breaking news
-
గ్యారెంటీలపై నిలదీయండి: యువతకు హరీశ్‌రావు పిలుపు
సాక్షి,హైదరాబాద్:గత ఏడాది దసరా సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను నమ్మి కాంగ్రెస్‌కు ఓటు వేయాలని గ్రామాల్లో ప్రచారం చేసిన యువత ఒక్కసారి ఆలోచించాలని మాజీ మంత్రి హరీశ్‌రావు కోరారు. ఈ మేరకు ఆదివారం(అక్టోబర్6) ఎక్స్(ట్విటర్)లో ఆయన ఒక పోస్టు చేశారు.‘గ్యారెంటీలు అమలు చేయలేకపోగా,మీ ఊళ్లలో అవ్వాతాతలకు పెంచుతామన్న పింఛన్ పెంచలేదు, రుణమాఫీ పూర్తి చేయలేదు,రైతు బంధును నిలిపివేశారు,రైతు భరోసా దిక్కులేకుండా పోయింది,బోనస్‌ను బోగస్ చేశారు.ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు అన్నరు,పది నెలలు గడిచాయి వాటికి అతీ గతి లేదు.నాలుగు వేల నిరుద్యోగ భృతికి నీళ్లు వదిలారు.ఈ దసరాకు మీ ఊళ్లకు వస్తున్న కుటుంబ సభ్యులు,స్నేహితులతో అలయ్-బలయ్ తీసుకుంటూ కాంగ్రెస్ చేసిన మోసాల గురించి చర్చించండి.మీ ప్రాంతాల్లోని కాంగ్రెస్ నాయకులను ఆరు గ్యారెంటీలతో పాటు,రైతు డిక్లరేషన్,యూత్ డిక్లరేషన్,ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్,మైనారిటీ డిక్లరేషన్,బీసీ డిక్లరేషన్లపై ఎక్కడిక్కడ నిలదీయండి’అని హరీశ్‌రావు యువతకు పిలుపునిచ్చారు. ఇదీ చదవండి: మూసీ బ్యూటిఫికేషన్ కాదు.. లూఠిఫికేషన్: కేటీఆర్ -
మూసీ బ్యూటిఫికేషన్ కాదు.. లూటిఫికేషన్!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: రైతులకు రుణమాఫీ చేసేందుకు పైసల్లేవుగానీ.. రూ.1.50 లక్షల కోట్లతో మూసీ సుందరీకరణ చేస్తారా అని సీఎం రేవంత్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు మండిపడ్డారు. ప్రజలకు సంక్షేమ పథకాలు ఇస్తే కమీషన్లు రావని.. అదే మూసీ ప్రాజెక్టు అయితే రూ.30 వేల కోట్లు దోచుకోవచ్చని ప్లాన్ వేశారని ఆరోపించారు. ఇది మూసీ బ్యూటిఫికేషన్ కాదని, పెద్ద లూటిఫికేషన్ అని విమర్శించారు. పార్టీ పెద్దలకు కమీషన్లు పంపి కుర్చీని కాపాడుకోవటం కోసమే మూసీ ప్రాజెక్టును తెరపైకి తెచ్చారని ఆరోపించారు. ‘‘పైసలు కావాలంటే నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలు చందాలు వేసుకుని ఇస్తాం. రాహుల్‌గాంధీకి పంపి కుర్చీని కాపాడుకో.. అంతేకానీ పేదల జోలికి రావొద్దు. నీ కళ్లు చల్లబడతాయంటే మా ఇళ్లు కూల్చు.కానీ పేదల ఇళ్లను కూలగొట్టవద్దు. ముందు రెడ్డికుంటలోని మీ ఇంటిని, దుర్గంచెరువులోని మీ అన్న ఇంటిని కూల్చు’’ అని రేవంత్‌కు సవాల్ చేశారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండల కేంద్రంలో రైతులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన మహాధర్నాలో కేటీఆర్ పాల్గొని మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే..‘‘సిగ్గు, శరం ఉన్నవాళ్లకు మనం మర్యాద ఇవ్వాలి. ఈ సీఎంకు అలాంటివి ఏమీ లేవు. కేసీఆర్ రుణమాఫీ చేసిన వాళ్లను కూడా మళ్లీ రుణం తెచ్చుకోండి మాఫీ చేస్తాం అని ఎన్నికల ముందు రేవంత్‌రెడ్డి చెప్పారు. డిసెంబర్ 9వ తేదీనే రుణమాఫీ చేస్తానన్నారు. పది నెలలైంది. ఇప్పటికీ పైసా రుణం మాఫీ కాలేదు. ఎన్నికల ముందు ఎక్కడ దేవుడు కనిపిస్తే.. ఆ దేవుళ్ల మీద ఒట్లు వేశారు. ప్రజలనే కాదు దేవుళ్లను మోసం చేశారు. చిట్టినాయుడు కట్టేటోడు కాదు.. కూలగొట్టేటోడు. రైతుబంధు లేదు, రైతు భరోసా లేదు. పెద్ద మనుషులు, మహిళలకు పింఛన్లు అన్నారు. లేవు. మహిళలకు బతుకమ్మ చీరలు వచ్చాయా? పండుగ పండుగలా ఉందా? ఇందిరమ్మ ఇళ్లు కడతా అంటే ఓట్లు వేశారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్న ఇళ్లు కూలగొడుతున్నారు. ఇలా అన్ని వర్గాలను మోసం చేశారు.బ్రదర్స్‌కు దోచిపెట్టేందుకే..మేం ఏడేళ్లపాటు కష్టపడి ఫార్మాసిటీ కోసం రైతుల నుంచి 14 వేల ఎకరాలు సేకరించాం. ఈ సర్కారు ఫోర్త్ సిటీ కోసం ఒక్క ఎకరా కూడా సేకరించలేదు. ఫార్మా సిటీ భూములనే ఫోర్త్ సిటీ కోసం వాడే ప్రయత్నం చేస్తున్నారు. అది ఫోర్త్ సిటీ కాదు. రేవంత్‌రెడ్డి ఫోర్ బ్రదర్స్ సిటీ. వాళ్లు రైతులను బెదిరించి అసైన్డ్ భూములను లాక్కుంటున్నారు. ఫార్మా సిటీ రద్దు కాలేదని కోర్టుకు చెప్తున్నారు. బయట మాత్రం ఫోర్త్ సిటీ అంటున్నారు. ఫోర్త్ సిటీ పేరుతో రియల్ ఎస్టేట్ దందాకు ప్రయత్నం చేస్తున్నారు. ఫోర్త్ సిటీ పేరుతో చేస్తున్న డ్రామాలపై రైతులు కోర్టుల్లో కేసులు వేయాలి. వారికి బీఆర్ఎస్ లీగల్‌సెల్ అండగా నిలుస్తుంది. రీజనల్ రింగ్‌రోడ్డు అలైన్మెంట్ మార్చేందుకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారు. అస్మదీయులకు కాంట్రాక్ట్ కట్టబెట్టేందుకే అలా వ్యవహరిస్తున్నారు. రేవంత్ ఓ రియల్ ఎస్టేట్ బ్రోకర్లా పనిచేస్తున్నారే తప్ప.. సీఎంలా పనిచేయటం లేదు.ఎవరినీ వదిలిపెట్టేది లేదు..మూసీ గబ్బు అంతా సీఎం, మంత్రుల మెదళ్లలోనే ఉంది. వారి గబ్బు మాటలను ఇక వదిలేది లేదు. నాపై అడ్డగోలు గా మాట్లాడిన మంత్రిని వదిలిపెట్టను. క్రిమినల్ కేసుతో పాటు పరువు నష్టం దావా కూడా వేస్తా. గతంలో ప్రతి పక్షంలో ఉన్నారని ఏది మాట్లాడినా పెద్దగా పట్టించుకోలే దు. ఇకపై వారిని వదిలేది లేదు. మోదీనే ఏం చేసుకుంటావో చేసుకో అన్నోళ్లం. ఈ చిట్టి నాయుడు ఎంత?’’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఈ ధర్నాలో ఎమ్మెల్సీ సురభి వాణిదేవి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు.సీఎంకు బతుకమ్మ అంటే గిట్టదా?‘‘ఆడబిడ్డల వేడుకకు ఏర్పాట్లు చేయడానికి సీఎంకు మనసు రావడం లేదా? పండుగ పూట కూడా పల్లె లను పరిశుభ్రంగా ఉంచలేరా? చెత్తా చెదారం మధ్య మురికి కంపులో మన అక్కాచెల్లెళ్లు బతుకమ్మ ఆడుకో వాలా? పల్లెల్లో బ్లీచింగ్ పౌడర్ కొనడానికి, చెరువు కట్టమీద లైట్లు పెట్టడానికి పైసల్లేని పరిస్థితులు దాపు రించాయి. రాష్ట్ర పండుగను నిర్వహించుకునేందుకు నిధుల్లేని దౌర్భాగ్యం ఎందుకొచ్చింది? తెలంగాణ అస్తిత్వ సంబురంపై ఎందుకింత నిర్లక్ష్యం?బతుకమ్మ చీరలను రద్దు చేశారు. బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా చేసుకోవాల్సిన అవసరం లేదని చెబుతున్నారా?’’ – ‘ఎక్స్’లో కేటీఆర్ విమర్శలు -
కొండా సురేఖకి అండగా ఉన్నాం
సాక్షి, హైదరాబాద్: మంత్రి కొండా సురేఖ తాను అన్న మాటలను ఉపసంహరించుకున్న తరువాత కూడా చర్చ కొనసాగించడం అనవసరమని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నా రు. శనివారం ఆయన గాంధీభవన్‌లో మీడి యాతో చిట్‌చాట్ చేస్తూ పలు అంశాలపై స్పందించారు. కొండా సురేఖ వ్యాఖ్యలను విత్ డ్రా చేసుకోవాలని నాగార్జున ఫ్యామిలీ కోరిన మేర కు మంత్రి వెంటనే స్పందించి తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్ర కటించారని గుర్తు చేశారు. ఆ అంశం అంతటి తో ముగిసిపోయిందని, పీసీసీ అధ్యక్షుడు కూ డా సమస్య సద్దుమణిగిందని చెప్పిన తరు వాత కూడా మాట్లాడటం శోచనీయమని అ న్నారు. కొండా సురేఖ ఇబ్బంది పడ్డప్పుడు మాట్లాడనోళ్లు ఇప్పుడు మాట్లాడుతున్నారని ఆరోపించారు.సురేఖ ఒంటరి కాదని, బలహీ న వర్గాల మంత్రికి తామంతా అండగా ఉన్నా మని అన్నారు. కేంద్రం నుంచి పైసా తేలేని వారు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని, బాధ్యత గల ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వానికి మంచి సలహాలు ఇవ్వాలన్నారు. ఈ సంవత్స రం మహిళా సంఘాల సభ్యులకు మాత్రమే బ తుకమ్మ చీరలు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ఇప్పటికే బతుకమ్మ చీరలకు రూ. 150 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. విద్యార్థి సంఘం నాయకుడిగా రెసిడెన్షియల్ విద్యాసంస్థల సమస్యలపై సీఎం, డిప్యూటీ సీఎంతో చర్చించానని, వారు సానుకూలంగా స్పందించారని పొన్నం వెల్లడించారు. -
కాలకేయ ముఠాలా మారారు: సీఎం రేవంత్
గన్‌ఫౌండ్రీ (హైదరాబాద్): రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మంచి చేసేందుకు ఏ కార్యక్రమం చేపట్టినా కొందరు కాలకేయ ముఠాలా అడ్డుపడుతున్నారని సీఎం రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. వాళ్లు గత పదేళ్లలో వందల ఎకరాల్లో ఫామ్‌హౌస్‌లు నిర్మించుకుంటే.. నిరుపేద ప్రజలు మాత్రం మురుగునీరు, కలుషిత వాతావరణంలో నివసిస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం మూసీ నిర్వాసితులకు అన్నివిధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. శనివారం హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో ప్రభుత్వం ఆధ్వర్యంలో కేంద్ర మాజీ మంత్రి జి.వెంకటస్వామి (కాకా) 95వ జయంతి వేడుకలను నిర్వహించారు. సీఎం రేవంత్ ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘ప్రజాప్రభుత్వం నిరుపేదలకు అండగా ఉంటుందే తప్ప అన్యాయం చేయబోదు. కొందరు వ్యక్తులు తమ ఫామ్‌హౌజ్‌లను రక్షించుకోవడం కోసం మూసీ నిర్వాసితులను ఒక రక్షణ కవచంలా వాడుకుంటున్నారు. వారి కుట్రలను అర్థం చేసుకోవాలి. మూసీ నిర్వాసితులను ప్రభుత్వం అనాథలను చేయదు. వారికి ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసే బాధ్యత ప్రభుత్వానిదే. మూసీ రివర్, బఫర్ జోన్లలో ఉన్న నిరుపేదలను ప్రభుత్వం ఆదుకుంటుంది. పేదలకు మేలు చేసే విషయంలో విపక్ష నేతలతో సహా ఒక కమిటీ వేస్తాం. పేదలకు మేలు జరిగేలా తగు సూచనలు చేయాలి. బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు సచివాలయానికి రావాలి. వారితోపాటు నేను, డిప్యూటీ సీఎం, అధికారులు కూర్చుందాం. మూసీ ప్రణాళికలపై చర్చిద్దాం. ప్రజలకు ఇళ్లు ఇస్తే మేలు జరుగుతుందా? లేక డబ్బులిస్తే మేలు జరుగుతుందా అనే విషయాలపై ఆలోచిద్దాం. మూసీని కాపాడుకోవాలి.. మూసీ నది, చెరువులు, కుంటలు చివరకు నాలాలను సైతం ఆక్రమించారు. ఇలాగే వదిలేస్తూ.. మూసీ నదిని మూసేద్దామా? 