breaking news
-
ఎంఐఎం కేన్సర్లాంటిది
నిజామాబాద్ సిటీ: ఎంఐఎం పార్టీ దేశానికి కేన్సర్ వ్యాధి వంటిద ని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ విమర్శించారు. ఆదివా రం జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా దానితో అంటకాగడం ఎంఐఎంకు అలవాటుగా మారిందని అన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎంఐఎంకు భయపడుతోందని ఎద్దేవా చేశారు. హైడ్రా పాతబస్తీలో అక్రమ కట్టడా లను ఎందుకు కూల్చటం లేదని ప్రశ్నించారు.వక్ఫ్‌బోర్డు చట్టంలో అనేక లొసుగులున్నా యని, వాటిని సవరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడే ఏమీ చేయలేని మాజీ మంత్రి కేటీఆర్.. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని పాదయాత్ర చేయాలనుకుంటున్నారో ప్రజ లకు చెప్పాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ పాదయాత్ర చేస్తే ప్రజలు ఆయనకు చీపుర్లు, చెప్పులతో స్వాగతం పలికి నిలదీయాలని పిలుపునిచ్చారు. -
కాంగ్రెస్‌లో దశాబ్దాల పోరాటం మాది.. నేడు కంచం లాక్కున్నట్టుంది: జీవన్ రెడ్డి
సాక్షి, జగిత్యాల: దశాబ్దాల పాటు కాంగ్రెస్‌లో ఉండి పోరాటం చేశామన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఇవాళ తినబోయే ముందు వేరే వాళ్ళు వచ్చి కంచం లాక్కున్నట్టుంది మా పరిస్థితి అంటూ సంచలన కామెంట్స్ చేశారు. ఇదే సమయంలో కుల గణన ద్వారా వెనుకబడిన వర్గాలకు న్యాయం జరుగుతుందని చెప్పుకొచ్చారు.జగిత్యాలలో నేడు కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ..‘దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీలో ఉండి పోరాటం చేశాం. ఇవాళ తినబోయే ముందు వేరే వాళ్లు వచ్చి కంచం లాక్కున్నట్టుంది మా పరిస్థితి. విప్ లక్ష్మణ్ కుమార్, ఆది శ్రీనివాస్ జగిత్యాల కాంగ్రెస్ నాయకులకు ఆత్మస్థైర్యం కల్పించే విధంగా అండగా ఉండాలి. స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసుకుని ఈ ప్రాంత ప్రజలకు ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దుకుందాం. కుల గణన ద్వారా వెనుకబడిన వర్గాలకు న్యాయం జరుగుతుంది. నవంబర్ నెల చివరి వరకు సర్వే రిపోర్ట్ వస్తే డిసెంబర్ నెలలో ఎన్నికల నిర్వహణకు ప్రణాళిక చేసుకోవచ్చు. తద్వారా జనవరి నెలలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించుకునే అవకాశం ఉంది అంటూ కామెంట్స్ చేశారు.కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చింది. ఎనిమిది లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని దోచుకున్నారు. మిగులు బడ్జెట్‌తో ఉన్న రాష్ట్రాన్ని పదేళ్లు నిండా ముంచారు. పదవులు లేకపోతే కేటీఆర్, కేసీఆర్ ఉండలేకపోతున్నారు. అసెంబ్లీ సాక్షిగా ఏడు లక్షల కోట్ల అప్పులు ఉన్నట్టుగా శ్వేతపత్రం విడుదల చేశారు. చేసిన అప్పులు కొరకే ప్రజలను క్షమించమంటూ కేటీఆర్ పాదయాత్ర చేస్తున్నాడని ప్రజలకు వివరించాలి. ఈ మేరకు కాంగ్రెస్ శ్రేణులు పనిచేయాలని పిలుపునిచ్చారు. -
ఢిల్లీ నేస్తం-అవినీతి హస్తం.. కాంగ్రెస్‌పై కేటీఆర్ సెటైర్లు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రజాపాలన అని పొద్దుకు పదిమార్లు ప్రగల్భాలు పలికెటోళ్లు అంటూ కాంగ్రెస్ నేతలపై సెటైర్లు వేశారు. అలాగే, తెలంగాణ ప్రాజెక్టుల మీద విషం కక్కి రాష్ట్రాన్ని ఆగంపట్టించినవాళ్లు అంటూ మండిపడ్డారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ తాజాగా ట్విట్టర్ వేదికగా..అంచనాలను పెంచారని హాహాకారాలు చేసినోళ్లు, అవినీతి జరిగిందని బురదజల్లిన వాళ్లుకాళేశ్వరం మీద కక్షగట్టిన రైతుల పొట్టగొట్టినవాళ్లుపాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల మీద పగబట్టి మళ్ళి వలసలకు పచ్చజెండా ఉపినవాళ్లుతెలంగాణ ప్రాజెక్టుల మీద విషం కక్కి రాష్ట్రాన్ని ఆగంపట్టించినవాళ్లుప్రజాపాలన అని పొద్దుకు పదిమార్లు ప్రగల్భాలు పలికెటోళ్లుసీతారామ ఎత్తిపోతల పథకంలో అనుమతులు లేకుండానే రూ.1074 కోట్ల పనులకు టెండర్లు ఎలా పిలిచారుసుద్దపూస ముచ్చట్లు చెప్పే మీరు ప్రాజెక్టు డిస్ట్రిబ్యూటరీల పనుల్లో నిబంధలు ఎలా తుంగలో తొక్కారుఒక మీటింగ్ లో త్వరగా టెండర్లు పిలవాలి అని ఆదేశం - మరో మీటింగ్ లో ఇదేంటి అంటూ నంగనాచి మాటలుప్రాజెక్టు పూర్తి అయ్యి కోటి ఏకరాలకు జీవం పోస్తున్న కాళేశ్వరం పై కమిషన్ లు వేసి విచారణ చేస్తున్న మీపై ఇప్పుడు ఏ కమిషన్ వెయ్యాలిఢిల్లీ నేస్తం - అవినీతి హస్తం అంటూ ఘాటు విమర్శలు చేశారు. అంచనాలను పెంచారని హాహాకారాలు చేసినోళ్లు, అవినీతి జరిగిందని బురదజల్లిన వాళ్లుకాళేశ్వరం మీద కక్షగట్టిన రైతుల పొట్టగొట్టినవాళ్లుపాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల మీద పగబట్టి మళ్ళి వలసలకు పచ్చజెండా ఉపినవాళ్లుతెలంగాణ ప్రాజెక్టుల మీద విషం కక్కి రాష్ట్రాన్ని ఆగంపట్టించినవాళ్లు… pic.twitter.com/GnZDblFR77— KTR (@KTRBRS) November 3, 2024 -
మమ్మల్ని జైల్లో వేస్తారా.. ఆలస్యం ఎందుకు?.: జగదీష్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ కమిషన్ చైర్మన్ మదన్ బీ లోకూర్ ఎప్పుడు పని చేశారో తమకు తెలియదని.. విచారణ చేయకుండా నివేదిక ఎలా ఇస్తారంటూ మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ప్రశ్నించారు. ఆదివారం ఆయన తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. విద్యుత్ కమిషన్ విచారణ పూర్తి చేసినట్లు ప్రభుత్వం అధికారికంగా చెప్పిందని.. తమ వివరణ ఛైర్మన్ తీసుకోలేదన్నారు.కమిషన్ వేస్తున్నట్లు సీఎం రేవంత్ అసెంబ్లీలో ప్రకటించారు. కమిషన్ విచారణ పూర్తి అయితే అసెంబ్లీలో వివరాలు బయట పెట్టాలి. కేసీఆర్ ముందు చిల్లర వేషాలు వేయలేరు. మమ్మల్ని జైల్లో వేసే ఆలోచన వస్తే ఆలస్యం ఎందుకు?. మమ్మల్ని జైల్లో పెట్టడానికి భయపడుతున్నారా?’’ అంటూ జగదీష్‌రెడ్డి మండిపడ్డారు.‘‘విద్యుత్ కమిషన్ రిపోర్ట్ ఇస్తే ప్రజల ముందు పెట్టు. కేసీఆర్ 24 గంటల కరెంటు ఇచ్చినందుకు జైల్లో పెడతారా? నివేదికలో ఏమీ ఉండదని ముందే లీకులు ఇస్తున్నారు’’ అని జగదీష్‌రెడ్డి చెప్పారు. -
రైతులకు సంచులిచ్చే తెలివి లేదా?.. కాంగ్రెస్‌పై హరీష్ రావు ఫైర్
