breaking news
-
మూసీ సుందరీకరణపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: నగరంలో మూసీ సుందరీకరణ అంశంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో పేదల ఇల్లు కూల్చకుండా మూసీ సుందరీకరణ చేయాలని ప్రభుత్వానికి సూచించారు. అలాగే, మూసీ నదిలో డ్రైనేజీలు కలవకుండా చూడాలన్నారు.కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘మూసీ సుందరీకరణ చేసినా పునర్జీవం చేసినా మేం వ్యతిరేకం కాదు. మూసీకి రెండు వైపులా రిటైనింగ్ వాల్ కట్టండి. డ్రైనేజీ మూసీలో కలవకుండా చూడండి. పేదల ఇల్లు కూల్చకుండా మూసీ సుందరీకరణ చేయవచ్చు. ఆ తర్వాత మూసీ పునర్జీవం చేయండి. రాష్ట్రంలో గ్రూప్-1 అభ్యర్థుల న్యాయ బద్ధమైన సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నా. తెలంగాణ సమాజానికి బీఆర్ఎస్ వ్యతిరేకం. కేసీఆర్ కుటుంబంపై తెలంగాణలో ఇంకా వ్యతిరేకత ఉంది. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు సీట్లే ఇవ్వలేదు అంటూ కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: పనికిమాలిన మాటలు.. పాగల్ పనులు: కాంగ్రెస్‌పై కేటీఆర్ ఫైర్ -
కేటీఆర్ అతి తెలివి ప్రదర్శించొద్దు: గుత్తా
సాక్షి, నల్గొండ: కేటీఆర్ అతి తెలివి ప్రదర్శిస్తున్నాడంటూ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, 50 అంతస్తుల భవనాలకు ఎవరు అనుమతి ఇచ్చారు? అని ప్రశ్నించారు. అక్రమ నిర్మాణాలన్నీ బీఆర్ఎస్ హయాంలోనే జరిగాయని.. ఎవరేం పాపాలు చేశారో వారి ఆత్మలకు తెలుసు. ఒకసారి పరిశీలన చేసుకోవాలంటూ గుత్తా వ్యాఖ్యానించారు.‘‘మూసీ ప్రక్షాళనకు వాజ్‌పేయ్ హయాంలోనే బీజం పడింది. కేసీఆర్ కూడా మూసీ రివర్ ఫ్రంట్ బోర్డు ఏర్పాటు చేశారు. సుందరీకరణ పేరుతో రేవంత్ దోచుకుంటున్నారనడం తగదు. నల్లగొండ జిల్లా ప్రజలు బాగుపడాలంటే మూసీ ప్రక్షాళన జరగాలి. మూసీ ప్రక్షాళనపై ప్రతిపక్షాల రాద్ధాంతం సరికాదు’’ అని గుత్తా హితవు పలికారు.అత్యుత్సాహం ప్రదర్శించొద్దు. అలా ప్రదర్శిస్తే మొన్నటి ఎన్నికల్లో ఏమైంది? మీ స్వార్థం కోసం ౫౦ అంతస్తుల భవనాలకు అనుమతి ఇచ్చి ఇబ్బందులకు గురిచేశారు. మీరు చేస్తే సుందరీకరణ అవతలోడు చేస్తే దోచుకోవడమా? రూ. 16500 కోట్లతో మూసీ సుందరీకరణ కు ప్రతిపాదనలు చేసింది బీఆర్ఎస్ కాదా? దేశభద్రత కు ఉపయోగపడే రాడార్ ఏర్పాటు విషయంలో కూడా విమర్శలేనా?. రాడార్ విషయంలో జీవోలు ఇచ్చింది బీఆర్ఎస్ కాదా?’’ అంటే గుత్తా సుఖేందర్‌రెడ్డి ప్రశ్నలు గుప్పించారు.మూసీ ప్రక్షాళన కోసం ప్రజలు ఉద్యమించాల్సిన అవసరం ఉంది. ప్రక్షాళన వద్దని చెప్పే పార్టీలకు గుణపాఠం చెప్పాలి. మూసీ పరివాహక ప్రాంతాల్లో నోరు తెరిస్తే దోమలే లోపలికి పోతాయి. నది గర్భంలో ఉన్న ఇళ్లను తొలుత తొలగించాలి. యాభై అంతస్తులు కట్టే వారంతా మట్టిని తవ్వి మూసీలోనే పోస్తున్నారు. అక్రమ నిర్మాణాల వల్ల జరిగే నష్టం, సెల్లార్లలో తీసిన మట్టి ఎటుపోతుందనేది కూడా హైడ్రా దృష్టి పెట్టాలి’’ అంటూ గుత్తా సూచించారు. -
మూసీపై సీఎం తీరు అర్థరహితం: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: మూసీ ప్రక్షాళన విషయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీరు అర్థరహితంగా ఉందని బీఆర్ఎస్ ధ్వజమెత్తింది. మూసీ నది ప్రక్షాళనకు సంబంధించి బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో చేపట్టిన కార్యక్రమాలపై శుక్రవారం కీలక ప్రజెంటేషన్ ఇస్తున్నట్లు ప్రకటించింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు తెలంగాణ భవన్లో శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారని తెలిపింది. మూసీ నది ప్రక్షాళనలో భాగంగా ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పలు మురుగునీటి శుద్ధీకరణ ప్లాంట్లను ప్రతిపాదించి, చాలా వరకు పూర్తి చేసినట్లు కేటీ రామారావు పలు సందర్భాల్లో వెల్లడించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన పలు ఎస్టీపీల నిర్మాణ పనులను ఇటీవల కేటీ రామారావు పార్టీ ఎమ్మెల్యేలతో కలసి సందర్శించారు. -
సుందరీకరణ కాదు.. పునరుజ్జీవం!: సీఎం రేవంత్
సాక్షి,హైదరాబాద్:‘అధికారం కోల్పోయి నిస్పృహ, అసహనంతో మూసీ నది పునరుజ్జీవానికి కొంతమంది అడ్డుపడుతున్నారు. మూసీ సుందరీకరణ అనే డైలాగ్‌ను ప్రచారంలోకి తెచ్చారు. మేము అందాల కోసం పని చేయడం లేదు. అందాల భామలతో కలిసి పనిచేయడం లేదు. అలాంటి కొంతమంది.. మంత్రులు, ప్రజాప్రతినిధుల ముసుగులో పదేళ్లు రాష్ట్రాన్ని పట్టిపీడించి బందిపోటు దొంగలకంటే దుర్మార్గంగా పట్టపగలు దోపిడీ చేసి స్వేచ్ఛగా తిరుగుతున్నారు. మూసీ పునరుజ్జీవన ప్రయత్నాలపై విష ప్రచారంతో ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నారు. మూసీ మురికిని మించి మెదడులో విషం నింపుకుని తెలంగాణ సమాజంపై దాడి చేస్తున్నారు..’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. గురువారం సచివాలయంలో మంత్రులు డి.శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఒక్కొక్కరిని ఒప్పించి తరలిస్తాం ‘ఇది సుందరీకరణ కాదు.. దుబాయ్‌కి వెళ్లి నెత్తిమీద జుట్టును నాటు వేయించుకున్న విధానం కాదు. పునరుజ్జీవంతో మూసీని, మురికిలో కాలం వెళ్లదీస్తున్న ప్రజలను కాపాడి మంచి జీవనాన్ని ఇవ్వాలని, ఉపాధి కల్పించాలని, ప్రత్యామ్నాయ ఇళ్లను ఇవ్వాలనే ఆలోచన మాకు ఉంది. కానీ పేదరికం, కట్టుబానిసలు ఉండాలనే దొరలు, భూస్వాములు, జమీందారుల భావజాలం ఉన్నవారు దీనికి అడ్డుపడుతున్నారు. అక్కడి ప్రజల భవిష్యత్తుపై అపోహలు సృష్టిస్తున్నారు. నిజానికి 4 కోట్ల తెలంగాణ ప్రజల భవిష్యత్తును, రాష్ట్ర, దేశ ఆర్థిక వ్యవస్థను నిర్దేశించగల కార్యాచరణ ఇది. గత 10 నెలల పాటు అధికారులు 33 బృందాలుగా ఏర్పడి మూసీ దుర్గంధంలో దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్న ప్రతి ఇంటికీ వెళ్లి వారి కష్టాలు, వివరాలను తెలుసుకున్నారు. వారిని ఏ విధంగా ఆదుకోవాలనే అంశంపై మేం ఆలోచన చేస్తున్నాం. అక్కడి సమస్యలు పరిష్కరించి ఒక్కొక్కరిని ఒప్పించి తరలిస్తాం..’ అని సీఎం స్పష్టం చేశారు. సెక్యూరిటీ లేకుండా వస్తా..మీరూ రండి ‘గత బీఆర్ఎస్ ప్రభుత్వం మల్లన్నసాగర్ భూసేకరణ కోసం వేములఘాట్ ప్రజలపై అర్ధరాత్రి పోలీసులతో దాడి చేయించి గుర్రాలతో తొక్కించినట్టుగా మేం చేయం. ఇక్కడికి వస్తావా? అక్కడికి వస్తావా? అని నన్ను అడుగుతున్నారు. వారు ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట, గజ్వేల్‌లోని ఏటిగడ్డ కిష్టాపూర్, వేములఘాట్, మల్లన్నసాగర్, రంగనాయకసాగర్, కొండపోచమ్మకు నేను సెక్యూరిటీ లేకుండా వస్తా. బీఆర్ఎస్ నేతలూ రావాలి. రచ్చబండ నిర్వహించి పదేళ్లలో ఎన్ని దుర్మార్గాలు చేశారో ప్రజలను అడుగుదాం..’ అని రేవంత్ సవాల్ చేశారు. బఫర్ జోన్లో మరో 10 వేల గృహాలు ‘మూసీ గర్భంలో 1,690 ఇళ్లు ఉండగా వారికి దసరా పండుగ వేళ డబుల్ బెడ్రూమ్ ఇళ్లతో పాటు రూ.25 వేలు చొప్పున తోవ ఖర్చులకు ఇచ్చాం. అయితే హైడ్రా వస్తుంది..బుల్డోజర్లు పెడ్తున్నరు అని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మూసీలో ప్రభుత్వం ఒక్క ఇల్లు కూలగొట్టలేదు. ఖాళీ చేసిన లబ్ధిదారులే తమ ఇళ్ల తలుపులు, కిటికీల కోసం కూలగొట్టుకున్నారు. అడ్డగోలుగా కట్టిన 10, 20 అంతస్తుల ఆకాశహర్మ్యాలను కూల్చడానికే బుల్డోజర్లు, హైడ్రా అవసరం. అయినా హైడ్రా ఏమైనా ఫామ్‌హౌస్‌లో నిద్రపోయే భూతమా? మీద పడడానికి? మరో 10 వేల ఇళ్లు బఫర్‌జోన్‌లో ఉన్నాయి వారికి ప్రత్యామ్నాయం కల్పించి, మంచి జీవితాలు ఇచ్చి మనస్సు గెలవాలని భావిస్తున్నాం..’ అని ముఖ్యమంత్రి చెప్పారు. అద్భుతాలు సృష్టించిన కంపెనీలతో కన్సార్టియం ‘ప్రపంచంలో అద్భుతాలను సృష్టించిన ఐదు కంపెనీలతో ఒక కన్సార్టియం ఏర్పాటు చేయించి రూ.141 కోట్లతో మూసీ పునరుజ్జీవనం ప్రాజెక్టు డీపీఆర్ తయారీ బాధ్యతలను టెండర్ల ద్వారా అప్పగించాం. డీపీఆర్ తయారీతో పాటు అంచనా వ్యయం, నిధులు, పెట్టుబడులు, రుణాల సమీకరణకు సంబంధించి కన్సార్టియం సహకారం అందిస్తుంది. 18 నెలల్లో డీపీఆర్ తయారు చేస్తారు. ఆ తర్వాత నాలుగైదేళ్లలో ప్రాజెక్టును పూర్తి చేస్తాం. ఆరున్నరేళ్ల పాటు కన్సార్టియం సేవలందిస్తుంది. ఈ కన్సార్టియంలో భాగమైన ‘మీన్‌హార్ట్’ కంపెనీకే ప్రధాని మోదీ గుజరాత్లో సర్దార్ పటేల్ విగ్రహం కట్టే బాధ్యత అప్పగించారు. అలాగే రాష్ట్రంలో కేసీఆర్, రామేశ్వర్రావు తమ కులగురువు చినజీయర్‌స్వామితో కలిసి సమతామూర్తి విగ్రహాన్ని కట్టే బాధ్యత అప్పగించారు. గత ప్రభుత్వం ఉప్పల్‌లో మూసీపై రూ.30 కోట్లతో పనులు ప్రారంభించి రూ.6 కోట్లు ఖర్చు చేసినట్టు రికార్డుల్లో ఉంది. కానీ వర్షం వచ్చి చేసిన పనికొట్టుకుపోయిందని అంటున్నారు. ఈ వ్యవహారంలో లోపల వేయవచ్చు. చర్లపల్లి జైల్లో వేస్తే తిండిదండగ అని మేం చూసీచూడనట్టుగా ఉంటే వారికి అలుసుగా ఉంది..’ అని రేవంత్ అన్నారు. ‘మూసీ’పై అసెంబ్లీలో చర్చకు సిద్ధం ‘మూసీ ఒడ్డున ఖాళీ చేసిన ఇళ్లల్లో హరీశ్, కేటీఆర్, ఈటల రాజేందర్ మూడు నెలలు ఉంటే ఈ ప్రాజెక్టును ఆపేస్తానంటూ ఓపెన్ ఆఫర్ ఇస్తున్నా. ప్రజలు అక్కడ ఉండడం అద్భుతం అనుకుంటే మీరూ ఉండండి. పునరుజ్జీవాన్ని అడ్డుకోవడం మాత్రం దేశద్రోహం. మంచి ప్రాజెక్టుగా భావిస్తే ప్రజలను తరలించడానికి ఏం చేయాలో సూచనలు చేయండి. దీనిపై అసెంబ్లీలో చర్చకు కూడా సిద్ధం. ఇళ్లు, ఉద్యోగం, ఉపాధి, ప్లాట్, నష్టపరిహారం ఇద్దామా? చెప్పండి. అనుమానాలుంటే నివృత్తి చేస్తాం ప్రత్యేక కేసుగా ఎంపీలను ఎంక్లోజర్లో పెట్టి శాసనసభలో మాట్లాడించడానికి ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తాం. ఎంఐఎం, బీజేపీ, బీఆర్ఎస్ నేతలు అసద్, కిషన్, కేసీఆర్ తమ అనుమానాలను శనివారంలోగా ప్రశ్నల రూపంలో తెలియజేస్తే రాతపూర్వకంగా సమాధానమిస్తాం. రాజకీయ సమ్మతి కోసం కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేస్తాం..’ అని సీఎం తెలిపారు. దామగుండాన్ని వ్యతిరేకించేవాళ్లు కసబ్ లాంటోళ్లు ‘దేశ భద్రత కోసం ఏర్పాటు చేసే దామగుండం నేవీ రాడార్ కేంద్రాన్ని వ్యతిరేకిస్తూ మాట్లాడేవాళ్లు కసబ్‌లాంటి వాళ్లు. కేటీఆర్ కసబ్‌లాగా మాట్లాడితే ఎవడో వచ్చి ఇవ్వాల్సిన సమాధానం ఇస్తాడు. ఏటా రూ.500 కోట్ల లంచం వచ్చే బతుకమ్మ చీరలను నిలుపుదల చేస్తే కడుపు మండి ఆరోపణలు చేస్తున్నారు. జీహెచ్ఎంసీలో వరద బాధితులకు రూ.10 వేలు చొప్పున గత ప్రభుత్వం చేసిన రూ.600 కోట్ల పంపిణీలో అక్రమాలపై ఏసీబీ విచారణకు ఆదేశించాలా?..’ అని కేటీఆర్‌ను ఉద్దేశించి రేవంత్ ప్రశ్నించారు. విలేకరులతో మాట్లాడటానికి ముందు.. ప్రస్తుతం మూసీ నది ఎలా ఉంది? పునరుజ్జీవం తర్వాత ఎలా ఉండబోతోంది తెలియజేస్తూ సీఎం ప్రెజెంటేషన్ ఇచ్చారు. -
‘అద్దాల మేడలు, అందమైన భామల కోసం మేం పని చేయడం లేదు’