1908లో వరదలు వచ్చినప్పుడు జరిగిన విపత్తు వంటివి పునరావృతం కావొద్దంటే మూసీని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. గుజరాత్లో సబర్మతి నదిని నరేంద్ర మోదీ ప్రక్షాళన చేస్తే చప్పట్లు కొట్టిన బీజేపీ నాయకులు.. మూసీ ప్రక్షాళన అంటే మాత్రం ఎందుకు సహకరించడం లేదు? ఆస్తుల లెక్కలు చూద్దామా? తెలంగాణ ప్రజల ఆస్తులు తగ్గుతుంటే.. గత ప్రభుత్వంలోని వారి ఆస్తులు ఎలా పెరిగాయి? 2004లో కేసీఆర్, 2005లో హరీశ్‌రావుల ఎన్నికల అఫిడవిట్ల నుంచి.. ఇప్పటి వాళ్ల ఆస్తుల వివరాలను చూద్దామా. కొందరు సోషల్ మీడియాతో అధికారంలోకి రావాలని కలలు కంటున్నారు. కానీ సోషల్ మీడియాతో అధికారంలోకి రావడం ఏమోగానీ.. చర్లపల్లి జైలుకు వెళ్లడం మాత్రం ఖాయం. నిర్వాసితులకు మలక్‌పేట, అంబర్‌పేటల్లో ఇళ్లు మూసీ నిర్వాసితులకు మంచి జీవితాన్ని ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. మలక్‌పేట్‌లో ఉన్న రేస్‌కోర్స్, అంబర్‌పేటలో ఉన్న పోలీస్ అకాడమీలను హైదరాబాద్ శివార్లకు తరలిస్తాం. ఈ ప్రాంతాల్లో మూసీ నిర్వాసితులకు ఇళ్లు కట్టిద్దాం. కేటీఆర్, హరీశ్‌రావులకు నిజంగా పేదలపై ప్రేమ ఉంటే.. వారికి ఉన్న వందల ఎకరాల ఫామ్‌హౌజ్‌ల నుంచి కొన్ని ఎకరాలను నిరుపేదలకు పంచి ఇవ్వాలి. బీఆర్ఎస్ పార్టీ ఖాతాలో రూ.1,500 కోట్లు ఉన్నాయి. అందులో నుంచి రూ.500 కోట్లు పేదలకు ఇవ్వొచ్చుకదా! బీఆర్ఎస్ హయాంలో కేవలం రూ.17 వేలకోట్లు రుణమాఫీ చేస్తే మేం నెల రోజుల్లోనే రూ.18 వేల కోట్ల రైతు రుణమాఫీ చేశాం. రైతులెవరూ రోడ్ల మీదికి రావొద్దు. ఏవైనా సమస్యలుంటే కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేస్తే సమస్య తీరిపోతుంది..’’అని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ‘కాకా’ఆశయాలను కొనసాగిస్తాం తెలంగాణ నుంచి జాతీయ స్థాయికి ఎదిగిన అతి కొద్ది మందిలో కాకా వెంకటస్వామి ఒకరని సీఎం రేవంత్ కొనియాడారు. కాకా పేదల మనిషని, 80 వేల మందికిపైగా నిరుపేదలకు ఇళ్లు ఇప్పించిన, సింగరేణి సంస్థను కాపాడి కార్మికులకు అండగా నిలిచిన గొప్ప వ్యక్తి ఆయన అని చెప్పారు. గత ప్రభుత్వం కాకా జయంతిని అధికారికంగా జరపకుండా విస్మరించిందని విమర్శించారు. తాము కాకా ఆశయాలను కొనసాగిస్తామన్నారు. బలమైన లక్ష్యాలు ఉంటే పేదరికం, కులం అడ్డంకులు కావని కాకా నిరూపించారని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. అనంతరం జి.వెంకటస్వామిపై రూపొందించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు వివేక్ వెంకటస్వామి, గడ్డం వినోద్, నాగరాజు, ఎమ్మెల్సీ కోదండరామ్, ఎంపీలు అనిల్‌కుమార్ యాదవ్, మల్లురవి, గడ్డం వంశీకృష్ణ, మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
హైడ్రా ఆపితే హైదరాబాద్ మరో వయనాడ్ అవుతుంది: టీపీసీసీ చీఫ్
సాక్షి, నిజామాబాద్: తెలంగాణలో హైడ్రా ఆపితే హైదరాబాద్ మరో వయనాడ్ అవుతుందంటూ సంచలన కామెంట్స్ చేశారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. అలాగే, ప్రభుత్వ స్థలాలు అక్రమిస్తే ఎంతటి వారైనా వదిలిపెట్టం అంటూ హెచ్చరించారు. ఇదే సమయంలో కొండా సురేష్, కేటీఆర్ అంశంపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు.టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో హైడ్రా, మూసీ యజ్ఞం ఏదీ ఆగదు. హైడ్రాను జిల్లాలకు కూడా విస్తరిస్తాం. ప్రభుత్వ స్థలాలు ఆక్రమిస్తే ఎంతటి వారైనా వదిలిపెట్టం. మా కుటుంబసభ్యులు కబ్జా చేసిన కూల్చేయండి. మూసీ సుందరీకరణపై ఇంకా డీపీఆర్ సిద్ధం కాలేదు. నిధులు ఎలా మళ్లిస్తాం. బీఆర్ఎస్ నేతలు దాదాపు 1500 చెరువులను కబళించారు. మూసీ సుందరీకరణ ప్రారంభానికి ముందే అవినీతి జరుగుతుందంటూ బీఆర్ఎస్ విమర్శలు అవివేకం. ఇప్పుడు జరుగుతుంది మూసీ ప్రక్షాళన మాత్రమే.రుణ మాఫీ చేస్తే రాజీనామా చేస్తా అన్న హరీష్ రావు మాట తప్పారు. సవాలు విసిరి వెనక్కి తగ్గారు. పదేళ్లలో బీఆర్ఎస్ రుణమాఫీకి ఇచ్చిన సొమ్మెంత.. కాంగ్రెస్ ఇచ్చిన సొమ్మెంతో హరీష్ చెప్పాలి. రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పాము.. తొమ్మిదినెలల్లోనే 18 వేల కోట్లు రుణమాఫీని ప్రభుత్వం చేసింది. దీనిపై చర్చకు మేం సిద్దమే..హరీష్ సిద్దమా?. ఏడున్నర లక్షలపైగా అప్పుతో బీఆర్ఎస్ మాకు రాష్ట్రాన్ని అప్పగించింది. ఎన్ని ఇబ్బందులు ఉన్నా రుణమాఫీ చేశాం.కేటీఆర్ అమెరికాలో చదివాడా? లేక సర్టిఫికెట్ కొన్నాడా?. కేటీఆర్‌పై కోపంతో కొండా సురేఖ మాట్లాడారు. పీసీసీ సూచనతో వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నారు. మాటల్లో తప్పులు దొర్లాయి కాబట్టి.. సురేఖ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు. ఈ వివాదానికి తెర లేపిందే కేటీఆర్. యక్తిగతంగా వ్యాఖ్యలు చేయడం కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం కాదు. కానీ, రఘునందన్ రావు విషయంలో కొండా సురేఖపై దుబాయ్ నుంచి సోషల్ మీడియాలో తప్పుగా పోస్టు చేశారు. దానివల్లే సురేఖ అలా మాట్లాడారు. అయినా అలా మాట్లాడటం సరైంది కాదు కాబట్టి కొండా సురేఖ చెప్పాం. దీంతో, తన మాటలను ఉపసంహరించుకున్నారు. ఆ వివాదానికి ముగింపు పలకాలని సూచించాం. ఎవరు అయినా కోర్టుకు వెళ్ళే హక్కు ఉంటుంది. అందుకే నాగార్జున కూడా వెళ్లి అంటారు.త్వరలో నామినేటెడ్, పార్టీ పదవుల భర్తీ జరుగుతుంది. రాష్ట్ర మంత్రి వర్గంలో నిజామాబాద్‌కు తప్పుకుండా ప్రాతినిధ్యం దక్కుతుంది. పార్టీ కోసం కష్టపడ్డ వారికి అవకాశం లభిస్తుంది. నిజామాబాద్ స్మార్ట్ సిటీ జాబితాలో ఉండాల్సిందే. సాంకేతిక అంశాలు అన్నీ అనుకూలంగా ఉన్నా జాబితాలో రాలేదు. కొందరి అసమర్థత వల్ల జాబితాలో రాలేదు. స్మార్ట్ సిటీ జాబితాలో వచ్చేలా ప్రయత్నం చేస్తాం. జిల్లాలో మరో మెడికల్ కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తున్నా. 2025 నాటికి సీఎంసీ మెడికల్ కళాశాల ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకుంటాం అని కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: హరీష్.. కేసీఆర్‌ను తీసుకొచ్చే కెపాసిటీ ఉందా?: జగ్గారెడ్డి సవాల్ -
హరీష్.. కేసీఆర్‌ను తీసుకొచ్చే కెపాసిటీ ఉందా?: జగ్గారెడ్డి సవాల్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇప్పటికే ఇరు పార్టీల నేతలు ఆరోపణలు చేసుకున్నారు. తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుకు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సవాల్ విసిరారు. రుణమాఫీకి సిద్దమా? అని చాలెంట్ చేశారు.మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి శనివారం మీడియాతో మాట్లాడుతూ..‘రుణమాఫీపై హరీష్ రావుకు సవాల్ చేస్తున్నాను. రుణమాఫీపై చర్చకు బీఆర్ఎస్ సిద్దామా?. రుణమాఫీపై చర్చకు మల్లిగాడు, ఎల్లిగాడు కాకుండా కేసీఆర్ రావాలి. సీఎం రేవంత్‌ను ఒప్పించి చర్చకు నేను తీసుకువస్తాను. కేసీఆర్‌ను ఒప్పించి చర్చకు తీసుకువచ్చే కెపాసిటీ హరీష్‌కు ఉందా?. మాతో చర్చకు మీకు భయంగా ఉంటే.. సిద్దిపేటలోనే చర్చ పెట్టండి.రుణమాఫీ విషయంలో పబ్లిసిటీ చేయడంలో మేము ఫేయిల్ అయ్యాం. కానీ, బీఆర్ఎస్ మాత్రం పబ్లిసిటీలో పాస్ అయ్యింది. సాంకేతిక కారణాల వల్ల కొందరికి రుణమాఫీ కాలేదని మేమే చెబుతున్నాం. దీనిపై హరీష్ రావు సహా, బీఆర్ఎస్ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారు. ఆర్థిక శాఖను కేసీఆర్ దివాలా తీశారు. బీఆర్ఎస్ పాలన సమయంలో ఎనిమిది కిస్తీల్లో లక్ష రూపాయలు కూడా రుణమాఫీ చేయలేకపోయారు. మేం పబ్లిసిటీ దగ్గర ఫెయిల్ అయ్యాం. రుణ మాఫీ అందని రైతులకు ఏ కారణాల వల్ల అందలేదో వివరాలు తెప్పించమని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు’ అని చెప్పుకొచ్చారు. ఇది కూడా చదవండి: రేవంత్.. ముందు రెడ్డికుంటలో నీ ఇల్లు కూల్చేవేయ్: కేటీఆర్ -