సాక్షి, సిద్దిపేట: రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఇదే సమయంలో సీఎం రేవంత్ రైతులను నట్టేట ముంచారు. రాష్ట్రంలో రైతుల వడ్లు కొనే దిక్కు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే, రైతులకు బోనస్ ఇవ్వరు.. రైతుబంధు ఇవ్వరు అని ఘాటు విమర్శలు చేశారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు సిద్దిపేటలో మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేతలకు పని తక్కువ.. కోతలు ఎక్కువ. రైతులకు సంచులు పంపే తెలివి లేదా?. హైదరాబాద్‌లో కూర్చోవడం కాదు. రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది. సీఎం రేవంత్ ఒక్కసారైనా ధాన్యం కొనుగోళ్లపై రివ్యూ చేశారా?. రైతులను నట్టేట ముంచిన వ్యక్తి రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో రైతులకు రైతుబంధు లేదు.. వడ్లకు బోనస్ లేదు. తెలంగాణలో వడ్లు కొనే దిక్కు లేదు. ముఖ్యమంత్రి క్షేత్రస్థాయి పరిస్థితులు తెలుసుకోవాలి. 30 శాతం వడ్లు దళారులు కొన్నారు. ఎలక్షన్ కన్నా ముందు రైతు ఓట్లు అన్ని నాకే కావాలన్నారు. నెల రోజులైనా సంచులు ఇవ్వలేదు. చాలా జిల్లాలో రైతులు ధర్నాలు చేస్తున్నారు.రుణ మాఫీకి 31 రకాల కోతలు పెట్టిన వ్యక్తి రేవంత్. లక్షా 50వేల కోట్లతో మూసీ సుందరీకరణ చేస్తారు కానీ.. రైతులకు బోనస్ ఇవ్వరు. అకాల వర్షాల కారణంగా చాలా చోట్ల వడ్లు తడిసిపోయాయి. తడిచిన వడ్లు మీరు కొనరు. కలెకర్లు అక్కడికి రారు.. మీ మంత్రులు అటువైపు కూడా చూడరు. దీనిపై ముఖ్యమంత్రి వెంటనే రివ్యూ చేయాలి. రైస్ మిల్లరతో చర్చలు చేయాలి. రైతులకు ఇబ్బంది రాకుండా చూడాలని డిమాండ్ చేశారు. -
సీఎం రేవంత్‌రెడ్డిపై డీకే అరుణ ఫైర్
సాక్షి,హైదరాబాద్:సీఎం రేవంత్‌రెడ్డిపై బీజేపీ సీనియర్‌నేత, మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ ఫైర్ అయ్యారు. ప్రధాని మోదీ వ్యాఖ్యలపై తాజాగా రేవంత్‌రెడ్డి చేసిన ట్వీట్‌పై డీకే అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆదివారం(నవంబర్ 3)డీకే అరుణ ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు.‘సోనియా గాంధీ పుట్టిన రోజునాడే అన్నీ గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు. ఏడాది కావస్తున్నా ఇంతవరకు ఏ ఒక్క హామీ పూర్తిగా అమలు చేయలేదు. ఒక్క ఇల్లు నిర్మాణం మొదల పెట్టలేదు. కేంద్రం నిధులు లేకుండా వీళ్ళు ఇళ్లు కడతారా? రైతు రుణమాఫీ సగం మందికి కాలేదు. సిగ్గులేకుండా రేవంత్ అబద్ధాలు చెప్తున్నారు. పక్క రాష్ట్రంలో అక్కడి డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఫ్రీబస్ స్కీమ్ ఎత్తేస్తాం అంటున్నారు.గ్రామాలకు బస్సులు బంద్ చేసి తెలంగాణలో ఫ్రీ బస్ అంటున్నారు. మోదీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల వైఫల్యాలు ఎత్తి చూపారు. ఆయన వ్యాఖ్యలపై మాట్లాడడానికి రేవంత్‌రెడ్డికి సిగ్గుండాలి. 500 రూపాయలకే సిలిండర్‌లో కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ ఉంది. ఉజ్వల గ్యాస్ కనెక్షన్లన్నీ కేంద్రానీవే. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను భ్రమలో ఉంచుతున్నారు. కానీ ప్రజలు మేల్కొన్నారు. అన్ని అర్దం చేసుకుంటున్నారు.రైతు భరోసా లేదు. కౌలు రైతులకు,కూలీలకు సాయం దిక్కు లేదు. అమ్మాయిలకు స్కూటీలు ఎటు పాయే.50 వేల ఉద్యోగాల భర్తీ మాట పెద్ద బోగస్.10 లక్షల రూపాయల వైద్యం ఈ పది నెలల్లో ఎంతమందికి చేయించారో బయట పెట్టండి. చెప్పిన మాట నిలబెట్టుకోకుండ దబాయించాలని చూస్తున్నారు. కొత్తగా ఒక ఫించను దరఖాస్తు కూడా తీసుకోలేదు.కొత్త వితంతు ఫించన్లు రాక మహిళలు ఇబ్బందులు పడుతున్నారు’అని డీకే అరుణ మండిపడ్డారు. ఇదీ చదవండి: పీఎం నరేంద్రమోదీ వర్సెస్ సీఎం రేవంత్‌రెడ్డి -
కేంద్రానికి రాష్ట్రం సహకారం
మల్యాల (చొప్పదండి): రాజకీయాలు ఎన్నికల వరకే ఉండాలని, ఎన్నికల తర్వా త అందరూ అభివృద్ధే ల క్ష్యంగా పనిచేయాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. అభివృద్ధి విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని చెప్పారు. కేంద్రానికి సహక రిస్తున్నందుకు సీఎం రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం క్రాస్‌రోడ్డు నుంచి వేములవాడ నియోజకవర్గంలోని మేడిపల్లి మండలం కాచారం వరకు డబుల్ రోడ్డు విస్తరణ పనులకు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో కలసి శనివారం ఆయన శంకుస్థాపన చేశారు.రోడ్డు విస్తరణ విషయాన్ని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ దృష్టికి తీసుకెళ్లగానే రూ.25 కోట్లు మంజూరు చేశారని చెప్పారు. కేంద్రం నుంచి మరిన్ని నిధులు తీసుకొస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే సత్యం రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి అనుమతులు మంజూరు చేయించాలని కోరారు. గత ప్రభుత్వం పగ, ప్రతీకారాలతో ప్రొటోకాల్ పాటించలేదని, అభివృద్ధికి సహకరించలేదని విమర్శించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.మీ విధ్వంసంతో చీకట్లోకి రాష్ట్రంసీఎం రేవంత్‌కు కేంద్ర మంత్రి బండి సంజయ్ కౌంటర్ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఉదయిస్తున్న సూర్యుడిలా పురోగమిస్తోందంటూ సీఎం రేవంత్‌రెడ్డి ‘ఎక్స్’లో చేసిన పోస్ట్‌కు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణను పునరి్నరి్మంచే బదులు రేవంత్‌రెడ్డి విధ్వంసకర పాలనతో రాష్ట్రాన్ని చీకట్లలోకి నెడుతున్నారని దుయ్యబట్టారు. తెలంగాణ ఉదయించట్లేదని.. కాంగ్రెస్ శుష్క వాగ్దానాలనే నీడల మాటున నిలిచిందని విమర్శించారు. కాంగ్రెస్ ఇచి్చన అంతులేని నకిలీ హామీల చిట్టా ఈ జన్మకు నెరవేరదని ఎద్దేవా చేశారు.ఒకవేళ ఆరు గ్యారంటీలను నిజంగా అమలు చేశామని రేవంత్ నమ్మితే పాదయాత్ర చేపట్టి ప్రజల నుంచి నిజాలు తెలుసుకోవాలని మరోసారి సూచించారు. ఈ మేరకు శనివారం ‘ఎక్స్’ఖాతాలో సీఎం రేవంత్‌ను ఉద్దేశించి బండి సంజయ్ సుదీర్ఘ పోస్ట్ చేశారు. ‘రేవంత్‌రెడ్డి గారు... మీరు యావత్ తెలంగాణను మోసగించారు. మీరిచ్చిన గ్యారంటీ కార్డు మాటున షరతులు వర్తిస్తాయనే విషయాన్ని అమాయకులైన తెలంగాణ ప్రజలు గుర్తించలేకపోయారు.6 గ్యారంటీలను నెరవేర్చడానికి 100 రోజులు, 1,000 రోజులు కాదు కదా.. 10 వేల రోజులైనా సరిపోవు’అని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. హామీల అమలును కాంగ్రెస్ బోగస్‌గా మార్చిందని దుయ్యబట్టారు. ‘6 గ్యారంటీల అమలుకు నిధుల్లేని మీవద్ద మూసీ ప్రాజెక్టు కోసం రూ. 1.50 లక్షల కోట్లు మాత్రం ఉన్నాయి. మూసీ ప్రాజెక్టును మరో కాళేశ్వరం తరహా ఏటీఎంగా మారుస్తున్నారు’అని బండి సంజయ్ ‘ఎక్స్’లో ఆరోపించారు. ఒవైసీపై ధ్వజం: టీటీడీలో హిందువులు మాత్రమే పనిచేయాలంటున్న ప్రధాని మోదీ సర్కార్ వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులకు చోటు కల్పించాలని బిల్లు రూపొందించడం ఏమిటంటూ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఓ ప్రకటనలో ధ్వజమెత్తారు. మతాన్ని అడ్డుపెట్టుకొని రాజకీయ వ్యాపారం చేస్తున్న ఒవైసీ అసలు రంగు బయటపడిందని మండిపడ్డారు. -
