breaking news
-
ఎనుముల కాదు.. ఎగవేతల రేవంత్‌రెడ్డి: హరీశ్‌రావు
సాక్షి, సిద్దిపేట/నంగనూరు: హామీలన్నీ తుంగలో తొక్కుతున్న సీఎం.. ఇక నుంచి ఎనుముల రేవంత్‌రెడ్డి కాదని, ఎగవేతల రేవంత్‌రెడ్డి అని మాజీమంత్రి తన్నీరు హరీశ్‌రావు ఫైర్ అయ్యారు. ఇప్పటికైనా ఇచ్చిన హామీలు అమలు చేయాలన్నారు. సిద్దిపేట జిల్లా నంగనూరు మండలకేంద్రంలో శుక్రవారం రైతు ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న హరీశ్‌రావు మాట్లాడుతూ దసరాలోపు రైతులందరికీ రుణ మాఫీ చేయాలని, లేకపోతే రైతులందరితో కలిసి సచివాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు.రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ జరిగే వరకు రేవంత్‌రెడ్డి గుండెల్లో నిద్రపోతా అన్నారు. ఒక్క నంగనూరు మండలంలోనే 11 వేల మంది రైతులు రుణాలు తీసుకుంటే, కేవలం 5,102 మందికే మాఫీ అయ్యిందని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని చెబుతున్న సీఎం.. మల్లన్నసాగర్, రంగనాయకసాగర్ ఎలా నిండిందో చెప్పాలన్నారు. దసరాలోపు మాఫీ చేయకుంటే రైతులతో కలసి సచివాలయం ముట్టడిస్తామని చెప్పారు. -
మాది నిర్మాణం.. కాంగ్రెస్‌ది విధ్వంసం: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: కేసీఆర్ ప్రభుత్వం లక్ష డబుల్ బెడ్ రూం ఇళ్లను నిర్మించిందనే వాస్తవాన్ని.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్టకేలకు అంగీకరించిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అన్నారు. మూసీ నది పునరుద్ధరణలో ఇళ్లు కోల్పోతున్న వారికి.. డబుల్ బెడ్ రూం ఇళ్లు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేయడమే దీనికి నిదర్శనమన్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణంపై ఇన్నాళ్లూ కాంగ్రెస్ పార్టీ చేసిన విష ప్రచారం, అబద్ధాలకు తాజా ఉత్తర్వులే సాక్ష్యమని ‘ఎక్స్’వేదికగా కేటీఆర్ పేర్కొన్నారు. ‘మేము నిర్మిస్తే.. మీరు కూల్చేస్తున్నారు.మాది నిర్మాణం.. మీది విధ్వంసం. లక్షల నిర్మాణాలు మావి.. లక్షల కూల్చివేతలు మీవి. డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టలేదని ఇన్నాళ్లూ ప్రజలను మభ్యపెట్టారు. మరి లక్ష ఇళ్లు రాత్రికి రాత్రే ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాయి. మీ జూటా మాటలు, కుట్రలు, మెదడు తక్కువ పనుల ద్వారా జరుగుతున్న నష్టాన్ని నివారించేందుకు నేడు కేసీఆర్ పాలనలో జరిగిన నిర్మాణాలే దిక్కయ్యాయి’.. అని కేటీఆర్ మండిపడ్డారు. -
‘హైడ్రా’తో డైవర్షన్ పాలిటిక్స్: డీకే అరుణ
సాక్షి,హైదరాబాద్:డబ్బు సంచులను కాంగ్రెస్ అధిష్టానానికి సమకూర్చడానికి,ఆరు గ్యారెంటీలపై నుంచి ప్రజల దృష్టిమరల్చడానికే రాష్ట్ర ప్రభుత్వం హైడ్రాను తెరపైకి తెచ్చిందని బీజేపీ ఎంపీ డీకే అరుణ విమర్శించారు. ఈ విషయమై డీకే అరుణ శుక్రవారం(సెప్టెంబర్27)మీడియాతో మాట్లాడారు.‘సామాన్యులను ఉన్నఫలంగా నిరాశ్రయులను చేయడం ఎంత వరకు న్యాయం.హైడ్రా పేరుతో ప్రభుత్వం ప్రజలను బెంబేలెత్తిస్తోంది.హైదరాబాద్ అభివృద్ధి ప్రశ్నార్థకంగా మారింది.హైదరాబాద్ రావాలంటే పెట్టుబడిదారులు భయపడాల్సిన పరిస్థితి.కేసీఆర్‌కు మించిన అవినీతిని రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తోంది.కాంగ్రెస్ ప్రభుత్వ దోపిడీ ప్రజలు గమనిస్తున్నారు.అడ్డగోలుగా టెండర్లు కట్టబెట్టి ప్రాజెక్టులు కేటాయిస్తున్నారు.ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నేతలు మాట్లాడిన మాటలు మర్చిపోయారా ? నిబంధనలు అందరికీ ఒకేలా ఉండాలి.కొందరికి ఒకలా మరికొందరికి ఇంకోలా నిబంధనలు పెడుతున్నారు.కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రజలకు హామీలు ఇచ్చి మభ్యపెట్టి మోసం చేశారు.వక్ఫ్ యాక్ట్ 2024 సవరణ బిల్లుపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) రేపు హైదరాబాద్‌కు రానుంది.వివిధ రాష్ట్రాల్లో కమిటీ ఇప్పటికే పర్యటించింది. ఈక్రమంలోనే రేపు హైదరాబాద్‌లో కమిటీ పర్యటిస్తుంది.తాజ్ కృష్ణ హోటల్లో రేపు కమిటీని కలిసి వినతిపత్రాలు ఇవ్వవచ్చు.వక్ప్ సవరణ బిల్లుపై దుష్ప్రచారాలను ఎవరు నమ్మొద్దు.వక్ప్ బోర్డులు కొందరి చేతుల్లోనే ఉన్నాయి.పేద ముస్లీంలకు న్యాయం జరగాలనే లక్ష్యంతోనే ఎన్డీఏ ప్రభుత్వం సవరణ బిల్లును ప్రవేశపెట్టింది’అని డీకే అరుణ పేర్కొన్నారు. ఇదీచదవండి: నిజాంకన్నా దుర్గార్ముడు సీఎం రేవంత్‌రెడ్డి: ఎంపీ ఈటల -
TG: ప్రభుత్వానికి హరీశ్‌రావు డెడ్‌లైన్
సాక్షి,సిద్ధిపేటజిల్లా:రుణమాఫీ విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి మాజీ మంత్రి హరీష్‌రావు డెడ్‌లైన్ విధించారు.దసరాలోపు రైతులందరికీ రుణమాఫీ చేయాలని అల్టిమేటం ఇచ్చారు. శుక్రవారం(సెప్టెంబర్27) సిద్దిపేట జిల్లా నంగునూరు వేదికగా రైతు ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడారు. దసరా లోపు రుణమాఫీ చేయకుంటే రైతులతో కలిసి హైదరాబాద్‌లోని సచివాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.ఇదీచదవండి: నిజాం కన్నా దుర్గార్గుడు సీఎం రేవంత్: ఈటల -
పొంగులేటి ఇంట్లో ఈడీ దాడులు బీజేపీ రాజకీయ కుట్రే: అద్దంకి దయాకర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసాల్లో ఈడీ దాడుల ఘటన రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో ఈడీ దాడులు.. బీజేపీ ఆడుతున్న రాజకీయ కుట్ర అని అద్దంకి దయాకర్ ఘాటు విమర్శలు చేశారు.మంత్రి పొంగులేటి ఇంట్లో ఈడీ దాడులపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ తాజాగా స్పందించారు. ఈ సందర్భంగా దయాకర్ మాట్లాడుతూ.. ఈడీ దాడులు బీజేపీ రాజకీయ కుట్ర. ప్రభుత్వంలో ఉన్న పెద్దలపై దాడులు చేసి బీజేపీ భయపెట్టాలని చూస్తోంది. రాజకీయ వ్యతిరేక పక్షాలపై నిరంతరం దాడులు చేయడమే బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రభుత్వంలో ఉన్న నాయకులను భయపెట్టి మానసికంగా దెబ్బకొట్టాలని బీజేపీ చూస్తోంది.కర్ణాటకలో కూడా బీజేపీ ఇదే తరహాలో ముందుకు సాగింది. డీకే శివ కుమార్‌పై కూడా ఇలాగే దాడుల ప్రయోగం చేశారు. కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను కూడా వదలకుండా కేంద్రంలోని బీజేపీ.. ఈడీ దాడులు చేయించింది. దీనికి బీజేపీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పుదు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇది కూడా చదవండి: హైడ్రా ఎఫెక్ట్.. మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉద్రిక్తత -