ముచ్చర్ల కేంద్రంగా ఫోర్త్ సిటీ కాదు.. ఫోర్ బ్రదర్స్ సిటీ: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అన్ని వర్గాలను సీఎం రేవంత్ మోసం చేస్తున్నాడని ఆరోపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇందిరమ్మ ఇళ్లు కడాతామంటే ఓట్లు వేశారు కానీ.. కూలగొట్టడానికి కాదంటూ మండిపడ్డారు. ఆరు గ్యారంటీలకు పైసలు లేవు కానీ.. మూసీ సుందరీకరణకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. బతుకమ్మ పండుగకు చీరలు రావు. పండుగను పండుగ మాదిరిగా లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని కందుకూరు వద్ద నిర్వహించిన రైతు ధర్నాలో కేటీఆర్ పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. మూసీ సుందరీకరణ పేరుతో కాంగ్రెస్ నేతలు కమీషన్లు కొట్టేయాలని చూస్తున్నారు. పథకాలు అమలు చేస్తే.. కమీషన్ రాదు.. అందుకే మూసీ అంటున్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాలను రేవంత్ మోసం చేస్తున్నారు. మూసీ కంపు అంతా సీఎం రేవంత్ నోట్లోనే ఉంది. తప్పు చేయనప్పుడు భయపడేది లేదు. త్వరలోనే రేవంత్ మీద కూడా పరువు నష్టం దావా వేస్తాను. ఇప్పటికే మంత్రి మీద కేసు వేశాను. మోదీకే భయపడలేదు.. చిట్టి నాయుడుకి భయపడతామా?.నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే కొడంగల్ రెడ్డికుంటలో ఉన్న నీ ఇల్లు కూల్చు. పైసల పిచ్చి ఉంటే.. నాలుగు కోట్ల మంది చందాలు వసూలు చేసి రేవంత్‌కు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఢిల్లీకి కప్పం కట్టడానికి.. కుర్చీ కాపాడుకోవడానికి చందాలు వేసి ఇద్దాం.. కానీ పేద ప్రజల దగ్గరకు మాత్రం రావద్దు. నాలుగున్నర గంటలు అసెంబ్లీలో నిలబడితే కనీసం కనికరం లేదు. సామాన్యులను తప్పించుకొని ఎక్కువ రోజులు పాలన చేయలేరు. కందుకూరు రైతు ధర్నా స్ఫూర్తితో ప్రతీ పల్లెలో ఆందోళనకు సిద్ధం కావాలి.ముచ్చర్ల కేంద్రంగా రేవంత్‌రెడ్డి చేసేది ఫోర్త్ సిటీ కాదు.. ఫోర్ బ్రదర్స్ సిటీ. ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ మార్చడానికి మంత్రి కోమటిరెడ్డి ప్రయత్నిస్తున్నారు. 2015 నుంచి 2022 వరకు ఎంతో శ్రమించి ఫార్మా సిటీ కోసం రైతుల నుంచి 14 వేల ఎకరాల భూమిని బీఆర్ఎస్ సేకరించింది. ఆ భూములు ఫార్మా సిటీకి తప్ప.. ఫ్యూచర్ సిటీకి వినయోగించడానికి వీలు లేదు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నిరుపేదల భూములను గుంజుకోవడమే పనిగా పెట్టుకుంది. ఫార్మా సిటీ కోసం సేకరించిన భూముల్లో ఫ్యూచర్ సిటీ ఎలా కడతారు?. ఏఐ సిటీ, ఫోర్త్ సిటీ, ఫ్యూచర్ సిటీ అంటూ దొంగ నాటకాలు ఆడుతున్నారు.రైతు రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ సర్కార్ పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తోంది. అర్హులైన రైతులందరికీ వెంటనే రూ.2 లక్షల రుణమాఫీ చేయాలి. ఒక్కో ఎకరానికి రూ.15 వేల చొప్పున రైతు భరోసా ఇవ్వాలి. వడ్లకు బోనస్ ఇస్తానని చెప్పిన ప్రభుత్వం ఇప్పటి వరకు ఆ ఊసే ఎత్తడం లేదు. కనీస మద్దతు ధరకు అదనంగా వరికి 500 రూపాయలు ఇస్తా అని చెప్పి మోసం చేస్తున్నారు. పెన్షన్ నాలుగు వేలు ఇస్తామన్నారు. అది కూడా ఇవ్వడం లేదు. ఇచ్చిన ప్రతీ హామీని కాంగ్రెస్ నేతలు విస్మరించారు’ అని విమర్శలు చేశారు.ఇది కూడా చదవండి: కబ్జాల కారణంగా మూసీ మూసుకుపోతోంది: సీఎం రేవంత్ -
ఫామ్‌హౌస్‌లు కాపాడుకునేందుకు దీక్షలా?: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: కబ్జాల కారణంగా మూసీ పూర్తిగా మూసుకుపోతుందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మూసీ ప్రాంతాల్లో ఉన్న వాళ్లు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. ఫామ్‌హౌస్‌లను కాపాడుకునేందుకు కొందరు దీక్షలు చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలను ఉద్దేశించి ఘాటు విమర్శలు చేశారు.వెంకటస్వామి జయంతి సందర్భంగా రవీంద్రభారతిలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో సీఎం రేవంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. ‘హైదరాబాద్ పూర్తిగా కాంక్రీట్ జంగిల్‌గా మారిపోయింది. చెరువుల ఆక్రమణతో మన బ్రతుకులు సర్వనాశనమవుతున్నాయి. బఫర్ జోన్లో ఉన్న వాళ్లకు ప్రత్యామ్నాయం చూపిస్తాం. చెరువుల్లో ఎఫ్టీఎల్, బఫర్ జోన్లో ఉన్నవాళ్లు మిమ్మల్ని ఏరకంగా ఆదుకోవాలో ప్రభుత్వానికి సూచన చేయండి. ప్రతిపక్షాల సూచనలను స్వీకరిస్తాం. మూసీ పరివాహక పేదలను ఆదుకునేందుకు రూ.10వేల కోట్లు ఖర్చు చేయడానికైనా సిద్ధంగా ఉంది. ఈటల రాజేందర్, కేటీఆర్, హరీష్ రావుకు సూచన చేస్తున్నా. మూసీ పరివాహక ప్రాంత ప్రజలను ఎలా ఆదుకుందామో సూచనలు ఇవ్వండి. మా ప్రభుత్వానికి ఎవరిపైనా కోపం లేదు. ప్రజలకు మేలు చేయడమే మా ప్రభుత్వ ఎజెండా అని అన్నారు ..కబ్జాల వల్ల మూసీ మూసుకుపోతోందని, అందువల్లే ప్రక్షాళన మొదలుపెట్టాం. మూసీ నిర్వాసితులను అనాథలను చేయం. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తాం. వలస వచ్చిన వాళ్లకు మంచి జీవితాన్ని ఇవ్వడమే మా లక్ష్యం. కొందరు కావాలనే పేదలను రెచ్చగొడుతున్నారు. పేదలను రెచ్చగొట్టడం మానేసి నిర్వాసితులను ఆదుకునేందుకు సలహాలివ్వండి. తెలంగాణ ప్రజల ఆస్తులు తగ్గుతుంటే.. ప్రతిపక్ష నేతల ఆస్తులు ఎలా పెరిగాయి?. ఫామ్‌హౌస్‌లను కాపాడుకునేందుకు కొందరు దీక్షలు చేస్తున్నారు. బీఆర్ఎస్ ఖాతాలో రూ.1500 కోట్లు ఉన్నాయి. పేదలకు రూ.500 కోట్లు ఇవొచ్చు కదా?. అంబర్‌పేటలో 200 ఎకరాల భూమి ఉంది. అది పేదలకు పంచుదాం.. ప్రతిపక్ష నేతలు ఏమంటారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల మంచి కోసమే పనిచేస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ సబర్మతీ నదిని అభివృద్ధి చేస్తే చప్పట్లు కొట్టి గొప్పలు చెబుతున్నారు. మరి సబర్మతిలా మూసీని అభివృద్ధి చేస్తే వచ్చిన ఇబ్బంది ఏమిటి?. కేసీఆర్, కేటీఆర్‌కు నిజంగా పేదలపై ప్రేమ ఉంటే ఫామ్ హౌస్‌లో కొంత భూమిని పేదలకు దానం చేయండి. పేదోళ్లకు ఏం చేద్దామో ఆలోచన చేద్దాం ముందుకు రండి. మీ ఆస్తులు ఇవ్వకపోయినా ఫర్వాలేదు.. మీ అనుభవంతో ఏం చేద్దామో చెప్పండి. అంతే కానీ.. ప్రభుత్వం ఏం చేసినా కాలకేయ ముఠాలా అడ్డుపడటం సరికాదు. ఐదేళ్లలో వాళ్లు చేసిన రుణమాఫీ కేవలం 11వేల కోట్లు.. నెలరోజుల్లో మేం 18వేల కోట్లు రైతు రుణమాఫీ చేసాం. దయచేసి రైతులెవరూ రోడ్డెక్కొద్దు.. సమస్య ఉంటే కలెక్టర్లను కలవండి. సోషల్ మీడియాతో అధికారంలోకి వస్తామని కొందరు కలలు కంటున్నారు. సోషల్ మీడియాతో అధికారంలోకి రావడం కాదు.. వాళ్లు చర్లపల్లి జైలుకు వెళ్లడం ఖాయం అంటూ హెచ్చరించారు. ఇది కూడా చదవండి: ‘జీహెచ్ఎంసీ’పై మంత్రి కోమటిరెడ్డి సంచలన ప్రకటన -
హోం మంత్రి పదవి ఇవ్వాలని..!
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: దసరాకు మంత్రివర్గ విస్తరణ ఉంటుందని చర్చ జరుగుతున్న నేపథ్యంలో జిల్లా నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి మంత్రి పదవి ఖాయమని ఆయన అనుచరులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. గతంలోనూ మంత్రివర్గ విస్తరణ జరుగుతుందన్న చర్చ బయటకు రావడంతో రాజగోపాల్‌రెడ్డికి మంత్రి పదవి వస్తుందన్న ప్రచారం జోరుగా సాగింది. అప్పుడు విస్తరణ జరగలేదు. ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఢిల్లీ వెళ్లిన సందర్భంలోనూ మంత్రివర్గ విస్తరణపైనే అధిష్టానంతో చర్చించారని వార్తలు వచ్చాయి. అప్పటికప్పుడు నిర్ణయం వెలువడకపోయినా దసరాకు ముందు మంత్రివర్గ విస్తరణ ఉంటుందని కాంగ్రెస్ వర్గాల్లో ఊగాహానాలు జోరందుకున్నాయి. దీంతో మంత్రి వర్గంలో రాజగోపాల్‌రెడ్డికి బెర్త్ ఖాయమనే చర్చ మళ్లీ మొదలైంది.ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి..మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి మంత్రి పదవి వస్తుందని భావిస్తూ వస్తున్నారు. కానీ, మొదట్లో ఉమ్మడి జిల్లా నుంచి తన సోదరుడైన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి మంత్రి పదవులు వచ్చాయి. ఆ తర్వాత మంత్రి వర్గ విస్తరణలో రాజగోపాల్‌రెడ్డికి తప్పకుండా అవకాశం దక్కుతుందని జోరుగా చర్చ సాగింది. అయితే పది నెలలు అవుతున్నా మంత్రివర్గ విస్తరణ జరగనే లేదు. మంత్రివర్గ విస్తరణ అంశం తెరపైకి వచ్చిన ప్రతిసారి రాజగోపాల్‌రెడ్డి పేరు ప్రస్తావనకు వస్తోంది.ఎంపీ ఎన్నికల సందర్భంలో అధిష్టానం హామీపార్లమెంట్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఢిల్లీ, రాష్ట్ర అధిష్టానం తనకు మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చినట్లుగా రాజగోపాల్‌రెడ్డి పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. రాహుల్‌గాంధీ ప్రధాని కావాలంటే రాష్ట్రం నుంచి ఎక్కువ మంది ఎంపీలను గెలిపించాలని అధిష్టానం, రాష్ట్ర పార్టీ నేతలు, ముఖ్యమంత్రి కలిసి నిర్ణయించారు. అభ్యర్థుల ఎంపికతోపాటు వారి గెలుపు బాధ్యతలను జిల్లాల్లోని ముఖ్య నేతలకు అప్పగించారు. అందులో భాగంగా భువనగిరి ఎంపీగా చామల కిరణ్‌కుమార్‌రెడ్డిని గెలిపించే బాధ్యతను మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి సీఎం రేవంత్‌రెడ్డి అప్పగించారు. ఆ సమయంలో ఎంపీని గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తామని అధిష్టానం హామీ ఇచ్చినట్లుగా చర్చ జరిగింది. మొత్తానికి భువనగిరి ఎంపీగా చామల కిరణ్‌కుమార్‌రెడ్డిని దగ్గరుండీ గెలిపించారు. అప్పటి నుంచి మంత్రి పదవి కచ్చితంగా వస్తుందని రాజగోపాల్‌రెడ్డి భావించినా ఇంతవరకు మంత్రివర్గ విస్తరణ మాత్రం జరగలేదు. అయితే, దసరాకు మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఈ నేపధ్యంలో అధిష్టానం హామీ మేరకు రాజగోపాల్‌రెడ్డికి బెర్త్ దక్కుతుందా అన్న చర్చ మళ్లీ జోరందుకుంది.హోం మంత్రి పదవి ఇవ్వాలని..!ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇటు ప్రతిపక్ష, అటు అధికార పక్షాల మధ్య పోటాపోటీగా అసెంబ్లీలో చర్చలు జరిగాయి. ఆ తర్వాత ప్రభుత్వ వేదికలతోపాటు రాజకీయ వేదికల్లోనూ పెద్ద ఎత్తున అధికార, ప్రతిపక్షాలు పోటా పోటీగా విమర్శలు చేసుకున్నాయి. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని అధికార పక్షం, పాలన చేత కాక గత ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తుందని ప్రతిపక్షం విమర్శలు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే తనకు హోంమంత్రి పదవి ఇవ్వాలని, తాను హోంమంత్రి అయితేనే కేసీఆర్‌ను సమర్థంగా ఎదుర్కొంటానని రాజగోపాల్‌రెడ్డి పలు సమావేశాల్లోనూ చెప్పుకొచ్చారు.ఎస్టీ కోటాలో బాలునాయక్‌కు!ఎస్టీ లంబాడా కోటాలో దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్‌కు మంత్రి పదవి వస్తుందని చర్చ సాగుతోంది. రాష్ట్రంలో ఆదివాసీ గిరిజన కోటాలో సీతక్కకు అధిష్టానం అవకాశం కల్పించింది. లంబాడా కోటాలో మరొక మంత్రి పదవి ఇస్తారన్న చర్చ సాగుతోంది. -