Telangana: పీఎం నరేంద్ర మోదీ వర్సెస్ సీఎం రేవంత్‌రెడ్డి
తెలంగాణ అభివృద్ధి, కాంగ్రెస్ సర్కారు హామీల అమలు అంశం రచ్చరేపుతోంది. తెలంగాణ సహా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఆర్థిక వ్యవస్థలు కునారిల్లుతున్నాయని మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ కామెంట్లు చేయగా... దానిపై సీఎం రేవంత్‌రెడ్డి దీటుగా స్పందించారు. ప్రధాని మోదీ ‘ఎక్స్’లో చేసిన పోస్టుకు కౌంటర్‌గా ‘ఎక్స్’లోనే సమాధానమిచ్చారు. మోదీ దురభిప్రాయాలు, ఆయన పోస్టులోని వాస్తవ లోపాలపై వివరణ ఇస్తున్నానంటూనే విమర్శలు గుప్పించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా లేనిస్థాయిలో పథకాలు అమలు చేస్తున్నామని, ఉద్యోగాలు ఇచ్చామని పేర్కొన్నారు. రాష్ట్రంలో వివిధ పథకాలు, వాటి నుంచి లబ్ధిపొందినవారి గణాంకాలను కూడా ప్రస్తావించారు. తామిచ్చిన ప్రతి వాగ్దానం పట్ల పవిత్రమైన చిత్తశుద్ధి ఉందని వ్యాఖ్యానించారు. మోదీ ఏమన్నారంటే?నెరవేర్చలేని వాగ్దానాలివ్వడం తేలికేనని, అమలు మాత్రం కష్టమని కాంగ్రెస్ పారీ్టకి అర్థమవుతోందని విమర్శిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. నెరవేర్చలేమని తెలిసినప్పటికీ కాంగ్రెస్ నేతలు ప్రతి ఎన్నికల సందర్భంగా హామీలు ఇస్తున్నారని, ప్రజల ముందు దోషులుగా నిలబడుతున్నారని మండిపడ్డారు. ‘‘ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రాన్నయినా చూడండి. హిమాచల్‌ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో అభివృద్ధి తగ్గుముఖం పట్టడంతో ఆర్థిక వ్యవస్థలు కునారిల్లిపోతున్నాయి. వారిచ్చిన గ్యారంటీలు నెరవేర్చడం లేదు. ఈ రాజకీయాలకు పేదలు, యువత, రైతులు, మహిళలు బాధితులుగా మిగిలిపోతున్నారు’’ అని ప్రధాని మోదీ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. మోదీకి కౌంటర్‌గా రేవంత్ ఏమన్నారంటే?సాక్షి, హైదరాబాద్: తాము అధికారంలోకి వచ్చిన 11 నెలల్లోనే పదేళ్ల బీఆర్ఎస్ పాలనలోని నిరాశ, నిస్పృహలను, నాటి చీకట్లను పారదోలామని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం ఉదయపు సూర్యుడిలా వెలుగొందుతోందన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ప్రజలకిచ్చిన హామీలు నెరవేరడం లేదని, ఆ రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి కునారిల్లుతోందని విమర్శిస్తూ ప్రధాని మోదీ శుక్రవారం ‘ఎక్స్’లో చేసిన పోస్ట్‌కు ప్రతిగా శనివారం రేవంత్‌రెడ్డి సుదీర్ఘ పోస్ట్ చేశారు. తెలంగాణలో రైతు రాజులా బతుకుతున్నాడని.. మహిళలు, యువత, విద్యార్థులకు ఉపయోగపడే కార్యక్రమాలను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. మూసీ పునరుజ్జీవంతోపాటు ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నామని వెల్లడించారు. మోదీ పోస్ట్‌కు కౌంటర్‌గా సీఎం రేవంత్ చేసిన పోస్ట్ యథాతథంగా.. ‘‘మీ (ప్రధాని మోదీ) ప్రకటనలో నా రాష్ట్రం, ప్రభుత్వం గురించి వెలువరించిన దురభిప్రాయాలు, వాస్తవ లోపాలపై వివరణ ఇస్తున్నందుకు సంతోషంగా ఉంది. దాదాపు దశాబ్దపు బీఆర్ఎస్ దుష్పరిపాలన తర్వాత డిసెంబర్ 7, 2023న తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి రాష్ట్రంలో ఉత్సాహం, ఆశలు నెలకొన్నాయి. బాధ్యతలు తీసుకున్న రెండు రోజుల్లోనే ప్రజలకిచ్చిన రెండు హామీలను నెరవేర్చాం. తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు రాష్ట్రవ్యాప్తంగా ఉచిత ప్రయాణం, రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిధిని 10 లక్షల రూపాయలకు పెంచుతూ నిర్ణయాలు తీసుకున్నాం. గత 11 నెలల కాలంలో తెలంగాణ తల్లులు, అక్కాచెల్లెళ్లు ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా ప్రయాణించారు. 101 కోట్ల ప్రయాణాల ద్వారా తెలంగాణ మహిళలు ఏడాదిలోపే రూ.3,433.36 కోట్లు లబ్ధి పొందారు. ఏడాది పూర్తిగాకముందే తెలంగాణ రైతును రాజును చేస్తూ దేశంలో ఎక్కడా లేనివిధంగా రుణమాఫీని అమలు చేశాం. ప్రస్తుతం తెలంగాణలోని 22,22,365 మంది రైతులు ఎలాంటి అప్పులు లేకుండా రాజులా బతుకుతున్నారు. రూ.2 లక్షల వరకు రైతు రుణాలను మాఫీ చేస్తూ కేవలం 25 రోజుల్లో రూ.18 వేల కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేశాం. మహిళలు సంతోషంగా ఉన్నారు.. గృహ వినియోగానికి 200 యూనిట్ల వరకు ఎలాంటి చార్జీలు లేకుండా విద్యుత్ సౌకర్యం పొందుతున్న మహిళల దీవెనలు మాకు అందుతున్నాయి. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని మహిళలు అధిక గ్యాస్ ధరలతో ఇబ్బందులు పడుతుండగా.. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న తెలంగాణలో రూ.500కే సిలిండర్ పొందుతున్న మహిళలు సంతోషంగా ఉన్నారు. మా హయాంలో ఇప్పటివరకు 42,90,246 మంది లబ్ధిదారులకు 1.31 కోట్ల గ్యాస్ సిలిండర్లను డెలివరీ చేయడంతో వారంతా సంతోషంగా వంట గదుల్లోకి వెళుతున్నారు. 50వేల మందికి ప్రభుత్వం ఉద్యోగాలిచ్చాం.. గత దశాబ్ద కాలంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ లేకపోవడం, పరీక్షల నిర్వహణలో వైఫల్యాలు జరిగాయి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీ చేపట్టాం. గ్రూప్–1, 2, 3, 4 వంటి అన్ని స్థాయిల్లోని పరీక్షలను సకాలంలో నిర్వహిస్తున్నాం. దేశంలోని ఏ రాష్ట్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కూడా చేయని విధంగా 11 నెలల కాలంలో తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం 50 వేల మంది యువతకు ప్రభుత్వ ఉద్యోగాలిచ్చింది. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో నిర్లక్ష్యానికి గురైన విద్యార్థులు ఇప్పుడు సంతోషంగా ఉన్నారు. వారి డైట్, కాస్మెటిక్ చార్జీలను 40శాతం మేరకు పెంచాం. గతంలో నిర్లక్ష్యానికి గురైన మూసీ నదిని శుద్ధి చేయడంతోపాటు పునరుజ్జీవ కార్యక్రమం చేపట్టాం. మా చెరువులను కాపాడుకుంటున్నాం. గత పదేళ్లలో నిరాటంకంగా ధ్వంసమైన నాలాలు, ఇతర నీటి వనరులను సంరక్షించుకునే పనిలో ఉన్నాం. మేం అధికారంలోకి వచ్చాక ఒక్క చెరువు కూడా కబ్జాకు గురికాలేదు. ఫ్యూచర్‌సిటీని సృష్టిస్తున్నాం. ఇందుకు సంబంధించిన మాస్టర్‌ప్లాన్ తయారవుతోంది. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ వర్సిటీతోపాటు ఇంటిగ్రేటెడ్ గురుకులాల ఏర్పాటుకు చర్యలు వేగవంతం చేశాం. మేం ప్రజలకిచ్చిన ప్రతి వాగ్దానం పట్ల మాకు పవిత్రమైన చిత్తశుద్ధి ఉంది. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో నెలకొన్న నిరాశ, నిస్పృహలను గత 11 నెలల కాలంగా తిప్పికొడుతూ ఆ పాలనా చీకట్లను పారదోలుతున్నాం. ఉదయపు సూర్యుడిలాగా తెలంగాణ ఇప్పుడు వెలుగుతోంది’’ అని సీఎం రేవంత్ ట్వీట్లో పేర్కొన్నారు. -