నిజాం కన్నా దుర్మార్గుడు రేవంత్: ఎంపీ ఈటల ఫైర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో నిజాం సర్కార్ కంటే దుర్మార్గమైన పాలన చేస్తున్నాడు సీఎం రేవంత్ రెడ్డి అని మండిపడ్డారు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్. శని, ఆదివారాలు చూసుకుని పేదల ఇళ్లను కూల్చివేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఆనందిస్తోందా? అని ప్రశ్నించారు.హైడ్రా బాధితులు శుక్రవారం బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌ను కలిశారు. ఈ సందర్బంగా అక్రమంగా తమ ఇళ్లను కూల్చివేసినట్టు వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఎంపీ ఈటల మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో పేదలు కంటి మీద కునుకు లేకుండా బతుకుతున్నారు. రేవంత్ పాలన నిజాం సర్కార్ కంటే దుర్మార్గంగా ఉంది. హైడ్రా పేరుతో డ్రామాలు చేస్తున్నారు. శని, ఆదివారాలు చూసుకొని ఇళ్లను కూలగొడుతున్నారు.సంజయ్ గాంధీ కూడా ఢిల్లీలో మారుతీ కంపెనీ కోసం పేదల ఇళ్లను కూలగొట్టారు. ఆయనకు వారి ఉసురు తగిలింది అంటారు. పేదల కళ్ళలో నీళ్లు చూసేవారికి ఎప్పుడు మంచి జరగదు. పోయేకాలం వచ్చినట్టుంది కాబట్టే ఎలా ప్రవర్తిస్తున్నారు. పేదలతో పెట్టుకున్న ప్రభుత్వం బాగుపడినట్టు చరిత్రలోనే లేదు. జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు కానీ.. లక్ష కోట్లు పెట్టి మూసీ సుందరీ కరణ చేస్తారట. బట్టలు లేవు కానీ బంగారం కొనిపిస్తా అన్నట్టు ఉంది కాంగ్రెస్ నేతల తీరు. మేక వన్నె పులులు ఎన్నికలప్పుడు ముసలి కన్నీరు కారుస్తూ ఓట్లు అడిగారు. ఇప్పుడు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ప్రజలు ఎవరూ ఆందోళన పడవద్దు. నేను ఉన్నంత వరకు మీ పక్షాన కొట్లాడుతాను’ అంటూ కామెంట్స్ చేశారు.ఇది కూడా చదవండి: మంత్రి పొంగులేటి నివాసంలో ఈడీ సోదాలు -
ఫార్మాసిటీ రద్దు వెనుక వేల కోట్ల భూస్కాం
సిరిసిల్ల/సాక్షి, హైదరాబాద్: ఫార్మాసిటీ రద్దు వెనుక రూ.వేల కోట్ల భూకుంభకోణం ఉందని మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఫార్మాసిటీ పేరిట సేకరించిన భూములను ఇతర రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు వినియోగిస్తే చూస్తూ ఊరుకోబోమన్నారు. 14 వేల ఎకరాలను తాము సేకరిస్తే ఒక్క ఎక రం కూడా సేకరించకుండా సీఎం రేవంత్‌రెడ్డి ఫ్యూచర్ సిటీ, ఫోర్త్ సిటీ అంటూ.. ఫోర్బ్రదర్స్కు రియల్ ఎస్టేట్ దందా కోసం ఇవ్వాలని చూస్తున్నారని ఆరోపించారు. న్యాయమూర్తులు సైతం ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరారు.రాజన్నసిరిసిల్ల జిల్లాలో గురువారం పలు కార్యక్రమా ల్లో పాల్గొన్న కేటీఆర్ సిరిసిల్లలోని తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. ‘ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఓ పిచ్చోడు.. ఆయనకేం తెల్వదు.. ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండానే 35 వేల ఉద్యోగాలు ఇచ్చినం అంటాడు.. 22 మంది నేతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటే పట్టించుకోడు.. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే స్పందించడు. సిరిసిల్ల నేతన్నల ఉపాధి కోసం బతుకమ్మ చీర ల పథకాన్ని తెస్తే దాన్ని బంద్ చేసిండ్రు.. కేసీఆర్ కిట్లు లేవు.. రంజాన్ తోఫా లేదు.. క్రిస్మస్ కానుక లేదు. సిరిసిల్లకు ఏడేళ్లలో రూ.3,312 కోట్ల ఆర్డర్లు ఇచ్చి రూ.200 కోట్ల బకాయిలుంటే.. మేమే ఇస్తున్నామని పోజు లు కొడుతున్నారు. మళ్లీ మా ప్రభుత్వమే వస్తుందనే అంచనాతో డబుల్ బెడ్రూం ఇళ్లను కట్టి లబి్ధదారులకు అందించలేకపోయాం. 1.65 లక్షల ఉద్యోగాలు ఇచ్చి కూడా చెప్పుకోలేకపోయాం’ అని పేర్కొన్నారు. తనపై కోపం, పగ ఉంటే.. తనతోనే చూసుకోవాలి.. కానీ సిరిసిల్ల నేతన్నలను గోస పెట్టవద్దని కోరారు. రికవరీ చేస్తాం... రైతుల రుణమాఫీ కాలేదు.. రైతు భరోసా సీజన్ అయిపోయినా.. అందలేదు.. కాంగ్రెసోళ్లు ఊళ్లలోకి వెళ్తే రైతులు తన్నేటట్లు ఉన్నారని కేటీఆర్ దుయ్యబట్టారు. కొందరు అధికారులు ఆలిండియా సరీ్వస్ స్థాయిలో ఉన్న వాళ్లు కాంగ్రెస్ కార్యకర్తల్లా పనిచేస్తున్నారని.. ఇష్టారాజ్యంగా పనిచేస్తే.. ఆర్డీ వో అయినా.. కలెక్టర్ అయినా.. వడ్డీతో స హా చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించా రు. రిటైరై వెళ్లిపోయినా జరిగిన నష్టాన్ని సంబంధిత అధికారి నుంచి రికవరీ చేస్తామని హె చ్చరించారు.హైడ్రా పేరిట హైడ్రామా చేస్తున్నారని, తన అన్న తిరుపతిరెడ్డికి నోటీసులు ఇచ్చి వదిలేశారని, అదే పేదోళ్ల ఇళ్లను కూలగొడుతున్నారని ఆరోపించారు. మూసీ బాధితులకు డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తామంటున్న సీఎం ఒక్క ఇల్లు అయినా కట్టించాడా? అని ప్రశ్నించారు. సిరిసిల్లలో తనపై నాలుగుసార్లు ఓడిపోయిన వ్యక్తి ఎలాంటి ప దవి లేకపోయినా రేషన్ షాపులను అక్రమంగా అనుచరులకు కట్టబెట్టారన్నారు. హైకోర్టునూ మోసం చేస్తున్నారు... ఫార్మాసిటీ వ్యవహారంలో నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలతో పాటు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందని కేటీఆర్ మండిపడ్డారు. ‘ఎన్నికల ప్రచారంలో హైదరాబాద్ ఫార్మాసిటీని రద్దు చేసి రైతులకు భూమిని తిరిగి ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే ఫార్మా సిటీని రద్దు చేసింది. ఫార్మాసిటీ పేరు మార్చి ఫ్యూచర్ సిటీ, ఫోర్త్ సిటీ, ఆర్టిఫిషియల్ఇంటెలిజెన్స్ ఏఐ సిటీ అని రకరకాల కొత్త పేర్లను తెరపైకి తెచ్చి అతి పెద్ద కుంభకోణానికి స్కెచ్ వేసింది. ఫార్మాసిటీ విషయంలో హైకోర్టును, న్యా యమూర్తులను కూడా తప్పుదోవ పట్టించే విధంగా కోర్టులో ప్రభుత్వం అబద్ధాలు చెబుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఒక్క ఎకరం భూమి కూడా సేకరించకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ, ఫోర్త్ సిటీ, ఫ్యూచర్ సిటీలను ఎక్కడ కడతారో చెప్పాలి’అని కేటీఆర్ నిలదీశారు. ఈ మేరకు కేటీఆర్ గురువారం బహిరంగ లేఖ రాశారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఫార్మాసిటీపై స్పష్టమైన ప్రకటన చేయడంతో పాటు హైకోర్టుకు వాస్తవ పరిస్థితులను తెలియజేయాలని డిమాండ్‌చేశారు. -
ఇళ్ల కూల్చివేతతో పేరు కోసం తాపత్రయం
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ఏ ప్రణాళిక లేకుండానే, హడావుడి చేసి నిత్యం వార్తల్లో ఉండే లక్ష్యంతో అక్రమ కట్టడాల పేరిట ఇళ్ల కూల్చివేతలతో పేరు తెచ్చుకోవాలని భావిస్తోందని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి మండిపడ్డారు. అయితే ఈ కూల్చివేతల ప్రక్రియ న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా చేపట్టి ఉంటే బాగుండేదని ప్రజల అభిప్రాయమని సీఎం రేవంత్‌రెడ్డికి గురువారం రాసిన లేఖలో పేర్కొన్నారు. హైడ్రా బాధితులు తన దృష్టికి తీసుకొచ్చిన అంశాలు, మేధావుల ఆలోచనలు, నిత్యం వార్తాపత్రికలు, టీవీ చానళ్ల ద్వారా తెలుసుకుంటున్న అంశాలన్నింటితో ఈ లేఖ రాస్తున్నట్టు తెలిపారు. ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలను తాము సమరి్థంచబోమని, అయితే వీటిపై చర్యలు తీసుకునే సమయంలో సహజ న్యాయ సూత్రాలకు (ప్రిన్సిపుల్స్ ఆఫ్ నేచురల్ జస్టిస్) అనుగుణంగా ఉండాలనేదే తమ ఉద్దేశమని స్పష్టం చేశారు. ముఖ్యంగా పేద, మధ్యతరగతి విషయంలో వీటి ఆధారంగానే పనిచేయాలనేది అందరి అభిప్రాయమని పేర్కొన్నారు. రాష్ట్రంలో చాలా కేసుల్లో సహజ న్యాయ సూత్రాలను ప్రభుత్వం పాటించడం లేదన్నారు. ఇవాళ అక్రమమని కూల్చేస్తున్న వాటి గురించి సున్నితంగా ఆలోచించాల్సిన అవసరముందని చెప్పారు. జీహెచ్ఎంసీ పరిధిలో ప్రస్తుతం అక్రమ కట్టడాలు అంటున్న ప్రాంతాల్లో వెలసిన ఇళ్లకు ప్రభుత్వ పక్షాన రూ.