సాక్షి,హైదరాబాద్: మూసీకి పునరుజ్జీవనం అందిస్తున్నాం. ‘అద్దాల మేడల కోసం అందమైన భామల కోసం మేం పనిచేయడం లేదు’ అంటూ సీఎం రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మూసీ నదీ ప్రక్షాళనపై సెక్రటేరియట్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో 33మంది అధికారుల బృందం పనిచేసింది.పేదలతో ఎదుర్కొంటున్న ప్రజల సమస్యల్ని విన్నారు.మూసీపై 10 నెలలుగా అధికారులు సీరియస్‌గా పనిచేస్తున్నారు.మూసీ పునరురజ్జీవనం కోసం మేం ప్రయత్నిస్తున్నాం.మూసీ పరివాహక ప్రాంత ప్రజలను ఆదుకోవడం ఎలా అనేదానిపై దృష్టి పెట్టాంమూసీ సుందరీకరణను అడ్డుకునేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు.ప్రజల్లో అపోహాలు సృష్టిస్తున్నారుబ్యూటిఫికేషన్ మీద విష ప్రచారం చేస్తున్నారుమూసీ కంటే బీఆర్ఎస్ నేతల మొదళ్లలో ఉంది.ఇప్పుడు ప్రజల్లో అపోహలు కల్పించి విషప్రచారం చేస్తున్నారు.మూసీ 300 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది.మూసీకి పునరుజ్జీవనం అందిస్తున్నాం10ఏళ్లు అధికారాన్ని అడ్డం పెట్టుకుని.. రాష్ట్రాన్ని బందిపోటు దొంగల్లా దోచుకున్నారు.మూసీకి పునరుజ్జీవనం అందిస్తున్నాంఅద్దాల మేడల కోసం... అందమైన భామల కోసం మేం పనిచేయడం లేదుమూసీ 300 కిలోమీటర్లు ప్రయాణిస్తుందిబఫర్ జోన్లో 10వేల ఇళ్లు ఉన్నాయిమూసీ బాధితులను ఆదుకోవడం కోసమే ఈ ప్రాజెక్ట్మూసీకి పునరుజ్జీవనం అందిస్తున్నాంచెన్నై ముంబైలాంటి నగరాల్లో వరదలు ఎలా ఉన్నాయి?చెన్నై,ముంబై నగరాల్లో ఏం జరుగుతుందో కనపడతలేదా?చెరువులు,నాళాలు ఆక్రమించారు. మూసీ పరిస్థితి ఏంటి?నగరాన్ని మూసీలో ముంచదల్చుకున్నారా?హైదరాబాద్ మహానగరాన్ని ఏం చేయదలుచుకున్నారు?వద్దంటే చెప్పండి మూసీ టెండర్లు రద్దు చేస్తాంనాకు స్వార్థం ఉన్నట్లు మమ్మల్ని విమర్శిస్తున్నారుఅధికారం కోల్పోయిన వారు ప్రతీది అడ్డుకోవాలని చూస్తున్నారుమూసీ విషం హైదరాబాద్‌లోనే కాదు నల్గొండకు వెళ్తుందిఖమ్మం,విజయవాడ కళ్లముందే వరదల్లో మునిగిపోయింది.హైదరాబాద్‌ను కూడా అలాగే ముంచాలనుకుంటున్నారా?నల్గొండ ప్రజలు మౌనంగా ఉంటే ఎలా? ఇది మూసీ సుందరీకణ కాదు, పునరుజ్జీవన ప్రాజెక్టుమూసీ పునరుజ్జీవంపై కొంతమంది అపోహాలు సృష్టిస్తున్నారుహైదరాబాద్లోని అద్భుత కట్టడాలను నాశనం చేయాలని చూస్తున్నారుహైదరాబాద్ సర్వనాశనం అవుతుంటే మీకు రాజకీయాలే ముఖ్యమా?హైదరాబాద్‌ను అద్భుతంగా తీర్చిదిద్దడానికి డీపీఆర్ కోసం.. ప్రపంచ అగ్రశ్రేణి కంపెనీలను కన్సార్టియంగా మార్చాందీనిపై అందురు ఒప్పుకుంటేనే ముందుకుపోదాం, లేదంటే వద్దుమూసీకి వెళ్తామంటున్న నేతలు అక్కడ మూడు నెలలు ఉండండికేటీఆర్,హరీష్‌రావు,ఈటలకు మూసీలో ఇళ్లు ఇస్తాంమూసీ అద్భుతంగా ఉంటే అక్కడే మూడు నెలలు ఉండండిమూసీలో కేటీఆర్,హరీష్,ఈటల మూడునెలల ఉంటే ప్రాజెక్ట్ ఆపేస్తాందేశ భద్రత విషయంలో రాజీపడందేశ భద్రత విషయంలో రాజీపడేది లేదురాడార్ స్టేషన్ కు గత ప్రభుత్వం లోనే అన్ని అనుమతులు ఇచ్చారు.రాడార్ స్టేషన్ వ్యతిరేకిస్తున్న బీఆర్ఎస్.. బతుకమ్మ చీరల విషయంలో గగ్గోలు పెడుతుందిహైదరాబాద్లో వరదలు వచ్చినప్పుడు.. గ్రౌండ్ ఫ్లోర్ వాల్లకు డబ్బులు ఇవ్వలేదు..5వ అంతస్తు వాల్లకు ఇచ్చారుదీనిపై ఏంక్వరీకి సిద్దమా.. సిద్దమైతే 24 గంటల్లో ఏసీబీ ఏంక్వరీకి ఆదేశిస్తా.. -
తొలిసారే ఈ గడ్డు పరిస్థితులు.. కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు
సాక్షి,హైదరాబాద్: పార్టీ పెట్టిన తర్వాత తొలిసారి గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటునున్నామని అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్వీ కార్యకర్తల సమావేశం జరిగింది.ఈ సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. అనేకమంది విద్యార్థులను బీఆర్ఎస్ నాయకులుగా చేసింది.పార్టీ పెట్టిన తర్వాత మెదటిసారి గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాం. సీఎం రేవంత్‌రెడ్డి పదవినికి కాపాడుకునే పనిలో ఉన్నారు. అన్ని వర్గాలను కాంగ్రెస్ మోసం చేస్తోంది. పోరాటాలు మనకు కొత్త కాదు. రాజకీయ ఉద్దండులతోనే మన పార్టీ కొట్లాడింది. ప్రభుత్వ లోపభూయిష్ట విధానాలతో నష్టం చేస్తున్నారు. తమకు అండగా నిలవాలని గ్రూప్-1 అభ్యర్థులు కోరారు. జీవో 55ను రద్దు చేసి జీవో 29ని తీసుకొచ్చారు. స్థానికులకు ఉద్యోగాలు రాకుండా చేస్తున్నారు. దేశంలో జోనల్ వ్యవస్థ ద్వారా 95శాతం స్థానికులకు ఉద్యోగాలు దక్కేలా కేసీఆర్ చేశారు.తెలంగాణలో ఉన్న గురుకుల పాఠశాలలు దేశంలో ఎక్కడా లేవు.రాష్ట్రంలో ఏ సమస్య వచ్చినా ప్రజలు తెలంగాణ భవన్‌కు వస్తున్నారు. 12వేల మంది ఆశా వర్కర్లతో పెద్ద సభ నిర్వహిస్తాం. కేసీఆర్ ఇచ్చిన జీవో 55ను రద్దు చేసి జీవో 29ను తెచ్చారు. జీవో 29వలన ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అన్యాయం జరుగుతోంది.నవంబర్ 5న జరిగనున్న ఆటో డ్రైవర్ల ధర్నాకు మద్దతు ఇస్తాం. కాంగ్రెస్ పాలనలో భాదపడని వారు లేరు. సిద్ధిపేటలో ఒకే ఇంట్లో నలుగురికి మెడికల్ సీట్లు వచ్చాయి. హరీష్ రావు కుట్రతోనే నలుగురికి మెడికల్ సీట్లు వచ్చాయని రేవంత్ రెడ్డి అనుకున్నారు. తెలంగాణలో కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయడం ఎవరి తరంకాదు. తెలంగాణను నాశనం చేస్తుంటే బీజేపీ ఎందుకు మాట్లాడదు?కవితను అక్రమంగా ఐదు నెలల్లో జైల్లో పెట్టారు. బీఆర్ఎస్ కాంగ్రెస్,బీజేపీ రెండు పార్టీలు ప్రత్యుర్థులే డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్లు రాబోతున్నాయి. అందరికి అవకాశాలు వస్తాయి’అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. -
హైడ్రా ఒక డ్రామా.. అవన్నీ అక్రమ నిర్మాణాలు కావు: ఈటల