కులగణనకు ఎమ్మెల్యేలే ఇన్‌ఛార్జ్‌లుగా వెళ్తారు: టీపీసీసీ చీఫ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డిపై సెటైరికల్ కామెంట్స్ చేశారు టీపీసీపీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. బీజేపీ ఆఫీసులో మహేశ్వర్ రెడ్డికి అసలు కుర్చీనే లేదంటూ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉండగా.. మరో సీఎం అనే ప్రస్తావన ఎక్కడి నుంచి వస్తుందని ప్రశ్నించారు.టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ శనివారం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ బీజేపీలో కిషన్ రెడ్డికి, మహేశ్వర్ రెడ్డికి మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు ఉన్నాయి. బీజేపీ కార్యాలయంలో మహేశ్వర్ రెడ్డికి కుర్చీనే లేదు. రాష్ట్రంలో సీఎం ఉండగా కొత్త సీఎం అనే ప్రస్తావన ఎక్కడి నుండి వస్తుంది. మహేశ్వర్ రెడ్డికి కాంగ్రెస్ విషయాలు ఎలా తెలుస్తాయి?. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే చెప్పిన విషయాలను కొందరు వక్రీకరిస్తున్నారు. ప్రజలు మాపై పెట్టుకున్న నమ్మకానికి అనుగుణంగా ప్రభుత్వం పని చేస్తోంది. ఈనెల ఆరు లేదా ఏడో తేదీన కుల గణనపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తాం. ఈనెల ఐదో తేదీన సాయంత్రం నాలుగు గంటలకు బోయినపల్లి గాంధీ ఐడీయాలజీ సెంటర్లో కులగణనపై సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి రాహుల్ గాంధీ వస్తారు. పార్టీ నేతలు, బీసీ నేతలు, వివిధ వర్గాల మేధావులతో రాహుల్ గాంధీ సమావేశం అవుతారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే కులగణనపై రాహుల్‌గాంధీ వివరాలు తెలుసుకుంటారు. ప్రధాని మోదీ ఎప్పుడూ వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం చేయరు. విమర్శలను రాహుల్‌గాంధీ పాజిటివ్‌గా తీసుకుంటారు. కులగణన కోసం కనెక్టింగ్ సెంటర్‌ను కూడా ప్రారంభించాం. కులగణనకు ఎమ్మెల్యేలు ఇన్‌ఛార్జులుగా వెళ్తారు అని స్పష్టం చేశారు. -
రెండు మూడ్రోజుల్లో ఆ బాంబు పేలుతుంది: పొంగులేటి
సాక్షి, హైదరాబాద్: ప్రతిపక్షం మాట్లాడాలి.. ఏదో ఒకటి మాట్లాడకపోతే ప్రతిపక్షం ఎలా అవుతుంది? అంటూ బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సెటైరికల్‌గా కౌంటర్ ఇచ్చారు. ‘‘నేను పేల్చిన బాంబు ఇంకా తుస్సు కాలేదు.. రెండు మూడు రోజుల్లో ఆ బాంబు ఏంటో మీరే చూస్తారు. వచ్చే నాలుగేండ్ల ఒక నెల సీఎంగా రేవంత్‌రెడ్డినే ఉంటారు.’’ అని పొంగులేటి స్పష్టం చేశారు. త్వరలోనే గ్రామ సర్పంచ్‌లు అందుబాటులోకి వస్తారు. సంక్రాంతి లోపు సర్పంచ్ ఎన్నికలు జరుగుతాయని మంత్రి అన్నారు.ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులున్నా గ్రీన్ చానెల్లో ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ జరుగుతుంది. లబ్ధిదారుని ఖాతాలోకి నేరుగా నిధుల జమ చేస్తాం. ప్రారంభంలో లక్ష ఇస్తారు. ఫిల్లర్స్ 1.25 లక్షలు, స్లాబ్ 1.75 లక్షలు ఇళ్లు పూర్తి అయ్యాక 1లక్ష ఇస్తారు. ఇందిరమ్మ ఇళ్లు లబ్ధి కోసం రేషన్ కార్డు తప్పనిసరి కాదు. ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ గురించి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌తో మాట్లాడా. కేంద్రం నుంచి పూర్తిస్థాయిలో సహకారం అందుతుందనే సంకేతాలు ఇప్పటి వరకు ఉంది.’’ అని పొంగులేటి చెప్పారు.‘‘కేంద్రం నుంచి నిధులు వస్తే మంచిది.. లేకపోతే నేను ఇండ్లను కట్టిస్తాను. ప్రారంభానికి కేంద్ర మంత్రులను పిలుస్తాం.. నేన, సీఎం వెళ్లి కేంద్ర మంత్రిని ఆహ్వానిస్తాం. వచ్చే నాలుగేళ్లు 20 లక్షలు ఇండ్లను టార్గెట్ పెట్టుకున్నాం’’ అని పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు.ఇదీ చదవండి: మా దగ్గర ‘బీఆర్ఎస్’ జాతకాలు.. అసదుద్దీన్ సంచలన వ్యాఖ్యలు -
మా దగ్గర ‘బీఆర్ఎస్’ జాతకాలు.. అసదుద్దీన్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: అహంకారం వల్లే బీఆర్ఎస్ ఓడిపోయిందంటూ ఆ పార్టీపై ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. 24 మంది అభ్యర్థులను మార్చి ఉంటే గెలిచేవారు. మా మద్దతుతోనే గ్రేటర్ ఎన్నికల్లో గెలిచారు. బీఆర్ఎస్ పార్టీ జాతకాలు మా దగ్గర ఉన్నాయి. మేం చెప్పడం మొదలుపెడితే తట్టుకోలేరంటూ ఆయన వ్యాఖ్యానించారు.ఇదీ చదవండి: తెలంగాణలో మళ్లీ ఎమర్జెన్సీ రోజులొచ్చాయి: కేటీఆర్ -
రేవంత్.. ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ చూపించు: హరీష్ రావు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్‌పై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో అన్ని వర్గాల వారిని మోసం చేస్తున్నారని అన్నారు. ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఇప్పటికీ నోటిఫికేషన్లు కూడా ఇవ్వకపోవడం వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. ఇదే సమయంలో డిసెంబర్ తొమ్మిదో తేదీలోపే రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి సగం మందికి కూడా చేయనిది నిజం కాదా అని నిలదీశారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ట్విట్టర్ వేదికగా..