‘మూసీ’ వెనక దాక్కున్న ముసుగు దొంగ ఎవరు? కేటీఆర్ ట్వీట్
సాక్షి, హైదరాబాద్: మూసీ సుందరీకరణ పేరిట అవినీతి ఆలోచనలు మానుకొని ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలపై సీఎం రేవంత్‌రెడ్డి దృష్టి పెట్టాలంటూ లేఖ రాసిన మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. కాంగ్రెస్ సర్కార్‌ను టార్గెట్ చేస్తూ.. మరోసారి ఎక్స్ వేదికగా ప్రశ్నలు సంధించారు.‘‘మూసీ వెనక దాక్కున్న ముసుగు దొంగ ఎవరు? రైతు రుణ మాఫీ ఎగ్గొట్టి, మూసీలో మురికి రాజకీయాలు చేస్తున్న మురికి దొంగ ఎవరు?. రైతు బంధు ఎగ్గొట్టి, మూసీ పేదల ఉసురు పోసుకుంటున్న దుర్మార్గుడు ఎవరు?. మహిళలకు వంద రోజుల్లోనే నెలకు 2500 ఇస్తా అని చెప్పి తప్పించుకు తిరుగుతున్న మోసగాడు ఎవరు?. అవ్వ, తాతలకు నెలకు 4000 ఇస్తా అని చెప్పి ఎగ్గొట్టిన నయవంచకుడు ఎవరు?. ఆడబిడ్డల పెళ్లిళ్లకు తులం బంగారం ఇస్తా అని మాట తప్పిన దగావీరుడు ఎవరు?. మూసి బ్యూటిఫికేషన్ పేరిట 1,500,000,000 కోట్ల లూటిఫికేషన్‌కి తెరతీసిన ఘనుడు ఎవరు?’’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.కాగా, మూసీ ప్రక్షాళన కోసం రూ. లక్షన్నర కోట్లు ఖర్చు పెడతామంటున్న ముఖ్యమంత్రికి రైతు భరోసా, దొడ్డు వడ్లకు బోనస్ ఇచ్చేందుకు డబ్బులు లేవా? అంటూ ప్రభుత్వానికి లేఖ రాశారు. రాష్ట్ర రైతాంగానికి ఇచ్చిన హామీలపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ దుయ్యబట్టారు. సీఎం నిర్వహించిన వ్యవసాయ సమీక్షలో దొడ్డు వడ్లకు రూ. 500 బోనస్, వర్షాకాలంలో రైతు భరోసా వంటి అంశాలపై చర్చించలేదని విమర్శించారు.ఇదీ చదవండి: సర్కార్‌పై సమరానికి సై!గత సీజన్లోనూ రైతులకు వరి ధాన్యంపై బోనస్ చెల్లించకుండా ప్రభుత్వం మోసగించిందని ఆరోపించారు. కేవలం సన్న వడ్లకే బోనస్ ఇస్తామనే ప్రకటనతో రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు. 80 శాతం మంది రైతులు దొడ్డు వడ్లు పండిస్తారని తెలిసి కూడా కేవలం సన్న వడ్లకే ప్రభుత్వం బోనస్ ఇస్తామని ప్రకటించడం సరికాదన్నారు. దొడ్డు వడ్లకు కూడా బోనస్ ఇవ్వకుంటే రైతుల తరఫున బీఆర్ఎస్ పోరాడుతుందని కేటీఆర్ హెచ్చరించారు. -
తుంగతుర్తి కాంగ్రెస్‌లో ముసలం.. రహస్య ప్రాంతంలో అసమ్మతి నేతలు
సాక్షి, సూర్యాపేట జిల్లా: తుంగతుర్తి కాంగ్రెస్ పార్టీలో లొల్లి కొనసాగుతోంది. ఎమ్మెల్యే మందుల సామేల్‌కు వ్యతిరేకంగా ఉదయం 11 గంటలకు జాజిరెడ్డిగూడెంలో అసమ్మతి వర్గం సమావేశం సమావేశం కానుంది. దగా పడ్డా కాంగ్రెస్ సీనియర్ ల్లారా కదలిరండి పేరుతో కార్యక్రమం చేపట్టారు. డీసీసీ ఉపాధ్యక్షుడు యోగానంద చారి అధ్యక్షతన సమావేశం జరగనుంది. గత కొంతకాలంగా సామేల్, యోగానంద చారి మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. గతంలో జాజిరెడ్డిగూడెం మండలంలో పర్యటించిన ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా యోగానంద నిరసన కార్యక్రమం చేయించారు. అసమ్మతి వర్గం వెనుక ఓ మాజీ మంత్రి ఉన్నట్లు ఎమ్మెల్యే అనుచరులు ఆరోపిస్తున్నారు.కాగా, జాజిరెడ్డిగూడెంలో కాంగ్రెస్ అసమ్మతి నేతలను ముందస్తు అరెస్ట్ చేసినట్లు సమాచారం. జాజిరెడ్డిగూడెం మండల పార్టీ అధ్యక్షుడు మోరపాక సత్యం, తుంగతుర్తి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డితో పాటు పలువురు నేతలను అరెస్టు చేసి రహస్య ప్రాంతానికి తరలించినట్లు సమాచారం.అసమ్మతి నేతలను ముందస్తు అరెస్ట్ చేశారని.. కాంగ్రెస్ నేతలు సమావేశం అయ్యే అవకాశం కూడా పార్టీలో లేదా అంటూ వాట్సాప్ గ్రూపుల్లో పోస్టులు పెడుతున్నారు. సామేల్ కాంగ్రెస్‌లో ఉన్నారా? బీఆర్ఎస్లో ఉన్నారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అరెస్ట్ చేసిన నేతలను విడిచిపెట్టకపోతే జాజిరెడ్డిగూడెం బంద్ చేస్తామని హెచ్చరిస్తున్నారు.ఇదీ చదవండి: సర్కార్‌పై సమరానికి సై! -
అవినీతి మానేసి హామీలపై దృష్టిపెట్టండి
సాక్షి, హైదరాబాద్: మూసీ సుందరీకరణ పేరిట అవినీతి ఆలోచనలు మానుకొని ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టి పెట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు హితవు పలికారు. మూసీ ప్రక్షాళన కోసం రూ. లక్షన్నర కోట్లు ఖర్చు పెడతామంటున్న ముఖ్యమంత్రికి రైతు భరోసా, దొడ్డు వడ్లకు బోనస్ ఇచ్చేందుకు డబ్బులు లేవా? అని ప్రశ్నించారు. రాష్ట్ర రైతాంగానికి ఇచ్చిన హామీలపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ దుయ్యబట్టారు.ఈ మేరకు సీఎం రేవంత్‌కు కేటీఆర్ శుక్రవారం లేఖ రాశారు. సీఎం నిర్వహించిన వ్యవసాయ సమీక్షలో దొడ్డు వడ్లకు రూ. 500 బోనస్, వర్షాకాలంలో రైతు భరోసా వంటి అంశాలపై చర్చించలేదని విమర్శించారు. గత సీజన్లోనూ రైతులకు వరి ధాన్యంపై బోనస్ చెల్లించకుండా ప్రభుత్వం మోసగించిందని ఆరోపించారు. కేవలం సన్న వడ్లకే బోనస్ ఇస్తామనే ప్రకటనతో రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు. 80 శాతం మంది రైతులు దొడ్డు వడ్లు పండిస్తారని తెలిసి కూడా కేవలం సన్న వడ్లకే ప్రభుత్వం బోనస్ ఇస్తామని ప్రకటించడం సరికాదన్నారు. దొడ్డు వడ్లకు కూడా బోనస్ ఇవ్వకుంటే రైతుల తరఫున బీఆర్ఎస్ పోరాడుతుందని కేటీఆర్ హెచ్చరించారు.రైతు భరోసా సంగతి తేల్చండి: వానాకాలం సీజన్ పూర్తయినా ప్రభు త్వం రైతు భరోసా సంగతి తేల్చడం లేదని కేటీఆర్ లేఖలో మండిపడ్డారు. రైతుబంధు పథకం పేరును రైతు భరోసాగా మార్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఎకరాకు రూ. 15 వేలు ఇస్తామనే హామీని విస్మరించిందని, నేటికీ రైతులకు పెట్టుబడి సాయం అందించలేదని దుయ్యబట్టారు. రైతులకు బాకీ పడిన రైతు భరోసాను వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 100 శాతం రుణమాఫీ చేస్తామని ప్రకటించినా 20 లక్షల మంది రైతులకు నేటికీ మాఫీ వర్తించలేదన్నారు. ప్రభుత్వం ఏర్పడి 10 నెలలు అవుతున్నా రైతులకు మేలు జరగట్లేదని.. రేవంత్ చేతకానితనం అన్నదాతలకు శాపంగా మారిందని కేటీఆర్ ధ్వజమెత్తారు. -
కార్యకర్తల కృషి వల్లే పీసీసీ పీఠం
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: సాధారణ కార్యకర్త నుంచి అత్యున్నత స్థాయి పదవుల వరకు చేరుకోవాలంటే కాంగ్రెస్ పారీ్టతోనే సాధ్యమని పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్ కుమార్‌గౌడ్ అన్నారు. తనకు పీసీసీ పీఠం దక్కడమే ఇందుకు నిదర్శనమని.. ఈ గౌరవం కార్యకర్తల కృషి ఫలితమేనని చెప్పారు. శుక్రవారం నిజామాబాద్‌లోని పాత కలెక్టరేట్ గ్రౌండ్లో మహేశ్‌కుమార్ గౌడ్ సన్మాన సభ జరిగింది. ఈ సభకు సగానికిపైగా మంత్రివర్గం తరలివచ్చి0ది. మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు హాజరయ్యారు. తండ్రి మరణంతో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, విదేశాల్లో ఉండటంతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీతక్క, జూపల్లి కృష్ణారావు రాలేకపోయారు. ఈ సందర్భంగా మహేశ్‌కుమార్ మాట్లాడుతూ 38 ఏళ్ల రాజకీయ జీవితంలో అనేక కష్టనష్టాలు చవిచూశానని.. కానీ కష్టపడినందుకు పార్టీ నాయకత్వం గుర్తించి కలలో కూడా ఊహించని రీతిలో వడ్డీతో సహా పీసీసీ పీఠం అప్పగించిందన్నారు. డీఎస్ ఆశీర్వాదం తీసుకొనేవాడిని.. దివంగత మాజీ పీసీసీ చీఫ్ ధర్మపురి శ్రీనివాస్‌తో తనకు కొన్ని విభేదాలు ఉన్నప్పటికీ రాజకీయ గురువుగానే భావిస్తానని మహేశ్‌కుమార్‌గౌడ్ అన్నారు. కరాటే మాస్టర్‌గా ఉన్న తనను రాజకీయాల్లోకి తీసుకొచ్చి ప్రోత్సహించిన డీఎస్.. 1986లో తనను ఎన్ఎస్యూఐ జిల్లా అధ్యక్షుడిగా చేశారని గుర్తుచేసుకున్నారు. ఒకవేళ డీఎస్ బతికి ఉంటే పీసీసీ చీఫ్ హోదాలో వెళ్లి ఆయన ఆశీర్వాదం తీసుకొనేవాడినని చెప్పారు. సోషల్ ఇంజనీరింగ్‌తో ముందుకు.. రాహుల్ గాంధీ ఆలోచనా విధానంతో ముందుకు వెళతామని మహేశ్‌కుమార్‌గౌడ్ అన్నా రు. ఇందులో భాగంగానే సోషల్ ఇంజనీరింగ్, బీసీ గణన జరుగుతోందని చెప్పారు. ఆరు గ్యారంటీలను పక్కాగా అమలు చేసే పనిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందన్నారు. స్థానిక ఎన్నికల్లో కార్యకర్తలందరికీ న్యాయం చేస్తామన్నారు. 2028 ఎన్నికల్లో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఆధ్వర్యంలో, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో కలిసి రాష్ట్రంలో 90 నుంచి 100 అసెంబ్లీ సీట్లు, ఆ తర్వాత లోక్‌సభ ఎన్నికల్లో 15 ఎంపీ సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అన్ని సీట్లు గెలుస్తామని జోస్యం చెప్పారు. పీసీసీ కమిటీలో, డీసీసీల్లో 60 శాతం బీసీలకే పదవులు.. పీసీసీ కమిటీతోపాటు జిల్లా కాంగ్రెస్ కమిటీల్లోనూ 60 శాతం పదవులను బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల వారికే కేటాయించనున్నట్లు మహేశ్‌గౌడ్ తెలిపారు. పార్టీలో కష్టపడి పనిచేసే కార్యకర్తలకు కొదవ లేదన్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఎలాంటి రాజకీయ అండ లేనప్పటికీ పార్టీ అత్యున్నత గుర్తింపు ఇచ్చి0దని చెప్పారు. కార్యకర్తలకు ఎలా న్యాయం చేయాలో కాంగ్రెస్ అధిష్టానానికి తెలుసన్నారు. కార్యకర్తలే కాంగ్రెస్ బలం: దీపాదాస్ మున్షీకాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ మాట్లాడుతూ కార్యకర్తలే కాంగ్రెస్ పార్టీకి తిరుగులేని బలమన్నారు. నిజామాబాద్ కాంగ్రెస్ బలహీనంగా ఉందని గతంలో విన్నానని.. కానీ అభినందన సభకు ఇంత భారీగా కార్యకర్తలు, అభిమానులు రావడం చూస్తుంటే పార్టీ బలం పుంజుకుంటున్నట్లు కనిపిస్తోందని చెప్పారు. -