సాక్షి, హైదరాబాద్: హెడ్రా విషయంలో తెలంగాణ ప్రభుత్వంపై, సీఎం రేవంత్‌పై మరోసారి మండిపడ్డారు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్. బఫర్ జొన్, ఎఫ్టీఎల్ పరిధిలో ఉండేవి మొత్తం ప్రభుత్వ భూములు కావని, పట్టా భూములు కూడా ఉంటాయని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చివేస్తున్నవి అన్ని అక్రమ నిర్మాణాలు కావని, హైడ్రా పేరుతో డబ్బులు వసూలు చేసే కార్యక్రమం జరుగుతోందని ఆరోపించారు.కాగా గతంలోనూ బుల్డోజర్లతో ఇళ్లను కూలగొట్టి కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారని ఈటల విమర్శించారు. కేవలం పేదలనే టార్గెట్ చేసి ప్రభుత్వం హీనంగా ప్రవర్తిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాన్యులకు శని, ఆదివారాల్లో కోర్టులు అందుబాటులో ఉండవని కూల్చివేతలు చేస్తున్నారని అన్నారు. చెరువులు కాపాడాలంటే ముందు ప్రభుత్వ, ప్రయివేటు భూములు లెక్కించాలని డిమాండ్ చేశారు. కూల్చివేతలతో రోడ్డున పడ్డ పేదలకు తక్షణమే ప్రభుత్వం పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కుమ్ములాటలు ఉన్నాయని, అవి బయటపడకుండా ఉండేందుకు హైడ్రా పేరుతో డైవర్షన్ చేస్తున్నారని విమర్శించారు. హైడ్రా పేరుతో పేదల భూములు లాక్కోవడానికి రేవంత్ రెడ్డి జాగీరు కాదన్నారు. చెరువులు, వాగుల రక్షణ కోసం అవసరమైతే భూసేకరణ చేపట్టాలని డిమాండ్ చేశారు. -
పైసా పనిలేదు.. రూపాయి లాభం లేదు: రేవంత్ ఢిల్లీ టూర్లపై కేటీఆర్
సా క్షి, హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు సంధించారు. పది నెలల్లో 25 సార్లు, 50 రోజులు ఢిల్లీకి పోయివస్తివి అంటూ ధ్వజమెత్తారు. పోను 25 సార్లు, రాను 25 సార్లు.. నీ ఢిల్లీ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు చేసి సిల్వర్‌జూబ్లీ కూడా చేస్తివని ఎద్దేవా చేశారు. తట్టా మట్టి తీసింది లేదు, కొత్తగా చేసింది అసలే లేదంటూ విమర్శించారు. అన్నదాతలు అరిగోసలు పడుతున్నారని, గురుకులాలు గాల్లో దీపాల్లా మారాయని, వైద్యం కుంటుపడిందని, విద్యావ్యవస్థ గాడి తప్పిందన్నారు.మూసి, హైడ్రా పేరుతో పేదోళ్ల పొట్టలు కొట్టారని, 420 హామీలను మడతపెట్టి మూలకు వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పండగలు పండగళ్లా లేవని, ఆడబిడ్డలకు చీరలు అందనేలేవని, అవ్వాతాతలు అనుకున్న పింఛను, తులం బంగారం జాడే లేదని ఫైరయ్యారు. స్కూటీలు, కుట్టు మిషిన్లు లేనేలేవని, అయినా ఢిల్లీకి పోయిరావాల్సిందేనంటూ ఎద్దేవా చేశారు.✳️ పైసా పనిలేదు - రాష్ట్రానికి రూపాయి లాభం లేదు10 నెలలు - 25 సార్లు - 50రోజులుపోను 25 సార్లు, రాను 25 సార్లు, నీ ఢిల్లీ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు చేసి సిల్వర్ జూబ్లీ కూడా చేస్తివి. తట్టా మట్టి తీసింది లేదు కొత్తగా చేసింది అసలే లేదు ❌ అయినను పోయి రావాలె హస్తినకు✳️…— KTR (@KTRBRS) October 17, 2024 -
రేవంత్ బుల్డోజర్లకు బీఆర్ఎస్ అడ్డుపడుతుంది
సాక్షి, హైదరాబాద్: హైడ్రా, మూసీ ప్రక్షాళన పేరిట ప్రభు త్వం సృష్టిస్తున్న భయానక వాతావరణం నుంచి ప్రజలను బీఆర్ఎస్ రక్షిస్తుందని, సీఎం రేవంత్ బుల్డోజర్లకు అడ్డుగా నిలబడుతుందని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు చెప్పారు. మూసీ పేరిట జరుగు తున్న లూటీని ప్రజల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు హైదరాబాద్ పేదలకు బీఆర్ఎస్ రక్షణ కవచంలా నిలుస్తుందని అన్నారు. పెద్ద పెద్ద బిల్డర్లను బెది రించేందుకే హైడ్రాను ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. పేదలను బెదిరింపులకు గురిచేస్తున్న ప్రాంతాల్లో త్వరలో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు పర్యటించి అక్కడి ప్రజలకు భరోసా కల్పిస్తారని తెలిపారు. ఈ మేరకు షెడ్యూలును త్వర లోనే ప్రకటిస్తామన్నారు. బుధవారం తెలంగాణ భవన్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలతో కేటీఆర్ సమావేశమయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.పేదలకు ఎవరూ అండగా లేరనుకుంటోంది..‘పేదలు, దిగువ మధ్య తరగతి ప్రజలకు ఎవరూ అండగా లేరనే రీతిలో ప్రభుత్వం అనాలోచితంగా, ప్రణాళిక లేకుండా దూకుడుగా వ్యవహరిస్తోంది. 50 ఏళ్ల క్రితం అనుమతులు పొందిన ఇళ్లను కూడా కూల్చివేస్తామంటే కుదరదు. మా ఫార్మ్‌హౌస్‌లు చట్టవిరుద్ధంగా ఉంటే కూల్చండి కానీ పేదల జోలికి వెళ్లొద్దు. హైడ్రా బాధితుల తరఫున న్యాయ పోరాటం చేసేలా బీఆర్ఎస్ లీగల్ సెల్‌ను బలోపేతం చేస్తాం..’ అని కేటీఆర్ తెలిపారు.మూసీ ప్రక్షాళనకు రూ.1.50 లక్షల కోట్లు ఎందుకు?‘మా ప్రభుత్వంలో మూసీ మురుగునీటిని వంద శాతం శుద్ధి చేసేందుకు రూ.4 వేల కోట్లతో ఎస్టీపీలను నిర్మించాం. రూ.1100 కోట్లతో కొండపోచమ్మ సాగర్ నుంచి గండిపేటకు గోదావరి నీళ్లు తేవడంతో పాటు నల్లగొండకు మంచినీళ్లు ఇచ్చే ఏర్పాట్లు చేశాం. అలాంటపుడు మూసీ ప్రక్షాళనకు రూ.1.50 లక్షల కోట్లు ఎందుకు? ఒకపక్క మూసీ సుందరీకరణ అంటూనే దామగుండం రాడార్ స్టేషన్ పేరిట 12 లక్షల వృక్షాలను ఎలా నరికేస్తారు? బీజేపీ కంటే ఎక్కువ రేవంత్ మాట్లాడుతున్నాడుదేశ రక్షణ విషయంలో బీజేపీ నాయకులకంటే ఎక్కువగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతున్నాడు. దేశ రక్షణకు బీఆర్ఎస్ పార్టీ కట్టుబడి ఉంది. 2017లో దామగుండం రాడార్ స్టేషన్ కోసం జీవో ఇచ్చినా పర్యావరణ హితాన్ని దృష్టిలో పెట్టుకుని జీవోను తొక్కి పెట్టాం. ప్రధానిని ప్రశ్నించాలంటే రేవంత్‌కు భయం. గతంలో కేంద్ర బడ్జెట్లో అన్యాయం జరిగినా సీఎం మాట్లాడలేదు..’ అని కేటీఆర్ విమర్శించారు.పది నెలల్లో రికార్డు స్థాయిలో అప్పులు‘అధికారంలోకి వచ్చిన పది నెలల్లోనే రేవంత్ ప్రభుత్వం రికార్డు స్థాయిలో రూ.80,500 కోట్లు అప్పు చేసింది. అప్పు తప్పు అని గతంలో ఆరోపించిన వారిని ఇప్పుడు దేనితో కొట్టాలి? రుణమాఫీ చేయకుండా, రైతుభరోసా వేయకుండా, ఒక్క కొత్త ప్రాజెక్టు కట్టకుండా, నెలల పాటు జీతాలు ఇవ్వకుండా రూ.80 వేల కోట్లు ఎవరి జేబుల్లోకి వెళ్లాయి?’ అని మాజీమంత్రి నిలదీశారు. -
వరంగల్ కాంగ్రెస్‌లో పవర్ వార్..