కోట్లు ఖర్చుచేసి రోడ్లు, డ్రైనేజీ సౌకర్యం, కరెంటు కనెక్షన్లు, కమ్యూనిటీ హాళ్లు, ఇంటి నంబరు కేటాయింపు వాస్తవం కాదా అని ప్రశ్నించారు. దశాబ్దాలుగా జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏల ద్వారా సేవలు పొందుతూ పన్నులు కడుతుండగా, ఇప్పుడు హఠాత్తుగా అక్రమం అంటే వారు ఎక్కడకు వెళ్లాలి? అందులోనూ పేద, మధ్యతరగతి ప్రజలు ఏమైపోవాలి? అని నిలదీశారు. గతంలో అనేకసార్లు కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలు అక్రమ నిర్మాణాలను రెగ్యులరైజ్ కూడా చేశాయన్నారు.మూసీ రివర్ బ్యూటిఫికేషన్లో భాగంగా గ్రేటర్ పరిధిలో ఇళ్లు కోల్పోయే వారితో చర్చించాలని సూచించారు. మూసీతోపాటు, ఇతర ప్రాంతాల్లో జరుగుతున్న కూల్చివేతల విషయంలోనూ ఎలాంటి దుందుడుకు విధానాలతో ముందుకెళ్లకూడదన్నారు. హైడ్రా పేరుతో ఏర్పాటు చేసిన విభాగంతో ప్రభుత్వం ఏకపక్షంగా ముందుకెళుతోందని చెప్పారు. దీనిపై పేద ప్రజలు చేస్తున్న ఆందోళనలను, వారి మనోవేదనను పరిగణనలోకి తీసుకోకుండా హైడ్రాకు మరిన్ని అధికారాలు కల్పించడాన్ని తప్పుబట్టారు. -
తప్పు చేయకూడదనే దానికి ఉదాహరణ కాళేశ్వరం ప్రాజెక్టు: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ నీటి పారుదల శాఖ లో కొత్తగా నియమకమైన 700 మంది ఏఈఈలకులకు సీఎం రేవంత్ రెడ్డి నియామక పత్రాలను అందజేశారు. ఎర్రమంజిల్‌లో జలసౌధలో గురువారం జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. తెలంగాణ ఇరిగేషన్‌ను ప్రపంచానికి చాటేలాగా అందరం కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు. జలవివాదాలు కారణంగా ప్రాజెక్టులు ఆలస్యం అవుతున్నాయని తెలిపారు. తెలంగాణలో ప్రాజెక్టులు ఎందుకు ఆలస్యం అయ్యాయో గత పది ఏళ్లలో చేశామని, ఆ పరిస్థితి మళ్లీ పునరావృతం కాకుండా చూడాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో రెండు లక్షల కోట్ల రూపాయలు ఇప్పటివరకు సాగునీటి ప్రాజెక్టుల కోసం ఖర్చు చేశామని తెలిపారు.‘నీళ్లు, నియామకాల ఆకాంక్షల కోసమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. నీళ్లు మన సంస్కృతిలో భాగస్వామ్యం.. అలాంటి శాఖకు మీరు ప్రతినిధులుగా నియామకమవుతున్నారు. తెలంగాణ ఏర్పడిన దశాబ్దం తరువాత నియామకాల ప్రక్రియ వేగంగా జరుగుతోంది. ఇది మీకు ఉద్యోగం కాదు.. ఇది మీకు ఒక భావోద్వేగం. తెలంగాణ ప్రజల భావోద్వేగం నీళ్లతో ముడిపడి ఉంది. వారి భావోద్వేగాలకు అనుగుణంగా నీళ్లను ఒడిసిపట్టి ప్రజలకు అందించాల్సిన బాధ్యత మీపై ఉంది. ఏ వృత్తిలోనైనా క్షేత్ర స్థాయిలో అనుభవం ఉన్నవాళ్లే రాణిస్తారు. రాజకీయాల్లోనూ క్షేత్ర స్థాయి నుంచి వచ్చిన వారే ఎక్కువ రాణిస్తారు.పీవీ నరసింహారావు, కోట్ల విజయ భాస్కర్ రెడ్డి, నీలం సంజీవ రెడ్డి లాంటి వారు సర్పంచ్ స్థాయి నుంచి ముఖ్యమంత్రులు, ప్రధానులుగా ఎదిగారు. నేను కూడా జిల్లా పరిషత్ మెంబర్ స్థాయి నుంచే సీఎం స్థాయికి వచ్చా. గతంలో ఇంజనీర్లు ఉదయం 5 గంటలకే క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లేవారు. ఫీల్డ్ విజిట్ చేసాకే రిపోర్టులు రాసే వారు. కానీ ఈ మధ్య క్షేత్ర స్థాయి పర్యటనలకు వెళ్లే వారు తగ్గిపోయారు. మేం అధికారంలోకి వచ్చాక అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించాల్సిందేనని ఆదేశించాం. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులకు లక్ష కోట్లు ఖర్చు చేస్తే.. కట్టడం కూలడం రెండూ జరిగాయి. అధికారులు జీవితంలో ఎలాంటి తప్పు చేయకూడదో దానికి ఉదాహరణ కాళేశ్వరం ప్రాజెక్టు. దీనికి ఎవరిని బాధ్యులను చేయాలో మీరే చెప్పాలి. అధికారులనా? రాజకీయ నాయకులనా?.మీ మోడల్ స్టడీకి కాళేశ్వరమే సరైన ఉదాహరణ. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నిర్మించిన మోక్షగుండం విశ్వేశ్వరయ్యను ఆదర్శంగా తీసుకోండి. కాళేశ్వరం విషయంలో అందరిపై చర్యలు తీసుకుంటే డిపార్ట్మెంటే ఉండదు. చర్యలు తీసుకోకపోతే చర్యలు తీసుకోవడం లేదని ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈఈ చెప్పారని ఒకరు, ఎస్ఈ చెప్పారని ఇంకొకరు.. ఇలా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. రాజకీయ నాయకులు తీసుకునే తప్పుడు నిర్ణయాలను అమలు చేయకుండా ఉంటే ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నం అయ్యేవి కాదు. లక్ష కోట్లు ఖర్చు చేసినా లక్ష ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేకపోయారు.పదేళ్లలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి కాకపోవడానికి కారణం ఏమిటో గమనించండి. 2లక్షల కోట్లు ఖర్చు చేసినా తెలంగాణలో ప్రాజెక్టులు పూర్తి కాలేదు. భవిష్యత్ లో ఇలాంటివి పునరావృతం కావొద్దు. తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో నీళ్లు అత్యంత కీలకం.ప్రాజెక్టుల పూర్తికి క్షేత్ర స్థాయిలో పని చేయాలి. రికమెండేషన్‌తో వచ్చే వారికి సుదూర ప్రాంతాల్లో పోస్టింగ్ ఇచ్చి పనిష్మెంట్ ఇవ్వండి. పని మీద శ్రద్ధ పెట్టండి.. పోస్టింగ్‌ల మీద కాదు. అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేస్తే తెలంగాణ దేశంలోనే ఆదర్శంగా నిలబడుతుంది. క్షేత్రస్థాయిలో పని చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించండి.’ అని పేర్కొన్నారు. -
వారి బతుకులు ఏమైపోవాలి?.. సీఎం రేవంత్‌కు కిషన్‌రెడ్డి లేఖ
సాక్షి, హైదరాబాద్: హైడ్రాతో ఏకపక్షంగా ముందుకెళ్తున్నారని.. ప్రభుత్వాలే అనుమతులిచ్చి ఇప్పుడు అక్రమం అంటే ఎలా? అంటూ ప్రశ్నిస్తూ.. సీఎం రేవంత్‌రెడ్డికి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి లేఖ రాశారు. పేద, మధ్య తరగతి ప్రజలు ఏమైపోవాలి?. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ ఇచ్చిన అనుమతులు తప్పు అని హైడ్రా ఎలా చెబుతుంది. కూల్చివేతలకు ముందు బాధితులతో చర్చించాలి’’ అని లేఖలో కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.‘‘హైడ్రా దూకుడు పేదలపై కాకుండా బాధితులతో చర్చించండి. ఇతర భాగస్వామ్య పక్షాలను పరిగణనలో తీసుకోండి. 30 ఏళ్ల క్రితం నిర్మించుకున్న ఇళ్లు అక్రమమని సర్కార్ కూల్చివేస్తే వారి బాధ ఎవరికి చెప్పుకోవాలి. అక్రమంగా భూములు అమ్మిన వారిని బాధ్యులను చేయాలి. రాత్రికి రాత్రి కట్టుబట్టలతో రోడ్డున పడేస్తే వాళ్ల బతుకులు ఏమైపోతాయి.’’ అంటూ లేఖలో కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.‘‘పాలకుల, అధికారుల అవినీతి, ఓటుబ్యాంకు రాజకీయాల కారణంగా పేదలు, మధ్యతరగతి ప్రజల నుంచి దళారులు దోచుకున్నారు. అన్ని అనుమతులున్న భవనాలను నేలమట్టం చేయడం బాధకరం. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ ఇచ్చే అనుమతులను తప్పు అని హైడ్రా ఎలా నిర్ణయిస్తుంది. మూసీ పరివాహ ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వేలాది మంది జీవనోపాధి ఇక్కడే ఉంటుంది. దుందుడుకు విధానాలతో ముందుకు వెళ్లవద్దు’’ అని లేఖలో రేవంత్‌కు కిషన్‌రెడ్డి సూచించారు.ఇదీ చదవండి: తస్మాత్ జాగ్రత్త..! కనిపించని కన్ను చూస్తోంది..!బ్యాంకులకు, బ్యాంకింగ్యేతర ఆర్థిక సంస్థలు రుణ నిబంధనలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకోవద్దు. కూల్చివేతలతో ప్రజలు ఆందోళనలో ఉన్నారని లేఖలో పేర్కొన్న కిషన్‌రెడ్డి.. ప్రభుత్వ అధికారుల వ్యవహార శైలితో గందరగోళానికి గురవుతున్నారన్నారు. అధికారులు ఎలాంటి ప్రకటనలు జారీ చేయకుండా ఆదేశాలివ్వాలని కిషన్‌రెడ్డి కోరారు. మీరు తీసుకునే నిర్ణయం అందరికీ న్యాయం జరిగేలా ఉండాలని సీఎంకు కిషన్‌రెడ్డి సూచించారు.‘‘ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందని పక్షంలో అవకాశం ఉన్నచోట పేదలు తమ కష్టాన్ని దారబోసి ఇళ్లను నిర్మించుకున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలు చేసిన మోసానికి గురయ్యారు. సహజ న్యాయ సూత్రాలను ప్రభుత్వం పాటించడం లేదు. ఆక్రమణలను, అక్రమ నిర్మాణాలను మేం సమర్థించం. ఆక్రమణలపై, ఆక్రమ నిర్మాణాలపై చట్టబద్దంగా, న్యాయబద్దంగా చర్యలు ఉండాలన్నదే మా ఉద్దేశ్యం. హడావుడి చేసి, నిత్యం వార్తల్లో ఉండేందుకే ప్రభుత్వం అక్రమ నిర్మాణాల కూల్చివేత’’ అంటూ లేఖలో కిషన్‌రెడ్డి నిలదీశారు. -