‘తెలంగాణలో కాంగ్రెస్ పార్టీది నెరవేర్చని హామీల కథ . సీఎం రేవంత్‌రెడ్డి కేవలం తెలంగాణనే కాదు.. దేశం మొత్తాన్ని తప్పుదోవ పట్టించడం సిగ్గుచేటు. బీఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిదేళ్లలో 1.61 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తే.. రేవంత్‌రెడ్డి దుష్ప్రచారం చేయడం దురదృష్టకరం. ఎన్నికల కోడ్ కారణంగా పెండింగ్‌లో ఉన్న నియామక పత్రాలను మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. రాష్ట్రంలో ఉద్యోగాలు భర్తీ చేసినట్లు చెబుతున్న 50వేల ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు ఇచ్చి, పరీక్షలు నిర్వహించి, ధ్రువపత్రాల పరిశీలన చేసింది కేసీఆర్ ప్రభుత్వం కాదా?. ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఇప్పటికీ నోటిఫికేషన్లు కూడా ఇవ్వకపోవడం వాస్తవం కాదా?. రెండు లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి సగం మందికి కూడా చేయనిది నిజం కాదా?. Mr. @revanth_anumula The BRS government, within nine years, has recruited 1,61,000 positions. It’s unfortunate that you continue to spread falsehoods on recruitments. Mr. Chief Minister, is it not true that almost all the 50,000 jobs claimed by you were notified, examination… https://t.co/eoExyVOd1x— Harish Rao Thanneeru (@BRSHarish) November 2, 2024రాష్ఠ్రంలో పెన్షన్‌ను రూ.4వేలకు పెంచుతామని హామీ ఇచ్చి 11 నెలలైనా అమలు చేయకపోవడం వాస్తవం కాదా?. 18 ఏళ్లు పైబడిన మహిళలకు నెలకు రూ.2500 ఇస్తామని హామీ ఇచ్చి ఇంకా అమలు చేయలేదు. విద్యా భరోసా కింద ఒక్కో విద్యార్థికి రూ.5లక్షలు ఇస్తామని ఇంకా ఇవ్వలేదు. అన్ని పంటలకూ బోనస్ ఇస్తామని చెప్పి ఇప్పుడు కేవలం ప్రీమియం బియ్యం రకాలకు మాత్రమే పరిమితం అయ్యారు. కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు తులం బంగారం హామీ ఇంకా నెరవేర్చలేదు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వంద రోజుల్లో హామీలన్నీ నెరవేరుస్తామన్న కాంగ్రెస్.. 300 రోజులు గడచిపోయినా అమలు చేయడంలో విఫలమైంది’ అంటూ కామెంట్స్ చేశారు. అలాగే, తెలంగాణలో రైతుబంధు, దళిత బంధు, బీసీ బంధు, కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్, బతుకమ్మ చీరలను కూడా నిలిపివేసిందని మండిపడ్డారు. -
తెలంగాణలో మళ్లీ ఎమర్జెన్సీ రోజులొచ్చాయి: కేటీఆర్
హైదరాబాద్, సాక్షి: పోరాడి సాధించుకొని పదేళ్లు స్వేచ్చగా ఊపిరి పీల్చుకున్న తెలంగాణలో మళ్లీ ఎమర్జెన్సీ రోజులొచ్చాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ప్రజాస్వామిక తెలంగాణలో మళ్లీ ఎనుకటికాలంలా బూటుకాళ్ల శబ్దాలతో తెలంగాణ తెల్లవారే రోజులొచ్చాయని ‘ఎక్స్’ వేదికగా అన్నారు. ‘‘పోరాడి సాధించుకొని పదేళ్లు స్వేచ్చగా ఊపిరి పీల్చుకున్న తెలంగాణలో మళ్లీ ఎమర్జెన్సీ రోజులొచ్చాయి. ఇందిరమ్మ రాజ్యంలో ప్రశ్నిస్తే కేసులు.. హక్కులను అడిగితే బెదిరింపులు.. పోరాడితే సస్పెన్షన్లు.. ఇది నియంతృత్వ రాజ్యం.. నిర్బంధాన్ని నిర్మిస్తున్న ప్రభుత్వం. పోరాటం తెలంగాణకు కొత్తకాదు.. ఈ మట్టి పొత్తిళ్ళలో పోరాటం ఉన్నది. ఆ సహజత్వాన్ని ఎత్తిపడుతూ నిర్బంధాన్ని ఎదురిస్తాం.. ప్రజాస్వామిక తెలంగాణ పునరుద్దరణకై పోరాడుతాం’’అని పేర్కొన్నారు.పోరాడి సాధించుకొని.. పదేళ్లు స్వేచ్చగా ఊపిరి పీల్చుకున్న తెలంగాణలో మళ్లీ ఎమర్జెన్సీ రోజులొచ్చాయి..ప్రజాస్వామిక తెలంగాణలో..మళ్లీ ఎనుకటికాలంలా బూటుకాళ్ల శబ్దాలతో తెలంగాణ తెల్లవారే రోజులొచ్చాయి..ఇందిరమ్మ రాజ్యంలో ప్రశ్నిస్తే కేసులు...హక్కులను అడిగితే బెదిరింపులు..పోరాడితే… pic.twitter.com/vmFnf0zmoP— KTR (@KTRBRS) November 2, 2024 -
ప్రధాని మోదీకి సీఎం రేవంత్ కౌంటర్
సాక్షి,హైదరాబాద్:మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ తమ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలకు సీఎం రేవంత్‌రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు ఎక్స్(ట్విటర్) వేదికగా శనివారం(నవంబర్ 2) రేవంత్‌రెడ్డి ఒక పోస్టు చేశారు.‘ప్రధాని మోదీ చేసిన ప్రకటనలో అనేక అవాస్తవాలున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత ప్రజల జీవితాల్లో వెలుగులు వచ్చాయి. టీజీఎస్ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం,రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద 10 లక్షల బీమా వంటి హామీలను నెరవేర్చాం.22 లక్షల 22 వేల మంది రైతులకు రుణమాఫీ చేశాం.25 రోజుల్లో 18 వేల కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేశాం.పేదల ఇళ్లకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం.బీజేపీ పాలిత రాష్ట్రాల్లో గ్యాస్ సిలిండర్ ధరలు ఎక్కువగా ఉంటే,కాంగ్రెస్ అధికారంలో ఉన్న తెలంగాణలో కేవలం 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ లభిస్తోంది.ఈ పథకం కింద 42,90,246 మంది లబ్ధిపొందారు. యువతకు వేల ఉద్యోగాలిచ్చాం’అని రేవంత్‌రెడ్డి తెలిపారు.ఇదీ చదవండి: నోటికందే కూడు నీటిపాలు -
నేడో, రేపో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు?
సాక్షి, హైదరాబాద్: బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఓ కొలిక్కి వచ్చింది. రెండుమూడురోజుల్లో మూడు స్థానాలకు అభ్యర్థులను పార్టీ అధిష్టానం ఖరారు చేయనుంది. ఒక్కో స్థానానికి మూడేసి పేర్లతో జాబితాను రూపొందించి ఢిల్లీలోని జాతీయ ఎన్నికల కమిటీకి పంపించనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల ఉపాధ్యాయ, పట్టభద్రులు, వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలు వచ్చే ఏడాది మార్చి 29తో ఖాళీ కానున్నాయి.రాష్ట్రంలో బీజేపీకి 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు ఉండగా, వారిలో నలుగురు ఎంపీలు, ఏడుగురు ఎమ్మెల్యేలు కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల పరిధిలోనే గెలిచారు. దీంతో ఈ జిల్లాల పరిధిలోని ఒక టీచర్, ఒక గ్రాడ్యుయేట్ స్థానాలను కచ్చితంగా గెలవాలని రాష్ట్ర నాయకత్వం పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో బలమైన ఎమ్మెల్సీ అభ్యర్థులను నిలిపేలా చేస్తున్న కసరత్తు పూర్తి అయినట్టు పార్టీవర్గాల సమాచారం. శని, ఆదివారాల్లో ఈ మూడు స్థానాలకు ముగ్గురు చొప్పున అభ్యర్థులను (తొమ్మిది మందితో) ప్రతిపాదిస్తూ కేంద్ర ఎన్నికల కమిటీకి జాబితా పంపించనున్నారు.