నా ఫామ్‌హౌస్‌కు అధికారులను పంపండి
సాక్షి, హైదరాబాద్: తన ఫామ్‌హౌస్‌లోని ఏ కట్టడమైనా ఒక్క అంగుళం ఎఫ్టీఎల్ లేదా బఫర్‌జోన్‌లో ఉన్నా సొంత ఖర్చులతో కూల్చుకునేందుకు సిద్ధంగా ఉన్నానని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ కేవీపీ రామచందర్‌రావు ప్రక టించారు. ‘‘కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా నాకు చట్టం నుంచి ఏ మినహాయింపులు వద్దు. ఒక సాధారణ పౌరుడి విషయంలో చట్టం ఏవిధంగా వ్యవహరిస్తుందో, అదే విధంగా వ్యవహరిస్తే చాలు. ఎక్కువ–తక్కువలు అవసరం లేదు.మీరు, నేను కలగజేసుకోకుండా చట్టాన్ని తన పని చేసుకుపోనిద్దాం’’అని పేర్కొంటూ శుక్రవారం ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డికి కేవీపీ లేఖ రాశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎటువంటి చెడ్డపేరు తేవడానికి తనలో నరనరాన ఉన్న కాంగ్రెస్ రక్తం అంగీకరించనందునే ఈ బహిరంగ లేఖ రాస్తున్నానని పేర్కొన్నారు. క్రమశిక్షణ, నిబద్ధత గల కాంగ్రెస్ కార్యకర్తగా ప్రాంతాలకు అతీతంగా జాతీయ పార్టీ కాంగ్రెస్ బలోపేతానికి తన శాయశక్తులా ప్రయత్నం చేస్తున్నానని తెలిపారు. మూసీ ప్రక్షాళనను స్వాగతిస్తున్నా.. హైదరాబాద్ శివార్లలోని అజీజ్‌నగర్‌లో ఉన్న తన ఫామ్‌హౌస్‌కు సంబంధిత అధికారులను పంపాలని.. వారు చట్టప్రకారం మార్క్ చేస్తే ఆ పరిధిలో కట్టడాలేవైనా ఉంటే 48 గంటల్లో కూల్చి, ఆ వ్యర్థాలను కూడా తొలగిస్తానని కేవీపీ లేఖ లో పేర్కొన్నారు. ఈ విషయంలో ప్రభుత్వానికి ఎలాంటి భారం పడనివ్వబోనని తెలిపారు. అయితే మార్కింగ్ ప్రక్రి య పారదర్శకంగా జరగాలని.. తేదీ, సమయాన్ని ముందే ప్రకటిస్తే ప్రతిపక్ష నాయకులు కూడా తీరిక చేసుకుని వచ్చి వీక్షించే అవకాశం కలుగుతుందని వెల్లడించారు. మూసీ ప్రక్షాళన, సుందరీకరణను స్వాగతిస్తున్నానని తెలిపారు. ఈ ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్, బీజేపీ నేతలు వారి స్వప్రయోజనాలను కాపాడుకోవడం కోసమే మాట్లాడుతున్నారని, వారిది మొసలి కన్నీరని విమర్శించారు.‘‘బీఆర్ఎస్, బీజేపీ నేతలు మీ భుజంపై తుపాకీ పెట్టి నన్ను కాల్చాలని, తద్వారా మిమ్మల్ని ఇరుకున పెట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు. వారు కాంగ్రెస్ సీఎంపై నిరాధార ఆరోపణలు చేయడానికి నన్ను, మా ఫామ్‌హౌస్‌ను పావుగా వాడుకోవడం మనోవేదన కలిగిస్తోంది. నేను కాంగ్రెస్‌లో క్రమశిక్షణ గల కార్యకర్తను. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకునే ప్రతి కార్యక్రమాన్ని త్రికరణ శుద్ధిగా సమరి్థస్తాను. ఈ విషయాన్ని ఒక కాంగ్రెస్ ముఖ్యమంత్రికి చెప్పవలసి రావడం బాధాకరమే అయినా తప్పడం లేదు’’లేఖలో కేవీపీ పేర్కొన్నారు. -
కేసీఆర్‌ది రైతు గుండె.. రేవంత్ రెడ్డిది రాతి గుండె
సాక్షి, మహబూబాబాద్: ‘తెలంగాణ సాధించిన కేసీఆర్.. పదేళ్ల పాలనలో రైతు పక్షపాతిగా ఉన్నారు. ఆయనది రైతుగుండె.. కానీ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులను మోసగించిన సీఎం రేవంత్‌రెడ్డిది రాతి గుండె’అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. అందరికీ రుణమాఫీ చేయాలని, ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్న డిమాండ్లతో శుక్రవారం మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో బీఆర్ఎస్ రైతు మహాధర్నా నిర్వహించింది. ఈ ధర్నాలో హరీశ్‌రావు మాట్లాడుతూ, ఎన్నికలకు ముందు కల్ల్లబొల్లి మాటలు చెప్పి, నేనే మొనగాడిని.. రాష్ట్రాన్ని బాగుచేసేది నేనే అని చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి అసలు స్వ రూపం బయట పడిందన్నారు. ఆయన మొనగాడు కాదు .. మోసగాడని ప్రజలు గ్రహించారని చెప్పారు. రుణ మాఫీ పై ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఒకతీరు.. మంత్రి తు మ్మల మరోతీరు మాట్లాడి రైతులను అయోమయానికి గురి చేస్తున్నారని విమర్శించారు. సీఎం మాటలు నమ్మిన రైతులు రూ.2 లక్షలకు పైగా ఉన్న అప్పులు చెల్లించారని, రుణమాఫీ అవుతుందని అధిక వడ్డీకి డబ్బులు తెచ్చి ఇప్పు డు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చేవరకు సీఎం రేవంత్‌రెడ్డిని, ప్రభుత్వాన్ని విడిచి పెట్టేది లేదని హరీశ్ అన్నారు. హామీల అమలుకు దసరా తర్వాత ఢిల్లీలోని రాహుల్‌గాంధీ ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. మంత్రుల్ని, ఎమ్మెల్యే లను నిలదీయాలని ఆయన పిలుపు నిచ్చారు. కాగా, ధర్నా సందర్భంగా ఓ తొండ తాటికొండ రాజయ్య చొక్కాలోకి వెళ్లడంతో కార్యకర్తలు అప్రమత్తమై దానిని తీసివేశారు. దీంతో కొంతసేపు నవ్వులు విరిశాయి. కార్యక్రమంలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, మధుసూదనాచారి, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎంపీ మాలోత్ కవిత తదితరులు పాల్గొన్నారు. -
ఆవేశంలో ఉన్నా ఆలోచించి మాట్లాడాలి.. సురేఖకు డీకే అరుణ చురకలు
సాక్షి, హైదరాబాద్: రాజకీయాల్లో ఉన్నప్పుడు నోరు జాగ్రత్తగా పెట్టుకుని మాట్లాడాలని కొండా సురేఖకు హితవు పలికారు బీజేపీ ఎంపీ డీకే అరుణ. ఆవేశం వచ్చినా రాజకీయ నాయకులు ఆలోచించి మాట్లాడాలన్నారు. ఒక మహిళను పట్టుకొని, సినిమా కుటుంబాన్ని కించపరిచే విధంగా మాట్లాడం కరెక్ట్ కాదంటూ ఘాటు విమర్శలు చేశారు.మాజీ మంత్రి, ఎంపీ డీకే అరుణ శుక్రవారం చార్మినార్ భాగ్యలక్ష్మీ ఆలయం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. ఈ క్రమంలో కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించారు. ఈ క్రమంలో డీకే అరుణ మాట్లాడుతూ.. కొండా సురేఖతో నాకు మంచి అనుబంధం ఉంది. గతంలో ఇద్దరం కలిసి మంత్రులుగా పనిచేశాం. కానీ, ఒక సినీ కుటుంబంపై ఆమె చేసిన ఆరోపణలు అభ్యంతరకరం. సినిమా పరిశ్రమలో ఆ కుటుంబానికి ప్రత్యేక పేరు ఉంది. ఎవరి వ్యక్తిగత విషయాలతో రాజకీయాలు ముడిపెట్టడం సరికాదు.రాజకీయాల్లో ఉన్నప్పుడు నోరు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడాలి. ఒకసారి మాట్లాడి మళ్లీ వెనక్కు తీసుకోలేము. రాజకీయ నాయకులు ఆవేశం వచ్చినా ఆలోచించి మాట్లాడాలి. ఒకరి మీద కోపం ఇంకొకరి మీద తీయడం సరికాదు. ఒక మహిళను పట్టుకొని, సినిమా కుటుంబాన్ని కించపరిచే విధంగా మాట్లాడం కరెక్ట్ కాదు. భాగ్యలక్ష్మి అమ్మవారి ఆగ్రహానికి రేవంత్ ప్రభుత్వం గురికావద్దు. అమ్మవారి ఆలయం దగ్గర మహిళలు బతుకమ్మ ఆడటానికి కోర్ట్ పర్మిషన్ తీసుకోవాల్సి వచ్చింది. తెలంగాణలో మళ్లీ నియంతృత్వ పాలనా సాగుతుంది’ అంటూ కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: ఎన్నికల హామీలు విఫలమై హైడ్రా.. చివరకు సినీ తారలు: జగదీష్ రెడ్డి -
మూసీ కాదు.. రేవంత్, మంత్రుల బుర్రలు ప్రక్షాళన కావాలి: జగదీష్ రెడ్డి
సాక్షి, సూర్యాపేట: తెలంగాణ మంత్రి కొండా సురేఖ మాటలు ఆమె మానసిక స్థితిపై అనుమానాలు వచ్చేలా ఉన్నాయని ఎద్దేవా చేశారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. ఇదే సమయంలో మంత్రుల వెనుక సీఎం రేవంత్ ఉండి ఇలా వారితో మాట్లాడిస్తున్నారని ఆరోపించారు. ఇచ్చిన హామీలు విఫలమై హైడ్రా.. అలాగే, హైడ్రా విఫలమై సినీ తారల అంశం తెరపైకి తెస్తున్నారని ఆసక్తికర కామెంట్స్ చేశారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో స్థాయిలేని వారికి మంత్రి రావడంతో అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. ఎవరో ఆకతాయిలు సోషల్ మీడియాలో చేసిన పనులకు కేటీఆర్‌కు ఏం సంబంధం ఉంది?. రేవంత్ వెనకుండి మంత్రులతో ఇలా మాట్లాడిస్తున్నారు. కొండా సురేఖ మాటలు సొంత పార్టీ నాయకులు సైతం సిగ్గుపడేలా ఉన్నాయి. హామీల అమలులో విఫలమై కాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది. హామీలు విఫలమై హైడ్రాను ముందుకు తెచ్చారు. హైడ్రా కూడా విఫలం కావడంతో సినీ తారల అంశం తెరపైకి తెస్తున్నారు.రేవంత్ డైవర్షన్ రాజకీయాలతో కుటుంబాలు నాశనం అయ్యేలా ఉన్నాయి. కేసీఆర్ కనపడటం లేదంటే కొండా మురళీ కనపడటంలేదని కొందరు మీమ్స్ పెడుతున్నారు. మనుషులను మాయం చేసే చరిత్ర మీది. చిల్లర మాటలు అనడం, అనిపించుకోవడం ఎందుకు. మంత్రి కోమటిరెడ్డి మానసిక స్థితి కూడా సరిగా లేదు. కాంగ్రెస్, బీఆర్ఎస్ హయాంలో మూసీ పరిస్థితిపై కోమటిరెడ్డి చర్చకు సిద్ధమా?. మూసీ దుస్థితికి కారణం కాంగ్రెస్ పార్టీనే. మూసీ ప్రక్షాళన కాదు సీఎం, మంత్రుల బుర్రలు ప్రక్షాళన చేయాలి. మూసీ మురికి కన్నా ఎక్కువ కలుషితమైన కాంగ్రెస్ ఆలోచనల సుందరీకరణ జరగాలి’ అంటూ ఘాటు విమర్శలు చేశారు. ఇది కూడా చదవండి: మూసీకి కాసులు.. రైతులకు పైసల్లేవా?: రేవంత్‌కు కేటీఆర్ హెచ్చరిక -
మూసీకి కాసులు.. రైతులకు పైసల్లేవా?: రేవంత్‌కు కేటీఆర్ హెచ్చరిక