బీఆర్ఎస్ కుట్రలో భాగమే వరంగల్ ఆరు ముక్కలు: కడియం శ్రీహరి
సాక్షి, జనగామ: తెలంగాణలో అవినీతి, అక్రమాలకు మారుపేరు బీఆర్ఎస్ అంటూ సంచలన ఆరోపణలు చేశారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి. అలాగే, వరంగల్ చరిత్రను కనుమరుగు చేసేందుకే జిల్లాను ఆరు ముక్కలు చేశారని చెప్పుకొచ్చారు. జిల్లాను ముక్కలు చేయవద్దు అన్నందుకే తనకు రెండోసారి మంత్రి పదవి ఇవ్వలేదని కామెంట్స్ చేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారాయి.స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గురువారం మీడియాతో మాట్లాడుతూ..‘ప్రజాస్వామ్య వ్యవస్థను బీఆర్ఎస్ ప్రభుత్వమే కాలరాసింది. అవినీతి, అక్రమాలకు బీఆర్ఎస్ మారుపేరు. వరంగల్ చరిత్రను కనుమరుగు చేసేందుకు కేసీఆర్ కుట్ర పన్నారు. అందులో భాగంగానే జిల్లాను ఆరు ముక్కలు చేశారు. దీనిపై ప్రశ్నించినందుకే రెండో సారి నాకు మంత్రి పదవి ఇవ్వలేదు.కేసీఆర్ కుటుంబ చేతిలో తెలంగాణ బంధీ అయ్యింది. బీఆర్ఎస్ నేతలు సిగ్గులేకుండా ఇప్పుడు పార్టీ ఫిరాయింపులపై మాట్లాడటం విడ్డూరంగా ఉంది. ఏకంగా శాసనసభ పక్షాలను కలుపుకున్న చరిత్ర బీఆర్ఎస్ పార్టీది. ఇప్పట్లో తెలంగాణలో ఉప ఎన్నికలు రావు. ఒకవేళ వచ్చినా ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. స్టేషన్ ఘనపూర్‌లో ఎన్నికలు వస్తే బీఆర్ఎస్కు డిపాజిట్ కూడా రాదు. కోర్టులు, ప్రజాస్వామ్యంపై మాకు గౌరవం ఉంది’ అంటూ కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: మూసీ పరివాహక ప్రాంతాల్లో టెన్షన్.. అక్కడ భవనం కూల్చివేత -
హామీలు అడిగితే మహిళలను అరెస్ట్ చేస్తారా?: కేటీఆర్ ఫైర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రుణమాఫీ చేయాలని బ్యాంక్‌ల వద్దకు వెళ్లిన వారిని హింసిస్తారా? ఇదేనా ఇందిరమ్మ రాజ్యం, ఇదేనా ప్రజా పాలనా? అని ప్రశ్నించారు.కేటీఆర్ ట్విట్టర్ వేదికగా..‘తెలంగాణ గడ్డపై నిలబడి రైతు రుణమాఫీ అంటూ రైతు డిక్లరేషన్ ఇచ్చారు. తీరా అధికారంలోకి వచ్చాక.. రుణమాఫీ చేయండి అని బ్యాంకుకు వెళ్తే ఇలాంటి మాటలా? లక్ష రూపాయల రుణమాఫీ కావాలని వెళ్తే లక్ష రూపాయల ఖర్చు అయ్యేలా కేసులు పెడతారా? ఇదేనా ఇందిరమ్మ రాజ్యం, ఇదేనా ప్రజా పాలన?.తెలంగాణ గడ్డపై నిలబడి రైతు రుణమాఫీ అంటూ రైతు డిక్లరేషన్ ఇచ్చారు... తీరా అధికారంలోకి వచ్చాక... రుణమాఫీ చేయండి అని బ్యాంకుకు వెళ్తే ఇలాంటి మాటలా? లక్ష రూపాయల రుణమాఫీ కావాలని వెళ్తే లక్ష రూపాయల ఖర్చు అయ్యేలా కేసులు పెడతారా? ఇదేనా ఇందిరమ్మ రాజ్యం, ఇదేనా ప్రజా పాలన...? I demand… pic.twitter.com/qjl6dfmNhh— KTR (@KTRBRS) September 26, 2024ప్రభుత్వం చేసిన తప్పిదానికి రైతులను కరడుగట్టిన నేరస్థులుగా పరిగణిస్తున్నందుకు సీఎం బేషరతుగా రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాను!. మీరు మీ వాగ్దానాలను అందించడంలో విఫలమయ్యారు. మీరు ఇచ్చిన హామీని తీర్చాలని వచ్చినప్పుడు వారిని అరెస్టు చేస్తారా?. అలాగే కోదాడ రూరల్ సీఐ రజితారెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. మీకు ఆహారం ఇచ్చే చేతులను గౌరవించడం నేర్చుకోండి!’. అన్నం పెట్టే అన్నదాతపై పోలీస్ జులూమ్. ఒకరు దర్వాజాలు పీకుతారు-మరోకరు కేసులు పేట్టి లోపలేస్తాం అంటారు. మాఫీ కాలేదు మాఫీ చెయ్యండి మొర్రో అంటూ రైతులు నానా తంటాలు పడుతుంటే మరో వైపు కేసులు పెడతాం అంటూ పోలీసుల బెదిరింపులు. కేసులు పెట్టి లక్ష ఖర్చయ్యేదాకా తిప్పుదాం అని అన్నదాతపై పోలీసుల దాష్టీకాలు. రుణమాఫీపై శృతి గతి లేని మాటలతో ఇప్పటికే సర్కార్ రైతుల ఊసురు పోసుకుంటే అధికారుల అతి అన్నదాతలను మరింత అగాధంలోకి నెట్టుతుంది. కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు ఖబర్దార్ కాంగ్రెస్ పాలకులారా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంటూ కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: హైడ్రా పేరుతో హైడ్రామాలు: కేటీఆర్ -
హైడ్రా పేరుతో హైడ్రామాలు: కేటీఆర్
కూకట్పల్లి (హైదరాబాద్)/సాక్షి, హైదరాబాద్: హైడ్రా పేరుతో ప్రభుత్వం హైడ్రామాలు ఆడుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీ రామారావు మండిపడ్డారు. సామా న్యులకు అన్యాయం జరిగే పక్షంలో బుల్డోజర్లకు అడ్డం పడన్నా న్యాయం జరిగేంతవరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఆక్రమణలకు తప్పుడు అనుమతులు ఇచ్చింది కాంగ్రెస్ వారేనని చెప్పారు. బ్లాక్ లిస్టు అయిన పాకిస్తాన్ కంపెనీకి మూసీ సుందరీకరణ కాంట్రాక్టు ఇచ్చి భారీ కుంభకోణానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ కుంభకోణానికి తెర లేపిన పెద్దల బాగోతాలను బయటకు తీస్తామని అన్నారు. బుధవారం ఫతేనగర్, ఖాజాకుంటలో మురుగునీటి శుద్ధి కేంద్రాలను (ఎస్టీపీలు) సందర్శించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. కోర్టులను అపహాస్యం చేస్తున్నారు ‘హైదరాబాద్‌లో హైడ్రా పేరుతో పేదలకు ఓ న్యాయం, పెద్దలకు ఓ న్యాయం జరుగుతోంది. వేదశ్రీ అనే ఏడేళ్ల పాప తన పాఠ్య పుస్తకాలు తీసుకోవటానికి కూడా సమయం ఇవ్వకుండా ఇళ్లు కూల్చివేశారు. కస్తూరి అనే మహిళ చెప్పుల దుకాణాన్ని కూడా కూల్చివేశారు. కోర్టు సెలవు దినాన కావాలని ఉదయమే వచ్చి అభాగ్యుల ఇళ్లను కూల్చివేస్తూ కోర్టులను అపహాస్యం చేస్తున్నారు. బఫర్ జోన్లో అనుమతులు ఇచ్చిన వారిని వదిలేసి, పేదల ఇళ్లను కూల్చివేయటం ఎంతవరకు సబబు? తమ ప్రభుత్వ హయాంలో పేదలకు లక్ష ఇళ్లు నిర్మించి ఇచ్చాం. మీకు చిత్తశుద్ధి ఉంటే పేదవారికి ఇళ్లు నిర్మించి ఇవ్వండి. మీ దౌర్జన్యాలను, దాషీ్టకాలను ఇలాగే కొనసాగిస్తే ప్రజలు బుద్ధి చెబుతారు. మీ ఫాంహౌస్‌ల వీడియోలు బయట పెడతాం జీహెచ్ఎంసీ, హైడ్రా ఆఫీసు, నీ అన్న ఇళ్లు బఫర్ జోన్లోనే ఉన్నాయి. మీ మంత్రుల ఫాంహౌస్‌లు కూడా బఫర్ జోన్లోనే ఉన్నాయి. అవసరమైతే ఫాంహౌస్‌ల వీడియోలు బయట పెడతాం. ముందు వాటిని కూలగొట్టి చిత్తశుద్ధి నిరూపించుకోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరితో రియల్ ఎస్టేట్ వ్యాపారం 42 శాతానికి పడిపోయింది. ఎంతోమంది కార్మికులు ఉపాధి దొరకక ఖాళీగా ఉంటున్నారు. హైడ్రా బాధితులందరికీ మేం అండగా ఉంటాం. ప్రజలు తెలంగాణ భవన్‌కు కూడా వచ్చి ఫిర్యాదులు ఇవ్వొచ్చు..’