ప్రధానంగా ఉత్తర తెలంగాణ జిల్లాల పరిధిలోని ఉపాధ్యాయ, పట్టభద్రుల స్థానాల్లో నేతలు టికెట్ కోసం తీవ్రంగా పోటీ పడుతున్నారు. పార్టీకి అంతగా బలం లేదని భావిస్తున్న వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ స్థానం నుంచి కూడా పలువురు టికెట్ ఆశిస్తున్నారు. ఇటీవల జరిగిన భేటీలో అభ్యర్థుల పేర్లపై ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు, ఎన్నికలు జరగబోయే ఆయాజిల్లాల పార్టీ అధ్యక్షుల నుంచి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, సంస్థాగత ప్రధానకార్యదర్శి చంద్రశేఖర్ తివారీ అభిప్రాయాలు సేకరించారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఎంపీ ధర్మపురి అరవింద్, ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు, ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, కాసం వెంకటేశ్వర్లు, ప్రదీప్‌కుమార్‌లతో ఓ ప్రత్యేక కమిటీని బీజేపీ రాష్ట్ర నాయకత్వం నియమించింది. పోటాపోటీగా ప్రయత్నాలు కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల్లో పోటీకి పార్టీనేతలతోపాటు, తటస్తులు కూడా టికెట్ ఆశిస్తున్నట్టు సమాచారం. ఈ రెండు స్థానాల్లో గ్రాడ్యుయేట్ స్థానం నుంచి టికెట్ కోసం మంచిర్యాలకు చెందిన ఎర్రబెల్లి రఘునాథరావు, సంగారెడ్డి జిల్లాకు చెందిన గోదావరి అంజిరెడ్డి, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన గుజ్జుల రామకృష్ణారెడ్డి, దుగ్యాల ప్రదీప్‌కుమార్ ముందువరుసలో ఉన్నట్టుగా పార్టీనాయకులు చెబుతున్నారు. ఈ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పోటీకి విద్యాసంస్థల అధినేత మల్క కొమురయ్య, గత ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన మామిడి సుధాకర్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారు. ఖమ్మం, నల్లగొండ, వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ టికెట్ కోసం పీఆర్టీయూ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు సర్వోత్తమరెడ్డి, సంఘ్ పరివార్‌కు చెందిన టీపీయూఎస్ నాయకుడు సాయిరెడ్డి తదితరుల పేర్లు వినిపిస్తున్నాయి. -
భవిష్యత్తులో రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర
సాక్షి, హైదరాబాద్: పార్టీ కార్యకర్తల కోరిక మేరకు భవిష్యత్తులో రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేస్తానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ప్రకటించారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం, పార్టీని బలోపేతం చేయడం లక్ష్యంగా తన పాదయాత్ర ఉంటుందని చెప్పారు. రాజకీయాల్లోకి కుటుంబ సభ్యులను లాగడం అత్యంత నీచమన్నారు. తన కుటుంబాన్ని రాజకీయాల్లోకి లాగుతున్న సీఎం రేవంత్, ఆయన వందిమాగధులపై ప్రజల మద్దతుతో పోరాటం చేస్తానని పేర్కొన్నారు. గురువారం సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’లో ‘ఆస్క్ కేటీఆర్’పేరిట నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు కేటీఆర్ సమాధానాలు ఇచ్చారు. ఆయా అంశాలు కేటీఆర్ మాటల్లోనే.. ఈ నష్టం నుంచి కోలుకోవడం కష్టమే.. ‘‘తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ పాలన ఒక శాపంగా మారింది. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే ఉద్దేశం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమాత్రం లేదు. సర్కారు వైఫల్యాలను కప్పిపుచ్చుకొనేందుకు కాంగ్రెస్ ప్రారంభించిన రాజకీయ వేధింపులకు భయపడేది లేదు. కాంగ్రెస్ పాలన ఢిల్లీ నుంచి, ఢిల్లీ కోసమే అన్నట్టుగా తయారైంది. రాష్ట్రం నుంచి పెట్టుబడులు కూడా వెనక్కి మళ్లుతున్నాయి. కాంగ్రెస్ పాలనలో జరుగుతున్న నష్టం నుంచి తెలంగాణ కోలుకోవడం కష్టమే. భవిష్యత్తులో అధికారంలోకి వచ్చే పారీ్టకి తెలంగాణను ముందుకు తీసుకెళ్లడం అతిపెద్ద సవాల్‌గా మారుతుంది. రాజకీయాల్లోకి కుటుంబాలను లాగడం నీచం బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్లలో ఇతరుల కుటుంబ సభ్యులను రాజకీయ అంశాల్లోకి లాగలేదు. సుమారు రెండు దశాబ్దాల రాజకీయ జీవితంలో కుటుంబ సభ్యులను అవహేళన చేసి మాట్లాడినప్పుడు, రాజకీయాలు వదిలేయాలన్నంత భావోద్వేగానికి గురయ్యాను. కేవలం రాజకీయాల కోసం ఇతరుల కుటుంబ సభ్యులను ఎందుకు లాగుతారో అర్థం కాదు. రేవంత్ అధికారంలోకి వచి్చన తర్వాత ఈ నీచ రాజకీయ సంస్కతి అత్యంత హీనదశకు చేరుకుంది. కాంగ్రెస్‌ను ఐదేళ్ల కోసం ప్రజలు ఎన్నుకున్నారు. ఈ సీఎం ఐదేళ్లు పదవిలో ఉంటారా లేదా అనేది చెప్పలేం. కాంగ్రెస్‌లో ఎప్పుడైనా ఎలాంటి పరిణామమైనా జరగొచ్చు. ఆ అధికారులను గుర్తుపెట్టుకుంటాం! విధులు మరిచి, చట్టవిరుద్ధంగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై రెచి్చపోతున్న పోలీస్ అధికారులను గుర్తుపెట్టుకుని.. మేం అధికారంలోకి వచి్చన తర్వాత కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ అధినేతలను ప్రసన్నం చేసుకునే పనుల్లో కొందరు పోలీసు అధికారులు బిజీగా ఉండటంతో శాంతిభద్రతలు క్షీణించాయి. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ కలసి పనిచేస్తున్నాయి. ఇచి్చన హామీలను అమలు చేయని కాంగ్రెస్ వంటి పారీ్టలపై చర్యలకు బలమైన సంస్కరణలు అవసరం. కొత్త సంవత్సరంలో జనంలోకి కేసీఆర్.. ఎన్నికల్లో ఓటమి తర్వాత సామాజిక మాధ్యమాల్లో బీఆర్ఎస్ మద్దతుదారులు ప్రపంచవ్యాప్తంగా బాగా యాక్టివ్‌గా మారారు. త్వరలో సోషల్ మీడియా విభాగంతో విస్తృత సమావేశాన్ని ఏర్పాటు చేస్తాం. పార్టీ అధినేత కేసీఆర్ సంపూర్ణ ఆరోగ్యంతో పారీ్టకి, నాయకులకు ఎప్పటికప్పుడు మార్గదర్శనం చేస్తున్నారు. బాధ్యత కలిగిన ప్రతిపక్ష నాయకుడిగా కాంగ్రెస్ ఇచ్చిన 420 హమీల అమలుకు సరిపడా సమయం ఇచ్చారు. నూతన సంవత్సరం తర్వాత ఆయన నుంచి మరిన్ని కార్యక్రమాలను చూస్తాం. ప్రతిపక్ష పారీ్టగా నూతన నాయకత్వాన్ని తయారు చేసుకునే అవకాశం వచి్చంది. పార్టీ ఫిరాయింపులు జరిగిన పది నియోజకవర్గాల్లో ఉప ఎన్నిక ఖాయం..’’అని కేటీఆర్ పేర్కొన్నారు. -
రేవంత్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది
సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్‌రెడ్డికి హనీమూన్ పీరియడ్ ముగిసి కౌంట్‌డౌన్ మొదలైందని... వచ్చే ఏడాది జూన్–డిసెంబర్ల మధ్య ఆయన పదవి పోవడం ఖాయమని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్‌కు ప్రత్యామ్నాయం కోసం కాంగ్రెస్ అధిష్టానం చూస్తోందని..కొత్త సీఎంగా ఎవరిని పెట్టాలనే దానిపై రహస్యంగా ఓ కమిటీ అన్వేషణ సాగిస్తోందన్నారు. సీఎం రేసులో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీనియర్ మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి ఉన్నారని చెప్పారు. మూసీ ప్రాజెక్ట్ వ్యయం ఒకేసారి రూ.50 వేల కోట్ల నుంచి రూ.లక్షన్నర కోట్లకు పెంచి భారీగా అవినీతికి ప్లాన్ చేశారని, ఏకపక్షంగా సొంత ఎజెండాతో సెలక్షన్, కరప్షన్, బ్లాక్‌మెయిలింగ్ వంటి వాటికి దిగడం దీనికి కారణమని ఆరోపించారు.మూసీ, హైడ్రా కూల్చివేతలతో పేదల్లో కాంగ్రెస్ అభాసుపాలు కావాల్సి వస్తోందని హైకమాండ్ ఆందోళన చెందుతోందన్నారు. శుక్రవారం మహేశ్వర్‌రెడ్డి మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. కొందరు సీనియర్ మంత్రులు హైడ్రా, మూసీ, ల్యాండ్ సెటిల్మెంట్ల మీద రేవంత్‌పై హైకమాండ్‌కు ఫిర్యాదు చేసినట్టు తమకు సమాచారం ఉందన్నారు. మూసీ ప్రాజెక్టు వ్యయాన్ని మూడొంతులు పెంచి తన స్వార్థం కోసం కాంగ్రెస్‌ను వాడుకుంటున్నారని, ఒరిజినల్ కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారని చెప్పారు. రేవంత్ ఏకపక్ష ధోరణిని కూడా పలువురు నేతలు అంగీకరించడం లేదన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టో కాకుండా రేవంత్‌రెడ్డి తన సొంత ఎజెండాను అమలు చేస్తున్నారనే ఫిర్యాదులు కూడా హైకమాండ్‌కు చేరాయని తెలిపారు.కేంద్ర మాజీ మంత్రి పళ్లంరాజు కూడా సోనియాగాంధీకి ఫిర్యాదు చేశారని, కూల్చివేతలపై నివేదిక సమర్పించారని చెప్పారు. దీనిపై పరిశీలనకు సోనియా సూచనలతో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ రంగంలోకి దిగి ఫోన్ చేస్తే రేవంత్ స్పందించలేదన్నారు. ఫోన్ ఎత్తకపోగా హైకమాండ్‌కు తాను స్పందించలేదని రేవంత్‌రెడ్డి పేర్కొనడాన్ని అధిష్టానం తీవ్రంగా పరిగణిస్తోందని చెప్పారు. సీనియర్ మంత్రులు, పార్టీ నేతల ఫిర్యాదులపై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్‌గా ఉందని తెలుస్తోందన్నారు. రేవంత్ వ్యతిరేకవర్గం ఢిల్లీలో అధిష్టానం వద్ద గట్టిగా లాబీయింగ్ నిర్వహిస్తోందన్నారు.ఈ కారణంగానే ఇప్పటికే ఏడుసార్లు ఢిల్లీకి వెళ్లినా, రేవంత్‌కు రాహుల్‌గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని చెప్పారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే కేబినెట్ విస్తరణ వాయిదా వేస్తూ వస్తున్నారన్నారు. మొత్తం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకుంటామంటూ ఫిరాయింపులకు రేవంత్‌రెడ్డి తెరతీశారని తెలిపారు. అయితే ఆ పార్టీ నుంచి వచ్చిన పదిమంది ఎమ్మెల్యేల్లో ఐదుగురు మళ్లీ కేసీఆర్‌తో టచ్‌లోకి వెళ్లారన్నారు. దీంతో పార్టీ మేనిఫెస్టోలో పేర్కొన్న అంశానికి భిన్నంగా ఫిరాయింపులు చేపట్టడంపై హైకమాండ్ ఆగ్రహంతో ఉందని చెప్పారు. ఈ పరిణామాల నుంచి బీఆర్ఎస్ లాభపడుతుందా అనే ప్రశ్నకు లోక్‌సభ ఎన్నికల్లో డకౌట్ అయ్యి ఏం చేయగలుగుతుందని వ్యంగ్యంగా అన్నారు. కాంగ్రెస్–బీఆర్ఎస్ ఒక్కటైనా.. బీజేపీ ప్రధాన ప్రతిపక్షంగానే వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. -
జార్ఖండ్‌లో కాంగ్రెస్ కూటమి గెలుపు ఖాయం
సాక్షి, హైదరాబాద్: జార్ఖండ్‌లో జరగ నున్న ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి గెలుపు ఖాయమని ఉపముఖ్యమంత్రి, జార్ఖండ్ ఎన్నికల ఇన్చార్జి, స్టార్ క్యాంపెయినర్ మల్లు భట్టి విక్రమార్క ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమిని గెలిపించుకోవాలనే ఉత్సాహం అటు ప్రజల్లోనూ, ఇటు పార్టీ కేడర్‌లోనూ కనిపిస్తోందన్నారు. ఎన్నికల ఇన్చార్జిగా జార్ఖండ్‌లో జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు వెళ్లిన భట్టి శుక్రవారం రాంచీలో జరిగిన రాష్ట్ర పీసీసీ నేతలు, అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ చార్జీల సమావేశానికి హాజరై ప్రసంగించారు.ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ...అసెంబ్లీ ఇన్చార్జీలు, జిల్లా కాంగ్రెస్, బ్లాక్ కాంగ్రెస్ నేతలెవరూ ఎన్నికలు పూర్తయ్యేవరకు తమకు కేటాయించిన నియోజకవర్గాలను వదిలిపెట్టవద్దని సూచించారు. కూటమిలో అసంతృప్తితో ఉన్న నేతలతో చర్చించి వారు ప్రచారంలో పాల్గొనేలా చేయాలన్నారు. ప్రచారాన్ని నిర్వహించాలని, సోషల్‌మీడియాను విస్తృతంగా వినియోగించుకోవాలని కోరారు. అనంతరం అసెంబ్లీ ఎన్ని కల్లో అనుసరించాల్సిన వ్యూహం, మేనిఫెస్టో తయారీపై అభిప్రాయాలను తెలిపారు. సమావేశంలో కేసీ వేణుగో పాల్, కేశవ్మహతో కమలేశ్, గులాం అహ్మద్ మీర్‌సాబ్, బి.కె.హరి ప్రసాద్, రామేశ్వరరావు పాల్గొన్నారు. -
కాంగ్రెస్ గ్యారంటీలపై వ్యాఖ్యలు.. ఖర్గేపై మండిపడ్డ కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బడ్జెట్ చూసుకొని ఎన్నికల హామీలు ప్రకటించాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సెటైర్లు వేశారు. గాలిమాటల గ్యారెంటీలిస్తే.. మొదటికే మోసం వస్తుందని ఇప్పుడు అర్థమైందా అని విమర్శించారు. కర్ణాటకలో ఐదు గ్యారంటీలు ప్రకటించినప్పుడు ఆ రాష్ట్ర బడ్జెట్ గుర్తు రాలేదా అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలను నయవంచన చేసినందుకు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.బడ్జెట్‌ను మించి గ్యారంటీలు ఇవ్వొద్దని.. అలా చేస్తే రాష్ట్రం దివాళా తీసే పరిస్థితి వస్తుందన్న ఖర్గే వ్యాఖ్యలకు కేటీఆర్ ‘ఎక్స్’ వేదికగా కౌంటర్ ఇచ్చారు. ‘బడ్జెట్ చూసుకోకుండా హామీలిస్తే.. రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం తప్పదని ఇప్పుడు బోధపడిందా? ఆరు గ్యారంటీలతో వల వేసినప్పుడు తెలంగాణ బడ్జెట్ గురించి తెలియదా? తెలంగాణలో కాంగ్రెస్ ఈ తప్పు చేస్తున్నప్పుడు.. ఈ విషయాలు ఎందుకు గుర్తుకురాలేదు?చదవండి: కాంగ్రెస్ నిజస్వరూపం బయటపడింది: మోదీ ఏవీ చూసుకోకుండా.. కేవలం అధికారమే లక్ష్యంగా.. కాంగ్రెస్ ఆడిన గ్యారెంటీల గారడీతో తెలంగాణ రాష్ట్రం ఏడాదిలోనే ఆగమైంది. తెలంగాణ ప్రజలను నమ్మించి, నయవంచన చేసినందుకు కాంగ్రెస్ పార్టీ నాలుగు కోట్ల ప్రజలకు క్షమాపణలు చెప్పాలి. పదేళ్లపాటు ప్రగతిపథంలో పరుగులు పెడుతున్న తెలంగాణను అడ్డగోలు హామీలతో మభ్యపెట్టినందుకు తప్పు ఒప్పుకోవాలి.అనాలోచితంగా ఇచ్చే కాంగ్రెస్ గ్యారెంటీలతో.. భవిష్యత్ తరాలకు కూడా నష్టం జరుగుతుందని ఇప్పటికైనా గుర్తించినందుకు సంతోషం. కానీ.. కాంగ్రెస్ గ్యారెంటీలను నమ్మిన పాపానికి ఏడాదికాలంగా తెలంగాణకు జరిగిన నష్టం పూడ్చలేనిది!. గ్యారెంటీల మాటున కాంగ్రెస్ చేసిన మోసం క్షమించలేనిది’ అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.గౌరనీయులైన ఖర్గే గారు..గాలిమాటల గ్యారెంటీలిస్తే.. మొదటికే మోసం వస్తుందని ఇప్పుడు అర్థమైందా..?కర్ణాటకలో ఐదు గ్యారంటీలు ప్రకటించినప్పుడు ఆ రాష్ట్ర బడ్జెట్ గుర్తు రాలేదా?బడ్జెట్ చూసుకోకుండా హామీలిస్తే.. రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం తప్పదని ఇప్పుడు బోధపడిందా..?ఆరు గ్యారంటీలతో… https://t.co/XcHhFGnDkN— KTR (@KTRBRS) November 1, 2024 -