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతీ హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అలాగే, రైతుల రుణమాఫీ విషయంలో ఏ ఒక్క రైతుకు అన్యాయం జరిగినా ఊరుకోమని కాంగ్రెస్ సర్కార్‌ను హెచ్చరించారు.బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ వార్నింగ్ ఇచ్చారు. తాజాగా ఓ కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ.. రైతులు పండించిన దొడ్డు వడ్లకు రూ.500 బోనస్ వెంటనే చెల్లించాలి. ఈరోజు జరిగిన సమావేశంలో ప్రభుత్వం కేవలం సన్న వడ్లకే 500 రూపాయలు బోనస్ అని ప్రకటించడం కరెక్ట్ కాదు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని ప్రభుత్వం నిలబెట్టుకోవాలి.మూసీ ప్రక్షాళన కోసం రూ.లక్షా 50వేల కోట్లు అంటున్న ముఖ్యమంత్రికి రైతులకు రైతు భరోసాకి, దొడ్డు వడ్ల బోనస్‌కు పైసలు లేవా?. లక్షలాది మంది రైతులకు పంగనామాలు పెడతామంటే ఊరుకోం. వానాకాలం సీజన్ పూర్తవుతున్నా రైతు భరోసా ఊసేలేదు. మీ ముడుపుల మూసీ కోసం రూ.లక్షా 50 వేల కోట్లు ఉంటాయి కానీ.. రైతులకు ఇచ్చేందుకు డబ్బులు లేవా?. ఇప్పటికైనా అవినీతి ఆలోచనలు మానేసి రైతులకిచ్చిన హామీలపై దృష్టి పెట్టండి. రైతు రుణమాఫీ విషయంలో ఏ ఒక్క రైతుకు అన్యాయం జరిగినా ఊరుకోం’ అంటూ హెచ్చరించారు. ఇది కూడా చదవండి: హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు కీలక తీర్పు -
రాహుల్ ఇంటిని ముట్టడిస్తాం: హరీష్‌రావు
సాక్షి, సూర్యాపేట: వరంగల్ రైతు డిక్లరేషన్ సభలో రాహుల్ గాంధీ ఇచ్చిన రుణమాఫీ హామీ ఏమైందని మాజీ మంత్రి హరీష్‌రావు ప్రశ్నించారు. దసరాలోపు రైతులకు రుణమాఫీ చేయకపోతే ఢిల్లీలో రాహుల్ ఇంటి ముందు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేస్తా.. దసరాలోపు రైతు బంధు పడకపోతే నిన్ను రైతులు వదలరంటూ హరీష్ హెచ్చరించారు. రేవంత్‌రెడ్డికి ప్రజలపై పట్టింపు లేదు.. రైతంటే లెక్క లేదు. దేవుళ్ల మీద ఒట్లు వేసి మాటతప్పాడు. రేవంత్ రెడ్డి మొనగాడు కాదు.. మోసగాడు. 31 కుంటి సాకులు పెట్టి రుణమాఫీ ఎగ్గొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. కర్ణాటకలో ఐదు.. తెలంగాణలో ఆరు.. హర్యానాలలో ఏడు గ్యారెంటీలతో ప్రజలను కాంగ్రెస్ మోసం చేస్తుంది. ఒక చేతిలో రాజ్యాంగం.. మరో చేతిలో రౌడీయిజం. హెడ్రా పేరుతో పేదల ఇండ్లు కూలగొట్టి హక్కు మీకు ఎవరిచ్చారు’’ అంటూ హరీష్‌రావు ప్రశ్నించారు.జూటా మాటలు మానుకోక పోతే నిన్ను వదలం. నిన్ను అడుగుతాం.. కడుగుతాం.. అసెంబ్లీలో నిలదీస్తాం. ఒక్క బస్సు తప్ప.. మీ హామీలు అన్నీ తుస్సే.. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా కానీ సీఎంకి కనికరం లేదు. కేసిఆర్‌ది రైతు గుండె.. రేవంత్‌ది రాతి గుండె.. ప్రజల నుండి తిరుగుబాటు రాగానే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు. ఏదో ఒక వివాదం సృష్టిస్తున్నారు’’ అని హరీష్‌రావు మండిపడ్డారు.ఇదీ చదవండి: తప్పని తేలితే కూల్చేస్తా.. సీఎం రేవంత్‌కి కేవీపీ లేఖ -
తప్పని తేలితే కూల్చేస్తా.. సీఎం రేవంత్‌కి కేవీపీ లేఖ
సాక్షి, హైదరాబాద్: ఫాంహౌస్ చట్టప్రకారమే నిర్మించానని.. నిర్మాణం అక్రమమని తేలితే సొంత ఖర్చులతో కూల్చేస్తానంటూ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు చెప్పారు. ఎఫ్టీఎల్, బఫర్ జోన్లో ఉంటే మార్క్ చేయండి. ఫాంహౌస్‌కు అధికారులను పంపించాలంటూ సీఎం రేవంత్‌కు లేఖ రాశారు.మూసీ బఫర్ జోన్ లో నా ఫాం హౌజ్ వస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. వెంటనే అధికారులను పంపి సర్వే చేయించండి. నా ఫాం హౌజ్ బఫర్ జోన్లో ఉంటే 48 గంటల్లో నా సొంత ఖర్చులతో కులగొడతాను. మార్కింగ్ ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని నా కోరిక. మార్కింగ్ తేదీ, సమయం ముందే ప్రకటించాలి. సర్వే చేసేటప్పుడు నాపై ఆరోపణలు చేస్తున్న ప్రతిపక్ష నాయకులు, వారి అనుకూల మీడియాను తీసుకొచ్చి సర్వే చేయించండి’’ అని కేవీపీ లేఖలో పేర్కొన్నారు.ఇదీ చదవండి: మంత్రి సురేఖ వ్యాఖ్యలు స్థాయికి తగ్గవి కాదు -
చెన్నూరులో ఉప ఎన్నిక ఖాయం: బాల్క సుమన్
సాక్షి, తెలంగాణ భవన్: సూటు కేసు కంపెనీలకు డబ్బులు పంపిన వ్యవహారంలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ జైలు పోవటం ఖాయమన్నారు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్. సీఎం రేవంత్ కాదు కాదా.. భగవంతుడు కూడా వివేక్‌ను కాపాడలేరు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ..చెన్నూరు నియోజకవర్గానికి ఉప ఎన్నికలు పక్కా జరుగుతాయి. సూటు కేసు కంపెనీలకు డబ్బులు పంపిన వ్యవహారంలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ జైలు పోవటం ఖాయం. సీఎం రేవంత్ రెడ్డి.. వివేక్‌ను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి కాదు కదా.. భగవంతుడు కూడా వివేక్‌ను కాపాడలేడు.ఈడీ కేసు జరుగుతుంటే.. తెలంగాణ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. వివేక్ కేసు వ్యవహారంలో సుప్రీంకోర్టు వరకు వెళ్తాం. వివేక్.. అక్రమంగా వందల కోట్ల రూపాయలను ఖర్చు చేసి ఎన్నికల్లో గెలిచాడు. తెలంగాణ పోలీసులకు స్వామి భక్తి ఎక్కువైంది. పోలీసులు.. రేవంత్ రెడ్డి అడుగులకు మడుగులు ఒత్తుతున్నారు. అత్యుత్సాహం ప్రదర్శిస్తోన్న పోలీసులు భవిష్యత్తులో బలికాక తప్పదు. ఈడీ విచారణ జరుగుతున్న కేసును పోలీసులు క్లోజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అంటూ సంచలన ఆరోపణలు చేశారు.ఇదిలా ఉండగా.. ఈ ఏడాది జనవరిలో చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్.. ఈడీ విచారణకు హాజరయ్యారు. విశాఖ ఇండస్ట్రీస్, ఎంఎస్ విజిలెన్స్ సెక్యూరిటీస్ లావాదేవీల వ్యవహారంలో ఈడీ విచారణకు హాజరయ్యారు. రూ. 8కోట్ల బ్యాంకు లావాదేవీలపై గతంలో తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే ఎన్నికల సమయంలో విశాఖ ఇండస్ట్రీస్, ఎంఎస్ విజిలెన్స్ సెక్యూరిటీ సర్వీసెస్ మధ్య జరిగిన రూ.100 కోట్ల లావాదేవీల వ్యవహారంలో మనీలాండరింగ్ చట్టం కింద ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. దీనిపై వివేక్‌ను ఈడీ ప్రశ్నించింది. గత ఏడాది నవంబర్‌లో విశాఖ సంస్థల్లో ఈడీ అధికారులు సోదాలు చేశారు. విజిలెన్స్ సెక్యూరిటీ సర్వీసెస్ బోగస్ సంస్థ అని గుర్తించి కోట్ల విలువైన ఆస్తులకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.ఇది కూడా చదవండి: హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు కీలక తీర్పు -
సీఎం రేవంత్ బండారం బయటపడింది:కేటీఆర్
సాక్షి,హైదరాబాద్:20 లక్షల మందికి రుణమాఫీ కానే కాలేదన్న వ్యవసాయ మంత్రి ప్రకటనతో సీఎం బండారం మరోసారి బట్టబయలైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.ఈ మేరకు కేటీఆర్ శుక్రవారం(అక్టోబర్4)ఎక్స్(ట్విటర్)లో పోస్టు చేశారు.‘వందశాతం రుణమాఫీ పూర్తిచేశామని విర్రవీగిన ముఖ్యమంత్రివన్నీ డొల్లమాటలేనని ఇంకోసారి తేలిపోయింది.ఓవైపు డిసెంబర్ 9న ఏకకాలంలో చేస్తామని దగా చేశారు.మరోవైపు 10 నెలలైనా 20 లక్షల మందికి మోసం చేశారు.రూ.2 లక్షల రుణమాఫీ పూర్తయిపోయిందన్న సన్నాసి మాటలు నయవంచన కాక మరేంటి ?అధికారిక లెక్కల ప్రకారమే.. 20 లక్షల మంది అన్నదాతలకు అన్యాయం జరిగితే అనధికారికంగా రుణమాఫీ కాని రైతులందరో ?? రేవంత్ చేతకానితనం.. అన్నదాతలకు కోలుకోని శాపంగా మారింది’అని కేటీఆర్ ట్వీట్లో పేర్కొన్నారు. ఇదీ చదవండి: టీజీపీఎస్సీ ఆఫీసు ముందు పోస్టర్ల కలకలం -
మంత్రి సురేఖ వ్యాఖ్యలు స్థాయికి తగ్గవి కాదు
‘‘ఒక మహిళా మంత్రి దుష్టశక్తిగా మారి తప్పుడు ఆరోపణలు చేస్తారా? రాజకీయ ప్రయోజనాలకోసం పరువు ప్రతిష్టలతో బతుకుతున్న పౌరులపై బురద చల్లుతారా? సభ్యత లేని వారెవరో నా భర్తపై మీకు పచ్చి అబద్ధాలు చెబితే ఆవగింజంత వాస్తవం లేకపోయినా ఆరోపణలు చేస్తారా? ఇది నిజంగా సిగ్గు చేటైన విషయం’’ - ఇదీ ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున సతీమణి అమల ఆవేదనతో చేసిన వ్యాఖ్య. నాగార్జునపైన పిచ్చి ఆరోపణలు , కేటీఆర్ కారణంగానే నాగచైతన్య, సమంత విడాకులు తీసుకున్నారని మంత్రి కొండా సురేఖ చేసిన తీవ్రమైన వ్యాఖ్యలపై అమల ఘాటుగా స్పందించారు.అనేక మంది రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు ఈ విషయంలో కొండా సురేఖ తీరును ఖండించిన ప్రకటనలు ఎలా వున్నా.. అమల ప్రకటనకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. ఆమె కొండా సురేఖ వైనాన్ని ప్రజల ముందు ఎండగట్టడానికి ఎక్కడా వెనుకాడ లేదు. నాయకులు తమ స్థాయిని తామే తగ్గించుకొని క్రిమినల్స్ మాదిరి వ్యవహరిస్తే ఈ దేశం ఏమైపోతుంది అంటూ అమల ఆవేశంగా ప్రశ్నించారు. మీ రాజకీయాల కోసం బలి చేస్తారా అని అమల అన్నారు. ఆమె ఏఐసిసి నేత రాహుల్ గాంధీకి కూడా ఒక విజ్ఞప్తి చేస్తూ ప్రజల గౌరవ మర్యాదలపై ఏమాత్రం నమ్మకమున్నా ఇలాంటి నేతలను నియంత్రించాలని, దేశ పౌరులను రక్షించాలని కోరారు.అమల ఆవేదనలో నిజంగానే అర్థముంది. భర్త నాగార్జునను టార్గెట్ చేశారన్న బాధ కనిపించింది. ఇప్పటికే తెలంగాణలోని కాంగ్రెస్ సర్కార్ అనండి, లేక రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనండి, అవసరం, అర్జెన్సీ లేక పోయినా నాగార్జున ఎన్ కన్వన్షన్ ను కూల్చి వేసింది. ఆ తర్వాత రేవంత్ ప్రభుత్వంలోని మంత్రి కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేశారు. మీడియాలో విస్తారంగా రావడంతో అవన్ని నాగార్జున కుటుంబానికి తీవ్రమైన ఆవేదన మిగిల్చాయి. ఆ తర్వాత కొండా సురేఖ సారీ చెప్పి వివరణ ఇచ్చినా అదంత సంతృప్తికరంగా లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా దీనిపై వెంటనే స్పందించి ఉంటే బాగుండేది.అసలు స్పందించకపోవడం ఇంకా అధ్వాన్నం.