అని కేటీఆర్ తెలిపారు. కేసీఆర్ సంకల్పం తీసుకుని ‘మురుగునీటి’పనులు పూర్తి చేశారు ‘మా ప్రభుత్వ హయాంలో హైదరాబాద్‌లో నాలాల పరిరక్షణతో పాటు రూ.4 వేల కోట్లతో 31 ఎస్టీపీలను నిర్మించాం. కేవలం కూకట్‌పల్లిలో నియోజకవర్గంలోనే రూ.350 కోట్లు ఖర్చు పెట్టాం. దక్షిణాసియాలోనే 100% మురుగునీటి శుద్ధి నగరంగా హైదరాబాద్ చరిత్ర సృష్టించబోతోంది. కేసీఆర్ సంకల్పం తీసుకుని ఈ పనులు పూర్తి చేశారు. గత 10 నెలల్లో ఈ ప్రభుత్వం ఏ ఒక్క మంచి పని కూడా చేపట్టలేదు..’అని కేటీఆర్ విమర్శించారు. హైదరాబాద్ ప్రజలు సంపూర్ణ ఆశీర్వాదం ఇచ్చి బీఆర్ఎస్ను గెలిపించినందుకు వారికి రుణపడి ఉంటామని చెప్పారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు మహమూద్ ఆలీ, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, మాగంటి గోపీనాథ్, మర్రి రాజశేఖర్‌రెడ్డి, కేపీ వివేకానంద్, కాలేరు వెంకటే‹Ù, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు తదితరులు పాల్గొన్నారు. మనం సంధికాలంలో ఉన్నాం – మళ్లీ నాలుగేళ్లలోనే కేసీఆర్‌ను సీఎంగా గెలిపించుకోవాలి ‘ఉద్యమ పార్టీగా అనేక ఆటు పోట్లు ఎదుర్కొని తెలంగాణ సాధించిన మనం ఇప్పుడు సంధి కాలంలో ఉన్నాం. 14 ఏళ్లు ఉద్యమ పార్టీ, పదేళ్లు అధికార పార్టీగా ఉన్న మనం ఇప్పుడు పోషిస్తున్న ప్రతిపక్ష పాత్ర కొత్తది. రాష్ట్రంలో చాలామంది మనవైపు చూస్తున్నారు. ఈ సమయంలో పార్టీని బలోపేతం చేసుకోవాలి. గాడిద ఉంటేనే గుర్రం విలువ తెలుస్తుంది అన్నట్లు చిట్టి నాయుడు (రేవంత్‌రెడ్డి) ఉంటేనే కేసీఆర్ విలువ తెలుస్తుంది. ఈ ప్రభుత్వం తీరు చూసి మళ్లీ కేసీఆర్ కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. మళ్లీ నాలుగేళ్లలో కేసీఆర్‌ను సీఎంగా గెలిపించుకోవాలి..’అని కేటీఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణ భవన్లో మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ అధ్యక్షతన జరిగిన వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన ప్రసంగించారు. వందేళ్ల పాటు దృఢంగా ఉండేలా పార్టీ నిర్మాణం ‘ఒక్కో జిల్లా కమిటీలో 800 మందికి పైగా కార్యకర్తలు, నేతలకు పదవులు ఇచ్చే వీలుంటుంది. తమిళనాడులో డీఎంకే పార్టీ 76 ఏళ్లుగా రాజకీయాలను శాసిస్తోంది. 24 ఏళ్ల మన పార్టీ మరో వందేళ్ల పాటు దృఢంగా ఉండేలా పార్టీ నిర్మాణంపై దృష్టి పెడదాం. శిక్షణ శిబిరాలు ఏర్పాటుతో పాటు గతంలో జరిగిన తప్పులు పునరావృతం కాకుండా చూసుకుందాం. కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు కోసం షాడో గవర్నమెంట్ మాదిరిగా పనిచేసేందుకు కమిటీలు వేస్తాం..’అని కేటీఆర్ చెప్పారు. స్టేషన్ ఘనపూర్ అభ్యర్ధిగా రాజయ్య ‘కొందరు పెద్ద నాయకులు పదవులు అనుభవించి పార్టీని వదిలివెళ్లారు. వారిని గతంలో రేవంత్ పచ్చిబూతులు తిట్టినా సిగ్గు లేకుండా ఆయన చుట్టూ తిరుగుతున్నారు. ఫిరాయింపులపై నెలలోగా నిర్ణయం తీసుకోవాలనే కోర్టు తీర్పుతో వారిలో భయం మొదలైంది. .’అని కేటీఆర్ తెలిపారు. సమావేశంలో ఎమ్మెల్సీలు మధుసూదనాచారి, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, వికలాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ కె.వాసుదేవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘దేవర’ ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దుపై కేటీఆర్ కామెంట్స్!
సాక్షి : హైదరాబాద్ : ‘దేవర’ ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వం ఉంటే దేవర ఈవెంట్ ఫంక్షన్ అద్భుతంగా జరిగేదన్నారు.బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి కేటీఆర్ ఫతేనగర్ బ్రిడ్జ్‌ని సందర్శించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేటీఆర్ దేవర ప్రీ రిలీజ్ రద్దుపై మాట్లాడారు.Jr ఎన్టీఆర్ దేవర సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా సరిగ్గా నిర్వహించడానికి రాలేదు ఈ అసమర్ధత ప్రభుత్వానికి - కేటీఆర్ pic.twitter.com/0I8CGXVEjt— Telugu Scribe (@TeluguScribe) September 25, 2024 సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ అన్ని రంగాల్లో విఫలమైందని కేటీఆర్ మండిపడ్డారు. జూనియర్ ఎన్టీఆర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ప్రభుత్వం కనీస సౌకర్యాలు కల్పించలేదని విమర్శలు గుప్పించారు. ప్రీ రిలీజ్ ఫంక్షన్లో పోలీసులు చేతులెత్తేశారని, తాము అధికారికంలో ఉన్నప్పుడు సినిమా ఫంక్షన్లు సంతోషంగా జరుపుకునే వాళ్లని కేటీఆర్ ప్రస్తావించారు. తాము సినిమా ఫంక్షన్లతో పాటు అన్ని మతాల పండుగలను సమర్థవంతంగా నిర్వహించామని అన్నారు. 👉చదవండి : దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎందుకు రద్దైందికొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా నటించిన ‘దేవర’ భారీ అంచనాల మధ్య ఈ చిత్రం సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 22న చిత్రబృందం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించాలని భావించింది. అయితే పరిమితికి మించి అభిమానులు రావడంతో గందరగోళం నెలకొంది. దీంతో నిర్వహాకులు ఈవెంట్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. -
నా కాలేజీలు కాంగ్రెస్ హయాంలో కట్టినవే: మాజీ మంత్రి మల్లారెడ్డి
సాక్షి, యాదాద్రి భువనగిరి: తెలంగాణలో హైడ్రా కారణంగా ప్రజలు ఎవరూ ప్రశాంతంగా నిద్రపోవడం లేదన్నారు మాజీ మంత్రి మల్లారెడ్డి. కాంగ్రెస్ అంటేనే గ్రూపు రాజకీయాలు. ఒక్కొక్కరూ ఒక్కో గ్రూపు తయారు చేశారని ఎద్దేవా చేశారు. అలాగే, ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి బుధవారం యాదగిరిగుట్ట వద్ద మీడియాతో మాట్లాడుతూ..‘హైడ్రా ప్రజలను హైరానా చేస్తోంది. ప్రజల దృష్టిని మరల్చడానికే హైడ్రా పనిచేస్తోంది. ఇళ్లను కూలగొట్టి ప్రజలను రోడ్లపై పడేయాల్సిన అవసరం ఏం వచ్చింది?. యుద్ధం చేసినట్టుగా ఇళ్లను కూల్చివేస్తున్నారు. హైడ్రా కారణంగా ప్రజలు ఎవరూ ప్రశాంతంగా నిద్రపోవడం లేదు. అందరి ఇళ్లకు నోటీసులు ఇచ్చినట్టే నాకు కూడా నోటీసులు ఇచ్చారు. నేను కట్టిన కాలేజీలు అన్నీ కాంగ్రెస్ హయాంలో నిర్మించినవే.కేసీఆర్, కేటీఆర్‌ను తిట్టడమే హస్తం పార్టీ నేతలు పనిగా పెట్టుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి నేను సవాల్ చేస్తున్నా. కేసీఆర్ పాలనలో పండించిన పంట కంటే ఎక్కువ పంట పండిస్తే కాంగ్రెస్ వాళ్లు పాలాభిషేకం చేస్తా. రేవంత్ సర్కార్ పాలనలో రైతుభరోసా లేదు. రుణమాఫీ పూర్తిగా కాలేదు. మంత్రుల మధ్య కూడా సఖ్యత సరిగాలేదు. ఒక్కొక్కరూ ఒక్కో గ్రూపు తయారు చేశారు. కాంగ్రెస్ అంటేనే గ్రూపు రాజకీయాలు. కాంగ్రెస్ నేతలు ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి’ అంటూ కామెంట్స్ చేశారు.ఇది కూడా చదవండి: పాక్ కంపెనీలతో కలిసి రేవంత్ సర్కార్ భారీ స్కామ్: కేటీఆర్ -
మూసీ సుందరీకరణపై కేటీఆర్ సంచలన ఆరోపణలు