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్‌లో ముసలం మొదలైంది. అధికారంలోకి వచ్చి ఏడాదైనా గడవకుండానే వరంగల్ పార్లమెంటు నియోజకవర్గం వేదికగా పార్టీలో అంతర్గత లుకలుకలు ప్రారంభమయ్యాయి. జిల్లా నుంచి కేబినెట్లో ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి కొండా సురేఖపై హను మకొండ పార్లమెంటు పరిధిలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బహిరంగంగానే పార్టీకి ఫిర్యాదులు చేయడం గమనార్హం. పరకాల నియోజకవర్గంలో ఇప్పటికే కొండా సురేఖ, ఎమ్మె ల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డిల మధ్య విభేదాలు బహిర్గతం కాగా, ఇప్పుడు పార్లమెంటు పరిధిలోని మిగిలిన ఎమ్మెల్యేలు కూడా జత కలిశారు.మంత్రి సురేఖ తమ నియోజ కవర్గ రాజకీయాల్లో జోక్యం చేసుకుంటున్నారని, తమకు నష్టం కలిగే విధంగా వ్యవహరిస్తున్నారంటూ వీరంతా పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్‌కు లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. బుధవారం ఉదయం హైదర్‌గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో రాష్ట్ర అధ్యక్షుడిని కలిసి వినతిపత్రం అందజేశారని, తమ నియోజకవర్గాల్లో కలుగజేసుకోకుండా మంత్రి సురేఖను నియంత్రించాలని కోరారని తెలుస్తోంది. దీనికి ముందు మంగళవారం రాత్రి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీని కూడా కలిసి ఈ మేరకు ఫిర్యాదు చేయడం గమనార్హం. వివాదాస్పదమవుతున్న సురేఖ వ్యవహార శైలిరాష్ట్ర మంత్రి కొండా సురేఖ వ్యవహార శైలి ఇటీవలి కాలంలో వివాదాలకు దారితీస్తోంది. సినీ నటుడు నాగార్జున కుటుంబంపై ఆమె చేసిన వ్యాఖ్యలు దుమారం సృష్టించాయి. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డితో వివాదం పార్టీకి తలనొప్పిగా మారింది. వరంగల్ పార్లమెంటు పరిధిలోని ఇతర ఎమ్మెల్యేలతో సైతం సఖ్యత కొరవడటం తాజాగా చర్చనీయాంశమవుతోంది. దీంతో సురేఖ విషయంలో ఎప్పుడు ఏం జరుగుతుందోననే ఆసక్తి కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో నెలకొంది. ఇటీవలి పరిణామాలు ఆమె భవితవ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతాయనే చర్చ గాంధీభవన్ వర్గాల్లో జరుగుతోంది. -
బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం దివాలా తీసింది
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో రూ.7 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాళా తీసిందని అన్నారు పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్. బుధవారం హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. క్రమశిక్షణ ఉల్లంగిస్తే చర్యలు తప్పవు. ఎంత పెద్దవారైనా ఉపేక్షించేది లేదు. పార్టీ లైన్లో పని చేయాల్సిందేనని ఆదేశించారు. రాబోయే గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మంచి ఫలితాలు సాధించాలి. బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో రూ. 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాళా తీసింది. కానీ కాంగ్రెస్ అలా కాదు.. అధికారంలోకి వచ్చాక 10 నెలల కాలంలో అనేక అద్భుతమైన పనులు చేసింది.. అటు రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టింది. ఇచ్చిన హామీలను నెరవేర్చింది. గ్రేటర్ ఎన్నికల్లో ప్రభుత్వం చేస్తున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి మరింత విస్తారంగా తీసుకెళ్లాలి. రాబోయే గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మంచి ఫలితాలు సాధించాలి. మనం గట్టిగా పనిచేస్తేనే ప్రజల్లోకి వెళ్తాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో చరిత్ర సృష్టించింది. ప్రభుత్వం చేస్తున్న పనులను నాయకులు లోతుగా అధ్యయనం చేయాలి.. అర్థం చేసుకోవాలి. ప్రజల్లో మంచి స్పందన ఉంది.ప్రతి పక్ష బీఆర్ఎస్, బీజేపీ రెండు పార్టీలు కలిసి పోయాయి.. రెండు పార్టీ లు కలిసి కాంగ్రెస్‌ను దెబ్బతీయాలని చూస్తున్నాయి. ప్రతిపక్ష పార్టీ కుట్రల్ని మనం తిప్పికొట్టారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నందున గ్రేటర్ లో విజయం సాధిస్తేనే మనకు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి హైదరాబాద్ జిల్లా నాయకులు పకడ్బందీగా పని చేసి ఫలితాలు సాధించాలి’అని బి.మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. -
TG: ప్రభుత్వంపై హరీశ్‌రావు ఫైర్
సాక్షి,హైదరాబాద్:ఉన్న పథకాలు బంద్ పెట్టడమే తెలంగాణలో కాంగ్రెస్ తెచ్చిన మార్పు అని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణభవన్‌లో బుధవారం(అక్టోబర్ 16) మీడియాతో హరీశ్‌రావు చిట్‌చాట్‌గా మాట్లాడారు.‘ఒక చీర కాదు..రేవంత్ రెడ్డి రెండు చీరలు అన్నాడు.దసరా పండుగకు అక్క చెల్లెళ్ళను ప్రభుత్వం నిరుత్సహపరిచింది.రూ.15వేలు రైతుబంధు అన్నాడు..గుండు సున్నా చేశాడు. కేసీఆర్ కిట్ కంటే మంచి కిట్ ఇస్తామని పేద గర్బిణి స్త్రీలను మోసం చేశాడు.ముదిరాజ్,గంగపుత్రులంటే సీఎం రేవంత్‌కు చిన్నచూపు.ఆగస్టులో పోయాల్సిన చేప పిల్లలను అక్టోబర్ వచ్చినా పోయలేదు.మేం రూ. 100కోట్లు ఖర్చు చేస్తే..కాంగ్రెస్ ప్రభుత్వం చేప పిల్లల కోసం బడ్జెట్లో పెట్టిందే రూ.16కోట్లు.ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన మార్పు’అని ఎద్దేవా చేశారు.ఇదీ చదవండి: బిల్డర్లను బెదిరించేందుకే హైడ్రా -
బిల్డర్లను బెదిరించేందుకే హైడ్రా: కేటీఆర్
సాక్షి, తెలంగాణభవన్: హైడ్రాను అడ్డు పెట్టుకుని బిల్డర్లు, వ్యాపారవేత్తల నుంచి రేవంత్ సర్కార్ వసూళ్లకు పాల్పడుతోందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అలాగే, సీఎం రేవంత్ కాంగ్రెస్ ముఖ్యమంత్రినా? లేక బీజేపీలో ఉన్నారా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ దిక్కుమాలిన పాలన వలన హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పడిపోయింది అంటూ ఘాటు విమర్శలు చేశారు.నేడు తెలంగాణభవన్‌లో జీహెచ్ఎంసీ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కేటీఆర్ సమావేశమయ్యారు. అనంతరం తెలంగాణభవన్‌లో కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ..‘బిల్డర్లను బెదిరించేందుకే హైడ్రాను తీసుకువచ్చారు. వసూళ్ల కోసమే రేవంత్ సర్కార్ హైడ్రాను తీసుకొచ్చింది. హైడ్రా పేరుతో వసూలు జరుగుతున్నాయని ఎంఐఎం వాళ్ళు కాంగ్రెస్ నేతలను కొట్టారు. అఖిలపక్షం సమావేశం కాదు.. మూసీ పరివాహక ప్రాంతంలో ప్రజలతో మీటింగ్ పెట్టాలి. పార్టీల అభిప్రాయాలు కాదు.. ప్రజల అభిప్రాయాలు తీసుకోవాలి. మూసీ సుందరీకరణ వెనుక భారీ కుంభకోణం ఉంది.