జన్వాడ మందు పార్టీ సీసీ టీవీ ఫుటేజీ బయటపెట్టాలి: ఎంపీ రఘునందన్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కేటీఆర్ పాదయాత్ర కాదు.. మోకాళ్ల యాత్ర చేసినా ఎవరూ బీఆర్ఎస్ను నమ్మరు అంటూ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఘాటు విమర్శలు చేశారు. అలాగే, దీపావళికి బజార్లలో బాంబులు పేలాయి కానీ పొంగులేటి చెప్పిన కుక్క తోక పటాకులు మాత్రం పేలలేదు అంటూ ఎద్దేవా చేశారు.బీజేపీ ఎంపీ రఘునందన్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. కేటీఆర్ రాజకీయాల నుంచి తప్పుకోవాలని ఉందని అంటున్నారు. ఆయన తప్పుకుంటే వద్దు అనే వాళ్లు ఎవరూ లేరు. అధికారంలో ఉన్న పదేళ్లు కేటీఆర్‌కు ప్రజలను కలిసే సమయం దొరకలేదు. ఇప్పుడు పాదయాత్ర ఎందుకు?. కేటీఆర్ మోకాళ్ల యాత్ర చేసినా ఎవరూ పట్టించుకోరు. కేసీఆర్ పది నెలలుగా ఫామ్ హౌస్‌లో ఉన్నాడు. ఏమైనా నష్టం జరిగిందా?. కేటీఆర్ వచ్చింది ప్రజల కోసం కాదు ఆయన వచ్చింది డబ్బుల కోసం, అధికారం కోసం, ఫామ్ హౌస్ కోసం మాత్రమే. మీకు పది నెలల పాలనే విసుగొస్తే పదేళ్లు మిమ్మల్ని ఎలా భరించారు.కేటీఆర్‌కు ఎవరి మీదా నమ్మకం లేదు. చివరకు తన కుటుంబ సభ్యులపై కూడా నమ్మకం లేదు. జన్వాడ ఫామ్‌హౌస్ కేసులో సీసీ టీవీ ఫుటేజ్‌ను బయటపెట్టాలి. అప్పుడే అక్కడ ఏం జరిగిందో అందరికీ తెలుస్తుంది. తెలంగాణలో ఆడవాళ్లు తాగుతారని కోరుట్ల ఎమ్మెల్యే అంటున్నారు. తెలంగాణలో ఎక్కడైనా ఆడవాళ్లు తాగుతారా?. దీపావళికి బజార్లలో బాంబులు పేలాయి కానీ మంత్రి పొంగులేటి చెప్పిన కుక్క తోక పటాకులు మాత్రం పేలలేదు’ అంటూ సెటైర్లు వేశారు. -
రాహుల్.. ప్రధాని కావడం కలే: బండి సంజయ్
సాక్షి, బెజ్జంకి: రాహుల్ గాంధీ ఎప్పటికీ ప్రధాని కాలేడు.. అది ఆయన కల మాత్రమే అని ఆసక్తికర కామెంట్స్ చేశారు కేంద్రమంత్రి బండి సంజయ్. ఇదే సమయంలో బీఆర్ఎస్పై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ పాదయాత్ర చేస్తాను అనడం హాస్యాస్పదం అంటూ సెటైర్లు వేశారు.కేంద్రమంత్రి బండి సంజయ్ నేడు బెజ్జంకిలో పర్యటించారు. ఈ సందర్బంగా బండి సంజయ్ మాట్లాడుతూ..‘నాడు బీఆర్ఎస్, నేడు కాంగ్రెస్ డైవర్షన్, కాంప్రమైజ్ పాలిటిక్స్ నడుపుతున్నాయి. మూసీ ప్రక్షాళన పేరిట లక్షా యాభై వేల కోట్లను ఖర్చు పెట్టే కంటే కాంగ్రెస్ గ్యారంటీలు అమలు చేస్తే బాగుండేది. రేవంత్ రెడ్డి ఏం చెప్పి ప్రజల్లోకి వెళ్తాడు?.ప్రజాసమస్యలు పట్టించుకోకుండా రాహుల్ గాంధీని ప్రధానిని చేయడానికి మోదీపై యుద్ధం చేస్తాడట రేవంత్. రాహుల్ ఎప్పటికీ ప్రధాని కాలేడు. అది కేవలం కల మాత్రమే. రాష్ట్రంలో విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయడం లేదు. జీవో 29ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నా. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే హిందూ ఆలయాలు, హిందువులుపైనే దాడులు జరుగుతాయి. కేటీఆర్ పాదయాత్ర చేస్తాను అనడం హాస్యాస్పదం. బీఆర్ఎస్ ఇప్పుడు నాయకుడు లేని నావలా నడుస్తోంది అంటూ కామెంట్స్ చేశారు. -
‘రేవంత్ కుర్చీకి కౌంట్‌డౌన్.. ఆరు నెలల్లో కొత్త ముఖ్యమంత్రి’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కొత్త ముఖ్యమంత్రి కోసం కాంగ్రెస్ అధిష్టానం అన్వేషిస్తోందని సంచలన కామెంట్స్ చేశారు బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి. సీఎం రేవంత్‌పై సీనియర్ మంత్రులు, ఒరిజినల్ కాంగ్రెస్ నేతలు అధిష్ఠానానికి ఫిర్యాదు చేస్తున్నారు. రేవంత్ హాలీడే పీరియడ్ అయిపోయింది. రేవంత్‌కు కౌంట్ డౌన్ మొదలైంది అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి తాజాగా మీడియా చిట్‌చాట్‌లో.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు. రేవంత్ హాలీడే పీరియడ్ అయిపోయింది.. కౌంట్ డౌన్ మొదలైంది. 2025 జూన్ నుంచి డిసెంబర్‌లోపు రేవంత్ పదవి పోవడం ఖాయం. రేవంత్ రెడ్డికి ప్రత్యామ్నాయ కోసం కాంగ్రెస్ అధిష్ఠానం చూస్తోంది. ఒరిజినల్ కాంగ్రెస్ నేతలు రేవంత్‌పై అధిష్ఠానానికి ఫిర్యాదు చేస్తున్నారు. రేవంత్ వ్యతిరేక వర్గం ఢిల్లీలో లాబీయింగ్ చేస్తున్నారు. మేనిఫెస్టోను కాదు అని.. సొంత ఎజెండాను రేవంత్ అమలు చేస్తున్నారు. కేంద్ర మాజీ మంత్రి పళ్లంరాజు.. సోనియా గాంధీకి ఫిర్యాదు చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యామ్నాయం ఎవరు అని కాంగ్రెస్ అధిష్ఠానం ఆలోచన చేస్తోంది.సీనియర్ మంత్రులు హైడ్రా, మూసీ, ల్యాండ్ సెటిల్మెంట్ల మీద రేవంత్‌పై ఫిర్యాదు చేసినట్లు మా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి. సీనియర్ మంత్రులు చేసిన ఫిర్యాదుపై కాంగ్రెస్ అధిష్ఠానం సీరియస్‌గా ఉంది. మూసీ ప్రాజెక్టు కాస్ట్ మూడు వంతులు పెంచి.. రేవంత్ స్వార్థం కోసం కాంగ్రెస్‌ను వాడుకుంటున్నారు. సీఎం రేవంత్ ఏకపక్ష ధోరణికి చాలా మంది నేతలు ఒప్పుకోవడం లేదు. రేవంత్ ఏడు సార్లు ఢిల్లీకి వెళ్లినా రాహుల్ అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు. 11 నెలలు దాటింది.. ఏడాదిన్నరలోపే కాంగ్రెస్ కొత్త ముఖ్యమంత్రి రావడం ఖాయం.భట్టి విక్రమార్క నేను సైతం సీఎం రేసులో ఉన్నానని చెప్పడానికి చెరువుల కబ్జాలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వడమే ఒక ఉదాహరణ. ముగ్గురు మంత్రులు సీఎం రేసులో పోటీ పడుతున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పక్కా సమాచారంతోనే మాట్లాడారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారు అని.. నా నాలుకపై పుట్టుమచ్చ ఉందని ముందుగానే పసిగట్టి ఆయన ఇలా మాట్లాడారు. ముఖ్యమంత్రి పదవి రేసులో ఉత్తమ్, కోమటిరెడ్డి, భట్టి విక్రమార్క ముగ్గురూ పోటీ పడుతున్నారు. అలాగే, కాంగ్రెస్‌లో చేరిన ఐదుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేసీఆర్‌తో టచ్‌లో ఉన్నారు.