హైదరాబాద్, సాక్షి: మూసీ నదిని కొత్తగా శుద్ధి చేయాల్సిన అవసరం లేదని.. గత బీఆర్ఎస్ హయాంలో కట్టిన ఎస్టీపీ(sewage treatment plants)ను ఉపయోగించుకుంటే సరిపోతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు అంటున్నారు. బీఆర్ఎస్ బృందంతో కలిసి ఫతేనగర్ బ్రిడ్జి వద్ద సందర్శనకు వెళ్లిన ఆయన ఆపై మీడియాతో మాట్లాడారు. ‘‘ రేవంత్ రెడ్డి మూసీ సుందరీకరణ పనులను పాకిస్తాన్ కంపెనీలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కొత్తగా మూసీని శుద్ది చేయాల్సిన అవసరం లేదు . గత బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టిన STPలను ఉపయోగించుకుంటే సరిపోతుంది. మా హయాంలో రూ. 4వేల కోట్లతో జీహెచ్ఎంసీ పరిధిలో 31ఎస్టీపీలు నిర్మించాం. .. మూసీ నదీ సుందరీకరణ ప్రాజెక్టుపై ఇప్పుడున్న ముఖ్యమంత్రి, మంత్రుల మాటలకు పొంతన లేదు. లక్ష 50వేల కోట్లు.. 70వేల కోట్లు.. 50వేల కోట్లు.. అంటూ రకరకాలుగా మాట్లాడుతున్నారు. మూసీ శుద్ధి వెనుక ప్రభుత్వ అస్సలు ఉద్దేశం వేరే ఉంది. మూసీ సుందరీకరణ పేరుతో వేల కోట్ల కుంభకోణం జరగబోతోంది.ఇదీ చదవండి: ఓటుకు నోటు కేసులో ఇక రేవంత్ విచారణ.. ఇండియాలో 31ఎస్టీపీలు ఉన్న ఏకైన నగరం హైదరాబాద్. STPలు కేసీఆర్ ముందు చూపునకు నిదర్శనం. బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన సిటీలో అన్ని ఎస్టీపీలను సందర్శిస్తాం. కేసీఆర్ ప్రభుత్వం చేసిన ప్రయత్నాన్ని ప్రజలకు తెలియజేస్తాం. .. బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూంలు కట్టకుంటే మూసీ నిర్వాసితులకు ఎక్కడ నుంచి ఇస్తున్నారు. హైడ్రా కూల్చివేతలపై కాంగ్రెస్ నేతలకు ఒక న్యాయం.. పేదలకు మరొక న్యాయమా?. సిటీ ఎమ్మెల్యేలతో చర్చించి హైడ్రాపై ఒక నిర్ణయానికి వస్తాం. పేదల పట్ల హైడ్రా ప్రతాపానికి వేదశ్రీ అనే బాలిక మాటలే ఒక ఉదాహరణ. ప్రస్తుత ప్రభుత్వం చేసే పనులను బీఆర్ఎస్ గతంలోనే చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలు అమలు చేస్తే చాలు. పబ్లిక్ సిటీ స్టంట్లతో రేవంత్ ఎక్కువ కాలం ప్రభుత్వాన్ని నడపలేరు’’ అని కేటీఆర్ అన్నారు. -
ప్రభుత్వం పేదల గూడు కూలుస్తోంది: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: రేవంత్‌రెడ్డి ప్రభుత్వం హైడ్రా పేరిట పేదల బతుకులను రోడ్డుపాలు చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం సోదరుడు తిరుపతిరెడ్డికి ఒక న్యాయం.. పేదలకు మరో న్యాయం అనే రీతిలో ప్రభుత్వ తీరు ఉందని మండిపడ్డారు. పేదల ఇళ్లను కూలిస్తే తాము ఊరుకోబోమన్నారు. మంగళవారం తెలంగాణ భవన్లో శేరిలింగంపల్లి బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ ప్రసంగించారు. హైదరాబాద్‌లో బీఆర్ఎస్ అన్ని సీట్లనూ గెలుచుకోవడంతో కాంగ్రెస్‌కు ఓటేయలేదనే కక్షతో రేవంత్.. ప్రజలపై కక్ష కట్టారని ఆరోపించారు. రేవంత్ కుటుంబం, ఆయన సోదరులు రాష్ట్రాన్ని పంచుకొని స్వైర విహారం చేస్తున్నారని.. వారి దౌర్జన్యాలతో రియల్ ఎస్టేట్ రంగం కుప్పకూలిందని దుయ్యబట్టారు. మాదాపూర్‌లో సీఎం సోదరుడు తిరుపతిరెడ్డి కమీషన్ల దుకాణం తెరిచారని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ తనకు చెప్పారన్నారు. నోటీసు డ్రామా ఆడి తిరుపతిరెడ్డి ఇల్లు కూల్చకుండా స్టే తెచ్చుకొనేందుకు ప్రభుత్వం ఆయనకు సహకరించిందని కేటీఆర్ ఆరోపణలు గుప్పించారు. పేదల పిల్లలు కనీసం తమ పుస్తకాలు కూడా తీసుకొనే వ్యవధి ఇవ్వని హైడ్రా అధికారులు.. సీఎం సోదరుడి ఇంటిని మాత్రం ముట్టుకోవట్లేదని మండిపడ్డారు. త్వరలో గ్రేటర్ ఎమ్మెల్యేల సమావేశం.. ‘ప్రభుత్వానికి దమ్ముంటే మంత్రి పొంగులేటి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి తదితరుల ఇళ్లు కూల్చాలి. పేదలకు దిక్కులేక నాలాలపై ఇళ్లు కట్టుకుంటే కనీసం నోటీసు కూడా ఇవ్వట్లేదు. గత ప్రభుత్వం నిర్మించిన 40 వేల డబుల్ బెడ్రూం ఇళ్లను పేదలకు ఇవ్వాలి. పేదలకు అండగా నిలిచేందుకు త్వరలో కేసీఆర్ అనుమతితో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఎమ్మెల్యేలతో సమావేశమై కార్యాచరణ సిద్ధం చేస్తాం. అరికెపూడి గాందీని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని మంత్రి శ్రీధర్‌బాబు చెబుతున్నారు. మరి ఆయనకు కాంగ్రెస్ కండువా కప్పింది ఎవరో శ్రీధర్‌బాబు చెప్పాలి. పార్టీ మారిన ఎమ్మెల్యేల పరిస్థితి బతుకు బస్టాండ్లా తయారైంది. ఏ పార్టీలో ఉన్నానో చెప్పుకోలేని స్థితిలో అరెకపూడి ఉన్నారు. దమ్ముంటే ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు చేపట్టి ఉపఎన్నికలు నిర్వహించాలి. శేరిలింగంపల్లిలో ఎప్పుడు ఉపఎన్నిక వచ్చినా కార్యకర్తల నుంచే అభ్యరి్థని ఎంపిక చేస్తాం’అని కేటీఆర్ ప్రకటించారు. సీఎంకు కుర్చీపై భరోసా లేదు.. రైతు భరోసాకు హామీ ఇచ్చిన రేవంత్‌కు ఆయన కుర్చీపైనే భరోసా లేదని కేటీఆర్ ఎద్దేవా చేశారు. తన పదవిని ఖమ్మం, నల్లగొండ బాంబులు తీసుకుంటాయనే భయంతో ఉన్నారని ఎగతాళి చేశారు. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తానని చిట్టి నాయుడు తరహాలో రేవంత్ సవాళ్లు చేస్తున్నారని.. కానీ తెలంగాణ ఉన్నన్ని రోజులు కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేయడం ఎవరికీ సాధ్యం కాదన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో కొత్త కమిటీ ఏర్పాటు చేసి పార్టీని బలోపేతం చేస్తామని కేటీఆర్ ప్రకటించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు గోపీనాథ్, మాధవరం కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. ‘అమృత్’లో అవినీతిపై బండివి చిల్లర మాటలు కేంద్ర పథకమైన అమృత్‌లో అవినీతిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ వైఖరి దొంగలుపడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగిన చందంగా ఉందని కేటీఆర్ ‘ఎక్స్’లో ఎద్దేవా చేశారు. అమృత్‌లో అవినీతి జరిగిందని మొదట చెప్పింది బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డేనని.. అయినా పాలు తాగుతున్న దొంగ పిల్లిలా బండి కళ్లు మూసుకున్నారని మూసుకున్నారని విమర్శించారు. పథకంలో అవినీతిని ఆధారాలతో తాము బయట పెట్టాక ఆయన చిల్లర మాటలు మాట్లాడటం దేనికని ప్రశ్నించారు. వైద్యవిద్య ప్రవేశాలపై సర్కారు మొద్దునిద్ర గత పదేళ్లు ప్రశాంతంగా, పకడ్బందీగా సాగిన ఎంబీబీఎస్, బీడీఎస్ అడ్మిషన్ల ప్రక్రియను కాంగ్రెస్ ప్రభుత్వం తొలి ఏడాదే అస్తవ్యవస్తంగా మార్చి గందరగోళాన్ని సృష్టిస్తోందని కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణ బిడ్డలకు స్థానికత విషయంలో అన్యాయం చేసేలా జీవో–33 తెచ్చి ప్రవేశాల ప్రక్రియను ఆగం చేసిన సీఎం విద్యార్థులకు క్షమాపణలు చెప్పాలని ‘ఎక్స్’వేదికగా డిమాండ్ చేశారు. స్థానికతపై మార్గదర్శకాలు రూపొందించాలని సుప్రీంకోర్టు తీర్పు చెప్పినా ప్రభుత్వం మొద్దునిద్ర వీడట్లేదని విమర్శించారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఒక్క విద్యార్థికి నష్టం జరిగినా చూస్తూ ఊరుకోబోమని కేటీఆర్ హెచ్చరించారు. -
ట్రిపుల్ ఆర్‌పై కాంగ్రెస్ మాట తప్పింది