అక్రమ నిర్మాణమైతే.. నా ఫాంహౌస్‌ను కూల్చేయండి. పేదల కడుపు కొట్టకుండా మూసీ సుందరీకరణ చేసుకోవచ్చు. మూసీకి పురిట్లోనే గండి కొట్టి.. హైదరాబాద్ వచ్చి సుందరీకరణ అంటున్నారు. దామగుండం నేవీ రాడార్ స్టేషన్స్‌కు అమెరికా, యూకే లాంటి దేశాలు వాడటం లేదు. పర్యావరణ ప్రేమికుల సూచన మేరకు కేబీఆర్ పార్క్ చుట్టూ ప్లై ఓవర్స్ ఆలోచనను విరమించుకున్నాం. సీఎం రేవంత్ కాంగ్రెస్ ముఖ్యమంత్రినా? లేక బీజేపీలో ఉన్నారా?. ఉన్నట్టుండి రేవంత్‌కు దేశరక్షణ గుర్తొచ్చింది. గతంలో ఆర్మీలో ఏమైనా రేవంత్ పనిచేశాడా?.మూసీ నది పరివాహక ప్రజలకు 50 ఏండ్ల కిందట ప్రభుత్వమే పట్టాలిచ్చి రిజిస్ట్రేషన్లు చేసి ఇచ్చింది. వారి చేత నల్లా బిల్లు, కరెంట్ బిల్లు కట్టించుకుంది. మూసీ సుందీరకరణ, హైడ్రా ఏదైనా కావొచ్చు.. ఏదైనా సరే.. నిర్దిష్టమైన ఆలోచన, పద్ధతి, ప్రణాళిక లేదు. మూసీ పేరిట జరుగుతున్న దోపిడీ ఏదైతే ఉందో దాన్ని వివరంగా ప్రజల్లోకి తీసుకెళ్తాం. దిక్కుమాలిన పాలన వలన హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పడిపోయింది. సీఎం దివాలాకోరు మాటల వలనే అప్పు పుట్టడం లేదని మంత్రి తుమ్మల గుర్తుంచుకోవాలి. రేవంత్ రెడ్డి పంపే బుల్డోజర్లకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అడ్డంగా ఉంటారు. కాంగ్రెస్ హయాంలోనే అనుమతిలిచ్చి.. ఇప్పుడు కూల్చుతున్నారని డిప్యూటీ సీఎంకు తెలియదా?. మోదీని చూస్తే.. రేవంత్ రెడ్డికి హడల్. సంక్షేమ పథకాలకు లేని నిధులు హర్యానా, మహారాష్ట్ర ఎన్నికలకు డబ్బులు ఎక్కడివి?’ అంటూ ప్రశ్నించారు. -
మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలు.. కాంగ్రెస్ పరిశీలకులుగా తెలంగాణ మంత్రులు
న్యూఢిల్లీ: మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ సీనియర్ పరిశీలకులను నియమించింది. ఈ మేరకు ఏఐసీసీ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ జాబితాలో తెలంగాణ నుంచి ముగ్గురికి చోటు కల్పించింది.మహారాష్ట్రలోని 5 డివిజన్లకు 11 మందిని నియమించగా.. వీరిలో రాష్ట్ర మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీతక్క ఉన్నారు. ఝార్ఖండ్‌కు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు ఆ పార్టీ సీనియర్ నేతలు తారిక్ అన్వర్, అధిర్ రంజన్ చౌదరిని నియమించారు.కాగా మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన విషయం తెలిసిందే. మహారాష్ట్రకు ఒకే దశలో, జార్ఖండ్‌కు రెండు విడతల్లో పోలింగ్ జరగనుంది. నవంబర్ 20న మహారాష్ట్రకు, నవంబర్ 13న, 20న జార్ఖండ్‌కు ఎన్నికలు జరగనున్నాయి. -
కేటీఆర్‌పై బండిసంజయ్ ఫైర్
సాక్షి,హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఫైర్ అయ్యారు. వికారాబాద్ నేవీ రాడార్ కేంద్రానికి మీరే అనుమతిచ్చి మీరే ఎలా వ్యతిరేకిస్తారని ప్రశ్నించారు. ‘కేటీఆర్.. మీ అయ్య ఫాంహౌజ్ ముందు ధర్నా చేయ్. ఆనాడు రాడార్ వ్యవస్థకు ఎందుకు అనుమతి ఇచ్చారో అడుగు. మీ అయ్య ఆనాడు సోయిలో ఉండే ఆమోదం తెలిపారో లేదో అడుగు. మీరే అనుమతి ఇచ్చి మీరే వ్యతిరేకిస్తారా? దేశ భద్రత వ్యవస్థ ఏర్పాటును వ్యతిరేకించడమంటే.. దేశ ప్రయోజనాలను వ్యతిరేకించినట్లే. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్కు బుద్ది చెప్పినా మార్పు రాలేదు. కాగా, వికారాబాద్ దామగుండంలో నేవీ ఏర్పాటు చేయనున్న వీఎల్ఎఫ్ రాడార్ స్టేషన్‌కు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ మంగళవారం(అక్టోబర్ 15) శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డితో పాటు కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండిసంజయ్ తదితరులు పాల్గొన్నారు. ఇదీ చదవండి: రాడార్‌కు అనుమతులిచ్చింది వాళ్లే: సీఎం రేవంత్ -
‘రాడార్’కు అనుమతులిచ్చింది వారే : సీఎం రేవంత్
సాక్షి,హైదరాబాద్: దేశ రక్షణలో తెలంగాణ కీలక అడుగు వేస్తోందని, డిఫెన్స్, ఆర్మీ విభాగాల్లో హైదరాబాద్ వ్యూహాత్మక స్థానంలో ఉందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ముఖ్య అతిథిగా హాజరై వికారాబాద్ జిల్లా దామగుండంలో నేవీ ఏర్పాటు చేయనున్న వీఎల్ఎఫ్ రాడార్ స్టేషన్‌కు మంగళవారం(అక్టోబర్15) శంకుస్థాపన చేశారు.ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ‘వీఎల్ఎఫ్ స్టేషన్ పై కొందరు అపోహాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. తమిళనాడులో ఇలాంటి స్టేషన్ ఏర్పాటు చేసి 34 ఏళ్లు అవుతున్నా ఎలాంటి ఇబ్బందులూ తలెత్తలేదు. వివాదం చేసే వాళ్ళు దేశ రక్షణ కోసం ఆలోచన చేయాలి. అసలు బీఆర్ఎస్ హయాంలోనే రాడార్ స్టేషన్‌కు అనుమతులిచ్చారు. దేశ రక్షణపై వివాదాలు సృష్టించే వారికి కనువిప్పు కలగాలి. నేను, స్పీకర్ ఈ జిల్లా నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నాం. దేశ రక్షణ కోసం రాజకీయాలను వదిలి కేంద్రానికి సహకరిస్తున్నాను. కేంద్ర రక్షణ మంత్రి వేరే పార్టీ అయినా... నేను వేరే పార్టీ అయినా దేశ రక్షణ కోసం అందరం ఒకటే. వీఎల్ఎఫ్ స్టేషన్ నిర్మాణానికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకరిస్తుంది’అని రేవంత్‌రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండిసంజయ్ రాష్ట్ర మంత్రి కొండా సురేఖ తదితరులు పాల్గొన్నారు.ఇదీ చదవండి: ఓ వైపు మరణశాసనం..మరోవైపు సుందరీకరణ ఎలా: కేటీఆర్ -
ఆ రూ.77 వేల కోట్లు ఎటు వెళ్లాయి?: కేటీఆర్
హైదరాబాద్, సాక్షి: కరెంటు కోతల కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు వాతలు పెట్టేందుకు సిద్ధమవుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. విద్యుత్ సరఫరాకు గ్యారెంటీ లేదు. కానీ విద్యుత్ షాకులు మాత్రం గ్యారెంటీ అని ‘ఎక్స్’ వేదికగా దుయ్యబట్టారు.‘‘కాంగ్రెస్ పార్టీ పవర్లోకి వచ్చి ఏడాది కాకముందే పవర్ చార్జీలు పెంచి జనం మీద భారం మోపడానికి సిద్ధమయ్యారు. ఫ్రీ కరెంట్ అమలు అంతంత మాత్రమే.. గృహజ్యోతి పథకం ఇంకా గ్రహణంలోనే ఉంది. జీరో బిల్లుల కోసం ఎదురు చూస్తుంటే గుండె గుభిల్లు మనేలా కొత్త బాదుడు షురూ చేస్తారా?. ఒక్క గ్యారెంటీ సక్కగా అమలు చేసింది లేదు.. 420 హామీలకు అతీ గతీ లేదు. మరి ఖజానా ఖాళీ చేసి ఏం చేస్తున్నారు?. 9 నెలల్లో ఎడాపెడా అప్పులు చేసి తెచ్చిన రూ.77 వేల కోట్లు ఎటుబాయే? మళ్లీ ఈ నడ్డి విరిగే వడ్డనలు ఎందుకు?. అసమర్థుల పాలనలో ఆఖరికి మిగిలేది కోతలూ వాతలే’’ అని అన్నారు.కరెంటు కోతల కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు వాతలు పెట్టేందుకు రెడీ అవుతున్నది ! విద్యుత్ సరఫరా కు గ్యారెంటీ లేదు కానీ విద్యుత్ షాకులు మాత్రం గ్యారెంటీ !పవర్ లోకి వచ్చి ఏడాది కాకముందే పవర్ చార్జీలు పెంచి జనం మీద భారం మోపడానికి సిద్ధమయ్యారు !ఫ్రీ కరెంట్ అమలు అంతంత మాత్రమే..… pic.twitter.com/hqiKkXIFrn— KTR (@KTRBRS) October 15, 2024చదవండి: ఓ వైపు మరణ శాసనం..! మరోవైపు సుందరీకరణా? -
ఓ వైపు మరణ శాసనం..! మరోవైపు సుందరీకరణా?