నాగార్జున తన ప్రకటనలో ప్రత్యర్థులను విమర్శించేందుకు, రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలను వాడుకోవద్దని కోరారు. సురేఖ చేసిన ఆరోపణలు అబద్ధమని స్పష్టం చేశారు. నాగచైతన్య తన ప్రకటనలో కేవలం మీడియాలో హెడ్‌లైన్స్ కోసం సెలబ్రిటీల వ్యక్తిగత జీవిత నిర్ణయాలపై మాట్లాడడం సిగ్గుచేటని, మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఏమాత్రం ఆమోదయోగ్యం కావని అన్నారు. సమంతతో విడాకుల నిర్ణయం పూర్తిగా పరస్పర అవగాహనతో జరిగిందని తమకు వేరు, వేరు జీవిత లక్ష్యాలు ఉండడంవల్లే పరిపూర్ణత కలిగిన వ్యక్తులుగా తామిద్దరం గౌరవించుకుంటూ ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. నాగార్జున మరొక కుమారుడు అఖిల్ తన ప్రకటనలో తల్లి అమల చేసిన వ్యాఖ్యలో ప్రతి పదాన్ని సమర్థిస్తున్నట్టు తెలిపారు.ఇక ఈ ఘటనలో బాధిత మహిళ అయిన ప్రముఖ నటి సమంత ఓ ప్రకటన చేస్తూ, విడాకులు తన వ్యక్తిగత విషయమని, సినీ పరిశ్రమలో ఉండడానికి, బైటకు వచ్చి నిలబడి పోరాడడానికి చాలా ధైర్యం, బలం కావాలని, సురేఖ ఆ విషయాన్ని గుర్తించాలని అన్నారు. దయచేసి చిన్నచూపు చూడవద్దని విజ్ఞప్తి చేశారు. తమ విడాకుల విషయంలో ఎలాంటి రాజకీయ కుట్ర లేదని, తాను రాజకీయాలకు అతీతంగా ఉంటానని స్పష్టం చేశారు.అంటే దీనర్థం సమంతపై కేవలం కొందరు ప్రచారం చేసే అసత్యపు గాసిప్స్‌నే మంత్రి వాడారని అర్థమవుతోంది. ఒకప్పుడు హిందూ నేషన్ అనే ఒక పత్రిక ఉండేది. అందులో సినిమావాళ్లకు సంబంధించిన పిచ్చి పిచ్చి గాసిప్స్ రాసేవారు. వాటిని జనం చదివి నవ్వుకొని వదిలేసేవారు. కొందరు తిట్టేవారు. అంతవరకే అవి పనికొచ్చేవి. కాలక్రమంలో సమాజం నుంచి నిరాదరణ రావడంతో ఆ పత్రిక నిలిచిపోయింది. ఇప్పుడు ఆ గాసిప్ప్ పత్రిక పాత్రను సురేఖవంటి రాజకీయ నేతలు తీసుకున్నట్టయింది.నాగార్జున కుటుంబానికి పలువురు సినీ ప్రముఖులు సంఘీభావం తెలిపారు. వారిలో కొందరు ఘాటైన వ్యాఖ్యలు కూడా చేశారు. ప్రకాష్ రాజ్ ''ఏంటీ ఈ సిగ్గులేని రాజకీయాలు ...సినిమాల్లో నటించే ఆడవాళ్లంటే చిన్న చూపా'' అని ప్రశ్నించారు. జూనియర్ ఎన్టీఆర్ అయితే సినీ పరిశ్రమలోని వారిపై నిరాధార ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోజాలమని అన్నారు. ఎలాంటి చెత్త మాట్లాడినా చెల్లిపోతుందని రాజకీయ నేతలు కొందరు భావిస్తున్నారని మరొక నటుడు నాని ధ్వజమెత్తారు.మెగాస్టర్ చిరంజీవి, అల్లు అర్జున్, వెంకటేష్ ,మహేశ్ బాబు తదితరులు మంత్రి వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపట్టారు. మంత్రి పదవిలో ఉండి నీచ స్థాయికి దిగజారడం సిగ్గుచేటని చిరంజీవి అన్నారు. అయితే ఏపీ ఉప ముఖ్యమంత్రి, ప్రముఖ నటుడు పవన్ కళ్యాణ్ దీనిపై మాట్లాడినట్లు కనిపించలేదు.ఒకవైపు హైడ్రా వ్యవహారంలో చికాకుపడుతున్న రేవంత్ ప్రభుత్వానికి కొండా సురేఖ కొత్త చిక్కులను తెచ్చిపెట్టారు. సురేఖ దీనిపై వివరణ ఇస్తూ తన వ్యాఖ్యల ఉద్దేశం, ఒక నాయకుడి చిన్నచూపు ధోరణిని ప్రశ్నించడమే కానీ సమంత మనోభావాలను దెబ్బతీయడం కాదని, ఆమెపై అభిమానం ఉందని, ఆమె తనకు ఆదర్శమని వ్యాఖ్యానించారు. మీరు కానీ, మీ అభిమానులు కానీ మనస్థాపానికి గురయితే బేషరతుగా వ్యాఖ్యలు ఉపసంహించుకుంటున్నానని ప్రకటించారు.బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కోపంతో సురేఖ ఇలాంటి దారుణమైన వ్యాఖ్యలు చేయడం ద్వారా ఒక ప్రతిష్ట కలిగిన కుటుంబాన్ని రోడ్డుపైకి తీసుకొచ్చినట్టయింది. పైగా సమంత మనస్థాపానికి గురయితే.. అని ముక్తాయించి వ్యాఖ్యల్ని ఉపసంహరించుకుంటాను అనడంలో కూడా కచ్చితంగా అధికార అహంకారం కనిపిస్తోంది. సురేఖ బేషరతుగా, బహిరంగంగా క్షమాపణలు కోరి ఉండాల్సింది. సినిమా వారికి, రాజకీయాల్లోని వారికి మధ్య సంబంధ, బాంధవ్యాలు ఉండడం ఈనాటిది కాదు. ఎన్నికల సమయంలో సినీ నటుల ప్రచారాన్ని నేతలు కోరుకుంటుంటారు. కొందరు సినీ ప్రముఖులు రాజకీయాల్లో కూడా రాణించారు.కాని ఒక సినీమా స్టార్ పై ఈ రకమైన నీచవ్యాఖ్య చేయడం మాత్రం దారుణం.సినీ రంగంలో మహిళలు ఎన్నో కష్టనష్టాలకు, అపవాదులను ఓర్చుకునే పరిస్థితి సభ్య సమాజానికే అవమానం. సురేఖ అర్థం పర్థం లేని ఆరోపణలు చేయడం ద్వారా ఆమె నాగార్జున కుటుంబానికి, సమంతకు తీరని నష్టం చేశారు. సినీ పరిశ్రమకు అక్కినేని నాగాశ్వరరావు గానీ, ఆయన కుమారుడు నాగార్జున గానీ ఎనలేని సేవలు అందించారు.కాసు బ్రహ్మానందరెడ్డి, చెన్నారెడ్డి, నేదురుమల్లి జనార్ధన రెడ్డిలాంటివారు అక్కినేనిని చాలా గౌరవించి ఆయన్ని హైదరాబాద్ కు రప్పించి సినీ పరిశ్రమ ఇక్కడకు రావడానికి సహకారం తీసుకున్నారు. ఎన్టీఆర్ సమకాలీనుడైన నాగేశ్వరరావును రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా సినిమా అభిమానులు గౌరవిస్తారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రులే కాకుండా ఆ తర్వాత వచ్చిన ఎన్టీఆర్, చంద్రబాబు, వైఎస్ రాజశేఖరరెడ్డి, కేసీఆర్, వైఎస్ జగన్ ల కు కూడా అక్కినేని కుటుంబంతో సత్ సంబంధాలున్నాయి. అక్కినేని కుటుంబం వారెప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాలేదు. కానీ కారణం ఏమో తెలయదు గానీ నాగార్జునను గురి పెట్టినట్టుగా ఇటీవలి కాలంలో రేవంత్ ప్రభుత్వంలోని వారు వ్యవహరిస్తున్నారు.కొండా సురేఖ విషయానికి వస్తే ఆమె దుందుడుకుగా మాట్లాడడం కొత్త కాదు. ఆమె కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీల తరువాత మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరారు. . వైఎస్ఆర్ టైమ్‌లో మంత్రిగా ఉన్నారు. తిరిగి ఇప్పుడు మంత్రి కాగలిగారు. గతంలో జగన్‌కు మద్దతిచ్చి రోశయ్య ప్రభుత్వంపై అనవసరమైన కొన్ని వ్యాఖ్యలు చేసి మంత్రి పదవి పోగొట్టుకున్నారు. ఆ తర్వాత కాలంలో వైఎస్సార్ సీపీకి దూరమై జగన్ పై అభ్యంతకరమైన రీతిలో మాట్లాడారు. కేసీఆర్‌ను ఉద్దేశించి కూడా ఆమె తీవ్రమైన భాషనే ప్రయోగించారు.సినీ ప్రముఖుల జీవితాల సంగతి ఎలా ఉన్నా అనేక మంది రాజకీయ ప్రముఖుల జీవితాలకు సంబంధించి కూడా ఎన్నో కల్పిత కథలు ప్రచారం అవుతుంటాయి. వాటన్నిటినీ పరిగణనలోకి తీసుకుంటే చాలా మంది నేతలు రాజకీయాలకు అర్హులే కాకుండా పోతారు. ఇక్కడ కొండా సురేఖ వ్యక్తిగత జీవితం జోలికి వెళ్లజాలం.ఆమెపై బీఆర్ఎస్ వారు గానీ, మరెవరో గానీ చేసిన ట్రోలింగ్స్‌ను సమర్థించజాలం. బీజేపీ ఎంపీ రఘునందన్ ఆమెకు నూలు దండ వేస్తే దానిపై పిచ్చివాళ్లు కొందరు అభ్యంతరకర పోస్టింగులు పెట్టారు. దానిపై కేటీఆర్ స్పందించిన తీరు కూడా బాగాలేదు.ఆమెను ఉద్దేశించి దొంగ ఏడుపులు అనడం పద్ధతిగా లేదు. తదుపరి సురేఖ మరింత జుగుప్సాకరంగా , మంత్రి హోదాను మర్చిపోయి అక్కినేని నాగార్జున కుటుంబాన్ని వాళ్ల రొంపిలోకి లాగడం ఏమాత్రం సభ్యత కాదు. కేటీఆర్ పై రాజకీయ విమర్శలు చేసుకోవచ్చుగానీ మధ్యలో నాగార్జున, నాగచైతన్య, సమంత ఏం చేశారు? వారిని అన్యాయంగా సమాజంలో బలి చేయడం తప్ప, సాధించింది ఏముంది? నిజానికి ఇంత తీవ్రమైన హేయమైన వ్యాఖ్యలు చేసిన సురేఖ మంత్రి పదవిలో కొనసాగడానికి అర్హులవుతారా? కాదా? అనేది ఆలోచించుకోవాలి. పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఇంతటితో ఈ వివాదాన్ని ముగించాలని అనడం సులువే కానీ, అక్కినేని నాగార్జునకు జరిగిన డ్యామేజీని ఎలా పునరుద్ధరిస్తారో చెప్పలేకపోయారు. గతంలో కేంద్రమంత్రిగా పని చేసిన అనంతకుమార్ హెగ్డే వివాదస్పద వ్యాఖ్యలు చేసి మంత్రి పదవి కోల్పోయారు.గతంలో చెన్నారెడ్డి ప్రభుత్వంలో వరంగల్ జిల్లాకే చెందిన అప్పటి మంత్రి గోకా రామస్వామి రాజకీయంగా కొన్ని విమర్శలు చేసి పదవి కోల్పోయారు. ప్రముఖ నటి జయప్రద యూపీలో కొందరు రాజకీయ నేతల వల్ల ఇబ్బంది పడ్డారు. నాగార్జున కుటుంబానికి ఆవేదన మిగిలి ఉండవచ్చు కాని, ఈ మొత్తం ఉదంతంలో కొండా సురేఖే సమాజం దృష్టిలో దోషిగా నిలబడ్డారని చెప్పాలి. ఈ నేపథ్యంలో నాగార్జున మంత్రి సురేఖపై క్రిమినల్ కేసు పెట్టి పరువు నష్టం దావా వేయడం సముచితమే. సురేఖపై అభ్యంతర ట్రోలింగ్స్ చేయించారని కేటీఆర్, హరీష్ రావులపై కేసులు పెట్టారట. ఒకే. కానీ మరి ఇలాంటి నీచమైన వ్యాఖ్యలు చేసిన మంత్రి పై కేసులు ఎందుకు పెట్టలేదు?నాగార్జున మంత్రిపై కేసు పెట్టించడానికి ఎంతగా కష్టపడాల్సి ఉంటుందో తెలియదు.మహిళానేత సోనియా గాంధీ ఆధ్వర్యంలో నడుస్తున్న కాంగ్రెస్ పార్టీలో, ఒక మహిళా మంత్రి ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసినా ఆమెపై ఎలాంటి చర్యలు తీసుకోకపోతే తప్పుడు సంకేతాన్ని ఇచ్చినట్టవుతుంది. ఏపీలో చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా లడ్డూ రాజకీయాన్ని తీసుకొచ్చినట్టుగా ఇక్కడ తెలంగాణలో హైడ్రాతో వచ్చిన వ్యతిరేకతను డైవర్ట్ చేయడానికి సురేఖ వంటివారు ఇలాంటి ప్రయత్నం చేస్తే కాంగ్రెస్ కు, రేవంత్ కు ఎలాంటి ప్రయోజనం వుండకపోగా మరింత నష్టమన్న సంగతి తెలుసుకోవాలి. - కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