సాక్షి, హైదరాబాద్: రీజినల్ రింగు రోడ్డు (ట్రిపు ల్ ఆర్) భూ సేకరణలో నష్టపోతున్న రైతులు, బాధితులకు న్యాయం చేయాలని మాజీమంత్రి హరీశ్‌రావు డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో వారికి ఇచ్చిన హామీని సీఎం రేవంత్, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి నిలబెట్టుకోవాలన్నారు. ట్రిపుల్ ఆర్తో నష్టపోతున్న రైతులు మంగళవారం హరీశ్‌రావును హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కలిసి వినతిపత్రం అందజేశారు. బాధితులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని హరీశ్ భరోసా ఇవ్వడంతో పాటు ప్రభుత్వ తీరును ఎండగట్టారు. ‘బాధితులకు న్యాయం చేస్తామని అసెంబ్లీ ఎన్నికల సమయంలో సాక్షాత్తూ భువనగిరి సభలో ప్రియాంకాగాంధీ హామీ ఇచ్చారు. ట్రిపుల్ ఆర్ ఉత్తరభాగంలో జంక్షన్‌ను 40 కిలోమీటర్లకు బదులు 28 కిలోమీటర్లను పరిగణనలోకి తీసుకోవడంతో చౌటుప్పల్ మున్సిపాలిటీతోపాటు మండలంలోని రైతులు నష్టపోతున్నారు. గతంలో జంక్షన్ రింగును 78 ఎ కరాల్లో ప్రతిపాదించగా, ప్రస్తుతం 184 ఎకరా లకు పెంచడంతో నష్టం పెరుగుతుంది. గతంలో ఎంపీగా ఉన్న కోమటిరెడ్డి వెంకట్రె డ్డి ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ మార్చాలని రాయగిరి, చౌటుప్పల్ రైతులతో కలిసి ధర్నా చేశారు. కానీ ఇప్పు డు పోలీసు బలగాలతో నిర్బంధంగా సర్వే చేసి ఒప్పంద పత్రాల మీద సంతకాలు చేయాలని ఒత్తిడి చేయడం దుర్మార్గం. కాంగ్రెస్ మాట నిలుపుకునేంత వరకు బాధితులకు బీఆర్ఎస్ అండగా ఉంటుంది. బాధితుల పక్షాన పోరాటం చేస్తాం’అని హరీశ్‌రావు చెప్పారు. -
ఆ ఇద్దరు మంత్రులు దద్దమ్మలు: జగదీష్‌రెడ్డి
సాక్షి,నల్లగొండజిల్లా:ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఇద్దరు దద్దమ్మ మంత్రులున్నారని మాజీ మంత్రి,బీఆర్ఎస్ సీనియర్ నేత జగదీష్‌రెడ్డి మండిపడ్డారు. సాగర్ జలాలపై ఈ మంత్రులకు అవగాహన లేకపోవడంతో ఆయకట్టు పొలాలు ఎండిపోతున్నాయన్నారు. సూర్యాపేటలో మంగళవారం(సెప్టెంబర్24) నిర్వహించిన మీడియా సమావేశంలో జగదీష్‌రెడ్డి మాట్లాడారు.ఖమ్మం జిల్లాకు సాగర్ నీళ్లు అధికంగా తరలించడం వల్లనే ఎడమ కాల్వకు గండి పడిందని ఆరోపించారు. జిల్లాలో ఉన్న మంత్రుల మాటలు విని పోలీసులు తప్పుడు కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. రెండు లక్షల రుణమాఫీ ఇంకా 30 శాతం కూడా పూర్తిచేయలేదని విమర్శించారు. రైతు భరోసా వెంటనే ఇవ్వాలని జగదీష్‌రెడ్డి డిమాండ్ చేశారు.ఇదీ చదవండి: సాగర్‌కాలువ గండి పూడ్చడం చేతకాదా..? -
పార్టీ మారిన ఎమ్మెల్యేల బతుకు జూబ్లీ బస్టాండే : కేటీఆర్
సాక్షి,హైదరాబాద్ : తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల బతుకు జూబ్లీ బస్టాండే అవుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం తెలంగాణ భవన్లో శేరిలింగంపల్లి నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. బీఆర్ఎస్ ఏం పాపం చేసిందని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరికెపూడి గాంధీ కాంగ్రెస్‌లోకి వెళ్లారని కేటీఆర్ ప్రశ్నించారు.మంత్రి శ్రీధర్ బాబు అతితెలివి ప్రదర్శించొద్దని హెచ్చరించారు. ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొట్టుకున్నారని మాట్లాడారు. ఎమ్మెల్యేలకు కండువా కప్పిన సన్నాసి ఎవరు? అని అన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యే బతుకు జూబ్లీ బస్టాండే అవుతుందని సూచించారు. Live: BRS Party Cadre Meeting, Serilingampally Assembly constituency.@KTRBRS https://t.co/9PwrvDngy6— BRS Party (@BRSparty) September 24, 2024చదవండి : చంద్రబాబు ప్రభుత్వం ఐదేళ్లు బతకదు -
కాంగ్రెస్ పార్టీలో రాజుకుంటున్న వర్గపోరు
జనగామ: డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి వర్సెస్ సీనియర్ నాయకుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గున మండుతోంది. కొమ్మూరి తనను హత్య చేయించేందుకు సుపారీ ఇచ్చాడని కంచె రాములు చేసిన ఫిర్యాదుతో జిల్లాలో పార్టీ అడ్డంగా చీలిపోయే పరిస్థితి నెలకొంది. అసెంబ్లీ ఎన్నికలు ముగిసే వరకు అంతా కలిసే ఉన్న నాయకత్వం.. లోక్‌సభ ఎన్నికలు వచ్చే సరికి రెండు వర్గాలుగా విడిపోయింది. ఎమ్మెల్యే ఎన్నికల సమయంలో తన ఓటమికి కారణమయ్యారంటూ కొంతమంది నాయకులపై ప్రతాప్‌రెడ్డి బహిరంగంగానే విమర్శలు గుప్పించడంతో ఇరువురి మధ్య దూరం పెరిగింది. కొమ్మూరి నిర్లక్ష్యం, ఒంటెద్దు పోకడలతోనే ఓడిపోయారే తప్ప.. నాయకులు, కార్యకర్తల తప్పు లేదని మరోవర్గం అంటోంది. ఇద్దరి మధ్య రాజుకున్న వివాదం.. పార్టీ అధిష్టానం వద్దకు చేరింది. రోజుకో ఫిర్యాదుతో రెండు వర్గాల వారు గాంధీభవన్, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, క్రమశిక్షణ సంఘం ప్రతినిధులకు ఫిర్యాదు చేసుకుంటున్నారు. పార్టీ ఇచ్చిన ప్రతీ కార్యక్రమాన్ని వేర్వేరుగా నిర్వహిస్తూ గ్రూపులకు ఆజ్యం పోస్తున్నా రు. దీంతో దిగువ శ్రేణి నాయకత్వం దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతోంది.రెండు వర్గాలుగా విడిపోయి..పార్టీ నాయకులు, శ్రేణులు జనగామ నుంచి కొమురవెల్లి వరకు రెండు వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటూ ప్రతిపక్షాన్ని తలపించేలా వ్యవహరిస్తున్నాయి. డీసీసీ అధ్యక్షుడి ఫొటో లేని ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తూ.. చించి వేసుకునే స్థాయికి దిగజారి పోతున్నారు. ప్రతిపక్షంలో పదేళ్లు ఉండి పార్టీని కాపాడుకుంటే.. కొమ్మూరి బాధ్యతలు తీసుకున్న తర్వాత సీనియర్లను పక్కన పెడుతున్నారన్న పంచాయితీ తెలిసిందే. జనగామ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నియామకం కొమ్మూరి వర్సెస్ సీనియర్ల మధ్య మరింత దూరం పెంచగా, చినికి చినికి గాలివానలా మారింది. హత్య చేయించేందుకు డీసీసీ అధ్యక్షుడు సుపారీ ఆఫర్ చేశారంటూ ఆ పార్టీ నేత కంచె రాములు పోలీసులకు ఫిర్యా దు చేసుకునే వరకు వెళ్లింది. పార్టీ రాష్ట్ర కార్యదర్శి కంచె రాములును హత్య చేయించేందుకు కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి రాహుల శ్రీనివాస్‌రెడ్డి అనే వ్యక్తికి రూ.25లక్షలు ఆఫర్ చేసి కుట్ర పన్నారని డీసీపీకి ఫిర్యాదు చేయడం హాట్ టాపిక్‌గా మారింది. ఈ విషయాన్ని పార్టీ క్రమశిక్షణ సంఘం చైర్మన్ చిన్నారెడ్డి దృష్టికి తీసుకువెళ్లినట్లు రాములు చెప్పగా.. తనపై అనవసరంగా బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారంటూ డీసీసీ అధ్యక్షుడు కొట్టి పారేశారు. ‘అసలు శ్రీనివాస్‌రెడ్డి నా శత్రువు.. సోషల్ మీడియాలో నాకు వ్యతిరేఖంగా పోస్టులు పెడుతున్నాడు. అంభాడాలు వేస్తున్నాడు.. పోలీసులు సమగ్ర విచారణ చేపట్టాలని’ కొమ్మూరి కోరడం గమనార్హం.ఒకరిపై ఒకరు ఫిర్యాదులు..కొద్ది రోజులుగా డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్‌రెడ్డితోపాటు మరో వర్గానికి చెందిన సీని యర్ నాయకులు వేమెళ్ల సత్యనారాయణరెడ్డి, ఎర్రమల్ల సుధాకర్, కంచె రాములు వర్గీయులు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్, మంత్రులు, సీఎం వద్దకు వెళ్లి జనగామ నియోజకవర్గంలో తాజా రాజకీయ పరిస్థితులపై ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. జనగామ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పదవి ఆశిస్తున్న కంచె రాములును కాదని డీసీసీ అధ్యక్షుడు మరో పేరును సూచించడంతో సీనియర్లు సీరియస్ అయ్యారు. అయినా కొమ్మూరి యువ నాయకు ల వైపే మొగ్గు చూపారు. ఈసారి బీసీ(ఏ) రిజర్వేషన్ ఉంది.. ఆ పదవి తనకే ఇవ్వాలని లోకుంట్ల ప్రవీణ్ పట్టు బడుతున్నాడు. అవసరమైతే కోర్టుకు వెళ్లేందుకు సిద్ధమంటూ సవాల్ విసురుతుండంతో అధిష్టానం మార్కెట్ చైర్మన్ పదవి విషయాన్ని పెండింగ్‌లో ఉంచింది. ఏది ఏమైనా డీసీసీ అధ్యక్షుడు వర్సెస్ కంచె రాములు వర్గపోరు ఎటుదారి తీస్తుందో వేచిచూడాలి. -
