన్ రెడ్డి మాత్రం రైల్వే స్టేషన్లో లిఫ్టులు ప్రారంభం చేస్తున్నాడు. అంబర్ పేట ఫ్లై ఓవర్, ఉప్పల్ ఫ్లై ఓవర్లు పూర్తి చేయించలేని పరిస్థితిలో కిషన్ రెడ్డి ఉన్నాడు . బీఆర్ఎస్ జైత్రయాత్ర ఇక్కడి నుంచే మళ్లీ ప్రారంభం సికింద్రాబాద్‌లో విఫలమైన ఎంపీ కిషన్ రెడ్డి, ఎటు అధికారం ఉంటే అటు పోయే దానం నాగేందర్, వ్యక్తిత్వం, సాయపడే గుణం ఉన్న పద్మారావు పోటీలో ఉన్నారని కేటీఆర్ తెలిపారు. కిషన్ రెడ్డిని ఓడించి ప్రధాని మోదీకి స్పష్టమైన సందేశం పంపాలని పార్టీ శ్రేణులను పిలుపునిచ్చారు. పద్మారావు గౌడ్ గెలుపుతో బీఆర్ఎస్ జైత్రయాత్ర మళ్లీ ప్రారంభం కావాలని చెప్పారు.. కాంగ్రెస్‌కు 40 కూడా రావు.. బీజేపీ, మోదీని ఆపాలంటే కేసీఆర్, మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ లాంటి ప్రాంతీయ పార్టీల నేతలతోనే సాధ్యం. రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీయా.. బీజేపీనా అర్థం కావడం లేదు. చౌకీదార్ చోర్ అని రాహుల్ గాంధీ అంటే.. రేవంత్ బడే భాయ్ అంటారు. నరేంద్ర మోదీ చోటా భాయ్ రేవంత్ రెడ్డి గుజరాత్ మోడల్‌ను పొగుడుతారు. రేవంత్ బీజేపీ పాట పాడుతున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవదు. ఆ పార్టీకి 40 సీట్లు కూడా రావు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీజేపీలోకి పోయే మొదటి నేత రేవంత్ రెడ్డినే. జీవితాంతం కాంగ్రెస్‌లో ఉంటా అని సీఎం ఎందుకు చెప్పడం లేదు? లంకెబిందెల కోసం అర్ధరాత్రి దొంగలు తిరగతారు. పేగులు మెడలో వేసుకుంటా అంటారు.. ముఖ్యమంత్రివా, బోటీ కొట్టేవారా? జేబులో కత్తెర పెట్టుకొని తిరిగే వాళ్ళు పక్కా జేబు దొంగలు. జేబులో కత్తెర ఉంటే ఏమైనా అయితే జాగ్రత్త. భయపడేవాళ్లు లేరు లిక్కర్ స్కాంలో అన్ని బయట పెడతామని కిషన్ రెడ్డి అంటున్నారు... కోర్టుకు ఇవ్వండి ఎవరు వద్దన్నారు? పనిచేయ చేతగాక ఫోన్ ట్యాపింగ్ అని లీకులు ఇస్తున్నారు. అధికారంలో ఉన్నారు, తప్పు జరిగితే విచారణ చేసి చర్యలు తీసుకోండి. భయపడే వాళ్లు లేరు. ఢిల్లీకి కప్పం కట్టేందుకు రూ 2,500 కోట్లు సిద్దం చేశారు. అందరినీ బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారు. హైదరాబాద్ పరిధిలో గత మూడు నెలలుగా భవన నిర్మాణ అనుమతులు ఎందుకు అపారు? హైదరాబాద్ లో 8 లక్షల కుటుంబాలకు మంచినీటి బిల్లుల భారం మోపారు... బీఆర్ఎస్ తరపున పోరాడతాం. కాంగ్రెస్ నమ్ముకొన్నది అబద్దాల ప్రచారం మాత్రమే. జై శ్రీరాం ఎవరికీ అభ్యంతరం లేదు.. కానీ, రాముడిని అడ్డం పెట్టుకొని రాజకీయం చేయడం భావ్యం కాదు’ అని కేటీఆర్ పేర్కొన్నారు. -
కడిగిన ముత్యంలా బయటకొస్తా.. కవిత సంచలన ఆరోపణలు
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలకు దిగారు. ఈడీ తనపై పెట్టింది మనీలాండరింగ్ కేసు కాదని.. ఇది పొలిటికల్ లాండరింగ్ కేసు అని అన్నారామె. ఈ క్రమంలో తప్పు చేయని తాను కడిగిన ముత్యంలా తాను బయటకు వస్తానంటూ వ్యాఖ్యానించారు. ఈడీ కస్టడీ ముగియడంతో మంగళవారం ఉదయం కవితను అధికారులు రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టారు. ఆ సమయంలో కోర్టు ప్రాంగణంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ‘‘నేను తప్పుచేయలేదు. కడిగిన ముత్యంలా బయటకు వస్తా. ఇది మనీల్యాండరింగ్ కేసు కాదు.. పొలిటికల్ ల్యాండరింగ్ కేసు. తాత్కాలికంగా నన్ను జైల్లో పెడతారేమో.. నా ఆత్మస్థైర్యాన్ని మాత్రం దెబ్బ తీయలేరు. .. ఈ కేసులో ఒక నిందితుడు ఇప్పటికే బీజేపీలో చేరారు. మరో నిందితుడికి బీజేపీ టికెట్ ఇచ్చింది. మూడో నిందితుడు బీజేపీకి రూ.50 కోట్లు ఎన్నికల బాండ్ల రూపంలో విరాళంగా ఇచ్చాడు. ఇది తప్పుడు కేసు. క్లీన్‌గా బయటకు వస్తా.. అప్రూవర్‌గా మారేది లేదు. జై తెలంగాణ అంటూ కవిత నినాదాలు చేస్తూ కోర్టు హాల్లోనికి వెళ్లారు. మరోవైపు ఆమె మద్దతుదారులు, బీఆర్ఎస్ నేతలు కోర్టు ప్రాంగణంలో జై తెలంగాణ నినాదాలు చేస్తూ కనిపించారు.