మూసీ మురికి అంతా వారి నోట్లోనే: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ‘మూసీ మురికి అంతా వాళ్ల నోట్లోనే.. ఇంకా శుద్ధి ఎందుకు, లక్షన్నర కోట్ల రూపాయల ఖర్చు ఎందుకు’అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ నేతలను ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్, మంత్రులు తనపై చేస్తున్న వ్యాఖ్యలపై మండిపడ్డారు. తన వ్యక్తిత్వాన్ని హననం చేసేలా వ్యాఖ్యలు చేసిన ఓ మంత్రికి లీగల్ నోటీసులు పంపించానని, కాంగ్రెస్ పార్టీ రాజకీయ వికారాలకు పాల్పడుతోందని అన్నారు. సీఎంతో పాటు తనపై వ్యాఖ్యలు చేసిన మంత్రిని మానసిక ఆరోగ్య నిపుణుల వద్దకు లేదా మానసిక వైద్యుల వద్దకు పంపాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఆయన కోరారు. రాష్ట్రంలోని అనేక అంశాలకు సంబంధించి కేటీఆర్ గురువారం సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’లో వరుస పోస్ట్‌లు చేశారు. గంగానది ప్రక్షాళన కోసం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘నమామి గంగే’ ప్రాజెక్టుకు కిలోమీటరుకు రూ.17 కోట్ల చొప్పున ఖర్చవుతుండగా, మూసీ సుందరీకరణకు మాత్రం కి.మీ.కు రూ.2,700 కోట్లు ప్రతిపాదించారన్నారు. ఇది సుందరీకరణ ప్రాజెక్టు కాదని, ప్రజాధనాన్ని లూటీ చేసే పథకమని విమర్శించారు.గుండెలు ఆగుతున్నా కూల్చుడు ఆగడం లేదుకష్టపడి పైసా పైసా కూడబెట్టుకుని, బ్యాంకు నుంచి అప్పు తెచ్చి మరీ కట్టుకున్న గూడును ప్రభుత్వం ఎప్పుడు కూల్చుతుందో అన్న భయంతో సామాన్యులు ప్రాణాలు వదులుతున్నారని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. గుండెలు ఆగిపోతున్నా, కుటుంబాలు చెల్లా చెదురవుతున్నా ప్రభుత్వం మాత్రం ఇళ్ల కూల్చివేతలపై తగ్గడం లేదన్నారు. ఉమ్మడి కుటుంబాలను రోడ్డుకు ఈడ్చి చిచ్చు పెట్టిన మూర్ఖుడు సీఎం రేవంత్‌రెడ్డి అని మండిపడ్డారు. మూసీ వద్ద ఇళ్లు ఖాళీ చేస్తే డబుల్ బెడ్ రూమ్ ఇల్లుతో పాటు రూ.25 వేల పారితోషికం.. అంటూ అధికారులు వెకిలి అఫర్లు ఇస్తున్నారని మండిపడ్డారు. కోటి ఆశలతో కట్టుకున్న కలల సౌధం ఖరీదు కేవలం రూ.25 వేలేనా అని ప్రశ్నించారు. మీ సోదరుడు, మంత్రుల ఇళ్లకు రూ.50 వేలు ఇస్తే కూల్చమంటారా? అని వ్యాఖ్యానించారు. ఇండ్లు పోతాయనే భయంతో బుచ్చమ్మ, కుమార్ ప్రాణాలు పోయాయని, సీఎం ధన దాహం, కుంభకోణాలకు ఎంత మంది ప్రాణాలు పోవాలో చెప్పాలన్నారు. ఇల్లు కూలుస్తారనే భయంతో కుమార్ అనే వ్యక్తి మరణించడంతో ఇప్పటికే తల్లి కూడా లేని ముగ్గురు పిల్లలు అనాథలు అయ్యారన్నారు. వీటన్నిటికీ ప్రజలు కాంగ్రెస్‌కు మిత్తితో సహా గుణపాఠం చెప్తారన్నారు.పాలనా వైఫల్యంతో ఆదాయానికి గండిముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అనుభవ రాహిత్యం, పాలనా వైఫల్యంతో ప్రభుత్వ ఆదాయం పడిపోతోందని కేటీఆర్ విమర్శించారు. సంపద సృష్టించి పేదలకు పంచే తెలివి లేకపోవడంతోనే అనర్థం జరుగుతోందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే ప్రభుత్వ ఆదాయం వేగంగా పడిపోతుంటే.. వచ్చే నాలుగేళ్లు రాష్ట్ర ప్రజలకు కష్టకాలమే అని పేర్కొన్నారు. ఈ గడ్డు పరిస్థితులను మరింత దిగజార్చే చేష్టలే తప్ప, దిద్దుబాటు చర్యలు కనుచూపు మేరలో కనిపించడం లేదన్నారు. మార్పు మార్పు.. అంటూ తెలంగాణ ప్రగతికి పాతరేసిన పాపం కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందన్నారు. ప్రభుత్వ లోపాలను ప్రశ్నిస్తున్న జర్నలిస్టులపై భౌతిక దాడులకు తెగబడుతున్నారన్నారు. ప్రభుత్వాన్ని నిలదీస్తున్న చిలుక ప్రవీణ్‌పై దాడి చేసిన కాంగ్రెస్ గూండాలను వెంటనే అరెస్ట్ చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. -
ఫామ్‌హౌస్‌ల కోసమే మూసీ ముసుగు!
సాక్షి, హైదరాబాద్: చెరువుల్లో అక్రమంగా నిర్మించిన ఫాంహౌస్లపై వేటుపడకుండా ఉండేందుకే బీఆర్ఎస్ నేతలు ముసుగు తొడుక్కొని మూసీ నిర్వాసితులను రక్షణ కవచంగా వినియోగించుకుంటున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు. బురదలో కూరుకుపోతున్న నగరాన్ని కాపాడేందుకు తాము మూసీపై ముందుకెళ్తుంటే దానిపైనా బురదజల్లుతున్నారని పరోక్షంగా కేటీఆర్, హరీశ్‌రావులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. పేదలకు అన్యాయం జరుగుతోందని డ్రామాలాడుతున్న బీఆర్ఎస్ నేతలు చేతనైతే ఆ పార్టీ ఖాతాలోని రూ. 1,500 కోట్ల తెలంగాణ ప్రజల సొమ్ములో రూ. 500 కోట్లను మూసీ బాధితులకు పంచాలని సూచించారు. మురికి మూసీలో జీవచ్ఛవాల్లా ఉన్న పేదలు ఆత్మగౌరవంతో బతకడానికి ఇళ్లు ఇస్తుంటే రెచ్చగొట్టడం తగదన్నారు. గురువారం సికింద్రాబాద్ సిఖ్ విలేజ్‌లో ఫ్యామిలీ డిజిటల్ కార్డు పైలట్ ప్రాజెక్టు కార్యక్రమాన్ని సీఎం రేవంత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్, హరీశ్‌రావులతోపాటు సబితా ఇంద్రారెడ్డి ముగ్గురు కుమారులకు చెందిన ఫాంహౌస్‌ల అక్రమ నిర్మాణాలను కూల్చాలో వద్దో చెప్పాలని వారినే ప్రశ్నించారు. కేవీపీ రామచంద్రరావు ఫాంహౌస్‌లను కూలగొట్టాలో వద్దో కూడా సలహా ఇవ్వాలన్నారు. నాలాలు, చెరువులు, పార్కులు, ప్రభుత్వ భూముల్లో అక్రమాలు చేసిందేవరో తేల్చుకుందాం రావాలని సవాల్ విసిరారు. నల్లచెరువు, సున్నం చెరువు, మూసీ ఒడ్డున అక్రమంగా ప్లాట్లు వేసి అమ్మింది బీఆర్ఎస్ వారు కాదా? అని సీఎం ప్రశ్నించారు. బలిసినోళ్లు వదిలిన నీళ్లు పేదలు తాగాలా? ‘హైదరాబాద్‌కు తాగునీరు అందించిన ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ పరిసరాల్లో బలిసినోళ్లు ఫాంహౌస్‌లు కట్టుకొని వారి డ్రైనేజీ తీసుకొచ్చి వాటిల్లో కలిపితే ఆ నీళ్లు నగర ప్రజలు తాగాల్నా?’అని సీఎం రేవంత్ నిలదీశారు. అక్రమాలకు పాల్పడ్డ వారిని వదలబోమని, ఒక్కొక్కడినీ చింతపండు చేస్తానని హెచ్చరించారు. అఖిలపక్షంలో మంచి సూచనలివ్వండి.. నిర్వాసితులు ఇళ్లు పోయిన దుఃఖంలో ఆవేశంగా ఉంటారని.. 20 ఏళ్లపాటు ప్రజాక్షేత్రంలో తిరిగిన తనకు పేదల కష్టాలు, రాజకీయాల లోతు తెలియక కాదని సీఎం రేవంత్ పేర్కొన్నారు. అయినప్పటికీ రాబోయే తరాల భవిష్యత్ దృష్ట్యా ముందుకే వెళ్తానన్నారు. హైదరాబాద్ నగరాన్ని, రాష్ట్రాన్ని ముంచేస్తున్న మూసీ వరదలకు విపక్షాలు చేతనైతే పరిష్కారం చెప్పాలని సూచించారు. అఖిలపక్ష సమావేశాలు పెడతానని, మంచి సూచనలివ్వాలని కేటీఆర్, హరీశ్‌లను కోరారు. మూసీలో నిర్వాసితులయ్యే వారికి 15 వేల డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపుతోపాటు రూ. 25 వేల చొప్పున నగదు అందించాలని ఆదేశించినట్లు తెలిపారు. ఈటలకు ఇంకా ఆ వాసనలు పోలేదు.. బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్పైనా సీఎం రేవంత్ విమర్శలు గుప్పించారు. ఆయన పార్టీ మారినా పదేళ్లు బీఆర్ఎస్లో ఉన్నందున ఇంకా ఆ గర్దు (కంపు) పోలేదని ఎద్దేవా చేశారు. కేటీఆర్, హరీశ్ ఏం మాట్లాడితే తెల్లారే ఆ జిరాక్స్ కాపీలతో ఈటల మాట్లాడతారని ఆరోపించారు. ఆయన కూడా బతకడానికి హైదరాబాద్ వచ్చి ఎంపీ అయిన విషయాన్ని గుర్తుంచుకోవాలని.. గౌరవం నిలబెట్టుకోవాలని ఈటలకు సూచించారు. మూసీ ప్రక్షాళనకు చేతనైతే ప్రధానిని రూ. 25 వేల కోట్టు ఇవ్వాల్సిందిగా కోరదామని.. ప్రధానిని కలవడానికి తనకు భేషజాల్లేవని చెప్పారు. జవహర్‌నగర్‌లో వెయ్యి ఎకరాల భూములున్నాయని.. కేంద్రం ఆర్థిక సాయం చేస్తే మూసీ బాధితులకు ఇందిరమ్మ ఇళ్లతో కాలనీలే కడతామన్నారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో సబర్మతీ రివర్ ఫ్రంట్‌ను అభివృద్ధి చేసిన మోదీని అనుసరించే బీజేపీ నేతలు.. మూసీ అభివృద్ధిని వద్దనడం ఏం న్యాయమని ప్రశ్నించారు. ఇంకుడుగుంతల్లేని ఇళ్లకు పంపే ట్యాంకర్లకు రెండింతల చార్జీ.. ‘కొందరు దురాశపరుల వల్ల చెరువుల్లోని నీళ్లు రోడ్లపైకి.. అక్కడి నుంచి ఇళ్లలోకి వస్తున్నాయి. కొందరి స్వార్థంతో లక్షల కుటుంబాలు నీట మునుగుతున్నాయి. దీనికో పరిష్కారం చూపించాలి. అందరూ నాకెందుకులే అనుకుంటే నగరం మునుగుతుంది. చూస్తుండగానే చెరువులు, నాలాలు మూసుకుపోయాయి. ఇలాగే చూస్తూపోతే మూసీ కూడా మూసుకుపోతుంది’అని రేవంత్ అన్నారు. అందుకే ఇకపై ఇంకుడు గుంతల్లేకుంటే ఇళ్ల నిర్మాణాలకు అనుమతులివ్వబోమని.. ఇంకుడుగుంతల్లేని ఇళ్లకు పంపే ట్యాంకర్లకు రెండింతల చార్జీలు వసూలు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. నల్లగొండను చంపేద్దామా? ‘నల్లగొండ జిల్లా ప్రజలు ఓవైపు ఫ్లోరైడ్‌తో, మరోవైపు మూసీ కాలుష్యంతో బతకలేని పరిస్థితిలో ఉంటే ప్రక్షాళనను అడ్డుకుంటున్న వారు ఏం ముఖం పెట్టుకొని నల్లగొండలో తిరుగుతారన్నారు. ఆ జిల్లాలో మీకు ఓట్లేయకుంటే ప్రజలను చంపేస్తారా అని బావబావమరుదులను అడుగుతున్నా’అని సీఎం రేవంత్ పేర్కొన్నారు. పేదలకు మెరుగైన సేవల కోసమే డిజిటల్ కార్డు కంటోన్మెంట్: పేదలకు మెరుగైన సేవలు అందించడానికే డిజిటల్ ఫ్యామిలీ హెల్త్ కార్డు ప్రాజెక్టు చేపట్టామని సీఎం రేవంత్ చెప్పారు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో రెండు గ్రామాలు లేదా వార్డుల్లో పైలట్ ప్రాజెక్టుగా సర్వే మొదలుపెట్టామన్నారు. కుటుంబ సమగ్ర సమాచారాన్ని.. సంక్షేమ పథకాల అమల్లో 30 శాఖల సమాచారమంతా ఒకే కార్డులో పొందుపరిచి ఒక్క క్లిక్‌తో అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు సీఎం వివరించారు. వన్న్స్టేట్ వన్న్కార్డు విధానంతో ప్రభుత్వం ముందుకెళుతోందని చెప్పారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డులో ప్రతి ఒక్కరి హెల్త్ ప్రొఫైల్ కూడా పొందుపరుస్తామన్నారు. తాము అధికారంలోకి రాగానే కంటోన్మెంట్‌ను జీహెచ్ఎంసీలో కలిపేలా కేంద్రాన్ని ఒప్పించడంతోపాటు పెండింగ్‌లో ఉన్న ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టును పట్టాలెక్కించామన్నారు. కాగా, దసరాలోపే నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్రూం ఇళ్లను ఇందిరమ్మ ఇళ్ల పేరిట లబి్ధదారులకు అందిస్తామని ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.