సాక్షి, హైదరాబాద్: నౌకాదళానికి చెందిన రాడార్ స్టేషన్ ఏర్పాటు పేరిట ఓ వైపు మూసీ నదికి మరణం శాసనం రాస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మరోవైపు సుందరీకరణ పేరిట హడావుడి చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. వీఎల్ఎఫ్ రాడార్ స్టేషన్ నిర్మాణంతో మూసీ నది అంతర్ధానమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. పదేళ్లు తమ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చినా రాడార్ స్టేషన్ నిర్మాణానికి అంగీకరించలేదన్నారు. పర్యావరణానికి హాని కలిగించే రాడార్ స్టేషన్ నిర్మాణాన్ని బీఆర్ఎస్ వ్యతిరేకిస్తుందన్నారు. రాడార్ స్టేషన్ ఏర్పాటుకు వ్యతిరేకంగా పర్యావరణవేత్తలతో కలిసి పోరాటం చేస్తామని సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో కేటీఆర్ ప్రకటించారు.ప్రమాదంలో మూసీ నది‘వికారాబాద్ జిల్లా దామగుండం అటవీ ప్రాంతంలో నౌకాదళానికి సంబంధించిన వీఎల్ఎఫ్ రాడార్ స్టేషన్ నిర్మాణంతో మూసీ నది ప్రమాదంలో పడుతుంది. ఓ వైపు మూసీ సుందరీకరణకు రూ.1.50 లక్షల కోట్లు ఖర్చు పెడతామంటూనే.. మరోవైపు రాడార్ స్టేషన్ నిర్మాణానికి అనుమతి ఇవ్వడం రేవంత్ ద్వంద్వ వైఖరికి నిదర్శనం. ఏం ఆశించి తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారో సీఎం చెప్పాలి. ఈ నెల 15న రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో కలిసి ఈ ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన చేయడంపై బీఆర్ఎస్ నిరసన తెలుపుతుంది. దామగుండంలో రాడార్ స్టేషన్ ఏర్పాటుతో 2,900 ఎకరాల అటవీ భూమి, 12 లక్షల చెట్లను నష్టపోతాం. జనావాసాలు లేని ద్వీపాల్లో ఏర్పాటు చేయాల్సిన రాడార్ స్టేషన్‌ను తెలంగాణలో ఎందుకు నిర్మిస్తున్నారో చెప్పాలి’ అని కేటీఆర్ అన్నారు.మూసీ నది ఎకో–సెన్సిటివ్ జోన్ కాదా?‘గంగానది జన్మస్థానం గంగోత్రి వద్ద 150 కిలోమీటర్ల పరిధిని కేంద్రం ఎకో సెన్సిటివ్ జోన్‌గా ప్రకటించింది. దామగుండంలో ఏర్పాటు చేస్తున్న రాడార్ కేంద్రం వికారాబాద్ అడవుల్లోనే మూసీ జన్మస్థానం ఉంది. అలాంటప్పుడు మూసీ నది జన్మస్థానాన్ని ఎకో సెన్సిటివ్ జోన్‌గా ప్రకటించాలి. గంగా నదికి ఒక న్యాయం.. మూసీకి మరో న్యాయమా? రాడార్ స్టేషన్ ఏర్పాటుతో పర్యావరణ సమతుల్యతకు ప్రమాదం పొంచి ఉంది. మూసీ పేరిట రూ.వేల కోట్ల దోపిడీ చేయాలన్నదే ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తోంది. దేశ రక్షణ విషయంలో తెలంగాణ ముందు వరుసలో ఉంటుంది. కానీ జనావాసాలు లేని చోట ఏర్పాటు చేయాల్సిన రాడార్ స్టేషన్‌ను దామగుండంలో ఏర్పాటు చేయడాన్ని అంగీకరించం. పర్యావరణ వేత్తలతో కలిసి పోరాటం చేస్తాం’ అని కేటీఆర్ పేర్కొన్నారు. -
కంటోన్మెంట్లో కారుణ్య నియామకాలు చేపట్టండి
సాక్షి, న్యూఢిల్లీ: సికింద్రాబాద్ కంటోన్మెంట్లో చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న కారుణ్య నియామకాలు చేపట్టాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు. కరోనా మహ మ్మారి వేళ కంటోన్మెంట్లో పనిచేసిన మున్సి పల్ కార్మికులు సుమారు వంద మందికి పైగా మృతి చెందారు.ఐదు శాతం కంటే ఎక్కువ మందికి కారుణ్య నియామకాలు చేపట్టవద్దని రక్షణ శాఖ నిబంధన ఉందని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయంలో ఉదారంగా వ్యవహరించి కరోనా సమయంలో మృతి చెందిన మున్సిపల్ కార్మికుల కుటుంబాలందరికీ ఉద్యోగాలు ఇవ్వాలని కోరారు. సాధ్యాసాధ్యాలు పరిశీలించి న్యాయం జరిగేలా చూస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చినట్లు ఈటల రాజేందర్ తెలిపారు.జేసీఓపీ చైర్మన్‌గా బాధ్యతల స్వీకారం18వ లోక్‌సభ ‘జాయింట్ కమిటీ ఆన్ ఆఫీసెస్ ఆఫ్ ప్రాఫిట్’ చైర్మన్‌గా సోమవారం ఢిల్లీలోని కార్యాలయంలో ఎంపీ ఈటల రాజేందర్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా.. ఆయనకు బీజేపీ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కమిటీకి ఈటల చైర్మన్ కాగా.. తొమ్మిదిమంది లోక్‌సభ ఎంపీలు, ఐదుగురు రాజ్యసభ ఎంపీలు సభ్యులుగా ఉంటారు. -
ముత్యాలమ్మ గుడి ఘటన.. బండి సంజయ్ ఆగ్రహం
సాక్షి,హైదరాబాద్ : సికింద్రాబాద్ మోండా మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ముత్యాలమ్మ ఆలయంలోకి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం అర్ధరాత్రి చొరబడి అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేశారు.ఈ ఘటనపై సమాచారం అందుకున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ముత్యాలమ్మ దేవాయాన్ని సందర్శించారు. అనంతరం, ఆయన మాట్లాడుతూ.. హిందూ దేవాలయాలపై దాడులు చేసే వాళ్లను పిచ్చోళ్లని పోలీసులు ముద్రవేస్తారా?.ఇతర మతాల ఆలయాలను ఆ పిచ్చోళ్లు ఎందుకు దాడి చేయడం లేదు?పోలీస్ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం పోతోంది. ఆలయాలపై దాడులు జరుగుతుంటే కాంగ్రెస్ నేతలు ఎందుకు స్పందించడం లేదు?.మేం స్పందిస్తే.. బీజేపీని ఉగ్రవాదుల పార్టీగా ముద్ర వేస్తారా? తక్షణమే దుండుగులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ విషయంలో ఎటువైపు ఉంటారో కాంగ్రెస్ తేల్చుకోవాలని బండి సంజయ్ సూచించారు. -
TG: ప్రభుత్వంపై హరీశ్‌రావు ఫైర్