దిద్దుబాటు దిశగా బీఆర్ఎస్.. ఆ నియోజకవర్గాలపై ఫోకస్
సాక్షి, హైదరాబాద్: కారు గుర్తుపై గెలిచిన పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. దీంతో బీఆర్ఎస్ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఎమ్మెల్యేలు పార్టీ వీడిన నియోజకవర్గాలపై ఆ పార్టీ దృష్టి పెట్టింది. ఈ క్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ నేతలకు మాజీ మంత్రి, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నుంచి పిలుపొచ్చింది. కాసేపట్లో తెలంగాణ భవన్లో శేరిలింగంపల్లి నేతలతో ఆయన భేటీ కానున్నారు.అరికెపూడి గాంధీ పార్టీ మారిన నేపథ్యంలో శేరిలింగంపల్లి నియోజకవర్గంపై బీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్ బలోపేతంపై కేటీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ఎమ్మెల్యేలు పార్టీ వీడిన నియోజకవర్గాల్లో క్యాడర్‌ను కాపాడుకునే పనిలో బీఆర్ఎస్ పడింది. కొత్త నాయకత్వాన్ని తయారు చేయటంపై బీఆర్ఎస్ కసరత్తు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో వరస సమావేశాలను కేటీఆర్ నిర్వహించనున్నారు.ఇదీ చదవండి: యజమానుల తప్పిదం.. సామాన్యులు బలి! -
ఆ కిటుకేదో సామాన్యులకు చెప్పండి.. రేవంత్ సోదరుడికి కేటీఆర్ డిమాండ్
సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్‌రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా ప్రశ్నల వర్షం కురిపించారు. ‘‘అనుముల తిరుపతి రెడ్డి గారు! ఎల్కేజీ చదివే వేదశ్రీ కి తన పుస్తకాలు తీసుకునే సమయం కూడా ఇవ్వలేదు!. 50 ఏళ్ల కస్తూరి బాయి తన జీవనాధారమైన చెప్పుల దుకాణం కోల్పోయింది!. 72 గంటల క్రితం కొన్న ఇల్లు నేల మట్టమైంది!. వారం ముందు గృహప్రవేశం చేసుకున్న ఇల్లు, అన్ని కాగితాలు ఉన్నా.. పేక మేడల కూల్చివేయబడింది!. తిరుపతి రెడ్డి గారు, క్షణం కూడా సమయం ఇచ్చే ప్రసక్తే లేదన్న హైడ్రా.. మీ విషయంలో నోరు మెదపలేదు!’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.‘‘వాల్టా అనుకుంటా.. ఏకంగా మీకు 30 రోజుల టైం ఇచ్చింది! కోర్టులో స్టే సంపాదించుకున్నారు!. ప్రస్తుతం జరుగుతున్న కూల్చివేతల రావణకాష్టంలో మట్టి కూడా అంటనిది బహుశా మీకు మాత్రమేనామో!. మీ సోదరుడి బల్డోజర్ల కింద నలిగిపోతున్న సామాన్యులకు ఆ కిటుకేదో చెప్పండి!’’ అంటూ కేటీఆర్ ఎద్దేవా చేశారు.అనుముల తిరుపతి రెడ్డి గారు! LKG చదివే వేదశ్రీ కి తన పుస్తకాలు తీసుకునే సమయం కూడా ఇవ్వలేదు! 50 ఏళ్ళ కస్తూరి బాయి తన జీవనాధారమైన చెప్పుల దుకాణం కోల్పోయింది! 72 గంటల క్రితం కొన్న ఇల్లు నేల మట్టమైంది! వారం ముందు గృహప్రవేశం చేసుకున్న ఇల్లు, అన్ని కాగితాలు ఉన్నా….పేక మేడల… pic.twitter.com/1zIb7cBrCB— KTR (@KTRBRS) September 24, 2024ఇదీ చదవండి: యజమానుల తప్పిదం.. సామాన్యులు బలి! -
వారంలో ఇద్దరు మంత్రులు గాంధీభవన్‌లో
సాక్షి, హైదరాబాద్: ప్రతీవారంలో ఇద్దరు మంత్రులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాల యమైన గాంధీ భవన్‌ను సందర్శించనున్నారు. ఈ మేరకు సోమవారం టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ షెడ్యూల్ విడుదల చేశారు. ప్రతి బుధ, శుక్రవారాల్లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం వరకు పార్టీ కార్యకర్తలు, సమస్యలు చెప్పుకునేందుకు వచ్చే ప్రజలను గాంధీభవన్‌లో కలుస్తారన్నారు. ఈ సందర్భంగా ప్రజల ఫిర్యాదులు, అర్జీలను ఆ రోజున తీసుకుంటారని మహేశ్‌కుమార్‌గౌడ్ ఆ షెడ్యూల్లో వివరించారు. మంత్రుల షెడ్యూల్ ఇలా...25 సెప్టెంబర్: దామోదర రాజనర్సింహ, 27 సెప్టెంబర్: శ్రీధర్‌బాబు, 2 అక్టోబర్: గాంధీ జయంతి (కార్యక్రమం లేదు), 4 అక్టోబర్ : ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, 9 అక్టోబర్: పొన్నం ప్రభాకర్, 11 అక్టోబర్: సీతక్క, 16 అక్టోబర్: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, 18 అక్టోబర్: కొండా సురేఖ, 23 అక్టోబర్: పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, 25 అక్టోబర్: జూపల్లి కృష్ణారావు, 30 అక్టోబర్: తుమ్మల నాగేశ్వరరావు -
సాగర్ కాలువ గండిని పూడ్చడం చేతకాదా?: హరీశ్‌రావు
సాక్షి, హైదరాబాద్: ఖమ్మం జిల్లాలో లక్షల ఎకరాల్లో పంటలు ఎండు తున్నా 22 రోజులుగా నాగార్జున సాగర్ కాలువకు పడిన గండిని పూడ్చ డం కాంగ్రెస్ ప్రభుత్వానికి చేతకావ డం లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు మండిపడ్డారు. కృష్ణా నది నిండుకుండలా ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పొలాలను ఎండ బెడుతోందన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగే శ్వరరావు గండి పడిన కాలువ పక్క నుంచే వెళ్తున్నా మరమ్మతులు జరగడం లేదని ఎద్దేవా చేశారు.దీంతో ‘సీఎంను క్షమించు.. రైతులను రక్షించు’అంటూ భద్రాచలం సీతారామచంద్ర స్వామిని వేడుకుంటున్నామని హరీశ్‌రావు అన్నా రు. సోమవారం ఆయన తెలంగాణ భవన్లో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యే చింత ప్రభా కర్, మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌తో కలసి మీడియాతో మాట్లాడుతూ, బీఆర్ఎస్ తరఫున త్వరలో ఖమ్మం జిల్లాలో పర్యటించి రైతులకు మనోధైర్యం కల్పిస్తామన్నారు.రైతులతో కన్నీళ్లు పెట్టిస్తున్నారు..‘పాలేరు, ఖమ్మం, వైరా, సత్తుపల్లి, మధిర నియో జకవర్గాల్లో రైతులు పార్టీలకు అతీతంగా నాగా ర్జునసాగర్ ప్రాజెక్టు ఆఫీసులను ముట్టడిస్తూ ధర్నాలు చేస్తున్నారు. ఆకాశాన్ని దించుతాం, సూర్యుడిని వంచుతాం అనే డైలాగులు కొడు తున్న రేవంత్ రెడ్డి, జిల్లా మంత్రులకు కాలువ గండి పూడ్చటం చేతకావడం లేదా. 3 లక్షల ఎకరాలు ఎండుతున్నా కాంగ్రెస్ సర్కార్‌కు కూల్చి వేతలు తప్ప పూడ్చివేత రాదా? వరదల్లో కొట్టు కుపోయిన పంటలకు నష్టం పరిహారం ఇవ్వకుండా రైతులతో కన్నీళ్లు పెట్టిస్తోంది’అని హరీశ్‌రావు మండిపడ్డారు.‘వరదల కారణంగా సాగర్ పరీవాహక ప్రాంతంలో 60 వేల ఎకరాలు, కాంగ్రెస్ నిర్వాకంతో లక్ష ఎకరాలు నష్టపోయినట్లు ప్రాథమికంగా అంచనా. ఇప్పుడు కాంగ్రెస్ సర్కా రు నీళ్లిచ్చినా పంటలు చేతికొచ్చే పరిస్థితి లేదు. పంటలను కాపాడుకునేందుకు రైతులు జనరే టర్లు, డిజిల్, ట్రాక్టర్ల కోసం వేల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. వరదల్లో నష్టపోయిన వారికి ఇస్తున్న పరిహారం రూ.10 వేలు ఏ మూలకూ సరిపోవడం లేదు’అని అన్నారు. రాష్ట్రంలో గూండాయిజం పెరిగి, అత్యాచారాలు నిత్యకృత్యం అయ్యాయన్నారు. రేవంత్ అధికారంలోకి వచ్చిన పది నెలల్లోనే రెండు వేల అత్యాచార ఘటనలు చోటు చేసుకున్నాయని హరీశ్ పేర్కొన్నారు.