సాక్షి,మెదక్‌జిల్లా:తెలంగాణ ఉద్యమంలో అలయ్ బలయ్ ఎంతో స్ఫూర్తినిచ్చిందని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు.ఆందోల్‌లో సోమవారం(అక్టోబర్14) మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ ఆధ్వర్యంలో నిర్వహించిన అలయ్ బలయ్ కార్యక్రమంలో హరీశ్‌రావు పాల్గొని మట్లాడారు.‘కేసీఆర్ పాలనలో ఎలాంటి ఇబ్బందులు ఉండేవి కాదు.సంగారెడ్డిలో కలుషిత నీళ్ళు తాగి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.మేము మిషన్ భగీరథ ద్వారా సురక్షిత నీళ్ళు ఇస్తే అది కూడా ఈ ప్రభుత్వం చేయడం లేదు.రైతు బంధు లేదు,బతుకమ్మ చీరెలు లేవు,రుణ మాఫీ రాలేదు.డిసెంబర్ 9 పోయింది.పంద్రాగస్టు పోయింది. నిన్న మంత్రి తుమ్మల మాట్లాడుతూ డిసెంబర్ 9కి రుణమాఫీ పూర్తి చేస్తాం అంటున్నాడు. ఏడాది కాలం గడిపారు.ఏడాదిలోగా రెండు లక్షల ఉద్యోగాలు అన్నారు.కేసీఆర్ ఇచ్చినవే ఇచ్చి డబ్బా కొట్టుకున్నారు’అని హరీశ్‌రావు విమర్శించారు.ఇదీ చదవండి: ఎమ్మెల్యే రాజాసింగ్ హౌజ్అరెస్ట్ -
ఆ పెద్దన్న ఎవరు?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులను ఈడీ నుంచి కాపాడుతున్న పెద్దన్న ఎవరో చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ప్రశ్నించారు. ఢిల్లీలో కొట్లాడుతున్నట్టు నాటకం ఆడుతూ, తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ అంట కాగుతున్నాయని ఆదివారం ఒక ప్రకటనలో ఆయన విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులపై ఈడీ దాడులు జరుగుతున్నా బీజేపీ నేతలు ఈ అంశంపై మాట్లాడటం లేదన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ నాయకులను ఈడీ నుంచి రక్షిస్తున్న పెద్దన్న ఎవరో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి నివాసంపై ఈడీ జరిపిన దాడుల అంశాన్ని ప్రస్తావిస్తూ, ఆ దాడిలో రూ.వందల కోట్ల నగదు దొరికిందని మీడియాలో కథనాలు వస్తున్నాయని, 2 వారాలు పూర్తయిన తర్వాత కూడా ఇప్పటిదాకా ఈ సంఘటన తాలూ కు ఒక్క విషయం బయటకి రాలేదని కేటీఆర్ తెలిపారు. కర్ణాటకలో జరిగిన వాల్మీకి కుంభకోణం ద్వారా వచ్చిన రూ.40 కోట్ల అక్రమ ధనాన్ని పార్లమెంటు ఎన్నికల సమయంలో తెలంగాణలో కాంగ్రెస్ ఉపయోగించిందని స్వయంగా తన ప్రకటనలో ఈడీ వెల్లడించిందని కేటీఆర్ గుర్తుచేశారు. ఈ కేసులో ఇప్పటివరకు అరెస్టులు జరగకపోవడం, దారి మళ్లిన నిధుల తాలూకు అంశంపైనా ప్రాథమిక విచారణ కూడా చేయకపోవడం పట్ల కేటీఆర్ అనుమానాలు వ్యక్తం చేశారు. -
చీఫ్‌విప్‌గా ‘పట్నం’ నియామకం రాజ్యాంగ విరుద్ధం
సాక్షి, హైదరాబాద్: శాసనమండలిలో ప్రభుత్వ చీఫ్‌విప్‌గా పట్నం మహేందర్‌రెడ్డి నియామకం రాజ్యాంగ విరుద్ధమని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. మహేందర్‌రెడ్డి అనర్హత పిటిషన్ పెండింగ్‌లో ఉండగా, ఆయనను చీఫ్ విప్‌గా మండలి చైర్మన్ ఎలా గుర్తిస్తారని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తోందనడానికి ఈ నియామకం ఓ ఉదాహరణ అని అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో చిట్‌చాట్ చేస్తూ, నిబంధనలకు విరుద్ధంగా మహేందర్‌రెడ్డిని చీఫ్‌విప్‌గా నియమించారని ధ్వజమెత్తారు. సభలో బిల్లులు పాస్ చేయించడం, ప్రభు త్వ బిజినెస్ జరిగేలా చూడడం చీఫ్‌విప్ బాధ్యత అని అన్నారు.‘బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన మహేందర్‌రెడ్డి ఎవరికి విప్ జారీ చేస్తారు? అధికార పార్టీ సభ్యులకా.. ప్రతి పక్ష పార్టీ సభ్యులకా?’అని ప్రశ్నించారు. శాసనసభ సమావేశాలు ముగిసే నాటికి బీఆర్ఎస్ పార్టీ సభ్యుల సంఖ్య 38 అని స్పీకర్ చెప్పారని, ఈ విషయాన్ని కాంగ్రెస్ వారు కూడా చెప్పారని గుర్తు చేశారు.అయితే మార్చి 15వ తేదీన మహేందర్‌రెడ్డిని చీఫ్‌విప్‌గా నియమిస్తూ గెజిట్ విడుదల చేశారని, మార్చిలో చీఫ్‌విప్ అయితే పంద్రాగస్టు, జూన్ 2, సెప్టెంబర్ 17న ఎమ్మెల్సీగా ఆయన జెండా ఎగురవేస్తారని జీఏడీ జీవో ఎలా ఇస్తుందని హరీశ్ ప్రశ్నించారు. అనర్హత వేటు వే యాల్సిన కౌన్సిల్ చైర్మన్.. స్వయంగా మహేందర్‌రెడ్డి చీఫ్‌విప్‌గా నియమి తులైనట్లు బులెటిన్ ఇవ్వటం సరికాదన్నారు. పట్నం మహేందర్‌రెడ్డి ఇప్పుడు ఏ పార్టీకి చెందిన వ్యక్తో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. -
ఫ్లెక్సీ వార్.. కొండా సురేఖ వర్సెస్ రేవూరి
సాక్షి, వరంగల్: గీసుకొండ పీఎస్ వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. మండలంలోని ధర్మారంలో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి, మంత్రి కొండా సురేఖ వర్గీయుల మధ్య వివాదం చోటుచేసుకుంది. దసరా పండుగను పురస్కరించుకొని ధర్మారంలో కొండా వర్గీయులు ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలో ఎమ్మెల్యే రేవూరి ఫొటో లేదని రేవూరి వర్గీయులు నిరసన తెలిపారు.ఈ క్రమంలో ఫ్లెక్సీని ధ్వంసం చేశారని రేవూరి వర్గీయులపై కొండా అనుచరులు దాడి జరిపారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో గీసుకొండ పోలీసులు కొండా వర్గానికి చెందిన ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. గీసుకొండ పీఎస్‌కు వచ్చిన మంత్రి కొండా సురేఖ.. సీఐ సీటులో కూర్చొని కార్యకర్తలను ఎందుకు అరెస్ట్ చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్‌స్టేషన్‌కు కొండా సురేఖ వర్గీయులు భారీగా చేరుకున్నారు. అరెస్ట్ చేసిన వారిని విడుదల చేయాలంటూ నినాదాలు చేశారు. దీంతో ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది.గీసుకొండ వివాదంపై స్పందించిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి.. ఇక్కడి వ్యవహారం ఇప్పటికే అధిష్టానం దృష్టికి వెళ్లింది. పార్టీ వర్గాలతో మాట్లాడి తదుపరి కార్యాచరణ ఉంటుందన్నారు. పార్టీ అంతర్గత వ్యవహారం కాదు.. స్థానికతకు సంబంధించిన ఇష్యూ.. ఎవరు తొందరపడినా పార్టీకే నష్టం.. సమన్వయం పాటించడం మంచిందని రేవూరి అన్నారు.ఇదీ చదవండి: సునీల్ పోస్టులో తప్పేముంది?.. ఏపీ సర్కార్‌పై ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ట్వీట్